TE/Prabhupada 0916 - కృష్ణుడికి మీ చక్కని దుస్తులు లేదా చక్కని పువ్వులు లేదా చక్కని ఆహారము అవసరం లేదు



730415 - Lecture SB 01.08.23 - Los Angeles


కృష్ణుడికి మీ చక్కని దుస్తులు లేదా చక్కని పువ్వులు లేదా చక్కని ఆహారము అవసరం లేదు ప్రభుపాద: ఈ భౌతిక ప్రపంచం లోపల భగవంతుని ఆగమనము మరియు అంతర్దానము, దీనిని చికిర్షితం అని పిలుస్తారు. చికిర్షితం పదం యొక్క అర్థం ఏమిటి? భక్తుడు: లీలలు. ప్రభుపాద: లీలలు. కృష్ణుడు లీలను చేయడానికి వస్తాడు ఆయన... ఆయన వచ్చినప్పుడు, ఆయన, ఆయన కొన్ని లీలలను చేస్తాడు ఈ లీలలు సాధువులకు రక్షణ ఇవ్వడం మరియు దుష్టులను చంపడము. కానీ రెండు కార్యక్రమాలూ ఆయన లీలలే. ఆయన అసూయ చెందడు. ఆయన అసూయ పడలేడు. రాక్షసులను చంపడం, అది కూడా ఆయన ప్రేమ. ఉదాహరణకు కొన్నిసార్లు మనము మనపిల్లలను శిక్షిస్తాము, మనము అతన్ని చాలా బలముగా చెంపపై కొడతాము. ఇది ప్రేమ వలన కాదు. ప్రేమ ఉంది. కాబట్టి కృష్ణుడు రాక్షసుడిని చంపినప్పుడు, ఆ పని భౌతికము అసూయ లేదా ఈర్ష్య యొక్క స్థితి మీద కాదు. కాదు

అందువల్ల, అది శాస్త్రములలో కూడా పేర్కొనబడింది రాక్షసులు కూడా, భగవంతుడి చేత చంపబడిన వారు, వారు వెంటనే మోక్షం పొందుతారు. ఫలితం ఒకటే. ఉదాహరణకు పూతన వలె. పూతన చంపబడింది. కృష్ణుడిని చంపాలని పూతన కోరుకుంది, కానీ కృష్ణుడిని ఎవరు చంపగలరు? అది సాధ్యం కాదు. ఆమె చంపబడింది. కానీ ఆమె చంపబడినప్పుడు, అయితే దాని వలన ఫలితమేమిటి? దీని ఫలితంగా ఆమె కృష్ణుడి యొక్క తల్లి స్థానము పొందింది. కృష్ణుడు తన తల్లిగా ఆమెను అంగీకరించారు. ఆమె విషము పూసుకున్న రొమ్ముతో వచ్చినది: కృష్ణుడు నా రొమ్మును తాగుతాడు, వెంటనే పిల్లవాడు చనిపోతాడు. కానీ అది సాధ్యం కాదు. ఆమె చంపబడింది. కృష్ణుడు రొమ్మును పీల్చినాడు మరియు ప్రాణాన్ని పూర్తిగా పీల్చాడు. కానీ కృష్ణుడు ప్రకాశవంతమైన వైపు తీసుకున్నాడు: "ఈ స్త్రీ, రాక్షసి, ఆమె నన్ను చంపడానికి వచ్చింది, కానీ ఏట్లాగైతే ఏమి నేను ఆమె రొమ్ము నుండి పాలను తాగాను. కాబట్టి ఆమె నా తల్లి. ఈమె నా తల్లి." ఆమెకు తల్లి స్థానము వచ్చింది.

ఇవి భాగవతములో వివరించబడ్డాయి. ఉద్ధవుడు విదురునికి వివరించారు, కృష్ణుడు చాలా దయ కలిగిన వాడు, భగవంతుడు చాలా దయతో ఉంటాడు. ఒక వ్యక్తి విషముతో ఆయనని చంపడానికి కోరుకున్నా కూడా, ఆమె తల్లిగా అంగీకరించబడింది. ఇటువంటి దయ కలిగిన భగవంతుడు, కృష్ణుడు, కృష్ణుడిని తప్ప ఇతరులను ఎవరిని ఆరాధిస్తాను? ఈ ఉదాహరణ ఇవ్వబడింది. వాస్తవానికి కృష్ణుడికి శత్రువు లేడు. ఇక్కడ చెప్పబడింది: na yasya kaścid dayitaḥ. దైతః అంటే అనుగ్రహము. ఎవరికి అనుగ్రహము ఇవ్వబడదు. Na yasya kaścid dayito 'sti karhicid dveṣyaś ca. ఎవరూ ఆయన శత్రువు కాదు. కానీ ఆయనకి శత్రువు గా ఎవరు అవ్వవచ్చు, ఆయనకి స్నేహితుడుగా ఎవరు అవ్వవచ్చు?

ఉదాహరణకు మనం స్నేహితులను చేసుకున్నాము. ఏమైనా దీవెన లేదా కొంత లాభాన్ని మనము స్నేహితుని నుండి ఆశిస్తాము శత్రువులు అంటే శత్రువుల నుండి హానికరమైన కార్యక్రమాలు ఉంటాయని మనము ఉహిస్తాము. కానీ కృష్ణుడు పరిపూర్ణుడు ఎవరూ ఎటువంటి హాని ఆయనకు చేయలేరు, ఎవరూ ఏదైనా కృష్ణుడికి ఇవ్వలేరు. కావున స్నేహితుడు మరియు శత్రువు యొక్క అవసరం ఎక్కడ ఉంది? అవసరం లేదు. అందువలన ఇది ఇక్కడ చెప్పబడింది: na yasya kaścid dayito 'sti. ఆయనకు ఎవరి అనుగ్రహము అవసరము లేదు. ఆయన సంపూర్ణుడు. నేను చాలా పేద వాడిని కావచ్చు. నేను ఎవరైనా స్నేహితుని యొక్క అనుగ్రహాన్ని ఆశిస్తాను, ఎవరిదైనా అనుగ్రహాన్ని. కానీ అది నా కోరిక ఎందుకంటే నేను అసంపూర్ణంగా ఉన్నాను. నేను సంపూర్ణముగా లేను. నేను చాలా విధాలుగా లోపము కలిగి ఉన్నాను. నేను ఎల్లప్పుడూ అవసరములు కలిగి ఉన్నాను. అందువలన నేను కొందరిని స్నేహితులను చేసుకోవాలనుకుంటున్నాను, అదేవిధముగా నేను శత్రువును ద్వేషిస్తాను. కాబట్టి కృష్ణుడు, ఆయన భగవంతుడు అవటము వలన... ఎవరూ కృష్ణుడికి ఎటువంటి హానీ చేయలేరు, ఎవరూ కృష్ణుడికి ఏమి ఇవ్వలేరు. అయితే ఎందుకు కృష్ణుడికి చాలా సౌకర్యాలను ఇస్తున్నాము? మనము కృష్ణుడికి దుస్తులు వేస్తున్నాము, మనము కృష్ణుడిని అలంకరిస్తున్నాము, మనము కృష్ణుడికి మంచి ఆహారాన్ని ఇస్తున్నాము. కాబట్టి ఆలోచన ఏమిటంటే...

ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ చక్కని దుస్తులు లేదా మంచి పువ్వు లేదా చక్కని ఆహారము కృష్ణుడికి అవసరం లేదు. కృష్ణునికి అవసరం లేదు. కానీ మీరు ఆయనకు ఇస్తే, అప్పుడు మీరు ప్రయోజనము పొందుతారు. ఇది కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని అతను అంగీకరిస్తున్నాడు. ఉదాహరణ ఇవ్వబడింది: అసలైన వ్యక్తిని మీరు అలంకరించినట్లయితే, అద్దంలో వ్యక్తి యొక్క ప్రతిబింబం, ఇది అలంకరించబడినదిగా కనిపిస్తుంది. కాబట్టి మనము ప్రతిబింబాలు. బైబిల్ లో కూడా మనిషి భగవంతుడు చిత్రం వలె తయారు చేయబడినాడు అని చెప్పబడింది. కాబట్టి మన, కృష్ణుడు ఆధ్యాత్మికము కనుక, మనము... ఆయనకు రెండు చేతులు, రెండు కాళ్ళు, ఒక తల ఉంది. కాబట్టి వ్యక్తి భగవంతునివలె తయారు చేయబడినాడు కనుక మనము భగవంతుని చిత్రము యొక్క ప్రతిబింబములు అని అర్థం. మనము తయారు చేసేది కాదు,మన రూపం ప్రకారం ఏదైనా రూపమును ఊహించుకోండి. అది తప్పు. మాయావాది తత్వము అలా ఉంటుంది. దీనిని మానవ రూపారోపణము అని పిలుస్తారు. వారు చెప్తారు: "ఎందుకంటే... పరమ సత్యము వ్యక్తి కాదు, కానీ మనము వ్యక్తులము కనుక మనము ఆ సంపూర్ణ సత్యమును కూడా వ్యక్తిగా ఊహించుకుంటాము. "కేవలము వ్యతిరేకము. వాస్తవమునకు అది వాస్తవం కాదు. ఈ వ్యక్తిగత రూపం భగవంతుడు ప్రతిబింబంగా మనకు లభించింది. ప్రతిబింబం లో... అసలైన వ్యక్తికి లాభం చేస్తే, ప్రతిబింబం ప్రయోజనము పొందుతుంది. అది తత్వము. ప్రతిబింబం కూడా ప్రయోజనము పొందుతుంది.