TE/Prabhupada 0913 - కృష్ణునికి గతము, వర్తమానము మరియు భవిష్యత్ లేదు. అందువలన ఆయన శాశ్వతము



730420 - Lecture SB 01.08.28 - Los Angeles


కృష్ణునికి గతము, వర్తమానము మరియు భవిష్యత్ లేదు. అందువలన ఆయన శాశ్వతము కాబట్టి ఈ విముక్తి అందరికీ తెరిచి ఉంటుంది. Samaṁ carantam. కృష్ణుడు ఇలా చెప్పడం లేదు: "మీరు నా దగ్గరకు రండి, మీరు విముక్తి పొందుతారు." లేదు, ప్రతి ఒక్కరికీ ఆయన ఆహ్వానము తెలుపుతున్నాడు. ఆయన ఇలా అంటున్నారు: sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja ( BG 18.66) ఆయన అందరితో మాట్లాడతాడు. ఆయన కేవలం అర్జునుడితో మాత్రమే మాట్లాడతాడు అని కాదు. ఆయన అందరితో మాట్లాడుతున్నాడు. భగవద్గీత అర్జునుడికి మాత్రమే చెప్పినది కాదు. అర్జునుడు కేవలం లక్ష్యము వంటి వాడు. కానీ అందరి కోసము మాట్లాడబడింది. మానవులు అందరికి కాబట్టి ప్రతీ ఒక్కరు ప్రయోజనమును పొందాలి. Samaṁ carantam. ఆయనకు పక్షపాతము లేదు: "మీరు మారండి..." ఉదాహరణకు సూర్యరశ్మి లాగానే. సూర్యరశ్మికి పక్షపాతము లేదు, అది: "ఇక్కడ ఒక పేద వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ ఒక తక్కువ తరగతి మనిషి ఉన్నాడు, ఇక్కడ ఒక పంది ఉంది. అక్కడ నేను నా సూర్యరశ్మిని ప్రసరించను. కాదు "సూర్యుడు అందరినీ సమానముగా చూస్తాడు ప్రతీ ఒకరు దాని ప్రయోజనమును పొందాలి. సూర్యరశ్మి అందరికీ ఉంది, కానీ మీరు మీ తలుపు మూసి వేసుకుంటే, మీరు గాలి చొరబడని చీకట్లో మీరే ఉండాలనుకుంటే, అది మీ పని.

అదేవిధముగా కృష్ణుడు అన్నిచోట్లా ఉంటాడు. కృష్ణుడు అందరి కోసం ఉంటాడు. కృష్ణుడు మీరు శరణాగతి పొందిన వెంటనే మిమ్మల్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. Samaṁ carantam. ఎటువంటి ఆంక్షలు లేవు. కృష్ణుడు చెప్తాడు: māṁ hi pārtha vyapāśritya ye 'pi syuḥ pāpa-yonayaḥ ( BG 9.32) ఇది తక్కువ తరగతి, ఇది అధిక తరగతి అని వారు విభేదిస్తారు. కాబట్టి కృష్ణుడు ఇలా అంటాడు, "దిగువ తరగతి అని పిలవబడే తక్కువ తరగతి వారు కూడా, పట్టింపు లేదు ఆయన నన్ను తీసుకుంటే, ఆయన కూడా తిరిగి వెళ్ళడానికి అర్హుడు, తిరిగి భగవత్ ధామమునకు తిరిగి, భగవంతుని దగ్గరకు తిరిగి రావాటానికి. " Samaṁ carantam.

ఆయన శాశ్వతమైన సమయం. అంతా కాలముతోనే జరుగుతోంది. కాలము...మన సమయం లెక్కింపు గతము వర్తమానము మరియు భవిష్యత్తు. ఇది సాపేక్షము. మనము మొన్నటి రోజు చర్చిస్తున్నాము. ఈ గతము, ప్రస్తుతము, భవిష్యత్తు అనేది ఒక దానితో మరొకటి సంబంధం కలిగిన పదం. ... ఒక చిన్న పురుగుకు, గతము, వర్తమానము మరియు భవిష్యత్తు భిన్నంగా ఉంటుంది నా గతము, వర్తమానము మరియు భవిష్యత్తు నుండి. సాపేక్ష పదం. అదేవిధముగా బ్రహ్మ యొక్క గతము, వర్తమానము భవిష్యత్తు, నా గతము, వర్తమానము మరియు భవిష్యత్తు నుండి వేరుగా ఉంటుంది. కానీ కృష్ణుడికి గతము, వర్తమానము మరియు భవిష్యత్తు లేదు. అందువలన ఆయన శాశ్వతమైన వాడు. మనము ఈ శరీరాన్ని మార్చడం వలన మనము గతము, వర్తమానము మరియు భవిష్యత్తును కలిగి ఉన్నాము ఇప్పుడు మనము ఈ శరీరం కలిగి ఉన్నాము... దీనికి ఒక సమయము ఉంది. అటువంటి మరియు అటువంటి సమయములో, నేను నా తండ్రి మరియు తల్లికి జన్మించాను. ఇప్పుడు ఈ శరీరం కొంత సమయం పాటు ఉంటుంది. ఇది పెరుగుతుంది. ఇది కొంత ఉప ఉత్పత్తిని చేస్తుంది. తరువాత అది ముసలిది అవుతుంది. తరువాత శుష్కించిపోతుంది. తరువాత నశించిపోతుంది, మరణిస్తుంది ఇంక ఈ శరీరము ఉండదు. మీరు మరొక శరీరాన్ని అంగీకరించాలి. ఈ శరీరం మరణించినది. ఈ శరీరము యొక్క చరిత్ర, గతము, వర్తమానము మరియు భవిష్యత్తు, పూర్తి అయినది. మీరు మరొక శరీరాన్ని అంగీకరిస్తారు. మళ్ళీ మీ గతము, వర్తమానము మరియు భవిష్యత్తు ప్రారంభమవుతుంది. కానీ కృష్ణుడికి గతము, వర్తమానము, భవిష్యత్తు లేవు ఎందుకంటే ఆయన శరీరాన్ని మార్చడు. ఇది మనకు కృష్ణుడికి మధ్య ఉన్న తేడా.

ఉదాహరణకు కృష్ణుడు అర్జునుడితో మాట్లాడారు: గతంలో, నేను ఈ తత్వము గురించి, భగవద్గీత గురించి సూర్య-భగవంతునితో మాట్లాడాను. కాబట్టి అర్జునుడు దానిని నమ్మలేకపోయాడు. అర్జునుడికి ప్రతిదీ తెలుసు, కానీ మన కోసం, మనము తెలుసుకోవడానికి, ఆయన ఈ ప్రశ్నను అడిగాడు: కృష్ణా, మనము సమకాలీకులము, ఆచరణాత్మకంగా ఒకే కాలంలో జన్మించినాము. సూర్య-భగవంతునికి ఈ తత్వము నీవు చెప్పినట్లు నేను ఎలా నమ్మాలి? " దానికీ సమాధానం ఏమిటంటే: "నా ప్రియమైన అర్జునా, నీవు కూడా అక్కడ ఉన్నావు, కానీ నీవు మర్చిపోయావు. నేను మర్చిపోలేదు. అది వ్యత్యాసం. " గతము, వర్తమానము, మరియు భవిష్యత్తు, ఎవరైతే వ్యక్తులు మర్చిపోతారో. కానీ ఎవరు మర్చిపోరో, ఎవరు శాశ్వతముగా ఉంటారో, వారికి గతము, వర్తమానము, భవిష్యత్తు ఉండదు.

అందువలన, కుంతి కృష్ణుడిని శాశ్వతము అని సంభోదిస్తుంది. Manye tvāṁ kālam. ఆయన శాశ్వతము కనుక, ఈశానామ్, ఆయన సంపూర్ణ నియంత్రికుడు. కుంతీ చెప్తుంది: మన్యే, "నేను భావిస్తున్నాను..." కృష్ణుడి యొక్క ప్రవర్తన ద్వారా, ఆమె అర్థం చేసుకోగలదు కృష్ణుడు శాశ్వతమైన వాడని, కృష్ణుడు మహోన్నతమైన నియంత్రికుడు అని. Anādi-nidhanam. Anādi-nidhana... ప్రారంభం లేదు, ముగింపు లేదు. అందువలన విభుమ్.