TE/Prabhupada 0889 - మీరు ప్రతి రోజు ఒక సెంట్ ను డిపాజిట్చేస్తే, ఒక రోజు అది ఒక వంద డాలర్స్ అవుతుంది



750522 - Lecture SB 06.01.01-2 - Melbourne


మీరు ప్రతి రోజు ఒక సెంట్ ను డిపాజిట్ చేస్తే, ఒక రోజు అది ఒక వంద డాలర్స్ అవుతుంది

భక్తుడు: శ్రీల ప్రభుపాద, ఇది గ్రంధాలలో ఉదహరించబడినప్పుడు భగవంతుడు బ్రహ్మ ఒక హంస మీద సవారి చేస్తాడు, ఇది...? ఇది వాస్తవమైన హంస అని అర్థం చేసుకోవాలా లేదా ఇది మనం చిహ్నముగా తీసుకోవాలా?

ప్రభుపాద: చిహ్నముగా కాదు, వాస్తవం. ఎందుకు మీరు చిహ్నముగా అని అంటున్నారు?

భక్తుడు: ఇది అసాధారణమైనది.

ప్రభుపాద: అసాధారణమైనది... మీకు ఏమి అనుభవం ఉంది? మీకు అనుభవం లేదు. మీకు ఇతర గ్రహ వ్యవస్థల గురించి ఎలాంటి అనుభవం కలిగి ఉన్నారు, అక్కడ ఏమి ఉంది? అప్పుడు? మీ అనుభవం చాలా చిన్నది. కాబట్టి మీరు బ్రహ్మ యొక్క జీవితం ఇతర విషయాలను మీ అతి తక్కువ అనుభవంతో లెక్కించకూడదు. ఇప్పుడు, భగవద్గీతలో బ్రహ్మ జీవిత కాలం, sahasra-yuga-paryantam ahar yad brahmaṇo viduḥ... ( BG 8.17) ఇప్పుడు, బ్రహ్మ యొక్క జీవితం, ఇది శాస్త్రములలో చెప్పబడింది. మనము ఇప్పటికే వివరణ ఇచ్చాము మనము ప్రామాణికమైన ప్రతిపాదనను వివరించాము. ఇప్పుడు, బ్రహ్మ యొక్క జీవితం అక్కడ పేర్కొనబడింది. Arhat అంటే ఆయన ఒక రోజు నాలుగు యుగాలతో సమానం. నాలుగు యుగాల అంటే నలభై మూడు వందల... 4,300,000 సంవత్సరాలు, దానిని వెయ్యి చేత హెచ్చ వేయండి, sahasra-yuga-paryantam ద్వారా గుణించండి. సహస్ర అంటే ఒక వేలు అని అర్థం. యుగా, యుగ అంటే 4,300,000 సంవత్సరాలు ఒక యుగమును చేస్తుంది. దానిని వెయ్యితో హెచ్చ వేయండి: ఆ కాలము బ్రహ్మ యొక్క ఒక రోజు. అదేవిధముగా, ఆయనకు ఒక రాత్రి ఉంది. అదేవిధముగా, ఆయనకు ఒక నెల ఉంది. అదేవిధముగా, ఆయనకు ఒక సంవత్సరం ఉంది. అలాంటి వంద సంవత్సరాలు ఆయన బ్రతికి ఉంటాడు. మీరు ఎలా లెక్కించగలరు? ఇది మీ అనుభవము లోపల ఎలా ఉంది? మీరు ఏదో అనుమానాస్పదంగా ఉందని భావిస్తారు. కాదు మీ అనుభవం దేనికి పనికి రాదు. కావున పరిపూర్ణ వ్యక్తి, కృష్ణుని నుండి అనుభవం తీసుకోవాలి. అప్పుడు మీ జ్ఞానం ఖచ్చితమైనది. నేను ఇప్పటికే చెప్పాను. మీ అతి తక్కువ అనుభవముతో ప్రతిదీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకండి. లేదు. అప్పుడు మీరు వైఫల్యం చెందుతారు.

భక్తుడు : ప్రభుపాద, కృష్ణుడి సేవ చేసేటటువంటి అన్ని ప్రయత్నాలు... (విరామం)

ప్రభుపాద: నేను ఇప్పటికే వివరించాను, మీరు ఇక్కడకు వస్తున్నారని; మీరు దీక్ష తీసుకోనప్పటికి, ఇది కూడా సేవ. కాబట్టి రోజు మీరు ఒక సెంట్ ను డిపాజిట్ చేస్తే, ఒక రోజు అది వంద డాలర్లు కావచ్చు. కావున వంద డాలర్లు వచ్చినప్పుడు, మీకు కావలసినది పొందవచ్చు. (నవ్వు) మీరు ప్రతి రోజు రండి, ఒక సెంట్ ను , ఒక సెంట్ ను... ఇది వంద డాలర్లు అయినప్పుడు, మీరు ఒక భక్తుడు అవుతారు. భక్తులు: జయ! హరి బోల్!

ప్రభుపాద: కాబట్టి ఇది వ్యర్థం కాదు. అది... ఇది శ్రీమద్-భాగవతం, kṛta-puṇya-puñjāḥ ( SB 10.12.11) లో చెప్పబడింది. కృత -పుణ్య. కృత అంటే అర్థం. శుకదేవ గోస్వామి వివరిస్తున్నారు కృష్ణుడు తన గోప బాల స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు, అందువలన ఆయన వర్ణిస్తున్నాడు "కృష్ణుడితో ఆడుతున్న ఈ గోప బాలురు, వారు ఒక రోజులో ఈ స్థానానికి రాలేదు. " కృత -పుణ్య-పుంజః. "జన్మ జన్మలుగా, పవిత్ర కార్యక్రమాలను నిర్వహించిన తరువాత, ఇప్పుడు వారు మహోన్నతమైన స్థితికి భగవంతునితో ఆడుకోవడానికి అనుమతించబడ్డారు. " కృత -పుణ్య-పుంజః. కృష్ణుని కొరకు చేసిన పవిత్ర కార్యక్రమాలు, అది మీ శాశ్వత ఆస్తి. అది ఎప్పటికీ కోల్పోదు. కాబట్టి ఈ ఆస్తిని పెంచుకుంటూ కొనసాగండి. ఒకరోజు అది మీకు కృష్ణునితో కలిసి ఆడుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. ఇది కృష్ణ చైతన్య ఉద్యమము