TE/Prabhupada 0692 - కాబట్టి భక్తి-యోగ అనేది యోగా సూత్రాల యొక్క అత్యధిక స్థితి



Lecture on BG 6.46-47 -- Los Angeles, February 21, 1969


భక్తుడు: "ఒక యోగి తపస్వి కంటెను అధికుడు, జ్ఞాని కన్నా అధికుడు కామ్యకర్మలు చేయువాని కంటే అధికుడు. అందువలన, ఓ అర్జునా, అన్ని పరిస్థితులలో, ఒక యోగివి కమ్ము."

ప్రభుపాద: యోగి, ఇది జీవితం యొక్క అత్యంత పరిపూర్ణమైన భౌతిక పరిస్థితి. ఈ భౌతిక ప్రపంచం లోపల వివిధ స్థాయిల జీవితము ఉన్నాయి, కానీ ఒకరు యోగ సూత్రం లో తాను స్థిరముగా ఉంటే, ముఖ్యంగా ఈ భక్తి-యోగ సూత్రంలో, దాని అర్థం ఆయన జీవితంలో అత్యంత పరిపూర్ణ దశలో జీవిస్తున్నాడు. కాబట్టి కృష్ణుడు అర్జునుడికి సిఫార్సు చేస్తున్నాడు, "నా ప్రియ మిత్రుడైన అర్జునా, అన్ని పరిస్థితులలోను, నీవు ఒక యోగి ఉండు, ఒక యోగిగా స్థిరముగా ఉండుము." అవును, కొనసాగించండి.

భక్తుడు: "యోగులు అందరిలో, ఎవరైతే ఎల్లప్పుడూ గొప్ప విశ్వాసముతో నాకు విధేయుడుగా ఉంటారో, నన్ను పవిత్రమైన ప్రేమ పూర్వక సేవలతో పూజిస్తూ ఉన్నవాడు, యోగలో నాతో అత్యంత సన్నిహితంగా ఉన్నవాడు అందరిలోనూ అత్యధికుడు. "

ప్రభుపాద: ఇప్పుడు, ఇక్కడ యోగులు అందరి గురించి స్పష్టంగా చెప్తారు - వివిధ రకాల యోగులు ఉన్నారు. అష్టాంగ-యోగి, హఠ-యోగి, జ్ఞాన-యోగి, కర్మ-యోగి, భక్తి-యోగి. కాబట్టి భక్తి-యోగ అనేది యోగా సూత్రాల యొక్క అత్యధిక స్థితి. కాబట్టి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, "యోగులు అందరిలో." వివిధ రకాల యోగులు ఉన్నారు. యోగులు అందరిలో, - ఎవరైతే ఎల్లప్పుడూ నాకు విధేయుడుగా ఉంటారో, "నా" అంటే అర్థం కృష్ణునిలో, కృష్ణుడు చెప్తున్నారు "నాలో." దానికి అర్థం ఎల్లప్పుడూ తనను కృష్ణ చైతన్యములో ఉంచుకునే వ్యక్తి. గొప్ప విశ్వాసముతో నాకు కట్టుబడి ఉండి, దివ్యమైన ప్రేమయుక్త సేవలో నన్ను పూజిస్తూ, ఉన్నవాడు యోగాలో నాతో అత్యంత సన్నిహితంగా ఉన్నవాడు అందరిలోనూ అత్యధికుడు. ఈ అధ్యాయం యొక్క ప్రధాన ఆదేశం, సాంఖ్య-యోగం, మీరు సంపూర్ణ యోగిగా మారాలనుకుంటే, అత్యధిక స్థితిలో అప్పుడు మిమ్మల్ని మీరు కృష్ణ చైతన్యములో ఉంచుకోవాలి మీరు మొదటి తరగతి యోగిగా మారుతారు. కొనసాగించు.

భక్తుడు: భాష్యము: "సంస్కృత పదం, భజతే, ఇక్కడ ముఖ్యమైనది."

ప్రభుపాద: ఈ పదం భజతే వాస్తవ సంస్కృత శ్లోకము లో కనిపిస్తుంది,

yoginām api sarveṣāṁ
mad-gatenāntar-ātmanā
śraddhāvān bhajate yo māṁ
sa me yuktatamo mataḥ
(BG 6.47)

ఈ భజతే, ఈ భజతే, ఈ పదం, సంస్కృత పదం, ఇది భజ్, భజ్- అనే మూల ధాతువు నుండి వచ్చింది. ఇది ఒక క్రియ, భజ్-ధాతువు. భజ్ అంటే సేవలను అందించడం. భజ. కాబట్టి ఈ పదము భజ్- ధాతు ఈ శ్లోకములో వాడబడింది. అంటే ఎవరైతే భక్తుడో. ఆయన భక్తుడు కాకపోతే, కృష్ణుడికి ఎవరు సేవ చేస్తారు? మీరు ఇక్కడ సేవను చేస్తున్నారని అనుకుందాం. ఎందుకు? మీరు ఎక్కడైనా సేవలను చేయవచ్చు, ప్రతి నెల మీరు వేల డాలర్లు లేదా రెండు వేల డాలర్లు పొందుతారు. కానీ ఇక్కడకు వచ్చి మీరు ఏ వేతనము లేకుండానే మీరు సేవ చేస్తారు. ఎందుకు? ఎందుకంటే కృష్ణుడి మీద ప్రేమ వలన. అందువల్ల ఈ భజ, ఈ సేవ, ప్రేమపూర్వక సేవ, భగవంతుని మీద ప్రేమ వలన. లేకపోతే ఎందుకు ఏమీ లేని దాని కొరకు ఎవరైనా తన సమయం వృథా చేసుకోవాలి? ఇక్కడ ఈ విద్యార్థులు, వారు చాలా విషయాలలో నియుక్తమై ఉన్నారు. కొంత మంది తోటపని, కొంత మంది టైప్ చేస్తున్నారు, కొంత మంది వంట చేస్తున్నారు, కొంత మంది వేరేది చేస్తున్నారు. ప్రతీదీ చేస్తున్నారు కానీ ఇది కృష్ణుడితో సంబంధం కలిగి ఉంది. అందువలన కృష్ణ చైతన్యము ఎల్లప్పుడూ, ఇరవై నాలుగు గంటలు ఉంటుంది. ఇది యోగ యొక్క అత్యధిక రకం. యోగ అంటే మీ చైతన్యం విష్ణువు లేదా కృష్ణుడైన దేవాదిదేవుడుతో చెక్కుచెదరకుండా ఉంచుకోవటమే. ఇది యోగ యొక్క పరిపూర్ణము. ఇది సహజముగా ఉంది - పిల్లవాడు కూడా చేయగలడు. ఈ బాలుడు తన తల్లితో పాటు వచ్చి ప్రణామము చేస్తున్నాడు కృష్ణా, నేను ప్రణామము చేస్తున్నాను. అందువలన ఆయన కూడా కృష్ణ చైతన్యవంతుడు. చిన్న పిల్లవాడు చప్పట్లు కొడుతున్నాడు, ఎందుకు, హే కృష్ణ ఏమైనప్పటికీ ప్రతి ఒక్కరు కృష్ణుడిని గుర్తు పెట్టుకుంటున్నారు. కృష్ణ చైతన్యములో ఉంచుకుంటూ ఇక్కడ చిన్న పిల్లవాడు కుడా ఉన్నతమైన యోగి ఇది మేము గొప్పలు చెప్పుకోవటము కాదు ఇది ప్రామాణికమైన గ్రంధములలో ఉన్నది ఉదాహరణకు భగవద్గీతలో మేము చెప్పము మేము వీటిని తయారు చేసామని మా గొప్ప కోసము, కాదు. ఇది వాస్తవము చిన్న పిల్లవాడు కుడా ఉన్నతమైన యోగ సాధన స్థితిలో ఉండగలడు ఈ ఆలయములో ఇది కృష్ణ చైతన్య ఉద్యమము యొక్క అత్యన్నతమైన బహుమతి. కొనసాగించు