TE/Prabhupada 1029 - మా ధర్మము అన్నిటిని త్యజించమని భోదించదు. మా ధర్మము భగవంతుని ప్రేమించమని నేర్పుతుంది



740625 - Arrival - Melbourne


మా ధర్మము అన్నిటిని త్యజించమని భోదించదు. మా ధర్మము భగవంతుని ప్రేమించమని నేర్పుతుంది.

విలేఖరి: (విరామం) భగవంతుని ప్రత్యేక సేవకుడు.

ప్రభుపాద: నేను ఎల్లప్పుడూ భగవంతుని సేవకునిగా ఉన్నాను, కానీ మీరు గుర్తించాలి. అంతే నేను ఎల్లప్పుడూ భగవంతుని సేవకునిగా ఉన్నాను, కానీ మీరు గుర్తించాలి.

విలేఖరి: మీకు తెలుసా ప్రతి సంవత్సరం సంస్థ ఎంత డబ్బు సంపాదిస్తోంది?

ప్రభుపాద: ప్రపంచంలోని ధనం అంతటినీ మేము ఖర్చు చేయగలము. (నవ్వు)

భక్తులు: హరిబోల్!( నవ్వు)

ప్రభుపాద: దురద్రుష్టవశాత్తు, మీరు మాకు డబ్బు ఇవ్వరు.

భక్తులు: హరిబోల్! (నవ్వు)

విలేఖరి: ఏమిటి.... మీరు ఎలా ఖర్చు చేస్తారు స్వామీజీ?

ప్రభుపాద: మేము ప్రస్తుతం, కనీసం, ఎనిమిది వందల వేల డాలర్లు నెలకు ఖర్చు చేస్తున్నాము.

విలేఖరి: దేనిపైన, స్వామీజీ

ప్రభుపాద: ఈ ప్రచారం పైన, ప్రపంచమంతా. ఇంకా మేము నలభై వేల డాలర్లకు తక్కువ కాకుండా పుస్తకాలను విక్రయిస్తున్నాము.

విలేఖరి: మీరు పని చేయాలని అనుకుంటున్నారా? ప్రభుపాద: అవును. అది ఏమిటి? మధుద్విస: మనము పని చేయాలని అనుకుంటున్నామా అని ఆమె అడుగుతుంది.

ప్రభుపాద: మేము పని చేస్తున్నాము, మీ కంటే ఎక్కువ - ఇరవై నాలుగు గంటలు ఈ వృద్ధ వయసులో నేను ప్రపంచవ్యాప్తంగా ప్రయాణిస్తున్నాను.

భక్తుడు: హరిబోల్!

విలేఖరి: కానీ యాచన ద్వారా చాలా డబ్బును పొందడము లేదా?

ప్రభుపాద: లేదు, లేదు. మొదట మీరు చూడండి. పని చేయటం - మా కంటే మీరు ఎక్కువ పని చేయలేరు, ఎందుకంటే నేను ఒక వృద్ధుడిని, 79 సంవత్సరాల వయసులో, ప్రపంచవ్యాప్తంగా నేను ఎల్లప్పుడూ ప్రయాణిస్తున్నాను, రెండు సార్లు, మూడు సార్లు సంవత్సరంలో. కనీసం, మీరు అంత పని చేయలేరు,

భక్తులు: హరిబోల్! ప్రభుపాద.

మధుద్విస: దయచేసి ఇంకొక ప్రశ్న. సరే.

విలేఖరి: స్వామీజీ, మీ ధర్మము చాలా సరళముగా జీవించడము వంటిది. మీరు మెల్బోర్న్ లో సరళముగా నివసిస్తారా? మాకు చెప్పబడింది మిమ్మల్ని రోల్ రాయిస్ లో తీసుకువెళతారు అని.

విలేఖరి: కానీ ఇది మీకు మీరుగా ధర్మమును తిరస్కరించడము కాదా?" ప్రభుపాద: ఇది మాకు మేముగా తిరస్కరించడము కాదు. మేము ప్రతి ఒక్కటినీ ఉపయోగిస్తున్నాము, మేము ఎందుకు తిరస్కరించాలి? మేము కేవలం పరిపూర్ణంగా అవసరమైన ప్రతి దానిని వాడుతాము, అంతే.

ప్రభుపాద: ఇది మాకు మేముగా తిరస్కారించడము కాదు. మేము ప్రతి ఒక్కటినీ ఉపయోగిస్తున్నాము, మేము ఎందుకు తిరస్కరించాలి? మేము కేవలం పరిపూర్ణంగా అవసరమైన ప్రతి దానిని వాడుతాము, అంతే.

విలేఖరి: అయితే, రోల్స్ రాయిస్ మరియు నివసించటానికి చాలా ఖరీదైన ఇల్లును వాడటం లాంటి విలాసాలను ఎలా సమర్థించుకుంటారు?

ప్రభుపాద: లేదు, మాకు రోల్స్ రాయిస్ అవసరం లేదు, మేము నడవగలుగుతాము. కానీ మీరు రోల్స్ రాయిస్ అర్పిస్తే నాకు అభ్యంతరం లేదు.

విలేఖరి: తక్కువ ఆడంబరకరమైన చాలా చిన్న కారులో మీరు ప్రయాణిస్తే బాగుంటుందేమో?

ప్రభుపాద: ఎందుకు? మీరు నాకు రోల్ రాయిస్ ప్రయాణం చేయడానికి ఇస్తే, నేను ఎందుకు దానిని తిరస్కరించాలి? ఇది మీ మీద నా అనుగ్రహము, నేను దానిని అంగీకరిస్తున్నాను.

విలేఖరి: స్వామీజీ మీరు అమెరికాలో హరేకృష్ణ ను ఎలా స్థాపించారో క్లుప్తంగా తెలియజేయగలరా

ప్రభుపాద: సరే, కనీసం ప్రపంచమంతా ఇప్పుడు హరేకృష్ణ జపిస్తున్నారు. మీరు ఎక్కడకు వెళ్లినా హరేకృష్ణ జపిస్తున్నారు