TE/Prabhupada 1012 - వినండి ప్రచారము చేయండి. వినండి ప్రచారము చేయండి. మీరు తయారీ చేయవలసిన అవసరము లేదు



750620c - Arrival - Los Angeles


శ్రవణము చేయండి మరియు తిరిగి దానినే ప్రచారము చేయండి, శ్రవణము చేయండి మరియు తిరిగి దానినే ప్రచారము చేయండి. మీరు తయారీ చేయవలసిన అవసరము లేదు

ప్రభుపాద:... ప్రవృత్తి, ధోరణి ఉంది. సహజంగానే నేను ఎవరినైన ప్రేమిస్తాను. ఇది అసహజమైనది కాదు. ఆ ప్రేమ కృష్ణుడి మీద ఉంచినప్పుడు, అది పరిపూర్ణము. మాయావాది, వారు నిరుత్సాహపడతారు; అందువల్ల వారు ఈ ప్రేమని సున్నాగా మార్చాలని అనుకుంటున్నారు. వారు గోపికల మీద కృష్ణుడికి ఉన్న ప్రేమను అర్థం చేసుకోలేరు. ఇది మరొక భౌతిక కథనము అని వారు భావిస్తున్నారు... ఓ, ఎలా ఉన్నావు, హయగ్రీవ ప్రభు? నీవు ఎలా ఉన్నావు? చాలా మంచిగా కనిపిస్తున్నావు. నీవు మెరుగుగా, చాలా కాంతిగా కనిపిస్తున్నావు, నేను నిన్ను వృందావనములో చివరిసారిగా చూసిన దాని కంటే. కృష్ణుడికి సేవ చేయడానికి నీవు చాలా నైపుణ్యాన్ని కలిగి ఉన్నావు. ప్రతి ఒక్కరికి ఉన్నాయి. నేను మాట్లాడుతున్నాను. దీనిని ఉపయోగించుకోవాలి. మొదట్లో నిన్ను కలుసుకున్నప్పుడు, నిన్ను ప్రచురణ చేయమని నేను నీకు సూచన ఇచ్చాను. అది మన బ్యాక్ టు గాడ్ హెడ్ ప్రారంభములో.

ఆయన మంచి టైపిస్ట్ కూడా. అది నీకు తెలుసా? (నవ్వు) నేను మన వారి అందరిలో అతడు అత్యుత్తమమని అనుకుంటున్నాను. ఆయన చాలా త్వరగా మరియు సరిగ్గా టైప్ చేయగలడు. నేను మన బృందములో హయగ్రీవ ప్రభు మరియు సత్స్వరూప మహారాజు చాలా మంచి టైపిస్టులు అని అనుకుంటున్నాను. మరియు జయాద్వైత కూడా. నేను నీవు కూడా అని అనుకుంటున్నాను?

జయాద్వైత: అవును. ఎందుకు మీరు బలి-మర్దనా యొక్క కథనాన్ని ప్రచురించ లేదు?

జయాద్వైత : బలి-మర్దనా యొక్క కథనం.

ప్రభుపాద: అవును.

జయాద్వైత : మేము ఎదురు చూస్తున్నాము. అది ప్రచురించడానికి సముచితం అవునా కాదా అని మేము చెప్పలేక పోతున్నాము.

ప్రభుపాద: ఆయన నిరాశకు గురయ్యాడు. ఆయన ప్రచురించాడు. ఆయన చాలా చక్కగా వ్రాశారు.

జయాద్వైత : ఆయన చక్కగా రాశారు?

ప్రభుపాద: అవును.

జయాద్వైత : మనము దానిని ప్రచురించవచ్చా?

ప్రభుపాద: కాబట్టి మనం... అవును, ఇక్కడ ఉంది... అది ఏమిటి?

బ్రహ్మానంద: "భ్రమ మరియు వాస్తవము," రెండు వ్యాసాలు...

ప్రభుపాద: ఆయన చాలా చక్కగా రాసినాడు. కాబట్టి మనం మన వారిని ప్రోత్సహించాలి. జయాద్వైత : దీనిని ప్రచురించండి. ప్రభుపాద: అవును. మన వారు, మన వారు అందరు వ్రాయాలి. లేకపోతే ఆయన మన తత్వము అర్థం చేసుకున్నాడని మనము ఎలా తెలుసుకోవాలి? రాయడం అంటే శ్రవణము కీర్తనము. శ్రవణము అంటే ప్రామాణికుల నుండి వినటము మరియు దానినే మళ్ళీ తిరిగి చెప్పటము. ఇది మన కర్తవ్యము, śravaṇṁṁ kirtanam viṣṇoḥ ( SB 7.5.23) విష్ణువు గురించి, ఏ రాజకీయవేత్త లేదా ఏ ఇతర వ్యక్తి గురించి కాదు. Śravaṇaṁ kīrtanaṁ viṣṇoḥ, కృష్ణుని లేదా విష్ణువు గురించి. కాబట్టి అది విజయము. శ్రవణము చేయండి మరియు తిరిగి దానినే ప్రచారము చేయండి, శ్రవణము చేయండి మరియు తిరిగి దానినే ప్రచారము చేయండి మీరు తయారు చేయవలసిన అవసరము లేదు. మనలో ఏ ఒక్కరైనా, కేవలము నేను భాగవతములో ఇచ్చిన భాష్యమును తిరిగి చెప్ప గలిగితే, మీరు మంచి వక్త అవుతారు. నేను ఏమి చేస్తున్నాను? నేను అదే పని చేస్తున్నాను, అదే విషయమును రాస్తున్నాను, ఆధునిక మనిషి అర్థం చేసుకోవడానికి. లేకపోయినా మనము అదే విషయమును తిరిగి చెప్తున్నాము. వారు కూడా ఇదే విషయాన్ని తిరిగి చెప్తున్నారు, ఇంద్రియ తృప్తి. Punaḥ punaś carvita-carvaṇānām ( SB 7.5.30) కానీ అది భౌతిక విషయము కాబట్టి, వారు ఆనందం పొంద లేకపొతున్నారు. కానీ ఆధ్యాత్మిక విషయము, మనము అదే హరే కృష్ణ కీర్తన చేయుచున్నాము, కేవలం దానినే తిరిగి చెప్తున్నాము, కానీ మనం ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నాము. మనం ఏమి చేస్తున్నాం? అదే "హరే కృష్ణ, హరే కృష్ణ." కీర్తన చేయుచున్నాము కాబట్టి పద్ధతి అదే ఉంది; విషయము భిన్నముగా ఉంది. ఎందుకు మీరు ప్రచురణలో వెనుక ఉన్నారు? ఇప్పుడు అందరు గొప్ప వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. ఎందుకు మన పుస్తకాలు వెనుక ఉన్నాయి? ఎందుకు? ఇక్కడ సంపాదకులు ఉన్నారు. ఏదైనా కొరత ఉందని నేను అనుకోను.

రామేశ్వర: ఇప్పుడు కొరత లేదు.

ప్రభుపాద: హుహ్? గతంలో అది ఉంది? (విరామం)

రామేశ్వర: పుస్తకాలను చాలా త్వరగా ప్రచురించాలని మనము కోరుకుంటే, అవి అమెరికాలో ప్రచురించవలసి ఉంటుంది. కొత్త పుస్తకాలను

ప్రభుపాద: అక్కడ పునః ముద్రణ.

రామేశ్వర: అవును, మనము దానిని చేయగలం.

ప్రభుపాద: అందువల్ల వారికి కొన్ని పుస్తకాలు కూడా ఎందుకు ఇవ్వకూడదు? సాధారణమైనవి

రామేశ్వర: మనము ఈ సంవత్సరం జపాన్లో చాలా వ్యాపారము ఇస్తున్నాము.

ప్రభుపాద: అవును, అవును. మనము వారితో చాలా చక్కగా వ్యవహరించాలి. వారు ఆరంభంలో సహాయపడ్డారు. అవును. నేను వారికి 5,000 డాలర్లు మాత్రమే ఇచ్చాను, నేను 52,000ఆర్డర్ ఇచ్చాను, కానీ వారు సరఫరా చేశారు. వారికి డబ్బు అందింది. మనము వారిని మోసం చేయమని వారు నమ్ముతున్నారు. మన సంబంధం చాలా బాగుంది. కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి. (విరామం) ...ఆ అమ్మాయి, జపనీస్, వారు మన ప్రచురణని ఇష్ట పడుతున్నారు.

రామేశ్వర: ఆ అమ్మాయి. మూల-ప్రకృతి.

ప్రభుపాద: హు్?

రామేశ్వర: ఆ అమ్మాయి, మీరు హవాయిలో ఉన్నప్పుడు చూసినది, మూల-ప్రకృతి.

ప్రభుపాద: అవును. ఆమె చాలా ఉత్సాహముగా ఉంది. మూల -ప్రకృతి. యదుబర ప్రభు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఉన్నారు?

జయతీర్థ: ఆయన ఇక్కడ ఉన్నాడు.

ప్రభుపాద:. మీరు ఇప్పుడు బాగున్నారా?

యదుబర: అవును. నేను ఎంతో మెరుగుపడ్డాను.

ప్రభుపాద: ఇది బాగుంది. అందరు బాగున్నారా?

భక్తులు: అవును.

ప్రభుపాద: మీరు కూడా బాగున్నారని భావిస్తున్నారా?

విశాఖ: ఇప్పుడు నేను సరిగ్గా ఉన్నాను.

ప్రభూపాద: హు్?

విశాఖ: ఇప్పుడు నేను బాగున్నాను.

ప్రభుపాద: (నవ్వుతూ) అది బాగుంది.