TE/Prabhupada 1045 - ప్రతి అర్థం లేనిది అర్థం లేని దాన్ని మాట్లాడుతుంది. నేను ఎలా తనిఖీ చేయగలను



751002 - Interview - Mauritius


నేను ఏమి చెప్పగలను? ప్రతి అర్థం లేనిది అర్థం లేని దాన్ని మాట్లాడుతుంది. నేను ఎలా తనిఖీ చేయగలను?

విలేఖరి (4): అనేక దీపాల నుండి కాంతి వస్తుంది అని భారతీయ తత్వము ఎప్పుడూ ప్రచారం చేస్తోంది. కానీ మీరు ఉపదేశం చేస్తున్నారు.....

ప్రభుపాద: అది ఏమిటి?

బ్రహ్మానంద: అతడు చెప్తున్నాడు కాంతి ఎన్నో దీపాల నుండి వస్తుంది అని భారతీయ సంస్కృతి ఎప్పుడూ నేర్పుతుంది.

విలేఖరి(4): మీ ఉపదేశము గీత నుండి మాత్రమే ఉంటుంది.

ప్రభుపాద: అవును. అది మహోన్నతమైన కాంతి. కాంతి యొక్క డిగ్రీలు వున్నాయి. సూర్యకాంతి ఉంది, ఈ కాంతి వుంది. మీరు ఈ కాంతిని సూర్యుని కాంతితో పోల్చలేరు.( నవ్వు) కాంతి ప్రతి చోట నుండి వస్తుంది, కానీ సూర్యకాంతి ఈ కాంతి ఒకటే అని అర్థం కాదు.

విలేఖరి(4): కాదు, నేను ఏమి....

ప్రభుపాద: మొదటిగా నీవు అర్ధం చేసుకో. నీవు కాంతి గురించి ప్రశ్నించావు. మొదటిగా నీవు అర్ధం చేసుకో కాంతికి డిగ్రీలు ఉన్నాయి. మీరు ఈ కాంతి సూర్యరశ్మి ఒకటే అని చెప్పలేరు.

విలేఖరి(4): దీనిద్వారా, కాంతికి అనుగుణంగా ఉన్నవాళ్లు మీరు భావిస్తున్నారు. ఖురాన్ నుండి వచ్చిన లేదా బైబిల్ నుండి వచ్చిన ఉపదేశాలు తక్కువ కాంతి....

ప్రభుపాద: అది మీ.... ఇది అధ్యయనం చేయడం మీ కర్తవ్యం. కానీ ప్రతి చోట నుండి కాంతి వస్తుందనే ఆలోచన మేము మీకు ఇస్తాము. ఒక మిణుగురు పురుగు ఉంది. ఆ కాంతి కూడా కాంతి, సూర్య కాంతి కూడా కాంతి. మిణుగురు పురుగు యొక్క కాంతి, సూర్యకాంతి ఒకటే అని మీరు అనుకోలేరు. మిణుగురు పురుగు కాంతి ఏది సూర్యకాంతి ఏది అని చూడటం ఇప్పుడు మీ కర్తవ్యం. అది మీ కర్తవ్యము.

విలేఖరి (6) (భారతీయుడు): ఇది ముఖ్యంగా మూడవ ప్రపంచ దేశాల్లో, తగినంతగా వాదించబడింది, మీ ఉద్యమం ఒక నిర్దిష్ట, నిర్దిష్ట సామ్రాజ్యవాద దేశాల పక్షములో ఉంది. మీరు...?

బ్రహ్మానంద: మన ఉద్యమం కొన్ని సామ్రాజ్యవాద దేశాలతో అనుసంధానమైందని కొన్ని ఆరోపణలు ఉన్నాయని ఆయన అన్నారు.

ప్రభుపాద: అర్థం లేనివి చెప్పనివ్వండి. నేను ఏమి చెప్పగలను? ప్రతి అర్థం లేని వారు అర్థం లేనిది మాట్లాడతారు. దాన్ని నేను ఎలా తనిఖీ చేయగలను? అర్థంలేనివి చాలా ఉన్నాయి; కాబట్టి ఈ అర్థంలేని వాటన్నిటినీ మనుషులుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాము అది మా కార్యక్రమం. ఎంత కాలం అతడు అసంతృప్తి కలిగి ఉన్నాడు, ఆయన అర్థం లేనిది మాట్లాడతాడు. నేను ఏమి చెయ్యగలను?

విలేఖరి( 4): స్వామిజీ, నేను ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ శ్లోకము, ఇది మీరు ఎలా సంపాదించారు,ఈ శ్లోకము, లావణ్యం కేశ-ధారణం? ఈ శ్లోకము, లావణ్యం కేశ-ధారణం.

ప్రభుపాద: అవును. ఇది శ్రీమద్భాగవతం లోని పన్నెండవ స్కంధంలోని మూడవ అధ్యాయంలో ఉంది. ( ప్రక్కన:) మీ వద్ద అన్ని భాగవతాలు ఉన్నాయా, పన్నెండవ స్కంధము?

పుష్ట కృష్ణ: మావద్ద లేదు.

ప్రభుపాద: కాబట్టి మీరు రాసుకోవచ్చు.