TE/Prabhupada 1026 - మనము ఆనందించే వారిమి కాదు, కృష్ణుడు ఆనందించే వాడు - అది ఆధ్యాత్మిక ప్రపంచం



731129 - Lecture SB 01.15.01 - New York


మనము అర్థం చేసుకుంటే, మనము ఆనందించే వారిమి కాదు, కృష్ణుడు ఆనందించే వాడు - అది ఆధ్యాత్మిక ప్రపంచం మనము సంతోషంగా ఉండాలనుకుంటున్నాము. చాలా ఆలోచనలతో అందరూ తన సొంత ఆలోచన చేస్తున్నారు, "ఇప్పుడు ఇది..." కానీ మూర్ఖులు, వారికి తెలియదు, ఆనందం పొందడానికి వాస్తవ పద్ధతి ఏమిటి, అది కృష్ణుడు. వారికి తెలియదు. Na te viduḥ svārtha-gatiṁ hi viṣṇuṁ durāśayā ye bahir-artha-māninaḥ ( SB 7.5.31) మీరు మీ దేశంలో చూడగలరు, వారు చాలా విషయాలు ప్రయత్నిస్తున్నారు. చాలా ఆకాశహర్మ్యం భవనాలు, చాలా మోటార్ కార్లు, చాలా గొప్ప, గొప్ప నగరాలు, కానీ ఆనందం లేదు. ఎందుకంటే వారికి ఏమి లేదో వారికి తెలియదు. మనం పోగొట్టుకున్న విషయమును మనము ఇక్కడ ఇస్తున్నాము. ఇక్కడ ఉంది, "మీరు కృష్ణుడిని తీసుకోండి మీరు ఆనందంగా ఉంటారు." ఇది మన కృష్ణ చైతన్యము. కృష్ణుడు మరియు జీవి, వారు చాలా సన్నిహితముగా అనుసంధానించబడి ఉన్నారు. తండ్రి కొడుకు వలె, లేదా స్నేహితుడు మరియు స్నేహితుడు వలె, లేదా యజమాని మరియు సేవకుని, వలె. మనము చాలా సన్నిహితముగా అనుసంధానించబడి ఉన్నాము. కానీ కృష్ణుడితో మన సన్నిహిత సంబంధాన్ని మర్చిపోయాము కనుక, ఈ భౌతిక ప్రపంచంలో సంతోషంగా మారాడానికి ప్రయత్నిస్తున్నాము కనుక, అందువలన మనము చాలా కష్టాలను ఎదుర్కోవలసి ఉంది. ఇది పరిస్థితి. Kṛṣṇa bhuliya jīva bhoga vañcha kare.

మనము జీవులము, ఈ భౌతిక ప్రపంచం లోపల సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాము... మీరు భౌతిక ప్రపంచంలో ఎందుకు ఉన్నారు, ఎందుకు ఆధ్యాత్మిక ప్రపంచంలో లేరు? ఆధ్యాత్మిక ప్రపంచం, ఎవరూ ఆస్వాదించే వారు కాలేరు, భోక్త. అది భగవంతుడు మాత్రమే bhoktāraṁ yajña-tapasāṁ sarva ( BG 5.29) .. ఏ తప్పు లేదు. జీవులు కూడా ఉన్నారు, కానీ వారికి వాస్తవముగా ఆనందించే వారు, యజమాని, కృష్ణుడు అని వారికి బాగా తెలుసు. అది ఆధ్యాత్మిక రాజ్యం. అదేవిధముగా, ఈ భౌతిక ప్రపంచమును కూడా, మనము చక్కగా అర్థం చేసుకుంటే మనము ఆస్వాదించలేము, కృష్ణుడు ఆనందిస్తాడు, అప్పుడు అది ఆధ్యాత్మిక ప్రపంచం. ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అందరిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తుంది, మనము, మనము ఆనందించే వారిమి కాదు. కృష్ణుడు ఆనందించే వాడు. ఉదాహరణకు ఈ మొత్తం శరీరం లాగానే. ఆనందించేది కడుపు, చేతులు కాళ్లు కళ్ళు చెవులు మెదళ్ళు ప్రతిదీ, వీటిని వినియోగించాలి ఆనందించే విషయాలను తెలుసుకొని, కడుపులో ఉంచడానికి . ఇది సహజమైనది. అదేవిధముగా, మనము భగవంతునిలో లేదా కృష్ణునిలో భాగము, మనము ఆనందించే వారిమి కాదు.

ప్రతి ధర్మములో, ఇది అంగీకరించబడుతుంది. క్రిస్టియన్ మతములో ఇలా చెప్పబడింది: "ఓ ప్రభు,మా రోజువారీ రొట్టె ఇవ్వండి." రొట్టెను, మనము తయారు చేయలేము. ఇది భగవంతుని నుండి రావాలి. అది వేదము ప్రకారము కూడా. Nityo nityānāṁ cetanaṣ cetanānām eko bahūnāṁ yo vidadhāti kāmān (Kaṭha Upaniṣad 2.2.13). భగవంతుడు, లేదా కృష్ణుడు, ఆయన మీకు నచ్చినట్లు, జీవితపు అవసరాలు ఇస్తాడు, కానీ మీకు నచ్చినట్లుగా మీ ఆనందాన్ని ఇచ్చే విషయాలను మీరు అంగీకరిస్తే, అప్పుడు మీరు చిక్కుకుపోతారు. కానీ మీరు ఆనందించ వలసిన విషయాలను మీరు అంగీకరిస్తే, tena tyaktena bhuñjīthā ( ISO mantra 1) మీకు కృష్ణుడి ఇచ్చినవి, అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. మీరు చేస్తే... ఉదాహరణకు ఒక వ్యాధి ఉన్న రోగి వలె, ఆయన తన సొంత విచిత్రమైన మార్గంలో జీవితమును ఆనందించాలని కోరుకుంటే, ఆయన తన వ్యాధిని కొనసాగిస్తాడు. కానీ ఆయన వైద్యుని యొక్క ఆదేశాల ప్రకారం జీవిత విధానమును అంగీకరిస్తే, అప్పుడు ఆయన స్వేచ్చను పొందుతాడు... అందువల్ల రెండు పద్ధతులు, ప్రవృత్తి మరియు నివృత్తి. ప్రవృత్తి అంటే "నేను దీనిని తినడానికి లేదా ఆనందించడానికి ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకు కాదు? నేను చేస్తాను. నాకు స్వేచ్ఛ ఉంది. " కానీ మీకు స్వేచ్ఛ లేదు అయ్యా, మీరు కేవలం... అది మాయ. మీకు స్వేచ్ఛ లేదు. మనకు అనుభవం ఉంది. ఉదాహరణకు చాలా మంచి రుచికరమైన ఆహారము ఉంది అనుకుందాం. నేను భావిస్తే, నాకు వీలైనంత ఎక్కువ నన్ను తిననివ్వండి, మరుసటి రోజు నేను ఆకలితో ఉండాలి. వెంటనే విరేచనాలు లేదా అజీర్ణం