TE/Prabhupada 0997 - కృష్ణుని యొక్క సేవ ప్రతి ఒక్కరికీ ఉద్దేశించబడింది. అందువలన మనం అందరినీ స్వాగతిస్తాము



730406 - Lecture SB 02.01.01-2 - New York


కృష్ణుని యొక్క సేవ ప్రతి ఒక్కరికీ ఉద్దేశించబడింది. అందువలన మనం అందరినీ స్వాగతిస్తాము ఏమైనా, కీర్తన, జపము చేయడము చాలా పవిత్రమైనది. చైతన్య మహాప్రభు ఈ వరమును ఇచ్చారు, ceto-darpaṇa-mārjanaṁ bhava-mahā-dāvāgni-nirvāpaṇam ( CC Antya 20.12) మనము ఈ భౌతిక ప్రపంచంలో బాధపడుతున్నాము ఎందుకంటే మనకు అవగాహన లేదు మన హృదయాలు పరిశుద్ధం అవ్వలేదు. హృదయం పవిత్రము చేయబడలేదు. కాబట్టి ఈ జపము చేయడము మన హృదయాన్ని పవిత్రము చేయటానికి సహాయం చేస్తుంది.

śṛṇvatāṁ sva-kathāḥ kṛṣṇaḥ
puṇya-śravaṇa kīrtanaḥ
hṛdy antaḥ stho abhadrāṇi
vidhunoti suhṛt satām
(SB 1.2.17)

కీర్తన, జపము చేయడము చాలా చక్కనిది. మీరు కీర్తన, జపము చేయడము ప్రారంభించిన వెంటనే, లేదా కృష్ణుడి గురించి వినండి - కీర్తన చేయడము కూడా కృష్ణుడి గురించి శ్రవణము చేయడము కూడా - కావున వెంటనే ప్రక్షళన పద్ధతి ప్రారంభమవుతుంది, ceto-darpaṇa-mārjanaṁ ( CC Antya 20.12) మన హృదయం పవిత్రము అయిన వెంటనే, bhava-mahā-davāgni-nirvāpaṇam, అప్పుడు మనము ఈ భౌతిక జీవితము యొక్క జ్వలించే అగ్ని నుండి విముక్తి పొందుతాము. కాబట్టి కీర్తన, జపము చేయడము చాలా పవిత్రమైనది, అందుచేత ఇక్కడ పరీక్షిత్ మహారాజుకు, శుకదేవ గోస్వామి చెప్తున్నాడు, varīyān eṣa te praśnaḥ kṛto loka-hitaṁ nṛpa ( SB 2.1.1) మరొక ప్రదేశములో కూడా, శుకదేవ గోస్వామి చెప్తున్నారు, సూత, సూత గోస్వామి చెప్తున్నారు yat kṛtaḥ kṛṣṇa-sampraśno yayātmā suprasīdati. నైమిశారణ్యంలో ఉన్నతమైన సాధువులు కృష్ణుని గురించి ప్రశ్నించారు, ఆయన ఇలా సమాధానమిచ్చాడు. Yat kṛtaḥ kṛṣṇa-sampraśnaḥ: మీరు కృష్ణుడి గురించి ప్రశ్నించినందున, అది మీ హృదయాన్ని పవిత్రము చేస్తుంది, yenātmā suprasīdati. నీ హృదయం లోపల చాలా ఆధ్యాత్మిక ఆనందమును అనుభూతి చెందుతారు "

కాబట్టి varīyān eṣa te praśnaḥ kṛto loka-hitam ( SB 2.1.1) లోకహితం. వాస్తవానికి మా, ఈ ఉద్యమం మానవ సమాజము యొక్క ప్రధాన సంక్షేమ కార్యక్రమము, లోక-హితమ్. ఇది వ్యాపారము కాదు. వ్యాపారము అంటే నా హితం, నా లాభము కొరకు మాత్రమే. ఇది కాదు ఇది కృష్ణుడి పని. కృష్ణుడు యొక్క పని అంటే అర్థం కృష్ణుడు అందరి వాడు; అందుచేత కృష్ణుని యొక్క పని ప్రతి ఒక్కరికీ ఉద్దేశించబడింది. అందుచేత మనము ప్రతి ఒక్కరినీ స్వాగతిస్తున్నాము. వ్యత్యాసం లేదు. ఇక్కడకు రండి కీర్తన చేయండి, లోక-హితమ్.. ఒక సాధువు, ఒక సాధువు ఎల్లప్పుడూ లోక హితము గురించి ఆలోచించాలి. అది సాధువు మరియు సాధారణ మనిషికి మధ్య తేడా. సాధారణ మనిషి, ఆయన తన గురించి లేదా తన వారి గురించి మాత్రమే ఆలోచిస్తాడు కుటుంబం కోసం, సమాజము కోసం, వర్గము కోసం, దేశం కోసం. ఇవి అన్ని విస్తరించబడిన స్వార్థము. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను నా ప్రయోజనము గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. నేను కొద్దిగా పెరిగినప్పుడు, నా సోదరులు సోదరీమణులు గురించి ఆలోచిస్తాను, నేను కొద్దిగా పవిత్రము అయినప్పుడు, నేను నా కుటుంబం గురించి ఆలోచిస్తాను. మరి కొంత పవిత్రము అయినప్పుడు, నా వర్గము గురించి ఆలోచిస్తాను మరి కొంత పవిత్రము అయినప్పుడు, నేను నా దేశం, నా దేశం గురించి ఆలోచిస్తాను లేదా అంతర్జాతీయ మానవ సమాజం గురించి నేను ఆలోచించగలను. కానీ కృష్ణుడు చాలా గొప్పవాడు, కృష్ణుడు ప్రతి ఒక్కరిని కలుపుకుంటాడు మానవ సమాజం, జంతు సమాజం, పక్షి సమాజం, మృగం సమాజం, చెట్టు సమాజం-మాత్రమే కాదు. ప్రతి ఒక్కరిని. కృష్ణుడు చెప్తాడు, ahaṁ bīja-pradaḥ pitā ( BG 14.4) "నేను ఈ రూపాలన్నింటికి విత్తనము ఇస్తున్న తండ్రిని."