TE/Prabhupada 1053 - మీరు సమాజమును నడపవలసిన అవసరం ఉన్నందున, మీరు వాస్తవ విషయమును మర్చిపోవాలని అర్థం కాదు



750522 - Conversation B - Melbourne


మీరు సమాజమును నడపవలసిన అవసరం ఉన్నందున, మీరు వాస్తవ విషయమును మర్చిపోవాలని అర్థం కాదు

ప్రభుపాద: మీ శరీరము, మీరు ప్రతీదీ, భగవంతునికి చెందుతుంది. ఈ శరీరము భౌతిక శరీరం. భౌతిక శక్తి, భూమి, నీరు, గాలి, అగ్ని - ప్రతిదీ భగవంతునికి చెందినవి. ఈ సముద్రం భగవంతునికి చెందుతుంది, నీరు, చాలా నీరు ఉంది. మీరు సృష్టించలేరు, మీ ముత్తాత సృష్టించలేదు. కాబట్టి ఈ శరీరం భూమి, నీరు, గాలి, అగ్ని, ఐదు మూలకాలతో చేయబడుతుంది. కాబట్టి మీ... శరీరం కూడా భగవంతునిది నేను ఒక ఆత్మను, నేను కూడా భగవంతునిలో భాగము. కాబట్టి ప్రతీది భగవంతునికి చెందుతుంది. ఇది కృష్ణ చైతన్యము. ఇది మాది అని మనము తప్పుగా చెప్తున్నాం. ఇది మాయ. మాయ అంటే వాస్తవం కాదు. అది మాయ యొక్క అర్థం.

మధుద్విస: శ్రీల ప్రభుపాద, ఈ అంశం ప్రతిదీ భగవంతునికి చెందుతుంది, ప్రతి ఒక్కరూ ప్రతిదీ భగవంతునికి చెందినది అని విశ్వసిస్తే తప్ప అది పనిచేయదు.

ప్రభుపాద: అప్పుడు అందరూ పిచ్చివారు అవ్వవచ్చు. అది వాస్తవమును మార్చదు . ఈ గదిలో ఎవరైనా పిచ్చివాడు వచ్చి, "నేను యజమానిని, మీరు బయటికి పొండి" కాబట్టి, అది వాస్తవం కాదు.

రేమండ్ లోపెజ్: నేను అర్థం చేసుకోగలను, మీకు తెలుసు, మీరు సముద్రం గురించి మాట్లాడుతున్నారు. మరియు చాలా వాటిని గురించి. కానీ అవి ప్రజలు వాటిని ఉపయోగించు కోవడానికి.

ప్రభుపాద: ఉపయోగించవచ్చు. మీరు ఉపయోగించవచ్చు. Tena tyaktena bhuñjīthāḥ ( ISO 1) అది వేదముల ఉత్తర్వు. మీకు ఇవ్వబడినది ఏమైనా, మీరు దాన్ని వాడతారు. ఉదాహరణకు ఒక పెద్దమనిషికి ఐదుగురు కుమారులు ఉన్నారు. ఆయన ఒక కొడుకుకు ఇస్తాడు, "ఇది నీ ఆస్తి, ఇది నీ ఆస్తి. నీవు ఉపయోగించుకోవచ్చు కానీ కుమారులు దానిని ఒప్పుకోవాలి "ఇది తండ్రి ఆస్తి, ఆయన మనకు ఇచ్చాడు" అదేవిధముగా, వేదముల శాస్త్రంలో, "అంతా భగవంతునికి చెందుతుంది, అని చెప్పబడినది ఆయన మీకు ఇచ్చినది ఏమైనా, మీరు ఉపయోగించుకోవచ్చు. ఇతరులపై ఆక్రమించుకోవద్దు."

రేమండ్ లోపెజ్: కానీ ఆయన ఇచ్చినట్లయితే...మీరు చెప్పుతున్నారు మీరు ఆయన మీకు ఏదో ఇచ్చినట్లయితే ఇతరుల దాని పైకి చొరబడకపోతే, కానీ ఒక వ్యక్తి లేదా వ్యక్తుల యొక్క ఒక సమూహం కలిగి ఉన్న విషయాలు కొన్ని ఉన్నాయి, ఇది, నేను అనుకుంటున్నాను, వాస్తవముగా చెప్పవచ్చు...

ప్రభుపాద: మొదట మనము అంగీకరించాలి, ప్రతిదీ భగవంతునికి చెందుతుంది. ఉదాహరణకు తండ్రి మరియు కుమారుల వలె. కొడుకుకు తెలిసి ఉండాలి, "ఈ ఆస్తి నా తండ్రిది." అది నిజమైన జ్ఞానం. ఇప్పుడు, "తండ్రి నాకు ఇచ్చినది ఏమైనా నేను దాన్ని ఉపయోగిస్తాను. నేను ఇతరుల మీద ఎందుకు చొరబడతాను , నా ఇతర సోదరుడు, అతడు నా తండ్రి నుండి పొందిన దాని గురించి ఇది మంచి భావం. "నేను నా సోదరునితో ఎందుకు పోరాడాలి? నా తండ్రి ఆయనకి ఈ ఆస్తిని ఇచ్చాడు, అందుచేత అతనిని దానిని ఉపయోగించుకోనిద్ధాము, ఆయన నాకు ఇచ్చినది ఏమైనప్పటికీ, నేను దానిని ఉపయోగించుకుంటాను. నేను తన ఆస్తిని ఎందుకు ఆక్రమిస్తాను? "ఇది మంచి భావన.

రేమండ్ లోపెజ్: మీరు చెప్పినప్పుడు నేను అర్థం చేసుకోగలను, "ఇతరుల ఆస్తిని ఆక్రమించుకోవద్దు." నేను నమ్ముతాను నేను మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకున్నట్లైతే, మీరు ఏమి చెప్తున్నది, ఏమిటంటే మీ దగ్గర ఏమైనా ఉంటే, ఎవరైనా మీకు ఇచ్చి ఉంటే,మరొకరు దానిని ఉపయోగించు కోవాలనుకుంటే, అప్పుడు ఆయనని ఉపయోగించు కోనివ్వండి. నేను అర్థం చేసుకోగలను. కానీ మీరు ఒక దశకు రావచ్చు, మీరు ఈ దశకు రావచ్చు కదా కొన్ని కారణాల వల్ల మీరు ఇతరులను దానిని ఉపయోగించు కోవాలని కోరుకోరు?

ప్రభుపాద: నేను నా విషయమును ఉపయోగించాలనుకోవడము లేదా?

మధుద్విస: ఆయన చెప్తాడు ఎవరైనా కోరుకోకపోతే... మీకు ఉన్నది ఎవరు ఉపయోగించుకోవాలి మీరు కోరుకోకపోతే. ఎవరైనా బలవంతంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తే...

ప్రభుపాద: లేదు, అది మరొక విషయము.

రేమండ్ లోపెజ్: మీరు కొన్ని ప్రత్యేక కారణాల కోసం వాడుతున్నప్పుడు దాన్ని కొందరు ఉపయోగించకోకూడదని మీరు అనుకునే పరిస్థితి రావచ్చు. మీరు ఆ సమయంలో మీరే ఉపయోగించుకోవచ్చు. ఆ పరిస్థితి తలెత్తవచ్చు, మీరు ఇష్టపడరు...

మధుద్విస: ప్రతిదీ భగవంతునికి చెందుతుంది అని మనము నమ్ముతున్నాము. ఎవరైనా ఆ భావనను నమ్మకపోతే, ఉపయోగించడానికి ప్రయత్నిస్తుంటే...

ప్రభుపాద: అది తప్పు. నేను చెపుతున్నాను ఇది ఆయన తప్పుడు భావన.

వాలీ స్ట్రోబ్స్: సరే, మీరు ఎలా సమాధానపరుస్తారు, లేదా మీరు పరిస్థితి ఎలా సరి చేస్తారు? ప్రతిదీ భగవంతునికి చెంది ఉంటే, మనము సమాజమును నడిపితే , ...

ప్రభుపాద: కానీ ప్రతిదీ భగవంతునికి చెందినదని మీరు మర్చిపోరు. మీరు సమాజాన్ని నడపాల్సిన అవసరం ఉన్నందున, మీరు వాస్తవమైన విషయమును మరచిపోవాలని కాదు.

రేమండ్ లోపెజ్: నేను వాస్తవమునకు ఆ ఆలోచనకు అభ్యంతరం వ్యక్తం చేయను. కానీ విషయము ఏమిటంటే మన, మనము పని చేస్తున్న వ్యవస్థ విభిన్న భావనలను కలిగి ఉంది.

ప్రభుపాద: దీనిని సరిదిద్దాలి. దీనిని సరిదిద్దాలి.

రేమండ్ లోపెజ్: ఇది తప్పక, క్షమించాలి?

ప్రభుపాద: సరిదిద్దబడింది.

మధుద్విస:సరిదిద్దబడింది