TE/Prabhupada 0954 - మనము ఈ ప్రాధమిక గుణాలను జయిస్తే, అప్పుడు మనము సంతోషంగా ఉంటాము



750623 - Conversation - Los Angeles


మనము ఈ ప్రాధమిక గుణాలను జయిస్తే, అప్పుడు మనము సంతోషంగా ఉంటాము

బహుళాస్వా: శ్రీల ప్రభుపాద, మన భౌతిక కలుషితమైన స్థితిలో, మనము ఒక వెర్రిగా లేదా పిచ్చివాడిగా ప్రవర్తిస్తే, అప్పుడు మనము దానిని తమస్ లేదా అజ్ఞానం అని పిలుస్తాము. కానీ ఆధ్యాత్మిక ఆకాశంలో జీవి తన పవిత్రమైన స్థితిలో ఉన్నప్పుడు, ఏమి ప్రభావితము... ఆయనకి భ్రాంతి కలిగించే స్థితిలో ఏదైనా ఆయనపై ప్రభావితము చూపుతుందా

ప్రభుపాద: అవును. ఉదాహరణకు జయ-విజయుల లాగానే. వారు అపరాధము చేసినారు. నలుగురు కుమారులను ప్రవేశించడానికి వారు అనుమతించలేదు. అది వారి తప్పు. కుమారులు చాలా బాధపడ్డారు. అప్పుడు వారు "నీవు ఈ ధామములో నివసించుటకు అర్హత లేదు" అని ఆయనను శపించారు. కాబట్టి మనము కొన్నిసార్లు పొరపాటు చేస్తాము. ఇది కూడా స్వాతంత్ర్యం యొక్క దుర్వినియోగము. లేదా మనము అల్పమైన వారిమి కావున మనము పతనము అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు అగ్ని యొక్క చిన్న కణము వలె, అది అగ్ని అయినప్పటికీ, అది ఆరిపోయే అవకాశం ఉంది. మహా అగ్ని చల్లారదు. కాబట్టి కృష్ణుడు మహా అగ్ని, మనము అంశలము, కణములము, చాలా అల్పమైన వారిమి. కాబట్టి అగ్ని లోపల కణములు ఉన్నాయి, "ఫట్,ఫట్!" చాలా ఉన్నాయి. కానీ కణములు అగ్ని నుండి బయట పడితే, అవి ఆరిపోతాయి. ఇది అలా ఉంటుంది. పతనము అవ్వడము అంటే, భౌతిక ప్రపంచంలో, మూడు వేర్వేరు గుణాలు ఉన్నాయి: తమో-గుణము, రజో-గుణము సత్వ-గుణము. అయితే ... ఉదాహరణకు కణము క్రింద పడిపోవటము వలె . పొడి గడ్డి మీద పడితే, గడ్డి దావాగ్ని అవుతుంది. కాబట్టి మండే గుణము ఇప్పటికీ కొనసాగుతుంది, అది మంట నుండి బయట పడినప్పటికీ. పొడిగడ్డి వాతావరణం కారణంగా, మరోసారి అది మరో అగ్ని తయారుచేస్తుంది, మండుతున్న గుణముము నిర్వహిoచబడుతుంది. అది సత్వ-గుణము. ఆకుపచ్చ గడ్డి మీద కణము పడితే, అది ఆరిపోతుంది. మరియు ఆకుపచ్చగడ్డి, ఎండితే పొడి అయితే పొడిగడ్డి అవుతుంది, మళ్ళీ జ్వలించే స్థాయికి వచ్చే అవకాశం ఉంది. కానీ కణము నీటిలో పడిపోతే, అప్పుడు అది చాలా కష్టము. అదేవిధముగా, భౌతిక ప్రపంచంలోకి వచ్చిన ఆత్మ, మూడు గుణాలు ఉన్నాయి. తమో-గుణమును స్పర్శిస్తే, అతడు చాలా అసహ్యకరమైన స్థితిలో ఉన్నాడు. అది రజో-గుణముతో పతనము అయితే అప్పుడు కొంత కార్యక్రమము ఉంటుంది. వారు పని చేస్తున్నట్లుగానే. ఆయన సత్వ -గుణములో పడినట్లయితే, అప్పుడు అతడు కనీసం జ్ఞానము కలిగి ఉంటాడు "నేను నిప్పుని. నేను ఈ నిస్తేజిత పదార్థానికి చెందను. "

కావున మనం అతన్ని మళ్ళీ సత్వ -గుణమునకు, బ్రాహ్మణ స్థాయి తీసుకురావాలి కావున అతడు అహం బ్రహ్మాస్మి అని అర్థం చేసుకోగలడు, నేను ఆత్మ. నేను ఈ పదార్థము కాదు. అప్పుడు ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అందువల్ల మనము ఆయనని సత్వ-గుణము స్థితిపైకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాము, అంటే రజో-గుణ, తమో-గుణము యొక్క పనులను విడనాడటము అంతే: ఏ మాంసం తినకూడదు, అక్రమ లైంగిక సంబంధము వద్దు , ఏ మత్తు వద్దు, ఏ జూదము వద్దు. చాలా నిషేధములు - ఆయనపై భౌతిక లక్షణాల ప్రభావాన్ని తిరస్కరించడం. ఆయన సత్వ గుణము లో ఉన్నట్లయితే, అప్పుడు, అతడు ఆ స్థితి మీద ఉంటాడు... ఆయన సత్వ-గుణములో ఉన్నప్పుడు, ఆ తరువాత రజస్-తమస్, ఇతర అధమ లక్షణాలు, ఆయనకి కలత కలిగించవు. అధమ లక్షణము, అధమ లక్షణము యొక్క స్థితి, ఇది: అక్రమ మైథునము, మాంసం తినడం, మత్తు, జూదం. కాబట్టి tadā rajas-tamo-bhāvāḥ kāma-lobhādayaṣ ca ye ( SB 1.2.19) కనీసం ఈ అధమ లక్షణాల నుండి ముక్తి పొందినప్పుడు ... అధమ లక్షణము అంటే కామ, కామ కోరికలు మరియు దురాశ. భౌతిక ప్రపంచంలో, సాధారణంగా వారు ఈ అధమ లక్షణములలో ఉంటారు, అంటే ఎల్లప్పుడూ కామ కోరికలతో నిండి ఉండటం, సంతృప్తి చెందక పోవడము, అత్యాశతో ఉండటము. కాబట్టి మనము ఈ అధమ లక్షణాలను జయిస్తే, అప్పుడు మనము సంతోషంగా తయారవుతాము. Tadā rajas-tamo-bhāvāḥ kāma-lobhādayaṣ ca ye, ceta etair anaviddham... ( SB 1.2.19) చైతన్యము ఈ అధమ లక్షణాలచే ప్రభావితం కానప్పుడు, ceta etair ana... Sthitaḥ sattve prasīdati. సత్వ గుణము స్థితి మీద ఉన్నప్పుడు, ఆయన సంతోషంగా ఉంటాడు. ఇది ఆధ్యాత్మిక జీవితం యొక్క ఆరంభం. ఎప్పుడూ... మనస్సు కామ కోరికలు దురాశతో కలవరపడినంత కాలము, ఆధ్యాత్మిక జీవితం ప్రశ్నే లేదు. అందువలన, మొదటి కర్తవ్యము మనస్సును ఎలా నియంత్రించాలి, అందుచే అది అధమ లక్షణములు అయిన, కామ కోరికలు మరియు దురాశతో ప్రభావితం కాకూడదు. మనము పారిస్ లో ముసలివాడిని చూసాము, డెబ్బై ఐదు సంవత్సరాల వయస్సు, ఆయన రాత్రి క్లబ్ కు వెళుతున్నాడు, ఎందుకంటే కామ కోరిక ఉంది. క్లబ్లో ప్రవేశించడానికి ఆయన యాభై డాలర్లు చెల్లిస్తాడు, తర్వాత ఆయన ఇతర విషయాల కోసం మరింత చెల్లిస్తాడు. ఆయనకు డెబ్బై-ఐదు సంవత్సరాల వయస్సు ఉన్నప్పటికీ, కామ కోరిక ఉంది