TE/Prabhupada 1033 - యేసుక్రీస్తు భగవంతుని కుమారుడు, భగవంతుడు యొక్క ఉత్తమ కుమారుడు,మనము ఆయనను గౌరవిస్తాము



740628 - Lecture at St. Pascal's Franciscan Seminary - Melbourne


యేసుక్రీస్తు భగవంతుని కుమారుడు, భగవంతుడు యొక్క ఉత్తమ కుమారుడు, కాబట్టి మనమందరం ఆయనను గౌరవిస్తాము

అతిధి (3): మీరు గౌరవనీయులు మీరు యేసుక్రీస్తును ఎలా చూస్తారు?

ప్రభుపాద: అయ్యో?

మధుద్విస: భగవంతుడు జీసస్ క్రైస్ట్ గురించి మన అభిప్రాయం ఏమిటి?

ప్రభుపాద: యేసు క్రీస్తు, ప్రభువైన యేసు క్రీస్తు,... ఆయన భగవంతుని యొక్క కుమారుడు, భగవంతుని ఉత్తమ కుమారుడు, కాబట్టి మనము ఆయన పట్ల పూర్తి గౌరవము కలిగి ఉన్నాము. అవును. భగవంతుని చైతన్యము గురించి ప్రజలకు ప్రచారము చేసే వారు ఎవరైనా మేము గౌరవము కలిగి ఉంటాము. అది ఏ దేశానికి చెందినది అని పట్టింపు లేదు, ఏ వాతావరణంలో, ఆయన బోధిస్తున్నాడు. ఇది పట్టింపు లేదు.

మధుద్విస: అవును, సర్?

అతిథి (4): సెయింట్ ఫ్రాన్సిస్ అఫ్ Assisi (అస్పష్టమైన) సిద్ధాంతం కనుగొన్నారు (అస్పష్టమైన), భగవంతుని కోసం వస్తువులను ఉపయోగించడం, సెయింట్ ఫ్రాన్సిస్ దాని గురించి మాట్లాడుతున్నాడు కుక్క సోదరుడు "పిల్లి సోదరి " "నీరు సోదరి " "గాలి సోదరుడు" సెయింట్ ఫ్రాన్సిస్ యొక్క విధానం సిద్ధాంతాన్ని గురించి గౌరవనీయులు మీరు ఏమనుకుంటున్నారు?

మధుద్విస: ( ప్రశ్న తిరిగి చెప్తున్నారు) ఈ ప్రత్యేక ఆశ్రమ స్థాపకుడు సెయింట్ ఫ్రాన్సిస్ , దీనిలో మాట్లాడడానికి మనల్ని ఇక్కడకు ఆహ్వానించారు, భౌతిక ప్రపంచంలో భగవంతుణ్ణి కనుగొన్నాడు. ఆయన భౌతిక ప్రపంచం యొక్క అంశాలను "సోదరుడు" "సోదరి." అని సంబోధించే వారు చెట్టు సోదరుడు, "నీరు సోదరి," ఆ విధముగా, దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?

ప్రభుపాద: ఇది నిజమైన భగవంతుని చైతన్యము. ఇది నిజమైన భగవంతుని చైతన్యము, అవును, అంతే కాని "నేను భగవంతుడు చైతన్యము కలిగి ఉన్నాను, నేను జంతువులను చంపుతాను." అది భగవంతుని చైతన్యము కాదు. చెట్లను, మొక్కలను, తక్కువ స్థాయి జంతువులను, అల్పమైన చీమలను కూడా, సోదరుని వలె... Samaḥ sarveṣu bhūteṣu.. ఇది భగవద్గీతలో వివరించబడింది. Brahma-bhūtaḥ prasannātmā na śocati na kāṅkṣati samaḥ sarveṣu bhūteṣu ( BG 18.54) Samaḥ. సమః అన్ని జీవులకు సమానం, ఆత్మను చూడడానికి, ఎవరైనా... ఆయన మనిషి లేదా పిల్లి లేదా కుక్క లేదా చెట్టు లేదా చీమ లేదా పురుగు లేదా గొప్ప మనిషి అనే విషయము పట్టింపు లేదు. వారు అందరు భగవంతునిలో భాగము. వారు కేవలం భిన్నంగా ధరించి ఉన్నారు ఒకరు చెట్టు యొక్క దుస్తులను కలిగి ఉన్నారు; ఒకరు రాజు దుస్తులు కలిగి ఉన్నారు ; ఒకరు, కలిగి ఉన్నారు పురుగు యొక్క. అది కూడా భగవద్గీతలో వివరించబడింది. Paṇḍitāḥ sama-darśinaḥ ( BG 5.18) పండితుడు అయిన వారు, ఆయన జ్ఞానవంతుడు, ఆయన దృష్టి సమానము. కావున సెయింట్ ఫ్రాన్సిస్ ఆ విధముగా ఆలోచిస్తే, అది ఆధ్యాత్మిక అవగాహన యొక్క అత్యధిక ప్రమాణము.