TE/Prabhupada 0880 - కృష్ణ చైతన్యములో ఉన్నది కృష్ణుడికి కలత కలిగించడానికా లేదా మీరు తీవ్రంగా ఉన్నారా



730412 - Lecture SB 01.08.20 - New York


కృష్ణ చైతన్యమును తీసుకున్నది కృష్ణుడికి కలత కలిగించడానికా, లేదా మీరు వాస్తవమునకు తీవ్రంగా వున్నారా

ప్రభుపాద: ప్రారంభంలో, మీరు కృష్ణ చైతన్యమును తీసుకుంటే, మాయ వలన చాలా అవాంతరాలు ఉంటాయి. మాయ మీరు ఎంత స్థిరముగా ఉన్నారో మిమ్మల్ని పరీక్షిస్తుంది. ఆమె మిమ్మల్ని పరీక్షిస్తుంది. ఆమె కూడా కృష్ణుడి యొక్క ప్రతినిధి. కృష్ణుడికి అంతరాయం కలిగించే వ్యక్తిని ఎవరినైనా ఆమె అనుమతించదు. అందువలన చాలా కఠినంగా పరీక్షిస్తుంది, వాస్తవానికి మీరు, మీరు కృష్ణుడికి కలత పెట్టడానికి కృష్ణ చైతన్యమును తీసుకున్నారా, లేదా మీరు వాస్తవమునకు తీవ్రముగా ఉన్నారా. అది మాయ యొక్క కర్తవ్యము. కాబట్టి ప్రారంభంలో, మాయా ద్వారా పరీక్ష ఉంటుంది, కృష్ణ చైతన్యము పురోగతి సాధించడంలో మీరు చాలా కలతలను అనుభూతి చెందుతారు. మీరు స్థిరంగా ఉంటే... స్థిరంగా అంటే నియమాలు మరియు నిబంధనలను అనుసరించడము అని అర్థం మరియు పదహారు మాలలు జపమును చేయడము, అప్పుడు మీరు స్థిరంగా ఉంటారు. మీరు నిర్లక్ష్యం చేస్తే, అప్పుడు వెంటనే మాయ మిమ్మల్ని బంధిస్తుంది. మాయ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. మనము సముద్రంలో ఉన్నాము. ఏ సమయంలోనైనా, మనము కలత చెందుతాము. అందుచేత కలత చెందని వ్యక్తిని ఎవరైనా అతనిని పరమహంసగా పిలుస్తారు.

అందువలన కుంతీదేవి ఇలా అంటున్నారు: tathā paramahaṁsānām ( SB 1.8.20) పరమ అంటే అంతిమముగా అని అర్థం. హంస అంటే హంస అని అర్థము. కాబట్టి పరమహంస అంటే పరిపూర్ణ హంస అని అర్థము. హంస. ఇది చెప్పబడినది మీరు... హంస అంటే హంస అని అర్థం. మీరు పాలులో నీటిని కలిపి హంసకు ఇస్తే, అది పాలులో పాల భాగమును తీసుకొని నీటి భాగమును వదలివేస్తుంది. అదేవిధముగా, ఈ భౌతిక ప్రపంచమును తెలిసిన వ్యక్తి... భౌతిక ప్రపంచం రెండు స్వభావాలు కలిగి ఉంటుంది - అధమ స్వభావము, ఉన్నత స్వభావము. ఉన్నత స్వభావం అంటే ఆధ్యాత్మిక జీవితం, అధమ స్వభావం భౌతిక జీవితం. కాబట్టి ఏ వ్యక్తి ఈ భౌతిక భాగాన్ని వదలి వేస్తాడో ఆధ్యాత్మిక భాగమును మాత్రమే తీసుకుంటాడో, ఆయనను పరమహంస అని అంటారు. పరమహంస. ఆధ్యాత్మిక భాగము అంటే ఎవరికైతే తెలుస్తుందో ఈ భౌతిక ప్రపంచములో పనిచేస్తున్నది ఏదైనా... ఉదాహరణకు ఈ శరీరము వలె-మీ శరీరం, నా శరీరం లాగే. ఈ కదలికలు, ఈ శరీరం యొక్క కార్యక్రమాలను తెలిసిన వారు ఎవరైనా ఈ శరీరం లోపల ఆత్మ ఉన్న కారణంగా జరుగుతున్నాయి... అది సత్యము. ఇది కేవలము బాహ్యముగా కప్పి ఉంది. అదేవిధముగా, కృష్ణుడు ఈ అన్ని కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్నాడని తెలుసుకున్న వ్యక్తి, ఆయన పరమ హంస ఆయన పరమహంస. ఆయనకు వాస్తవము తెలుసు.

కాబట్టి భక్తి-యోగం అనేది పరమహంసలకు, కృష్ణుడు కేంద్రము అని వాస్తవముగా తెలుసుకున్న ఒక వ్యక్తి. Aham ādir hi devānām ( BG 10.2) Mattaḥ sarvaṁ pravartate ( BG 10.8). అందువల్ల కృష్ణుడు అన్ని కారణాలకు కారణం అని తెలుసుకున్న వ్యక్తి, సిద్ధాంతపరంగా మాత్రమే కాదు, కానీ ఆచరణాత్మకంగా, అంగీకరించిన వాడు, ఆయన పరమహంస.

కాబట్టి కుంతీదేవి చెప్తుంది, "మీరు పరమహంసల కోసం ఉద్దేశించబడ్డారు, దుష్టులకు మరియు మూర్ఖుల కోసం కాదు. మీరు పరమహంసల కోసం ఉద్దేశించబడినారు. " Tathā paramahaṁsānāṁ munīnām ( SB 1.8.20) మునీనామ్ అనగా ఎవరైతే ఆలోచిస్తారో వారు అని అర్థం. మానసిక కల్పనలు చేసే వారు కూడా, వారిని కూడా ముని అని అంటారు. Munīnām amalātmanām. అమల. వారి హృదయంలో ఎటువంటి మురికి విషయాలు లేవు. భౌతిక వ్యక్తి అంటే పూర్తిగా హృదయంలో మురికి విషయాల ఉన్నాయి అని అర్థం. ఆ మురికి విషయాలు ఏమిటి? ఆవి కామము మరియు​​ దురాశ. అంతే. ఇవి మురికి విషయాలు. భౌతిక వ్యక్తులు అందరు, వారు కామము మరియు అత్యాశతో ఉన్నారు. అందుచేత వారి హృదయము మురికి విషయములతో నిండియున్నది. అమలాత్మానామ్ ఈ రెండు విషయాలు నుండి విముక్తి పొందిన వారు అని అర్థం, కామం మరియు...

భక్తులు: అత్యాశ.

ప్రభుపాద: ఎహ్? దురాశ, దురాశ. అమలాత్మానామ్. వారికి భక్తి-యోగం. ఈ భక్తి-యోగం పవిత్రము చేయబడిన హృదయముకు, కామము మరియు అత్యాశ కలిగిన వారికి కాదు. అది కాదు... వారు ప్రయత్నించవచ్చు. వారు క్రమంగా ప్రవిత్రము అవుతారు. కానీ ఒకరు, ఒకసారి భక్తి-యోగంలో ఉంటే, ఇంక కామం మరియు దురాశ ఉండదు. Viraktir anyatra syāt. ఇది పరీక్ష, ఒకరు విముక్తి పొందారా లేదా అని కామ కోరికలు మరియు దురాశ నుండి. అప్పుడు ఆయన భక్తి-యోగాలో ఉన్నాడు. ఆయన పరమహంస.

కాబట్టి కుంతీదేవి, వినయపూర్వకమైన సమర్పణ ద్వారా, "మీరు పరమహంసల కోసం ఉద్దేశించబడ్డారు, అమలాత్మానామ్ కోసం, మునీనామ్, భక్తి-యోగాలో వినియోగించబడిన వారు ఎవరైనా. మేము ఏమిటి? మేము కేవలం స్త్రీలము. మేము అధమ శ్రేణిలో ఉన్నాము. మేము ఎలా అర్థం చేసుకోగలము? "ఇది వినయము అంటే. ఆమె ప్రతిదీ అర్థం చేసుకున్నప్పటికీ, అయినప్పటికీ ఆమె ఒక సాధారణ మహిళ యొక్క స్థానమును తీసుకుంటోంది, నేను నిన్ను ఎలా అర్థం చేసుకోగలను?

చాలా ధన్యవాదాలు, హరే కృష్ణ.

భక్తులు: జయ, కీర్తి అంతా శ్రీల ప్రభుపాదుల వారికి