TE/Prabhupada 0948 - ఈ యుగము కలియుగముఇది చాలా మంచి సమయం కాదు అసమ్మతి మరియు పోరాటం, కలహాలు



720831 - Lecture - New Vrindaban, USA


ఈ యుగము కలి యుగము అని పిలువబడింది, ఇది చాలా మంచి సమయం కాదు. కేవలం అసమ్మతి మరియు పోరాటం, కలహాలు ఉదాహరణకు రాత్రి పూట, మనము మన చక్కని ఇంటిలో నిద్రిస్తున్నాం, కానీ సూక్ష్మ శరీరం నన్ను ఒక పర్వతం పైకి తీసుకు వెళ్ళుతుంది. కొన్నిసార్లు నేను కలలో చూస్తాను నేను పర్వత శిఖరాగ్రం పైకి వచ్చాను, చాలా ఎత్తైన, నేను పడిపోతున్నాను. వాస్తవానికి, నా స్థూల శరీరం ఒక చక్కని, సౌకర్యవంతమైన ఇంటిలో నిద్రిస్తున్నది, కానీ సూక్ష్మ శరీరం నన్ను తీసుకు వెళ్తుంది. మనకు రోజువారీ అనుభవం ఉంది. అదేవిధముగా, మరణం అంటే మనము ఈ స్థూల శరీరమును మారుస్తాము. ఉదాహరణకు మీరు మీ చొక్కా మరియు కోట్ ను కలిగి ఉన్నారు. కావున మీరు కోట్ మార్చండి, కానీ మీరు మీ చొక్కా ఉంచండి. మీరు దీనిని సాధారణముగా చేస్తారు. అదేవిధముగా, నేను నా సూక్ష్మ శరీరం ఉంచుకుంటాను, నా స్థూల శరీరమును వదలివేస్తాను; దానిని మరణం అంటారు. ప్రకృతి చట్టాలు ద్వారా మరొక తల్లి యొక్క గర్భం లోకి సూక్ష్మ శరీరము ద్వారా వెళ్ళుతాను నేను మరొక స్థూల శరీరమును అభివృద్ధి చేసుకుంటాను, తల్లి సరఫరా చేసిన పదార్థాలతో . శరీరం సిద్ధమైనప్పుడు, నేను తల్లి గర్భంలో నుండి వస్తాను నేను ఆ సూక్ష్మ మరియు స్థూల శరీరముతో మళ్ళీ పని చేస్తాను. భాగవత-ధర్మం అంటే మనం అధిగమించవలసి వుంటుంది స్థూల మరియు సూక్ష్మ శరీరములను రెండింటిని; ఆధ్యాత్మిక శరీరానికి రావడము. ఇది చాలా శాస్త్రీయమైనది. మనము ఆధ్యాత్మిక శరీరానికి వచ్చిన వెంటనే, ముక్త సంగ, స్థూల మరియు సూక్ష్మ శరీరం నుంచి విముక్తి పొందుతాము, మన వాస్తవమైన శరీరానికి, ఆధ్యాత్మిక శరీరానికి వస్తాం, అప్పుడు వాస్తవానికి మనము ఆనందం మరియు స్వాతంత్రమును అనుభవిస్తాము.

కాబట్టి కృష్ణ చైతన్యము యొక్క ఈ పద్ధతి మానవ సమాజానికి అత్యధిక వరము ఎందుకంటే అది ఆధ్యాత్మిక శరీర స్థితికి మానవుని తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది - స్థూల మరియు సూక్ష్మ భౌతిక శరీరాన్ని అధిగమిస్తూ. ఇది అత్యధిక పరిపూర్ణము. మానవ జీవితం ఆ స్థితికి రావడానికి ఉద్దేశించబడింది, ఆధ్యాత్మిక స్థితి, జీవితం యొక్క స్థూల మరియు భౌతిక శరీర భావనలను అధిగమించి వలసి ఉంది. అది సాధ్యమే. ఈ యుగములో ఇది సులభము అయింది. ఈ యుగమును కలి యుగము అని అంటారు, చాలా మంచి సమయం కాదు. కేవలం అసమ్మతి, పోరు, వివాదము, అపార్థం. ఈ యుగము వీటితో పూర్తిగా ఉంది, ఈ జరుగుతున్న సంఘటనలన్నీ. అందువలన ఆధ్యాత్మిక స్థితికి రావడానికి ఈ యుగములో చాలా కష్టము. గతంలో, అది అంత కష్టం కాదు. ప్రజలు వేదముల పద్ధతి ద్వారా చాలా సులభంగా శిక్షణ పొందారు. కానీ ఇప్పుడు ప్రజలకు ఆసక్తి లేదు. వారు కేవలము స్థూల శరీరము మీద ఆసక్తి కలిగి ఉన్నారు, లేదా కొద్దిగా ఎక్కువగా, ఎవరు కొద్దిగా ఉన్నత స్థానములో ఉన్నారో, సూక్ష్మ శరీరం. కానీ వారికి ఆధ్యాత్మిక శరీరము యొక్క సమాచారం లేదు. విద్య పురోగతి ఉన్నప్పటికీ, ఆధ్యాత్మిక శరీరం గురించి ఎటువంటి విద్య లేదు. వారు కేవలం స్థూల భౌతికము మరియు సూక్ష్మ శరీరంపై మాత్రమే ఆలోచిస్తున్నారు. అందువలన ఈ ఉద్యమం, కృష్ణ చైతన్య ఉద్యమము, చాలా ముఖ్యమైన ఉద్యమం. ఈ కృష్ణ చైతన్య ఉద్యమమును తీసుకున్న వారు చాలా చాలా అదృష్టవంతులు