TE/Prabhupada 0887 - వేద అంటే జ్ఞానము మరియు అంత అంటే చివరి దశ, లేదా ముగింపు



750522 - Lecture SB 06.01.01-2 - Melbourne


వేద అంటే జ్ఞానము మరియు అంత అంటే చివరి దశ, లేదా ముగింపు మనము ప్రకృతి చట్టం క్రింద ఉన్నాము. మీరు స్వతంత్రంగా ఉన్నారని చెప్పలేము. ప్రకృతి చట్టం చాలా కఠినంగా ఉంది. Prakṛteḥ kriyamāṇāni guṇaiḥ karmāṇi sarvaśaḥ ( BG 3.27) ప్రకృతి చట్టం... కేవలం అగ్ని వలె. మీరు అగ్నిని తాకినట్లయితే, అది మిమ్మల్ని కాల్చుతుంది. పిల్లవాడు అయినా కూడా, అమాయకుడైన వాడు, పిల్లవాడు అగ్నిని తాకినట్లయితే, అది దహించి వేస్తుంది. ఏ క్షమాపణ లేదు. మీరు చెప్పలేరు "పిల్లవాడు అమాయకుడు అని. అతడికి అగ్నిని తాకటము వలన ప్రభావం తెలియదు, కాబట్టి వాడిని క్షమించవలెను." కాదు అజ్ఞానం అనేది కారణము కాదు. ముఖ్యంగా... అది రాష్ట్ర చట్టాలు. మీరు చెప్పలేరు... మీరు ఏదైనా నేరము చేశారు అని అనుకుందాం. మీరు వేడుకుంటే, "నా ప్రభు, నాకు తెలియదు..., ఈ పని చేసిన తర్వాత నేను జైలు శిక్ష అనుభవించాలి అని. కాబట్టి మీరు నన్ను క్షమించండి, "కాదు, అది సమాధానము కాదు. మీకు చట్టము తెలియ వచ్చు లేదా తెలియక పోవచ్చు మీరు అలా ప్రవర్తించి ఉంటే మీరు బాధ పడాలి, ఇది జరుగుతోంది.

కాబట్టి మనము ఈ పరిణామాలను తప్పించుకొనటానికి తరువాతి జీవితమును నమ్మము కానీ అది మనల్ని మన్నించదు. మనము ఒక రకమైన శరీరమును అంగీకరించాలి. లేకపోతే ఎలా వివిధ రకాల శరీరాలు ఉన్నాయి? వివరణ ఏమిటి? ఎందుకు వివిధ రూపాల శరీరములు ఉన్నాయి, శరీరం యొక్క వివిధ దశలు, శరీరం యొక్క వివిధ ప్రమాణాలు? అది ప్రకృతి చట్టము. కాబట్టి ఈ మానవ రూపాన్ని సరిగా ఉపయోగించుకోవాలి, కేవలం పిల్లులు మరియు కుక్కలు వలె ఇంద్రియ తృప్తిలో నిమగ్నమవ్వటము కాదు. అది చాలా బాధ్యత కలిగిన జీవితము కాదు. బాధ్యతాయుతమైన జీవితం ఏమిటంటే "నేను పిల్లులు మరియు కుక్కల కంటే ఈ మెరుగైన జీవితాన్నికలిగి వున్నాను, నేను పిల్లులు మరియు కుక్కలు కంటే మరింత బుద్ధి కలిగి ఉన్నాను. నేను జీవితంలో నాలుగు శారీరక అవసరాల కోసం దీనిని ఉపయోగించుకుంటే... " జీవితం యొక్క నాలుగు శరీర అవసరాలు అంటే మనకు తినడానికి కొంత అవసరము ఉంది. పిల్లులు, కుక్కలు, మానవులు లేదా హై కోర్ట్ న్యాయమూర్తి లేదా ఎవరైనా, వారికి కొంచెం తినడానికి అవసరము. వారికి నిద్ర కావాలి, అపార్ట్మెంట్ అవసరం. తద్వారా... పిల్లులు మరియు కుక్కలు అపార్ట్ మెంట్ లేకుండా నిద్రపోతాయి, కానీ నిద్ర అవసరం. అది వాస్తవము. తినడము అవసరం, అది వాస్తవం. లైంగిక జీవితం అది కూడా వాస్తవము. మరియు రక్షణ, అది కూడా వాస్తవం. కానీ ఈ విషయాలు పిల్లులకు మరియు కుక్కలకు మరియు మనుషులకు, మానవులకు ఒకే విధంగా గా ఉన్నాయి.

కాబట్టి మానవుని యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటి? మానవుని యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటంటే, మానవుడు పరిగణలోకి తీసుకొనగలడు నాకు ఈ మంచి అమెరికన్ లేదా ఆస్ట్రేలియన్ లేదా భారతీయ శరీరము ఉంది. తరువాత నాకు ఏమి రాబోతుంది? ఏ విధమైన శరీరం? " ఇది మానవ బుద్ధి కోసం ఉపయోగించబడుతుంది. ఒక పిల్లి మరియు కుక్క అ విధముగా ఆలోచించలేవు. అందువలన మన పని, "ఇప్పుడు, ప్రకృతి మార్గం ద్వారా, నేను పరిణామ పద్ధతి ద్వారా ఈ రకమైన జీవితానికి వచ్చాను. ఇప్పుడు నాకు మంచి తెలివితేటలు ఉన్నాయి. నేను ఎలా ఉపయోగించాలి? " సరైన ఉపయోగం వేదాంత తత్వములో సూచించబడింది. వేదాంత తత్వము, బహుశా మీరు పేరు విని ఉంటారు. వేదములు అంటే జ్ఞానం, అంత అంటే చివరి దశ, లేదా ముగింపు. ప్రతి దానికి ముగింపు ఉంటుంది. కాబట్టి మీరు విద్యాభ్యాసం చేస్తున్నారు. మీరు విద్యను నేర్చుకుంటున్నారు. అది ఎక్కడ ముగుస్తుంది? ఇది వేదాంత అని పిలువబడుతుంది. ఎక్కడ అంతిమ స్థితి ఉంది.

కాబట్టి వేదాంత తత్వము చెప్తుంది... అది వేదాంత తత్వము, అంతిమ జ్ఞానం. అంతిమ జ్ఞానం, భగవద్గీతలో వివరించబడింది, ఆ అంతిమ జ్ఞానం ఏమిటి. Vedaiś ca sarvair aham eva vedyam ( BG 15.15)

మీరు జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు. "జ్ఞానం యొక్క అంతిమ లక్ష్యం నన్ను తెలుసుకోవడం." అని కృష్ణుడు అన్నాడు Vedaiś ca sarvair aham eva vedyam. మొత్తం జ్ఞానం భగవంతుడిని అర్థం చేసుకోవడానికి ఉద్దేశించబడింది. ఇది జ్ఞానం యొక్క ముగింపు. క్రమముగా జ్ఞానమును పెంచుకోవడము ద్వారా మీరు పురోగతి చెందవచ్చు, కానీ మీరు భగవంతుడు అంటే ఏమిటో అర్థం చేసుకోనే స్థితికి రాకపోతే, మీ జ్ఞానం అపరిపూర్ణముగా ఉంటుంది. ఇది వేదాంత అని పిలువబడుతుంది. Athāto brahma jijñāsā. ఈ మానవ జన్మ, చక్కని సౌకర్యం, మేధస్సు... ఉదాహరణకు ఆస్ట్రేలియా ఇంకా అభివృద్ధి చెందలేదు. ఐరోపావాసులు ఇక్కడికి వచ్చినప్పటి నుంచీ ఇప్పుడు ఇది చాలా అభివృద్ధి చెందినది, చాలా వనరులను కలిగినది ఎందుకంటే మేధస్సును ఉపయోగించారు.

అదేవిధముగా అమెరికా, అనేక ఇతర ప్రదేశాలలో. కాబట్టి ఈ బుద్ధిని వాడాలి. కానీ మనము అదే ఉద్దేశ్యం కొరకు ఈ బుద్ధిని ఉపయోగిస్తే పిల్లులు మరియు కుక్కలు నిమగ్నమయినట్లు, అప్పుడు అది సరైన ఉపయోగం కాదు. సరైన వినియోగము అంటే వేదాంత. Athāto brahma jijñāsā: ఇప్పుడు మీరు బ్రహ్మణ్, సంపూర్ణ సత్యము గురించి విచారణ చేయాలి. ఇది బుద్ధి