TE/Prabhupada 1005 - కృష్ణ చైతన్యము లేకుండా ఉంటే, మీరు కేవలం చెత్త కోరికలను కలిగి ఉంటారు



750713 - Conversation B - Philadelphia


కృష్ణ చైతన్యము లేకుండా ఉంటే, మీరు కేవలం చెత్త కోరికలను కలిగి ఉంటారు

శాండీ నిక్సాన్: సరే. ఈ ప్రశ్న నాకు అడగటానికి కష్టముగా ఉంది, ఎందుకంటే ఇది నా అజ్ఞానం చూపుతుంది. కానీ నేను అజ్ఞానంలో అడగడం లేదు. నాకు టేప్లో మీ సమాధానం కావాలి, సరే? మీ కోరిక ..? కృష్ణ చైతన్యాన్ని పొందాలనే కోరికతో సహా అన్ని కోరికలను చివరికి విడచి పెట్టాలా?

ప్రభుపాద: కృష్ణ చైతన్యము లేకుండా, మీరు కేవలం చెత్త కోరికలను కలిగి ఉంటారు. మీరు కృష్ణ చైతన్య వంతులు అయినప్పుడు, అప్పుడు మీరు సరియైన కోరికలను కోరుకుంటారు.

శాండీ నిక్సన్: అనేక ఆధ్యాత్మిక మార్గాల లక్ష్యం లోపల ఉన్న గురువు కనుగొనడము.

ప్రభుపాద: లోపల?

శాండీ నిక్సన్: లోపల ఉన్న గురువును. ఇది భిన్నమైనదేనా?

ప్రభుపాద: ఎవరు చెప్పారు , లోపల ఉన్న గురువును కను గోనాలి అని?

శాండీ నిక్సాన్: ఉమ్...

జయతీర్థ: కిర్పాల్ సింగ్, ఆయన చెప్పాడు.

శాండీ నిక్సాన్: నన్ను క్షమించండి?

జయతీర్థ: కిర్పాల్ సింగ్, అనే ఒక వ్యక్తి.

గురుదాస: కృష్ణమూర్తి కూడా ఇలా అన్నారు.

ప్రభుపాద: ఎందుకు ఆయన ప్రచారము చేయడానికి వచ్చాడు? (నవ్వు) ఈ మూర్ఖుడు, ఎందుకు ఆయన ప్రచారము చేయడానికి వచ్చాడు? ఇది సమాధానం. ఈ విషయాలు మూర్ఖులచే చెప్ప బడతాయి ఆయన ప్రచారము చేయడానికి వచ్చాడు, ఆయన " లోపల ఉన్న గురువును కనుగోనండి." అప్పుడు మీరు ఎందుకు వచ్చారు భోదించ డానికి? ప్రజలు తెలివైన వారు కాదు ఎందుకంటే, వారు ఆయనని పట్టుకోలేరు ఆయన అన్ని అర్థంలేనివి మాట్లాడతాడు, వారు వింటారు, అంతే.

గురుదాస: ఆయన "పుస్తకాల అవసరం లేదు" అనే ఒక పుస్తకాన్ని కూడా రాశాడు. (నవ్వు)

ప్రభుపాద: అందువల్ల ఆయన ఎంత మూర్ఖుడో అని మీరు తెలుసుకోవచ్చు. అవునా కాదా? మీరు ఒప్పుకుంటారా, లేదా? ఆయన పుస్తకాన్ని వ్రాసాడు ఆయన ఇలా చెప్పాడు, "పుస్తకాల అవసరం లేదు." ఆయన ప్రచారము చేయడానికి వచ్చాడు ఆయన చెప్పాడు, "గురువు అవసరం లేదు. గురువు లోపల ఉన్నాడు. "ఆయన ఒక మూర్ఖుడు కాదా?

శాండీ నిక్సాన్: సరే, వారు చెప్పేవారు... ఆ ప్రజలు...

ప్రభుపాద: కాదు, మొదట నా ప్రశ్నకు మీరు సమాధానం ఇవ్వండి. ఆయన వివాదాస్పద విషయాలు చెప్పినట్లయితే, ఆయన ఒక మూర్ఖుడు కాదా?

శాండీ నిక్సాన్: సరే, ఆయన తనకు తాను విరుద్ధంగా ఉన్నాడు.

ప్రభుపాద: అందువలన ఆయన ఒక మూర్ఖుడు. తనను తాను ఎలా కాపాడుకోవాలో ఆయనకు తెలియదు.

శాండీ నిక్సాన్: వేదాలను లాంఛనప్రాయంగా మరియు యథాతధముగా కూడా తీసుకోవచ్చా?

ప్రభుపాద: యథాతధముగా. మనము భగవద్గీత యథాతధముగా ఇస్తున్నాము, ఇది లాంఛనప్రాయంగా కాదు.