TE/Prabhupada 0955 - జీవులలో ఎక్కువమంది, వారు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నారు. కేవలం కొంత పతనం అయినారు



750623 - Conversation - Los Angeles


జీవులలో ఎక్కువమంది, వారు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నారు. కేవలం కొంత పతనం అయినారు

డాక్టర్ మిజ్: ఆధ్యాత్మిక ఆకాశంలో అన్ని ఆత్మలు అందరూ ఒకేసారి ఆధ్యాత్మిక ఆకాశం నుంచి పతనము అయినారా, లేదా వివిధ సమయాల్లో అయినారా, లేదా ఎల్లప్పుడూ మంచిగా ఉండే ఆత్మలు ఉన్నాయా, వారు పిచ్చిగా ఉండరు, వారు పతనము అవ్వరు?

ప్రభుపాద: లేదు, అక్కడ... మెజారిటీ, తొంభై శాతం, వారు ఎల్లప్పుడూ మంచిగా ఉంటారు. వారు ఎప్పుడూ పతనము అవ్వరు.

డాక్టర్ మిజ్: కాబట్టి మనము పది శాతములో ఉన్నామా?

ప్రభుపాద: అవును.లేదా అంతకంటే తక్కువ. భౌతిక, మొత్తం భౌతిక ప్రపంచములో, జీవులు అందరు... ఉదాహరణకు జైలులో కొంత మంది వుంటారు, కానీ వారు మెజారిటీ కాదు. ఎక్కువమంది జనాభా, వారు జైలు బయట ఉన్నారు. అదేవిధముగా, జీవులలో ఎక్కువ భాగం, భగవంతునిలో భాగం, వారు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నారు. కేవలము కొంత మంది మాత్రమే పతనము అయినారు

డాక్టర్. మిజ్: కృష్ణునికి ముందుగానే తెలుసా ఒక ఆత్మ మూర్ఖముగా ఉండి, పతనము అవుతుంది అని ?

ప్రభుపాద: కృష్ణుడికా? అవును, కృష్ణుడికి తెలియవచ్చు ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు.

డాక్టర్ మిజ్: మరిన్ని ఆత్మలు అన్ని సమయములలో పతనము అవుతాయా?

ప్రభుపాద: అన్ని సమయములలో కాదు. కానీ పతనం అయ్యే ధోరణి ఉంది, అన్ని కాదు, కానీ స్వాతంత్ర్యం ఉంది కనుక... అందరూ స్వాతంత్ర్యం దుర్వినియోగం చేసుకోవడానికి ఇష్టపడరు. ఇదే ఉదాహరణ: ఒక నగరం నిర్మిస్తున్న ఒక ప్రభుత్వము, జైలు గృహాన్ని కూడా నిర్మిస్తుంది, ఎందుకంటే కొందరు నేరస్థులు అవుతారని ప్రభుత్వమునకు తెలుసు, కాబట్టి వారికి ఆశ్రయం కూడా నిర్మిస్తారు. దీనిని అర్థం చేసుకోవడము చాలా సులభం. వంద శాతం జనాభా నేరస్తులుగా ఉండరు, కానీ ప్రభుత్వమునకు తెలుసు వారిలో కొంత మంది ఉంటారని లేకపోతే ఎందుకు వారు కూడా జైలును కూడా నిర్మిస్తారు? ఒకరు చెప్పవచ్చు, "నేరస్థుడు ఎక్కడ ఉన్నాడు? మీరు నిర్మిస్తున్నారు..." నేరస్థుడు ఉంటాడని ప్రభుత్వమునకు తెలుసు. కాబట్టి సాధారణ ప్రభుత్వానికి తెలిస్తే, భగవంతునికి ఎందుకు తెలియదు? ఎందుకంటే ధోరణి ఉంది.

డాక్టర్. మిజ్: ఆ ధోరణి యొక్క మూలం...?

ప్రభుపాద: అవును.

డాక్టర్. మిజ్: ఆ ధోరణి ఎక్కడ నుండి వస్తోంది?

ప్రభుపాద: ధోరణి అంటే స్వాతంత్ర్యం. స్వాతంత్ర్యం అంటే అర్థం ప్రతి ఒక్కరూ దానిని సరిగా ఉపయోగించుకోవచ్చు లేదా, దానిని దుర్వినియోగం చేయవచ్చు. అది స్వాతంత్రం. మీరు ఒక వైపు మాత్రమే చేస్తే, మీరు పతనము కాకుండా ఉండేటట్లు, అది స్వాతంత్రం కాదు. ఇది బలవంతముగా చేయడము. అందుచేత కృష్ణుడు చెప్తాడు, yathecchasi tathā kuru ( BG 18.63) "ఇప్పుడు నీకు ఇష్టము వచ్చేది నీవు చేయ వచ్చు"