TE/Prabhupada 1022 - మొదటి విషయము ఏమిటంటే మనము ప్రేమించడము నేర్చుకోవాలి, అది మొదటి-తరగతి ధర్మము



730408 - Lecture SB 01.14.44 - New York


మొదటి విషయము ఏమిటంటే మనము ప్రేమించడము నేర్చుకోవాలి, అది మొదటి-తరగతి ధర్మము కాబట్టి మొదటి విషయము ఏమిటంటే మనము ఎలా ప్రేమించాలి అని నేర్చుకోవాలి. Sa vai puṁsāṁ paro dharmo ( SB 1.2.6) ఇది మొదటి తరగతి ధర్మము. మీరు అనుసరిస్తున్న మత పద్ధతి, yato bhaktir adhokṣaje. మీరు అధోక్షజను... ఎలా ప్రేమించాలో మీకు తెలిస్తే... అప్పుడు ప్రేమ అనే ప్రశ్న ఎక్కడ ఉంది, తదుపరి ప్రశ్న ఏమిటంటే, "నేను ఎవరిని ప్రేమించాలి?" అందువల్ల, కృష్ణుడికి మరో నామము అధోక్షజ.. అధోక్షజ అంటే అర్థం "మీ ఇంద్రియాలకు అతీతముగా." ఇక్కడ మనము ఏదో ఒక వర్గంలో, లేదా పరిధిలో, నా ఇంద్రియాల అవగాహనలో ప్రేమిస్తాము. నేను ఒక అమ్మాయిని లేదా అబ్బాయిని, లేదా ఎవరినైనా, నా దేశమును , నా సమాజమును, నా కుక్కను, ప్రతిదీ ప్రేమిస్తాను. కానీ ఇది మీ ఇంద్రియాల అవగాహన పరిధిలో ఉన్న వాటిని కానీ భగవంతుడు మీ ఇంద్రియాలకు అతీతముగా ఉన్నాడు. అయినప్పటికీ మీరు ప్రేమించాలి, అది ధర్మము అంటే. భగవంతుడు ఇంద్రియాల అవగాహనకు అతీతముగా ఉన్నాడు, అయినప్పటికీ మీరు ప్రేమిస్తే ఆయన మీ ఇంద్రియాల అవగాహనకు అతీతముగా ఉన్నప్పటికీ, అప్పుడు మీరు భగవంతుణ్ణి గ్రహించగలరు. Sevonmukhe hi jihvādau svayam eva sphurat adaḥ (Brs. 1.2.234).ఉదాహరణకు మనము ఇక్కడ రాధాకృష్ణులను ఆరాధిస్తున్నాము. కృష్ణుని ప్రేమించని వారు, వారు భావిస్తారు ఈ మూర్ఖులు, వారు పాలరాయితో చేసిన బొమ్మను తీసుకువచ్చారు, వారు కేవలం తమ సమయాన్ని వృధా చేస్తున్నారు. "మీరు చూడండి? ఎందుకంటే ఆయనకు ప్రేమ లేదు. ఆయనకు ప్రేమ లేదు; అందువలన ఆయన ప్రేమ కొరకు కృష్ణుడి యొక్క ఈ ఆరాధనను ఆయన అభినందించలేడు,. కృష్ణుడి యొక్క ప్రేమికుడు ఎవరు చైతన్య మహా ప్రభు వలె, ఆయన జగన్నాథపురి ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే: "ఇక్కడ నా ప్రభు ఉన్నాడు," ఆయన వెంటనే మూర్ఛపోయినాడు.

కావున తేడా ఏమిటి... ఇది తేడా: భగవంతుని ప్రేమికుడు, ఆయన ప్రతిచోటా భగవంతుడు ఉన్నాడు అని చూడగలడు.

Premāñjana-cchurita-bhakti-vilocanena
santaḥ sadaiva hṛdayeṣu vilokayanti
(Bs. 5.38).

మీరు వాస్తవముగా ... మీరు వాస్తవమునకు భగవంతుని యొక్క ప్రేమికుడు అయితే, అప్పుడు మీరు ప్రతి దశలో భగవంతుడిని చూస్తారు. ప్రతి అడుగులో. ప్రహ్లాద మహారాజు వలె. ప్రహ్లాద మహారాజు, తన తండ్రి తన మీద దాడి చేసినప్పుడు, ఆయన స్తంభము వైపు చూస్తున్నాడు, ఆతని భగవంతుడు స్తంభములో ఉండవచ్చని తండ్రి అనుకున్నాడు, వెంటనే ఆయన, "ఈ స్తంభంలో నీ భగవంతుడు ఉన్నాడా?" "అవును, నా తండ్రి." "ఓ" వెంటనే విరగ్గొట్టినాడు. తన భక్తుని యొక్క మాటను నిలబెట్టడానికి, భగవంతుడు బయటకు వచ్చారు.

అందువల్ల భగవంతుడి ఆవిర్భావము అంతర్థానము భక్తుని కొరకు

Paritrāṇāya sādhūnāṁ
vināśāya ca duṣkṛtām
( BG 4.8)