TE/Telugu Main Page


వాణిపీడియా అంటే ఏమిటి

వాణిపీడియా అనేది శ్రీల ప్రభుపాద మాటల (వాణి) యొక్క డైనమిక్ ఎన్సైక్లోపీడియా. ఈ సహకారం ద్వారా, మేము శ్రీల ప్రభుపాద బోధలను వివిధ కోణాల నుండి అన్వేషిస్తాము మరియు సమగ్రంగా సంకలనం చేస్తాము మరియు వాటిని ప్రాప్యత మరియు సులభంగా అర్థమయ్యే మార్గాల్లో ప్రదర్శిస్తాము. అందరి ప్రయోజనాల కోసం, కృష్ణ చైతన్య శాస్త్రాన్ని ప్రపంచానికి బోధించడానికి మరియు బోధించడానికి ఆయనకు నిరంతర, ప్రపంచవ్యాప్త వేదికను అందించడానికి శ్రీల ప్రభుపాద యొక్క డిజిటల్ బోధనల యొక్క అసమానమైన రిపోజిటరీని నిర్మిస్తున్నాము.

వాణిపీడియా ప్రాజెక్ట్ ప్రపంచ బహుభాషా సహకార ప్రయత్నం, ఇది శ్రీల ప్రభుపాద యొక్క అనేక మంది భక్తుల కారణంగా వివిధ మార్గాల్లో పాల్గొనడానికి ముందుకు వస్తోంది. ప్రతి భాష అభివృద్ధి యొక్క వివిధ దశలలో ఉంటుంది. నవంబర్ 2027 లో ఆయన నిష్క్రమించిన 50 వ వార్షికోత్సవానికి సమర్పణగా శ్రీల ప్రభుపాద రికార్డ్ చేసిన ఉపన్యాసాలు మరియు సంభాషణలు మరియు కనీసం 16 భాషలలో మరియు 32 భాషలలో కనీసం 25% తో అనువదించాలని మేము కోరుకుంటున్నాము. మరాఠీ ఇందులో ఒకటి అవుతుందా ఈ భాషలలో?

తెలుగులోని విషయము లింకులు

Here are all the links of content available now on Vanipedia in Telugu :

Here you will find all 1080 videos of Srila Prabhupada with Telugu hard-coded subtitles.

Each of these playlists is a list, or group, of Videos with Telugu Hard-coded subtitles which allows you to play the videos one by one.

Nectar Drops are short excerpts from Srila Prabhupada's lectures, conversations and morning walks. These short(less than 90 seconds) audio clips are so powerful and will enlighten your soul and fill it with peace and happiness!

Srila Prabhupada's Lecture pages with transcription and Videos.

This manifesto is a description of the whole Vanipedia's Mission. It needs to be translated into Telugu.

మాతో సహకరించండి

"This section is your call to action - an open invitation to join the mission of building Vanipedia - can be newsy - can be updated regularly."

భగవద్గీత యథాతథం నుండి కొన్ని ముఖ్య శ్లోకములు

Bhagavad-gita 2.47

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ॥४७॥
karmaṇy evādhikāras te
mā phaleṣu kadācana
mā karma-phala-hetur bhūr
mā te saṅgo 'stv akarmaṇi

SYNONYMS

karmaṇi—prescribed duties; eva—certainly; adhikāraḥ—right; te—of you; —never; phaleṣu—in the fruits; kadācana—at any time; —never; karma-phala—in the result of the work; hetuḥ—cause; bhūḥ—become; —never; te—of you; saṅgaḥ—attachment; astu—be there; akarmaṇi—in not doing.

TRANSLATION

You have a right to perform your prescribed duty, but you are not entitled to the fruits of action. Never consider yourself to be the cause of the results of your activities, and never be attached to not doing your duty.

PURPORT

There are three considerations here: prescribed duties, capricious work, and inaction. Prescribed duties refer to activities performed while one is in the modes of material nature. Capricious work means actions without the sanction of authority, and inaction means not performing one's prescribed duties. The Lord advised that Arjuna not be inactive, but that he perform his prescribed duty without being attached to the result. One who is attached to the result of his work is also the cause of the action. Thus he is the enjoyer or sufferer of the result of such actions.

As far as prescribed duties are concerned, they can be fitted into three subdivisions, namely routine work, emergency work and desired activities. Routine work, in terms of the scriptural injunctions, is done without desire for results. As one has to do it, obligatory work is action in the mode of goodness. Work with results becomes the cause of bondage; therefore such work is not auspicious. Everyone has his proprietory right in regard to prescribed duties, but should act without attachment to the result; such disinterested obligatory duties doubtlessly lead one to the path of liberation.

Arjuna was therefore advised by the Lord to fight as a matter of duty without attachment to the result. His nonparticipation in the battle is another side of attachment. Such attachment never leads one to the path of salvation. Any attachment, positive or negative, is cause for bondage. Inaction is sinful. Therefore, fighting as a matter of duty was the only auspicious path of salvation for Arjuna.


శ్రీల ప్రభుపాదుల వారి అరుదైన వీడియో క్లిప్‌లు


శ్రీల ప్రభుపాద నుండి అరుదైన ఆడియో క్లిప్‌లు


Nectar Drops from Srila Prabhupada
"So here, in this Kṛṣṇa consciousness movement, it is directly simply on Kṛṣṇa. There is nothing... Therefore nobody is better meditator than these boys. They are simply concentrating on Kṛṣṇa. Their whole business is Kṛṣṇa. They're working in the garden, digging the earth: "Oh, there will be nice rose, we shall offer to Kṛṣṇa." Meditation. Practical meditation: "I shall grow rose and it will be offered to Kṛṣṇa." Even in the digging there is meditation. You see? They are preparing nice foodstuff, "Oh, it will be eaten by Kṛṣṇa." So in cooking there is meditation. You see? And what to speak of chanting and dancing. So they are meditating twenty-four hours in Kṛṣṇa. Perfect yogī. "
690216 - Lecture BG 06.13-15 - Los Angeles



వానిపీడియా మానిఫెస్టో

↓ Scroll down to read more...

Introduction పరిచయం

Srila Prabhupada placed much importance on his teachings, thus Vanipedia is dedicated exclusively to his body of work which comprises books, recorded lectures and conversations, letters, etc. When completed, Vanipedia will be the first-ever Vani-temple in the world offering a sacred space where millions of people seeking authentic spiritual guidance will find answers and inspiration from the illustrious teachings of Srila Prabhupada, presented in an encyclopedia format in as many languages as possible.

పరమ పూజ్య శ్రీల ప్రభుపాదులవారు తమ బోధనలకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు. పరంపరానుగతంగా వస్తూన్న శ్రీ కృష్ణ చైతన్య జ్ఞానామృతాన్ని భౌగోళిక సరిహద్దులకు తావులేకుండా, సమకాలీన సమాజం యొక్క అవగాహనా శక్తికి తగినట్లుగా, సమస్త మానవాళి శ్రేయస్సును కాంక్షిస్తూ, సజీవ ఉదాహరణలతో కూర్చి ఆయన ప్రవచించిన పరిపూర్ణ జ్ఞాన భాండాగారం గ్రంధాలు, ప్రసంగాలు, సంభాషణలు, లేఖలు వంటి అనేక రూపాల మేళవింపుగా లభ్యమవుతూ ఉంది. ఆ బోధనలన్నింటినీ "సమగ్ర జ్ఞాన సంగ్రహ" (ఎన్సైక్లోపీడియా) స్వరూపంగా వీలయినన్ని ఎక్కువ భాషలలో నిర్మించుటకే ఈ వాణీపీడియా అంకితం చేయబడినది. భగవదనుగ్రహం వల్ల మా ఈ ప్రయత్నం పూర్తి అయిన పిమ్మట, ఈ వాణీపీడియా ప్రామాణికమైన ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని కోరుకునే అనేక దేశాలలోని లక్షలాది భక్తులకు కృష్ణభక్తి మార్గమున సందేహ నివృత్తి చేయుచూ, గొప్ప ప్రేరణ కలిగించగల శ్రీల ప్రభుపాదుల వారి ఆధ్యాత్మిక బోధనా సంగ్రహ వేదికగా ఈ ప్రపంచంలోని మొట్టమొదటి వాణీ ఆలయంగా విరాజిల్లగలదని మా ఆకాంక్ష.

Vanipedia's Vision Statement వాణీపీడియా లక్ష్యము మరియు ఉద్దేశ్యము

Collaborating to invoke and fully manifest Srila Prabhupada's multi-lingual Vani-presence, thus facilitating hundreds of millions of people to live the science of Krishna consciousness and assist Lord Caitanya Mahaprabhu's sankirtana movement to re-spiritualize human society.

మానవసమాజాన్ని తిరిగి ఆధ్యాత్మికపథంలో నడిపించి, శ్రీ కృష్ణ చైతన్య జ్ఞానంలో జీవింపచేసి, నిస్సందేహంగా శాశ్వత ఆనందాన్ని ప్రసాదించగలిగే మహోత్తమమైన మార్గం భగవత్స్వరూపులు శ్రీ చైతన్య మహాప్రభువులు బోధించిన భగవన్నామ సంకీర్తనా మహాయజ్ఞం.

అటువంటి మార్గాన్ని ప్రతి వ్యక్తీ అవలంబించవలసిన ఆవశ్యకతను, అనుసరించవలవలసిన విధివిధానాల జ్ఞానాన్నీ శ్రీల ప్రభుపాదులవారు సర్వజన సమ్మతంగా, సరళంగా అనేక భాషలలో ప్రవచించారు.

ఈ ధరిత్రిపైనున్న కోట్లాది జనుల హృదయాలకు చేర్చేందుకు ఆ జ్ఞానామృతాన్ని పరిపూర్ణంగా వ్యక్తీకరించేలా సంకలన పరచడమే ఈ వాణీపీడియా ముఖ్యోద్దేశ్యం.

Collaborating సమిష్టి సహకారమే మార్గము

Building an encyclopedia to the degree that is evinced in Vanipedia is only possible by the mass collaborative effort of thousands of devotees congregationally compiling and diligently translating Srila Prabhupada's teachings.

జిజ్ఞాసువులు శ్రీకృష్ణ చైతన్య జ్ఞానాన్ని తెలుసుకొనుటకూ, సందేహ నివృత్తిగావించుకొనుటకూ, ఆధ్యాత్మిక సాధనలో పురోగమించుటకూ సరిపడినంతగా వాణీపీడియా లో శ్రీల ప్రభుపాదుల వారి దివ్యజ్ఞాన బోధనలను శ్రద్ధగా అనువదిస్తూ, "సమగ్ర జ్ఞాన సంగ్రహ" (ఎన్సైక్లోపీడియా) స్వరూపంగా సంకలనం చేయడమనే మహాకార్యం ఏ ఒక్కరి ద్వారానో, ఏ కొందరి ద్వారానో సాధ్యమయ్యే స్వల్పవిషయం కాదు. అటువంటి జ్ఞానభాండాగార నిర్మాణం మీవంటి ఉత్సాహవంతులైన వేలాది భక్తుల సామూహిక సహకారం ద్వారా మాత్రమే సాధ్యం కాగలదని మీకు విన్నవిస్తూ మీ అందరి సహకారాన్ని అభ్యర్ధిస్తున్నాము.

We want to complete the translation of all of Srila Prabhupada's books, lectures, conversations, and letters in at least 16 languages and reach at least 108 languages with some representation in Vanipedia by November 2027.

శ్రీల ప్రభుపాదుల వారిచే రచించబడిన గ్రంధాలు, లేఖలు, ప్రవచించబడిన ఉపన్యాసాలు మరియు సంభాషణల అనువాదాన్ని కనీసం 16 భాషలలో యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలనీ మరియు నవంబర్ 2027 వరకు కనీసం 108 భాషలలో వీలైనంత ఎక్కువగా ఈ వాణీపీడియా లో సంగ్రహపరచాలనీ మా ప్రగాఢ అభిలాష.

As of October 2017 the full Bible has been translated into 670 languages, the New Testament has been translated into 1,521 languages and Bible portions or stories into 1,121 other languages. These statistics show that our aims while being a substantial increase in Srila Prabhupada's teachings, are not at all ambitious compared to the efforts that the Christians are making to spread their teachings globally.

అక్టోబర్ 2017 నాటికి బైబిల్ 670 భాషలలోకి, కొత్త నిబంధన 1,521 భాషలలోకి మరియు బైబిల్ లోని కొన్ని భాగాలు లేదా కథలు 1,121 ఇతర భాషలలోకీ అనువదించబడ్డాయి.

శ్రీల ప్రభుపాదుల వారు బహురూపాలలో వ్యక్తీకరించిన బోధనలను అనేక భాషలలోకి అనువదించే ప్రయత్నంలో గణనీయమైన పురోగతి ఉన్నప్పటికీ, ఆ లక్ష్య సాధనకై మన ప్రయత్నాలు మరియు కృషి క్రైస్తవులు తమ బోధనలను ప్రపంచవ్యాప్తం గావించే ప్రయత్నాలతో పోల్చితే ఏమంత సంతృప్తికరంగా లేవు.

We invite all devotees to join us in this noble endeavor of invoking and making fully manifest Srila Prabhupada's multi-lingual Vani-presence on the web for the benefit of ALL humanity.

కావున, సమస్త మానవాళి ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని కాంక్షిస్తూ మన గురుపరంపర లోని ప్రతీ అవతారస్వరూపులూ ఆచరించి చూపిన విధంగా, అజ్ఞాపించిన విధిని నిర్వర్తించుటకూ, శ్రీల ప్రభుపాదుల వారి వాణిని ప్రపంచం యొక్క హృదయంలో నింపేందుకు భక్తులందరినీ ఈ అనువాద పవిత్ర యజ్ఞంలో భాగస్వాములు కావాలని హృదయ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.

Invoking సజీవ ప్రేరణ

In 1965 Srila Prabhupada arrived uninvited in America. Even though the days of his glorious Vapu presence ended in 1977, he still exists in his Vani and it is this presence that we must now invoke. Only by calling on and begging Srila Prabhupada to appear will he do so. Our intense desire to have him among us is the key we hold for his appearance.

శ్రీల ప్రభుపాదులు 1965 వ సంవత్సరంలో ఎవరిచేత ఆహ్వానించబడకుండానే స్వయంగా అమెరికా చేరారు. అప్పటినుండి ఆ దేశమంతటా విస్తరించిన ఆయన ప్రత్యక్ష దివ్యోపదేశం 1977 వ సంవత్సరంలో భౌతికంగా ఆగినప్పటికీ, ఆయన ఈనాటికీ తమ దివ్య వాణీ స్వరూపంలో నిలిచే ఉన్నారు. ఆయనను మనమధ్య, మనతోనే, శాశ్వతంగా, సజీవంగా నిలిపి ఉంచుకోవాలనే ప్రగాఢ కోరికను నెరవేర్చుకునేందుకు మనకున్న మార్గమొక్కటే. అది, ఆయనను తీవ్రంగా ప్రార్ధిస్తూ మరియు ఆయన వాణీ స్వరూపాన్ని సంకలన పరచి మన హృదయాలలో నింపుకుని మానవులందరి భాషలలోకి అనువదించి వారి హృదయాలలోనూ నింపడమే. అప్పుడే ఆయన మనకు సంపూర్ణంగా వ్యక్తమై మనం ఆధ్యాత్మిక గమ్యం చేరేంత వరకూ మనకు మార్గదర్శకత్వం వహిస్తూ, ప్రేరణ కలిగిస్తూనే ఉంటారు.

Fully manifesting సమగ్ర వ్యక్తీకరణ

We do not want the partial presence of Srila Prabhupada before us. We want his full Vani-presence. All of his recorded teachings should be completely compiled and translated into many languages. This is our offering to future generations of people of this planet - complete shelter (ashraya) of Srila Prabhupada's teachings.

మాకు శ్రీల ప్రభుపాదుల అసంపూర్ణ వ్యక్తీకరణను అంగీకరించుట అసంభవము. మేము ఆయన వాణి యొక్క సంపూర్ణ వ్యక్తీకరణనే ఆకాంక్షిస్తున్నాము. భద్రపరచబడిన ఆయన వాక్సందేశాలన్నింటినీ సమగ్ర సంకలనంగా నిర్మించి అన్ని భాషలలోనికీ అనువదించాలి. శ్రీల ప్రభుపాదుల ఉపదేశాలను ఓ పరిపూర్ణమైన ఆశ్రయంగా ఈ సమస్త భూమండలం మీద ఉన్న వర్తమాన, భవిష్యత్తరాలకు కానుకగా అందించాలనేదే మా పవిత్ర లక్ష్యం.

Vani-presence వాణీ స్వరూప అస్తిత్వం

Srila Prabhupada's full Vani-presence will appear in two phases. The first - and easy phase - is to compile and translate all of Srila Prabhupada's teachings in all languages. The second - and more difficult phase - is to have hundreds of millions of people fully living his teachings.

శ్రీల ప్రభుపాదుల వాణీ స్వరూప అస్తిత్వం మన అనుభవంలో రెండు దశల్లో సాక్షాత్కరించవలసి ఉంది. సులభమైన మొదటి దశ - శ్రీల ప్రభుపాదుల వారి బోధనలన్నింటినీ సంకలనం చేసి అన్ని భాషలలోకీ అనువదించి ఈ వాణీపీడియా వెబ్ సైట్ ద్వారా అందరికీ అందుబాటులోకి తేవడం. కష్టతరమైన రెండవ దశ - ఆయన బోధనల సారం సమస్త మానవుల జీవితాల్లో నిండుగా ప్రతిఫలించడం.

Different Ways to Study అధ్యయనం చేయడానికి వివిధ మార్గాలు

  • To date, in our research, we have found that there are 60 different ways that Srila Prabhupada has instructed the devotees to read his books.

శ్రీల ప్రభుపాదుల వారు తమ పుస్తకాలను చదవమని భక్తులకు సూచించిన విధానాలు 60 విభిన్న మార్గాలుగా ఉన్నాయని ఈ రోజు వరకు మా పరిశోధనలలో కనుగొన్నాము.

  • By studying Srila Prabhupada's books in these different ways we can properly understand and assimilate them. By following the thematic methodology of studying and then compiling them one can easily penetrate into the deep significance of the meanings of each word, phrase, concept or personality that Srila Prabhupada is presenting. His teachings are without a doubt our life and soul, and when we study them thoroughly we can perceive and experience Srila Prabhupada's presence in many profound ways.

శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలను ఈ విధంగా అధ్యయనం చేయడం ద్వారా మనం ఆయన బోధనలను సరిగ్గా అర్ధం చేసుకుని ఆయా విషయాలపట్ల అంగీకారాన్ని పొందవచ్చు. అటువంటి పద్ధతులను అనుసరించి అధ్యయనం చేయడం మరియు సంకలనం చేయడం ద్వారా శ్రీల ప్రభుపాదుల వారు వ్యక్తీకరించిన ప్రతీ పదం, వాక్యం, భావం మరియు వ్యక్తిత్వాల లోతైన విశిష్టతలోకి మనం సులభంగా ప్రవేశించగలము. నిస్సందేహంగా ఆయన బోధనలే మన జీవితం మరియు ఆత్మ. మనం వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసినప్పుడు, అనేక రూపాల్లో శ్రీల ప్రభుపాదుల ఉనికిని మనం గాఢంగా అనుభూతి చెందగలము.

Ten Million Acaryas కోటిమంది ఆచార్యులు

  • Suppose you have got now ten thousand. We shall expand to hundred thousand. That is required. Then hundred thousand to million, and million to ten million. So there will be no scarcity of acharya, and people will understand Krishna consciousness very easily. So make that organization. Don't be falsely puffed up. Follow the acharya's instruction and try to make yourself perfect, mature. Then it will be very easy to fight out maya. Yes. Acharyas, they declare war against maya's activities. – Srila Prabhupada Lecture on Sri Caitanya-caritamrta, 6 April 1975

"శ్రీ చైతన్య చరితామృతం" పై 6-ఏప్రిల్-1975 న శ్రీల ప్రభుపాదుల వారి ఉపన్యాసం. మీరు ఇప్పుడు పదివేలమంది ఉన్నారని అనుకుందాం. అక్కడి నుండి మనం ఒక లక్షమంది వరకు విస్తరించాలి. అటువంటి విస్తరణ ఆవశ్యకము. అప్పుడు లక్ష నుండి పది లక్షలకు, పది లక్షల నుండి కోటిమంది వరకు విస్తరించాలి. అప్పుడే ఈ ప్రపంచానికి ఆచార్యుల కొరత ఉండదు మరియు ప్రజలందరూ శ్రీ కృష్ణ చైతన్యాన్ని చాలా తేలికగా అర్ధం చేసుకుంటారు. కాబట్టి అటువంటి వ్యవస్థను తయారుచేయండి. అందుకోసం (పొరపాటుగా / తత్కాల / తాత్కాలిక) ఆవేశపూరితులు కాకండి. ఆచార్యులయొక్క సూచనలను అనుసరించండి, తద్వారా మిమ్మల్ని మీరు పరిపూర్ణులుగా పరిణతి చెందించుకునేందుకు ప్రయత్నించండి. అప్పుడు మాయ తో పోరాడటం చాలా సులభం అవుతుంది. అవును, ఆచార్యులు మాయ యొక్క కార్యకలాపాలకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించారు.

Comment వ్యాఖ్య

This vision statement of Srila Prabhupada speaks for itself - the perfect plan for people to easily understand Krishna consciousness. Ten million empowered siksa-disciples of Srila Prabhupada humbly living our Founder-acarya's instructions and always endeavoring for perfection and maturity. Srila Prabhupada clearly states "make that organization." Vanipedia is enthusiastically helping to fulfill this vision.

శ్రీల ప్రభుపాదుల యొక్క ఈ దూరదృష్టిపూర్వకమైన ప్రకటన, ప్రజలు శ్రీ కృష్ణ చైతన్యాన్ని సులభంగా అర్ధం చేసుకోవడానికి ఆవశ్యకమైన సరియైన ప్రణాళికను స్వయంగా తెలియచేస్తూంది. శ్రీల ప్రభుపాదుల యొక్క కోటి మంది సాధికార శిక్షా-శిష్యులు మన వ్యవస్థాపకాచార్యుల సూచనల ప్రకారం వినయంగా జీవిస్తున్నారు ఇంకా పరిపక్వత మరియు పరిపూర్ణతలకోసం ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉన్నారు. శ్రీల ప్రభుపాదులు స్పష్టంగా పేర్కొన్నారు - "అటువంటి వ్యవస్థను తయారుచేయండి" అని. ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి వాణీపీడియా ఉత్సాహంతో కృషి చేస్తూంది.

Science of Krishna Consciousness శ్రీ కృష్ణ చైతన్య శాస్త్రము

In the Ninth Chapter of the Bhagavad-gita this science of Krishna consciousness is called the king of all knowledge, the king of all confidential things, and the supreme science of transcendental realization. Krishna Consciousness is a transcendental science which can be revealed to a sincere devotee who is prepared to render service to God. Krishna Consciousness is not achieved by dry arguments or by academic qualifications. Krishna Consciousness is not a faith, such as the Hindu, Christian, Buddhist or Islam faith, but it is a science. If someone reads Srila Prabhupada's books carefully they will realize the topmost science of Krishna Consciousness and be more inspired to spread the same to all persons as their real welfare benefit.

భగవద్గీత యొక్క తొమ్మిదవ అధ్యాయంలో ఈ శ్రీ కృష్ణ చైతన్య శాస్త్రాన్ని అన్ని జ్ఞానాలకు, మార్మికమైన విషయాలకూ మకుటంగా, మరియు పారమార్ధిక సాక్షాత్కారం యొక్క అత్యున్నత శాస్త్రం గా పేర్కొన్నారు. శ్రీ కృష్ణ చైతన్యం అనే పారమార్ధిక శాస్త్రం భగవంతునికి సేవ చేసేందుకు సంసిద్ధంగా ఉన్న నిజాయితీ గల భక్తులకే అందించబడుతుంది. శ్రీ కృష్ణ చైతన్యాన్ని శుష్క వాదనల ద్వారా లేదా విద్యార్హతల ద్వారా ఎవ్వరూ సాధించలేరు. శ్రీ కృష్ణ చైతన్యం హిందూ, క్రైస్తవ, బౌద్ధ, ఇస్లాం ల యొక్క విశ్వాసాల వంటి ఒక విశ్వాసం కాదు. అది ఒక శాస్త్రం. శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలను జాగ్రత్తగా చదివిన వారెవరైనా శ్రీ కృష్ణ చైతన్యం యొక్క అత్యున్నత శాస్త్రాన్ని అవగాహన చేసుకోగలుగుతారు, ఇంకా తాము స్వయంగా అనుభూతి చెందిన ఆధ్యాత్మిక ప్రయోజనాలను అందరికీ అందించడానికి మరింతగా ప్రేరణ పొందుతారు.

Lord Caitanya's Sankirtana Movement భగవాన్ శ్రీ చైతన్యుల సంకీర్తన ఉద్యమం

Lord Sri Caitanya Mahaprabhu is the father and inaugurator of the sankirtana movement. One who worships Him by sacrificing his life, money, intelligence and words for the sankirtana movement is recognized by the Lord and endowed with His blessings. All others may be said to be foolish, for of all sacrifices in which a man may apply his energy, a sacrifice made for the sankirtana movement is the most glorious. The entire Krishna consciousness movement is based on the principles of the sankirtana movement inaugurated by Sri Caitanya Mahaprabhu. Therefore one who tries to understand the Supreme Personality of Godhead through the medium of the sankirtana movement knows everything perfectly. He is sumedhas, a person with substantial intelligence.

భగవాన్ శ్రీ చైతన్య మహాప్రభు సంకీర్తన ఉద్యమానికి మూలపురుషుడు. ఎవరైతే తన జీవితాన్ని, సంపదను, మేధస్సును, వాక్కును సంకీర్తనోద్యమం కోసం త్యాగం చేసి శ్రీ చైతన్య మహాప్రభువును ఆరాధిస్తారో వారు భగవంతుడి చేత గుర్తించబడి ఆయన ఆశీస్సులను పొందుతారు. ఆ విధంగా జీవించలేనివారు మూర్ఖులు అని చెప్పవచ్చు. ఎందువల్లనంటే మనిషి తన పూర్తి శక్త్యానుసారం చేయగలిగిన అన్ని త్యాగాలలో, సంకీర్తనోద్యమం కోసం చేసే త్యాగమే అత్యంత మహిమాన్వితమైనది. శ్రీ కృష్ణ చైతన్య ఉద్యమం మొత్తం శ్రీ చైతన్య మహాప్రభు ప్రారంభించిన సంకీర్తన ఉద్యమ సూత్రాలపై ఆధారపడింది. కావున సంకీర్తనా ఉద్యమాన్ని మాధ్యమంగా చేసుకుని భగవంతుని యొక్క పరిపూర్ణత్వాన్ని అర్ధ చేసుకునేందుకు ప్రయత్నించేవారికి ఖచ్చితంగా అంతా అవగతమవుతుంది. వారే సుమేధస్సులు అంటే అత్యంత బుద్ధికుశలురు.

Re-spiritualizing Human Society మానవ సమాజాన్ని మరలా ఆధ్యాత్మికం చేయడం

Human society, at the present moment, is not in the darkness of oblivion. It has made rapid progress in the field of material comforts, education and economic development throughout the entire world. But there is a pinprick somewhere in the social body at large, and therefore there are large-scale quarrels, even over less important issues. There is a need for a clue as to how humanity can become one in peace, friendship, and prosperity with a common cause. Srimad-Bhagavatam fills this need, for it is a cultural presentation for the re-spiritualization of the entire human society. The mass of people, in general, are tools in the hands of the modern politicians and leaders of the people. If there is a change of heart of the leaders only, certainly there will be a radical change in the atmosphere of the world. The aim of real education should be self-realization, realization of the spiritual values of the soul. Everyone should help to spiritualize all the activities of the world. By such activities, both the performer and the work performed become surcharged with spirituality and transcend the modes of nature.

ప్రస్తుత కాలంలో మానవ సమాజం ఉపేక్ష అనే చీకటిలో లేదు. ప్రపంచవ్యాప్తంగా భౌతికసుఖాలు, విద్య మరియు ఆర్ధిక అభివృద్ధి వంటి పలు విషయాలలో ఎంతో వేగంగా పురోగతి సాధించింది. అయినప్పటికీ సమాజంలో ఒక అంతర్లీన అసంతృప్తి ఉంది. ఆ కారణం వల్లనే ఏ ప్రాముఖ్యత లేని విషయాలపై కూడా పెద్ద ఎత్తున విద్వేషాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో శాంతి, స్నేహాల సమన్వయంతో మానవాళిని నిజమైన శ్రేయస్సు వైపు నడిపించగల అందరికీ సంబంధించిన ఒక సాధారణమైన కారణాన్ని గుర్తించాలి. శ్రీమద్భాగవతం నిస్సందేహంగా ఈ అవసరాన్ని తీర్చగలుగుతుంది. ఎందుకంటే ఈ మహత్తర గ్రంధం సమస్త మానవాళినీ మరల ఆధ్యాత్మిక పథంలో నడిపించగల సాంస్కృతిక వ్యక్తీకరణ. ఈ ఆధునిక సమాజంలో రాజకీయ నాయకులు, ప్రజా నాయకులు ప్రజలనందరినీ ప్రభావితం చేయగలిగే సామర్ధ్యులై ఉన్నారు. అటువంటి నాయకుల హృదయాలలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా సామాజిక వాతావరణంలో ఖచ్చితంగా సమూలమైన మార్పు సాధ్యమౌతుంది.

నిజమైన విద్య యొక్క లక్ష్యం స్వీయ-సాక్షాత్కారం మరియు ఆత్మ యొక్క ఆధ్యాత్మిక విలువలను అవగతం చేసుకోవడం. ప్రపంచంలోని అన్ని కార్యకలాపాలనూ ఆధ్యాత్మికం చేయడానికి ప్రతిఒక్కరూ సహాయం చేయాలి. అటువంటి కార్యకలాపాల ద్వారా ఆ కర్మలను చేసేవారూ ఇంకా చేయబడే ఆ కర్మలూ అన్నీ కూడా పవిత్రములై ఆధ్యాత్మిక శక్తితో నిండిపోతాయి ఆవిధంగా మానవ సాధారణ బలహీనతలైన ప్రకృతి సహజ రీతులని దాటి దివ్యములై నిలుస్తాయి.

Vanipedia's Mission Statement వాణీపీడియా కార్యాచరణ నివేదిక

  • To offer Srila Prabhupada a continuous, worldwide platform to preach, educate and train people in the science of Krishna consciousness in all languages of the world.

ప్రపంచంలోని ప్రజలందరికీ వారి మాతృభాషలో శ్రీ కృష్ణ చైతన్య శాస్త్రాన్ని నిరంతరంగా బోధించడానికీ, శిక్షణ ఇవ్వడానికీ మరియు విద్యావంతులను చేయడం కోసం ఉపయోగపడే ప్రపంచవ్యాప్త వేదికగా ఈ వాణీపీడియాను రూపొందించి శ్రీల ప్రభుపాదులవారికి అంకితమివ్వడం.

  • To explore, discover and comprehensively compile Srila Prabhupada's teachings from multiple angles of vision.

శ్రీల ప్రభుపాదుల యొక్క బోధనలను అనేక కోణాలలో శోధించి, అర్ధంచేసుకుని, సమగ్రంగా సంకలనం చేయడం.

  • To present Srila Prabhupada's Vani in easily accessible and understandable ways.

శ్రీల ప్రభుపాదుల యొక్క వాణిని అందరూ సులభంగా అందుకుని అర్ధం చేసుకోగలిగే మార్గాల్లో ఈ వాణీపీడియా ద్వారా వ్యక్తంచేయడం.

  • To offer a repository of comprehensive thematic research to facilitate the writing of many topical books based on Srila Prabhupada's Vani.

శ్రీల ప్రభుపాదులు తమ యొక్క కృష్ణభక్తి పరిశోధనా మరియు అనుభవాల సమగ్ర సారాన్ని వెలిబుచ్చిన వాణీస్వరూప విజ్ఞానాన్ని సంకలనపరచి ఆయన శిష్యులు అనేక ఆధ్యాత్మిక విషయాలపై సులభంగా పుస్తక రచనను గావించేందుకు అవసరమైన ఆధారంగా ఈ వాణీపీడియా ను తీర్చిదిద్దడం.

  • To offer curriculum resources for various educational initiatives into Srila Prabhupada's Vani.

జిజ్ఞాసువులను సాధకులను శ్రీకృష్ణభక్తి యందు విజ్ఞానవంతులను చేయుటకై వివిధ బోధనా కార్యక్రమాలను రూపొందించుటకు అవసరమైన పాఠ్యాంశాల వనరులుగా శ్రీల ప్రభుపాదుల యొక్క వాణిని అందించడం.

  • To instill among sincere followers of Srila Prabhupada an unequivocal understanding of the necessity to both consult Srila Prabhupada's Vani for personal guidance, and become sufficiently learned to represent him on all levels.

సుశిక్షితులైన అనేకమంది శ్రీకృష్ణ భక్తి బోధకులను తయారుచేయడం అనేది శ్రీల ప్రభుపాదుల యొక్క ఆశయాలలో ఒకటి. నిజాయితీపరులైన ఆయన అనుచరులు శ్రీకృష్ణ భక్తి బోధనలో అన్ని స్థాయిలలో ఆయనకు ప్రాతినిధ్యాన్ని వహించడానికి అవసరమైనంతగా నేర్చుకోవడం యొక్క ఆవశ్యకతను గురించి వారికి స్పష్టమైన అవగాహన కలిగించడం మరియి తమ యొక్క వ్యక్తిగత మార్గదర్శకత్వం కోసం శ్రీల ప్రభుపాదుల వాణినుండి నేర్చుకునేందుకు వారికి ఆ విజ్ఞాన సర్వస్వాన్ని అందుబాటులోకి తేవడం

  • To attract Srila Prabhupada's followers from all nations to collaborate globally with the view to achieving all the above.

పైన పేర్కొన్న ఉన్నత పవిత్ర లక్ష్యాలను సాధించేందుకు సహకరించమని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఉన్న శ్రీల ప్రభుపాదుల అనుచరులను ఆకర్షించడం.

What is Motivating Us to Build Vanipedia? వాణీపీడియా నిర్మించేందుకు మమ్మల్ని ప్రేరేపించే అంశాలు

  • We accept that

మేము విశ్వసించే విషయాలు

  • Srila Prabhupada is a pure devotee, directly empowered by Lord Sri Krishna to engage living entities in loving devotional service to God. This empowerment is proven in his unparalleled exposé on the Absolute Truth found within his teachings.

శ్రీల ప్రభుపాదుల వారు ఓ స్వచ్చమైన భక్తుడు. సమస్త ప్రాణికోటినీ భగవంతుని యొక్క ప్రేమపూర్వక సేవలో నిమగ్నం చేయడానికి శ్రీకృష్ణుడు ఆయనకు నేరుగా అధికారం ఇచ్చాడు. సంపూర్ణ సత్యంపై ఆయన బోధనలలో బహిర్గతమయ్యే అసమానమైన సాధికారత ద్వారా ఈ విషయం నిరూపించబడింది.

  • There has been no greater exponent of Vaishnava philosophy in modern times, and no greater social critic who explains this contemporary world AS IT IS, than Srila Prabhupada.

ఆధునిక కాలంలో వైష్ణవ తత్వశాస్త్రాన్ని శ్రీల ప్రభుపాదుల వారికంటే గొప్పగా వ్యక్తీకరించగలవారుగానీ మరియు ఈ సమకాలీన సమాజాన్ని యథాతథంగా వివరించగల సామాజిక విమర్శకుడు గానీ మరొకరు లేరు.

  • Srila Prabhupada's teachings will be the primary shelter for his millions of followers for all future generations.

శ్రీల ప్రభుపాదుల వారి దివ్య బోధనలు ఆయన యొక్క కోట్లాదిమంది అనుచరులకు ప్రాధమిక ఆశ్రయం.

  • Srila Prabhupada wanted his teachings to be profusely distributed and properly understood.

శ్రీల ప్రభుపాదులవారు తమ బోధనలు ప్రపంచంలో అన్నివైపులా విస్తరించబడాలనీ మరియు అందరూ ఆ బోధనలను సరిగ్గా అర్ధం చేసుకోవాలనీ కోరుకున్నారు.

  • A thematic approach to Srila Prabhupada's teachings greatly enhances the process of understanding the truths within them, and that there is immense value in exploring, discovering and thoroughly compiling his teachings from every angle of vision.

శ్రీల ప్రభుపాదులు తమ బోధనల్లో ఓ ప్రత్యేకమైన నేపథ్య విధానాన్ని అవలంబించారు. దానివల్ల ఆయన బోధనల్లోని సత్యాలు చాలా లోతుగా, సులభంగా అర్ధం అవుతాయి. అందువల్ల ఆయన బోధనలను మన లక్ష్యానికి ఉంపయోగపడేలా అన్ని కోణాల్లోంచి అన్వేషించి, ఆ సత్యాలను, మార్గదర్శకత్వాన్ని కనుగొని, పరిపూర్ణంగా సంకలనపరచడం అనే కార్యం ఈ వాణీపీడియా అనే యజ్ఞకార్యానికి అపారమైన విలువను చేకూర్చుతుంది.

  • Translating all of Srila Prabhupada's teachings into a particular language is the same as inviting Srila Prabhupada to reside eternally in the places where those languages are spoken.

శ్రీల ప్రభుపాదుల వారి బోధనలన్నింటినీ ఏదైన ఒక భాషలోకి అనువదించి ఆ ప్రజలకు అందించడం అంటే, ఆ భాషలు మాట్లాడే ప్రదేశాలలో శాశ్వతంగా నివసించమని మనం శ్రీల ప్రభుపాదులవారిని ఆహ్వానించినట్లే.

  • In his physical absence, Srila Prabhupada requires many vaniservants to assist him in this mission.

శ్రీల ప్రభుపాదులు భౌతికరూపమైన ఉనికిలో లేనందువల్ల తనయొక్క ఈ లక్ష్య సాధనకోసం ఆయనకు అసంఖ్యాక వాణీసేవకుల ఆవశ్యకత ఉన్నది.

Thus, we are committed to creating a truly dynamic platform to facilitate the profuse distribution and proper understanding of the perfect knowledge and realizations found within Srila Prabhupada's teachings, so they may be joyfully acted upon. It is that simple. The only thing separating us from the completion of Vanipedia is time and the many sacred hours of vaniseva that is yet to be offered by the devotees who commit themselves to this vision.

అందువల్ల శ్రీల ప్రభుపాదుల బోధనలలో వ్యక్తమయ్యే సమగ్రమైన జ్ఞానం మరియి అవగాహనలను అందరికీ అందించేటందుకు సులభంగా విస్తరించడానికి, అందుకున్న వారందరూ సరియైన విధంగా అర్ధంచేసుకోగలిగేందుకు ఉపయోగపడే ఓ క్రియాశీలకమైన వేదికగా వాణీపీడియా ను నిర్మించేందుకు మేము ధృఢనిశ్చయంతో ఉన్నాము. అది చాలా సులభమైన కార్యం. వాణీపీడియా పూర్తిగా నిర్మింపబడడానికి కావలసిందల్లా "సమయం". శ్రీల ప్రభుపాదులను సమస్త మానవ జాతితో సజీవ సంబంధంలో ఉంచి అందరినీ ఆధ్యాత్మిక మార్గంలో పురోగమింపచేసేందుకు వేదిక కాగలిగిన ఈ వాణీపీడియా నిర్మాణానికి కంకణబద్ధులైన భక్తులు తమ సమయాన్ని ఈ వాణీసేవకు పవిత్రంగా సమర్పించడమే మిగిలిఉంది.

I thank you very much, all of you, for appreciating my humble service which I am trying to render as a matter of duty ordered by my Guru Maharaja. I request all my disciples to work cooperatively and I am sure our mission will advance without any doubt. – Srila Prabhupada Letter to Tamala Krishna das (GBC) - 14 August, 1971

నా గురు మహరాజు ఆదేశానుసారం నా కర్తవ్యనిర్వహణ గా నేను అంధించేందుకు ప్రయత్నిస్తున్న నా ఈ వినయపూర్వక సేవను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. నా శిష్యులందరూ పరస్పర సహకారంతో పనిచేయాలని నేను అభ్యర్ధిస్తున్నాను, ఇంకా ఎటువంటి సందేహం లేకుండా మన లక్ష్యం ముందుకు సాగుతుందని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను – తమల కృష్ణ దాసు (GBC) కు శ్రీల ప్రభుపాదుల వారి లేఖ - 14 ఆగస్టు, 1971

Srila Prabhupada's Three Natural Positions శ్రీల ప్రభుపాదుల యొక్క మూడు సహజ స్థానాలు

A culture of shelter at the lotus feet of Srila Prabhupada's teachings can only be realized when these three positions of Srila Prabhupada are awakened in the hearts of all his followers.

శ్రీల ప్రభుపాదుల అనుచరులందరూ ఆయనయొక్క ఈ మూడుస్థానాలనూ తమ హృదయాలలో ప్రగాఢంగా విశ్వసించి, దర్శించినప్పుడే శ్రీల ప్రభుపాదుల బోధనా స్వరూపం యొక్క పాద పద్మాలవద్ద ఆశ్రయం కల్పించే సంస్కృతి సాధ్యమవుతుంది.

Srila Prabhupada is our pre-eminent siksa-guru శ్రీల ప్రభుపాదులు మన ప్రఖ్యాత శిక్షా గురువు

  • We accept that all of Srila Prabhupada's followers can experience his presence and shelter within his teachings – both individually and when discussing them with each other.

శ్రీల ప్రభుపాదుల అనుచరులందరూ వ్యక్తిగతంగా గానీ లేదా ఒకరితో మరొకరు చర్చించేటప్పుడు గానీ ఆయన బోధనలలో ఆయన ఉనికినీ మరియు ఆశ్రయాన్నీ అనుభూతిచెందడం వారందిరికీ అనుభవమే.

  • We purify ourselves and establish a firm relationship with Srila Prabhupada by learning to live with him as our guiding conscience.

శ్రీల ప్రభుపాదుల వారిని మనకు మార్గదర్శక చైతన్యంగా భావిస్తూ, ఆయన ఉనికిని అనుభవిస్తూ జీవించడం ద్వారా మనల్ని మనం పరిశుద్ధులను గావించుకుంటూ ఆయనతో ఒక ధృఢమైన సంబంధాన్ని ఏర్పరచుకోగలుగుతాము.

  • We encourage devotees feeling separation from Srila Prabhupada, to take the time to seek his presence and solace within his Vani.

శ్రీల ప్రభుపాదుల వారి నుండి భౌతికంగా దూరమైన భావనలో ఉన్న ఆయన యొక్క భక్తులందరినీ ఆయనయొక్క వాణిలో ఆయన ఉనికినీ మరియి సాంత్వనను అనుభూతి చెందడానికి తరచూ సమయం కేటాయించమని మేము ప్రోత్సహిస్తున్నాము.

  • We share Srila Prabhupada's compassion with all his followers, including those who take initiation in his line as well as those who follow him in different capacities.

శ్రీల ప్రభుపాదుల వారి నుండి దీక్ష స్వీకరించిన వారితో సహా ఆయనను తమ శక్తి కొలదీ వివిధ మార్గాల్లో అనుసరించే వారందరితో మేము ఆయన కారుణ్యాన్ని పంచుకుంటాము.

  • We educate devotees in the truth of Srila Prabhupada's position as our pre-eminent siksa-guru, and our sisya relationship with him in separation.

శ్రీల ప్రభుపాదుల వారి భక్తులకు ఆయన మన శిక్షా గురువు స్థానంలో ఉన్నారనే సత్యంపైన ఇంకా ఆయనతో మనకున్న గురు-శిష్య సంబంధం పైన విడి విడిగా అవగాహన కల్పిస్తాము.

  • We establish a succession of siksa-empowered disciples to uphold Srila Prabhupada's legacy throughout successive generations.

శ్రీల ప్రభుపాదుల యొక్క వారసత్వ సంపదను భవిష్యత్తరాలకు అందించి నిలబెట్టడానికి ఆయననుండి సాధికార శిక్షను పొందిన భక్తుల యొక్క పరంపరను తయారు చేస్తాము.

Srila Prabhupada is the Founder-Acharya of ISKCON శ్రీల ప్రభుపాదులు ISKCON వ్యవస్థాపకాచార్యులు

  • We promote his Vani as the primary driving force that keeps the members of ISKCON connected and faithful to him, and thus inspired, enthused and determined to make his movement everything that he wished it to be – both now and in the future.

శ్రీల ప్రభుపాదులు తమ శ్రీకృష్ణ భక్తి ఉద్యమం ప్రస్తుత మరియు భవిష్యత్ కాలాల్లో కూడా సర్వ వ్యాపకమై సమస్త మానవాళీ భగవంతుని శరణులో జీవించాలని కోరుకున్నారు. ఆ ఆశయసాధనకై ISKCON సభ్యులందరూ ఆయనతో అనుసంధానింపబడి, విశ్వాసం కలిగి ఉంటూ, ఉత్సాహవంతులై, ధృఢనిశ్చయంతో పనిచేసేందుకు ప్రేరేపించి నడిపించగల ఆయన యొక్క వాణీ స్వరూప బోధనలను ఇక్కడ విస్తృతపరుస్తాము.

  • We encourage the sustainable development of Vaishnava-brahminical standards centered on Srila Prabhupada's teachings and his preaching strategies – a "vani-culture."

శ్రీల ప్రభుపాదుల బోధనలు మరియు బోధనా విధానాలు ఏవిషయాల కేంద్రంగా సాగాయో అట్టి వైష్ణవ-బ్రాహ్మణ ప్రమాణాల యొక్క గణనీయమైన అభివృద్ధి కొరకు మేము ఈ "వాణీ-సంస్కృతి" ని ప్రోత్సహిస్తున్నాము.

  • We educate devotees in the truth of Srila Prabhupada's position as the Founder-Acharya of ISKCON and our service to him and his movement.

ISKCON వ్యవస్థాపక ఆచార్యులుగా శ్రీల ప్రభుపాదుల వారి స్థానం గురించి ఇంకా ఆయనకూ ఆయన యొక్క శ్రీకృష్ణ భక్తి ఉద్యమానికీ మేము అర్పించే సేవల గురించి భక్తులందరికీ అవగాహన కల్పిస్తాము.

Srila Prabhupada is the World-acharya శ్రీల ప్రభుపాదులు జగద్గురువులు

  • We increase the global awareness of the significance of Srila Prabhupada's spiritual stature as the world-acharya by establishing the contemporary relevance of his teachings in all circles in every country.

జగద్గురువుగా శ్రీల ప్రభుపాదుల ఆధ్యాత్మిక స్థానం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రపంచవ్యాప్తంగా అందరిలో అవగాహనను విస్తృతపరుస్తాము. సమకాలీన ప్రపంచంలోని అన్ని దేశాలలో అన్ని వర్గాల ప్రజలకూ ఆయన బోధనలలోని అనుకూలతను అందించి స్థిరపరచగలము.

  • We inspire a culture of appreciation and respect for Srila Prabhupada's teachings, resulting in active participation in the practices of Krishna consciousness by the world's population.

శ్రీల ప్రభుపాదుల బోధనలను అందరూ గౌరవించి ఆదరించే సంస్కృతిని మేము ప్రోత్సహిస్తాము. తత్ఫలితంగా ప్రపంచంలోని ప్రజలందరూ శ్రీకృష్ణ చైతన్యాన్ని ఉత్సాహంగా అభ్యసించి ఆత్మోభ్యున్నతిని పొందగలరు.

  • We realize the premise that Srila Prabhupada built a house in which the whole world can live by establishing his Vani as simultaneously the foundation and roof – the shelter, the ashraya – that protects this house.

శ్రీల ప్రభుపాదులు ఈ ప్రపంచ మానవాళి యొక్క ఆధ్యాత్మికతకు పునాదిగానూ మరియు నీడనిచ్చే పైకప్పుగానూ నిలిచేట్లుగా తమ వాణీ స్వరూప బోధనలతో ఓ గృహాన్ని నిర్మించారని, ఆయనే ఈ రూపంలో అందరికీ ఆశ్రయంగా నిలిచారనీ మేము గ్రహించగలిగాము.

Vital to Establish Srila Prabhupada's Natural Position శ్రీల ప్రభుపాదుల యొక్క సహజ స్థితి స్థాపన అత్యంత కీలకము / ఆవశ్యకము / ప్రాధాన్యము

  • Our ISKCON society needs educational initiatives, political directives, and social culture to facilitate and nurture Srila Prabhupada's natural position with his followers and within his movement. It will not happen automatically or by wishful thinking. It can only be achieved by intelligent, concerted and collaborative efforts offered by his pure-hearted devotees.

శ్రీల ప్రభుపాదుల ఉద్యమంలో (with his followers?) ఆయన సహజ స్థితిని స్థాపించేందుకు, ఇంకా సులభతరం చేసేందుకు మన ISKCON సమాజంలో విద్యా కార్యక్రమాలు, రాజకీయ నిర్దేశాలు మరియు సామాజిక సంస్కృతి ఆవశ్యకమై ఉన్నాయి. అటువంటి స్థితి తనంత తానుగా నెలకొనలేదు మరియు మనం కేవలం ఆకాంక్షించడం ద్వారా కూడా సంభవించదు. ఆయనయొక్క పరిశుద్ధ హృదయులైన భక్తుల యొక్క బుద్ధికుశలతతో నిండిన, సంఘటితమైన, పరస్పర సహకార కార్యాచరణ ద్వారా మాత్రమే సుసాధ్యమవుతుంది.

  • Five Key Obstacles Concealing Srila Prabhupada's Natural Position within his Movement:

శ్రీల ప్రభుపాదుల ఉద్యమంలో ఆయన సహజ స్థితినే మరుగుపరచే ఐదు కీలక అవరోధాలు

  • 1. ignorance of Srila Prabhupada's teachings – he has given instructions but we are not aware they exist.

1. శ్రీల ప్రభుపాదుల బోధనల గురించి తెలియకపోవడం - ఆయన ఆదేశాలు చేసారు, కానీ వాటిగురించి మనకు తెలియకపోవడం.

  • 2. indifference to Srila Prabhupada's teachings – we know the instructions exist but we do not care about them. We ignore them.

2. శ్రీల ప్రభుపాదుల బోధనల పట్ల ఉదాసీనత - ఆయన బోధనలగురించి మనకు తెలుసు, కానీ మనం ఆయన ఆదేశాల పట్ల అశ్రద్ధతో వాటిని నిర్లక్ష్యం చేయడం.

  • 3. misunderstanding of Srila Prabhupada's teachings – we apply them sincerely but due to our over-confidence or lack of maturity, they are misapplied.

3. శ్రీల ప్రభుపాదుల బోధనలను సరిగా అర్ధంచేసుకోలేకపోవడం - మనము ఆయన బోధనలను హృదయపూర్వకంగా స్వీకరిస్తాము, కానీ మనయొక్క అపరిపక్వత లేదా పెచ్చుమీరిన స్వీయ విశ్వాసాల వల్ల ఆయన బోధనలను తప్పుగా అనువర్తించడం.

  • 4. a lack of faith in Srila Prabhupada's teachings – deep within we are not fully convinced and think of them as utopian, neither realistic nor practical for the "modern world."

4. శ్రీల ప్రభుపాదుల బోధనలపై విశ్వాసం లేకపోవడం - ఆయన బోధనలు వాస్తవికమైనవేననీ, ఈ ఆధునిక ప్రపంచంలో కూడా ఆచరణ సాధ్యమైనవేననీ మన హృదయాంతరాళాల్లోంచి పరిపూర్ణంగా విశ్వసించలేకపోవడం.

  • 5. in competition with Srila Prabhupada's teachings – with full conviction and enthusiasm we go in a completely different direction than what Srila Prabhupada has instructed, and in so doing influence others to go with us.

5. శ్రీల ప్రభుపాదుల బోధనలతో వైరుధ్యం - ఆయన బోధనల సారాంశానికి విరుద్ధంగా స్వంతంగా అర్ధంచేసుకుని ఆ అవగాహనపై పూర్తి నమ్మకంతో, ఉత్సాహంతో శ్రీల ప్రభుపాదుల నిర్దేశాలకు పూర్తి భిన్న మార్గంలో ప్రయాణించడమేగాక ఇతరులనూ మనను అనుసరించేలా ప్రభావితం చేయడం.

Comment వ్యాఖ్య

We believe these obstacles can easily be overcome with the introduction of integral, structured educational and training programs aimed at nurturing our relationship with and increasing our knowledge of Srila Prabhupada's teachings. This will only succeed however if fueled by a serious leadership commitment to create a culture deeply rooted in Srila Prabhupada's Vani. Srila Prabhupada's natural position will thus automatically become, and remain, apparent to all generations of devotees.

శ్రీల ప్రభుపాదుల బోధనలతో మనకున్న సంబంధాన్ని సుధృఢం చేసుకోవడం మరియు పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం లక్ష్యాలుగా సమగ్రమైన, నిర్మాణాత్మకమైన విద్యా మరియు శిక్షణా కార్యక్రమాలను ప్రవేశపెట్టడం ద్వారా పై అవరోధాలను సులభంగా అధిగమించగలమని విశ్వసిస్తున్నాము. శ్రీల ప్రభుపాదుల యొక్క వాణీ స్వరూప బోధనల మూలాలే ఆధారంకాగల సంస్కృతిని సృష్టించేందుకు కంకణబద్ధులైన ఉన్నత నాయకత్వం స్ఫూర్తి నింపుతూ ఉంటేనే ఈ కార్యం విజయవంతమౌతుంది. అప్పుడే శ్రీల ప్రభుపాదుల సహజ స్థితి అన్ని తరాల భక్తులకూ స్వయంగా మార్గదర్శకమై నిలుస్తుంది.

Devotees are his Limbs, ISKCON is his Body, and his Vani is his Soul ISKCON ఆయన శరీరం, భక్తులు ఆయన అంగములు, ఆయన వాణియే ఆయన ఆత్మ

ఈ ISKCON అనే సంఘం యొక్క ధృఢమైన శరీరంలో ఎటువంటి పగుళ్ళను సృష్టించవద్దని మీ అందరికీ నేను తీవ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. వ్యక్తిగత ఆశయాలకు తావులేకుండా అందరూ కలిసి పనిచేయండి. అదియే లక్ష్య సాధనకు తప్పక సహాయకారి అవుతుంది. - శ్రీల ప్రభుపాదులు 31 జులై 1970 నాడు బ్రహ్మానంద స్వామి మరియు గర్గముని స్వామి లకు వ్రాసిన లేఖ.

పుస్తకాలపైన ఉండే చిత్రాల్ని చాలా ఆకర్షణీయంగా తయారుచేయండి. అప్పుడు చదువరులు లోపల ఉన్న జ్ఞానాన్ని తమంత తామే ఆసక్తితో చదువుతారు. పుస్తకాల ముఖచిత్రాలు మనస్సు మరియు ఇంద్రియాలవంటివి, లోపలి విషయాలు ఆత్మ వంటివి. - శ్రీల ప్రభుపాదులు 22 మే 1972 నాడు అమోఘ దాసు (TP) కు వ్రాసిన లేఖ.

ప్రపంచాన్ని కాపాడిన మహత్కార్యంగా ఈ శ్రీకృష్ణ చైతన్యోద్యమం చరిత్రలో గుర్తించబడాలని నేను ఆశిస్తున్నాను. వాస్తవానికి ప్రపంచాన్ని పూర్తి వినాశనం నుండి కాపాడగలిగే ఆశ కేవలం మన ఉద్యమం మాత్రమే. - శ్రీల ప్రభుపాదులు 1 జనవరి 1972 నాడు సుచంద్ర దాసు (TP) కు వ్రాసిన లేఖ.

  • You should always remember that whatever we are doing, it is in the parampara system beginning from Lord Krishna, down to us. Therefore, our loving spirit should be more upon the message than the physical representation. When we love the message and serve Him, automatically our devotional love for the physique is done. – Srila Prabhupada Letter to Govinda dasi, 7 April 1970

మనం చేస్తూన్నదంతా, శ్రీకృష్ణుని నుండి మొదలై మనవరకు కొనసాగుతున్న పరంపరలోనిదని మీరు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆవిధంగా, ప్రేమతోనిండిన మన ప్రవర్తన భౌతిక భావన కంటే ఎక్కువగా బోధనలపై ఆధారపడాలి. మనం ఎప్పుడైతే ఆయన సందేశాన్ని ప్రేమించి భగవంతుణ్ణి సేవిస్తామో, అప్పుడు ఆయన భౌతిక స్వరూపాన్ని కూడా మనం ప్రేమపూర్వక భక్తితో అర్చించినట్లే అవుతుంది. - శ్రీల ప్రభుపాదులు 7 ఏప్రిల్ 1970 నాడు గోవింద దాసికి వ్రాసిన లేఖ.

Comment వ్యాఖ్య

We are Srila Prabhupada's limbs. To successfully cooperate with him to his full satisfaction we must be united in consciousness with him. This loving unity develops from our becoming fully absorbed in, convinced by and practicing his Vani. Our holistic success strategy is for everyone to assimilate Srila Prabhupada's teachings and boldly place them at the heart of everything we do for his Krishna consciousness movement. In this way, Srila Prabhupada's devotees can flourish personally, and in their respective services to make ISKCON a solid body which can fulfill Srila Prabhupada's desire to save the world from complete disaster. The devotees win, the GBC wins, ISKCON wins, the world wins, Srila Prabhupada wins, and Lord Caitanya wins. There will be no losers.

మనం శ్రీల ప్రభుపాదుల యొక్క శరీరంలోని అవయవాలము. ఆయన పరిపూర్ణంగా సుంతుష్టులయ్యేలా ఆయన యొక్క లక్ష్యం సాకారమయ్యేలా ఆయనకు సహకరించడానికి మనమందరం సంపూర్ణ మానసిక సన్నద్ధతతో ఎల్లప్పుడూ ఆయనతో ఐక్యమై ఉండాలి. మనం ఆయన యొక్క వాణీ స్వరూప బోధనల పట్ల పూర్తి అంగీకారాన్ని కలిగి ఉండడం మరియు ఆ జ్ఞాన సారంలో సర్వదా మునిగిఉండడం ద్వారా మనందరి మధ్యా ఇటువంటి ప్రేమపూర్వక ఐక్యత వికసిస్తుంది. సమగ్రమైన విజయానికి మన ఆచరణా వ్యూహం ఏమిటంటే, ప్రతీ ఒక్కరూ శ్రీల ప్రభుపాదుల బోధనలను పూర్తిగా అర్ధం చేసుకోవడం మరియు ఆ సారాంశాన్ని శ్రీకృష్ణ చైతన్యోద్యమంకోసం మనం ఆచరించే ప్రతీ కార్యాచరణలో ధైర్యంగా నింపడం. ఈ విధంగా శ్రీల ప్రభుపాదుల భక్తులు ఆధ్యాత్మికంగానూ, ISKCON ను సుధృఢమైన సంస్థగా రూపొందించేందుకు తాము అర్పించే సేవలలోనూ వర్ధిల్లగలరు. అప్పుడు ISKCON ద్వారా ప్రపంచాన్ని పూర్తి వినాశనం నుండి కాపాడాలనే శ్రీల ప్రభుపాదుల ఆకాంక్ష కూడా సాకారమై నిలుస్తుంది. ఆ విధంగా భక్తులు ధన్యులౌతారు, GBC విజయవంతమౌతుంది, ISKCON విజయకేతనం ఎగురవేస్తుంది, ప్రపంచం ఉద్ధరించబడుతుంది, శ్రీల ప్రభుపాదులు చరితార్ధులౌతారు, శ్రీ చైతన్య మహాప్రభువుల దివ్య అవతార సంకల్పం సిద్ధిస్తుంది.

Distributing the Teachings of Parampara పరంపరానుగత బోధనల విస్తరణ

1486 Caitanya Mahaprabhu appears in order to teach the world Krishna consciousness – 533 years ago

1486 - శ్రీ కృష్ణ చైతన్యాన్ని ప్రపంచానికి బోధించడం కోసం శ్రీ చైతన్య మహాప్రభువు అవతరించారు - 533 సంవత్సరాల క్రితం

1488 Sanatana Goswami appears in order to write books on Krishna consciousness – 531 years ago

1488 - శ్రీ కృష్ణ చైతన్యం గురించి గ్రంధ రచన చేయడం కోసం సనాతన గోస్వామి అవతరించారు - 531 సంవత్సరాల క్రితం

1489 Rupa Gosvami appears in order to write books on Krishna consciousness – 530 years ago

1489 - శ్రీ కృష్ణ చైతన్యం గురించి గ్రంధ రచన చేయడం కోసం రూపా గోస్వామి అవతరించారు - 530 సంవత్సరాల క్రితం

1495 Raghunatha Gosvami appears in order to write books on Krishna consciousness – 524 years ago

1495 - శ్రీ కృష్ణ చైతన్యం గురించి గ్రంధ రచన చేయడం కోసం రఘునాథ గోస్వామి అవతరించారు - 524 సంవత్సరాల క్రితం

1500 Mechanical printing presses begin to revolutionize the distribution of books throughout Europe – 520 years ago

1500 - ఐరోపాలో ముద్రణా రంగంలో యాంత్రీకరణ ప్రవేశించడం వల్ల పుస్తకాల ముద్రణ మరియు పంపిణీల్లో విప్లవాత్మకమైన మార్పులు ఆరంభమయ్యాయి - 520 సంవత్సరాల క్రితం

1513 Jiva Gosvami appears in order to write books on Krishna consciousness – 506 years ago

1513 - శ్రీ కృష్ణ చైతన్యం గురించి గ్రంధ రచన చేయడం కోసం జీవా గోస్వామి అవతరించారు - 506 సంవత్సరాల క్రితం

1834 Bhaktivinoda Thakura appears in order to write books on Krishna consciousness – 185 years ago

1834 - శ్రీ కృష్ణ చైతన్యం గురించి గ్రంధ రచన చేయడం కోసం భక్తి వినోద ఠాకూర్ అవతరించారు - 185 సంవత్సరాల క్రితం

1874 Bhaktisiddhanta Sarasvati appears in order to write books on Krishna consciousness – 145 years ago

1874 - శ్రీ కృష్ణ చైతన్యం గురించి గ్రంధ రచన చేయడం కోసం భక్తి సిద్ధాంత సరస్వతి అవతరించారు - 145 సంవత్సరాల క్రితం

1896 Srila Prabhupada appears in order to write books on Krishna consciousness – 123 years ago

1896 - శ్రీ కృష్ణ చైతన్యం గురించి గ్రంధ రచన చేయడం కోసం శ్రీల ప్రభుపాదులు అవతరించారు - 123 సంవత్సరాల క్రితం

1914 Bhaktisiddhanta Sarasvati coins the phrase "brhat-mrdanga" – 105 years ago

1914 - భక్తి సిద్ధాంత సరస్వతీ స్వామి "బృహత్-మృదంగ" అనే ఆచరణకు / భావానికి రూపకల్పన చేసారు - 105 సంవత్సరాల క్రితం

1922 Srila Prabhupada meets Bhaktisiddhanta Sarasvati for the first time and is immediately requested to preach in the English language - 97 years ago

1922 - శ్రీల ప్రభుపాదుల వారు మొదటిసారి భక్తి సిద్ధాంత సరస్వతీ స్వామిని కలుసుకున్నారు. వెంటనే శ్రీల ప్రభుపాదులను ఆంగ్లంలో బోధించవలసినదిగా భక్తి సిద్ధాంత సరస్వతీ స్వామి అభ్యర్ధించారు - 97 సంవత్సరాల క్రితం

1935 Srila Prabhupada receives the instruction to print books – 84 years ago

1935 - శ్రీల ప్రభుపాదులు పుస్తకాలను ముద్రించాలనే సూచనను అందుకున్నారు - 84 సంవత్సరాల క్రితం

1944 Srila Prabhupada starts Back to Godhead magazine – 75 years ago

1944 - శ్రీల ప్రభుపాదులు Back to Godhead అనే పత్రికను ప్రారంభించారు - 75 సంవత్సరాల క్రితం

1956 Srila Prabhupada moves to Vrndavana to write books – 63 years ago

1956 - శ్రీల ప్రభుపాదులు గ్రంధరచనకోసమై బృందావనం చేరారు - 63 సంవత్సరాల క్రితం

1962 Srila Prabhupada publishes his first volume of Srimad-Bhagavatam – 57 years ago

1962 - శ్రీల ప్రభుపాదులు తాము రచించిన శ్రీమద్భాగవతం మొదటి సంపుటి ని ప్రచురించారు - 57 సంవత్సరాల క్రితం

1965 Srila Prabhupada arrives in the West to distribute his books – 54 years ago

1965 - శ్రీల ప్రభుపాదులు తాము రచించిన గ్రంధాలను వ్యాప్తిచెందించేందుకు పశ్చిమ దేశాలకు చేరుకున్నారు - 54 సంవత్సరాల క్రితం

1968 Srila Prabhupada publishes his abridged Bhagavad-gita As-It-Is – 52 years ago

1968 - శ్రీల ప్రభుపాదులు తాము రచించిన సంక్షిప్త భగవద్గీత - యథాతథము ను ప్రచురించారు - 52 సంవత్సరాల క్రితం

1972 Srila Prabhupada publishes his full version of Bhagavad-gita As-It-Is – 47 years ago

1972 - శ్రీల ప్రభుపాదులు తాము రచించిన సంపూర్ణ "భగవద్గీత - యథాతథము" ను ప్రచురించారు - 47 సంవత్సరాల క్రితం

1972 Srila Prabhupada establishes the BBT to publish his books – 47 years ago

1972 - శ్రీల ప్రభుపాదులు తమ గ్రంధాలను ప్రచురించడాంకి BBT ని స్థాపించారు - 47 సంవత్సరాల క్రితం

1974 Srila Prabhupada's disciples start the serious distribution of his books – 45 years ago

1974 - శ్రీల ప్రభుపాదుల గ్రంధాలను విస్తృతంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆయన శిష్యులు ప్రారంభించారు - 45 సంవత్సరాల క్రితం

1975 Srila Prabhupada completes the Sri Caitanya-caritamrta – 44 years ago

1975 - శ్రీల ప్రభుపాదులు శ్రీ చైతన్య చరితామృత రచన పూర్తిచేసారు - 44 సంవత్సరాల క్రితం

1977 Srila Prabhupada stops speaking and leaves his Vani in our care – 42 years ago

1977 - శ్రీల ప్రభుపాదులు మౌనాన్ని స్వీకరించి తమ యొక్క వాణీ సంరక్షణ బాధ్యతను మనకందరికీ అప్పగించారు - 42 సంవత్సరాల క్రితం

1978 The Bhaktivedanta Archives is established – 41 years ago

1978 - భక్తి వేదాంత Archives (ప్రాచీన గ్రంథాల భాండాగారం) స్థాపించబడింది - 41 సంవత్సరాల క్రితం

1986 The world's digitally stored material amounts to 1 CD-ROM per person – 33 years ago

1986 - ప్రపంచవ్యాప్తంగా Computers ద్వారా నిల్వ చేయబడిన సమాచారం సరాసరి ఒక్కో మనిషికి 1 CD Rom కు సరిపోతుంది - 33 సంవత్సరాల క్రితం

1991 The World Wide Web (brhat-brhat-brhat mrdanga) is established – 28 years ago

1991 - World Wide Web (బృహత్-బృహత్-బృహత్ మృదంగ) స్థాపించబడింది - 28 సంవత్సరాల క్రితం

1992 The Bhaktivedanta VedaBase version 1.0 is created – 27 years ago

1992 - భక్తి వేదాంత VedaBase Version 1.0 స్థాపించబడింది - 27 సంవత్సరాల క్రితం

2002 The Digital Age arrives - worldwide digital storage overtakes analog – 17 years ago

2002 - Digital Age మొదలయ్యింది. ప్రపంచవ్యాప్తంగా Analog పద్దతిలో సమాచార నిల్వ చేసే విధానం ప్రాభవాన్ని కోల్పోయి Digital format లో సమాచారాన్ని భద్రపరిచే ప్రక్రియ పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి వచ్చింది - 17 సంవత్సరాల క్రితం

2007 The world's digitally stored material amounts to 61 CD-ROMS per person – 12 years ago, that makes 427 billion CD-ROMs. (all full)

2007 - ప్రపంచవ్యాప్తంగా Digital format లో నిల్వ చేయబడిన సమాచారం సరాసరి ఒక్కో వ్యక్తికి 61 CD Rom లకు సమానమైనది. అన్నింటినీ పూర్తిగా ఉపయోగిస్తే అవి 427 బిలియన్ CD-Rom లు అవుతాయి - 12 సంవత్సరాల క్రితం

2007 Srila Prabhupada's Vani-temple, the Vanipedia begins construction in the web – 12 years ago

2007 - శ్రీల ప్రభుపాదుల వాణీ-దేవాలయ స్వరూపం గా Internet లో వాణీపీడియా నిర్మాణం మొదలయ్యింది - 12 సంవత్సరాల క్రితం

2010 Srila Prabhupada's Vapu-temple, the Temple of the Vedic Planetarium begins construction in Sridhama Mayapur – 9 years ago

2010 - శ్రీల ప్రభుపాదుల వేదవిజ్ఞాన ప్రదర్శనాలయం యొక్క నిర్మాణ కార్యం శ్రీధామ మాయాపూర్ లో ప్రారంభమయ్యింది - 9 సంవత్సరాల క్రితం

2012 Vanipedia reaches 1,906,753 quotes, 108,971 pages and 13,946 categories – 7 years ago

2012 - వాణీపీడియా 13,946 విభాగాలతో, 1,08,971 పుటలతో, 19,06,753 quotations కలిగిన ఆధ్యాత్మిక విజ్ఞాన భాండాగారంగా రూపుదిద్దుకుంది - 7 సంవత్సరాల క్రితం

2013 500,000,000 of Srila Prabhupada's books have been distributed by ISKCON devotees in 48 years – an average of 28,538 books every single day - 6 years ago

2013 - గత 48 సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేసిన శ్రీల ప్రభుపాదుల పుస్తకాల సంఖ్య 50 కోట్లు (ప్రతీరోజూ సగటున 28,538 పుస్తకాలు) - 6 సంవత్సరాల క్రితం

2019 21st March, Gaura Purnima day at 7.15 Central European Time, Vanipedia celebrates 11 years of inviting devotees to collaborate together to invoke and fully manifest Srila Prabhupada's Vani-presence. Vanipedia now offers 45,588 categories, 282,297 pages, 2,100,000 plus quotes presented in 93 languages. This has been achieved by over 1,220 devotees who have performed more than 295,000 hours of vaniseva. We still have a long way to go in order to complete Srila Prabhupada's Vani-temple thus we continue to invite devotees to participate in this glorious mission.

2019 మార్చి 21, గౌర పూర్ణిమ తిథి ఉదయం 7:15 సెంట్రల్ యూరోపియన్ సమయం. శ్రీల ప్రభుపాదుల యొక్క వాణీ-ఉనికిని సంపూర్ణంగా వ్యక్తీకరించేందుకు సమిష్టిగా కృషిచేయమని 11 సంవత్సరాలుగా భక్తులను ఆహ్వానించడాన్ని ఓ ఉత్సవంగా జరుపుకుంటున్నాము. వాణీపీడియా ఇప్పుడు 45 భాషలలో 45,588 విభాగాలుగా, 2,82,297 పుటలను ఇంకా 21,00,000 పైచిలుకు quotations ను 93 భాషలలో అందిస్తూంది. ఈ ఘనకార్యాన్ని 1,220 మంది భక్తులు 2,95,000 గంటల సమయాన్ని ఈ వాణీసేవగా సమర్పించడం ద్వారా సాధించారు. శ్రీల ప్రభుపాదుల వాణీ-ఆలయమైన ఈ వాణీపీడియా ను పూర్తి చేయడానికి మనం ఇంకా ఎంతో ఎంతో చేయాల్సి ఉంది. అందుకోసం ఈ అద్భుతమైన మహా కార్యంలో భాగస్వాములవమని భక్తులైన మీ అందరినీ మేము ఆహ్వానిస్తూ ఉన్నాము.

Comment వ్యాఖ్య

The unfolding of the mission of Sri Caitanya Mahaprabhu under the banner of the modern day Krishna consciousness movement is a very exciting time to be performing devotional service.

శ్రీ చైతన్య మహాప్రభువు యొక్క ఆధునిక శ్రీ కృష్ణ చైతన్యోద్యమం ప్రపపంచమంతా విస్తరిస్తోంది. ఆధ్యాత్మిక సేవ చేసేందుకు ప్రస్తుత కాలమే అత్యంత ఉత్తేజకరమైన సమయం.

Srila Prabhupada, the Founder-acarya of the International Society of Krishna Consciousness has brought onto the world scene a life-changing phenomenon in the form of his Translations, Bhaktivedanta Purports, Lectures, Conversations, and Letters. Here lies the key to the respiritualization of the whole human society.

అంతర్జాతీయ శ్రీ కృష్ణ చైతన్య సంఘ వ్యవస్థాపకాచార్యులైన శ్రీల ప్రభుపాదులు తమ యొక్క అనువాదాలు, భక్తివేదాంత భాష్యాలు, ఉపన్యాసాలు, సంభాషణలు ఇంకా లేఖల రూపంలో సాధారణ మానవ జీవితాల్ని పరివర్తింపచేయగలిగే మహోన్నత జ్ఞానాన్ని ప్రపంచానికి అందించారు. సమస్త మానవ సమాజాన్ని మళ్ళీ ఆధ్యాత్మిక మార్గంలో నడిపించేందుకు ఈ జ్ఞాన భాండాగారమే అత్యంత కీలకం.

Vani, Personal Association and Service in Separation - Quotes భౌతిక ఎడబాటులో వాణీ ద్వారా సహచర్యం మరియు సేవ - ఉల్లేఖనములు (Quotations)

నా గురుమహరాజు 1936 లో శరీరత్యాగం చేసారు, ఆ తరువాత 30 సంవత్సరాలకు 1965 లో నేను ఈ భక్తి వేదాంత ఉద్యమాన్ని ప్రారంభించాను. అయినా నేను నా గురుమహరాజు కరుణను పొందుతున్నాను. ఇదియే "వాణి". గురువు భౌతికంగా లేనప్పటికీ ఆయన బోధనలను నేను అనుసరించినట్లయితే, నీకు ఆయన నుండి సహాయం లభిస్తూనే ఉంటుంది. - శ్రీల ప్రభుపాద ఉదయపు కాలినడక సమయంలోని సంభాషణ - 21 జులై 1975

  • In the absence of physical presentation of the Spiritual Master the Vaniseva is more important. My Spiritual Master, Sarasvati Gosvami Thakura, may appear to be physically not present, but still because I try to serve His instruction I never feel separated from Him. I expect that all of you should follow these instructions. – Srila Prabhupada Letter to Karandhara das (GBC), 22 August 1970

ఆధ్యాత్మిక గురువు యొక్క భౌతిక ఎడబాటులో, వాణీసేవ మరింత ఆవశ్యకమౌతుంది. నా ఆధ్యాత్మిక గురువు సరస్వతీ గోస్వామి ఠాకూరు ఈనాడు భౌతికంగా లేకపోవచ్చు గాక, అయినప్పటికీ నేను ఆయన ఆజ్ఞలను పాటించే ప్రయత్నం చేస్తూనే ఉన్న కారణం చేత ఆయన నుండి విడిపోయిన భావన నాకెప్పుడూ కలగదు. మీరందరూ కూడా ఈ ఆదేశాలను పాటించాలని నేను ఆశిస్తున్నాను - శ్రీల ప్రభుపాదులు కరంధర దాసు (GBC) కు వ్రాసిన లేఖ నుండి - 22 ఆగష్టు 1970

  • From the very beginning I was strongly against the impersonalists and all my books are stressed on this point. So my oral instruction as well as my books are all at your service. Now you GBC consult them and get clear and strong idea, then there will be no disturbance. Disturbance is caused by ignorance; where there is no ignorance, there is no disturbance. – Srila Prabhupada Letter to Hayagriva das (GBC), 22 August 1970

మొదటినుండీ నేను వ్యక్తిగతవాదులను ధృఢంగా వ్యతిరేకిస్తున్నాను. నా రచనలన్నింటిలో ఈ అంశాన్ని నొక్కిచెప్పాను. నేను ప్రసంగాలద్వారా తెలిపిన సూచనలు ఇంకా రచించిన గ్రంధాలన్నీ ఇప్పుడు మీకందరికీ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మీరు GBC ని సంప్రదించి స్పష్టమైన, ధృఢమైన ఉద్దేశ్యాలను రూపొందించుకోండి. అప్పుడు ఎటువంటి అవరోధాలూ ఉండవు. స్పష్టమైన జ్ఞానమూ అవగాహనా లేకపోవడం వల్ల మనసులో ఆటంకాలు తలెత్తుతాయి. అజ్ఞానం నివృత్తి అయినతరువాత ఇక అక్కడ ఏ ఆటంకాలూ ఉండవు - శ్రీల ప్రభుపాదులు హయగ్రీవ దాసు (GBC) కు వ్రాసిన లేఖ నుండి - 22 ఆగష్టు 1970

గురువుతో వ్యక్తిగత సాంగత్యం అనే కోణంలో చూస్తే, నేను నా గురుమహరాజుతో ఉన్నది కేవలం నాలుగు లేదా ఐదు సార్లు మాత్రమే. కానీ ఆయనతో నా అనుభంధాన్ని నేను ఎప్పుడూ, కనీసం ఒక్క క్షణకాలం పాటు కూడా విడిచిపెట్టలేదు. నేను ఆయన ఆదేశాలను అనుసరిస్తూ ఉన్నందువలన ఆయననుండి దూరంగా ఉన్నాననే భావన నాకెన్నడూ కలుగలేదు - శ్రీల ప్రభుపాదులు సత్యధన్య దాసు కు వ్రాసిన లేఖ నుండి - 20 ఫిబ్రవరి 1972

నేను నా గురుమహరాజు నుండి వ్యక్తిగత మార్గదర్శకత్వం పొందుతున్న రీతిలోనే, నేను భౌతికంగా ఉన్నప్పటికీ, లేకున్నప్పటికీ కూడా మీకు వ్యక్తిగత మార్గదర్శిగా ఉంటాను - శ్రీల ప్రభుపాదుల గదిలో జరిగిన సంభాషణ - 14 జులై 1977

  • Please be happy in separation. I am separated from my Guru Maharaja since 1936 but I am always with him so long I work according to his direction. So we should all work together for satisfying Lord Krishna and in that way the feelings of separation will transform into transcendental bliss. – Srila Prabhupada Letter to Uddhava das (ISKCON Press), 3 May 1968

దయచేసి భౌతికంగా దూరంగా ఉండడం లో కూడా సంతోషంగా ఉండండి. నేను 1936 నుండి నా గురుమహరాజు నుండి విడిపోయి ఉన్నాను, కానీ ఈనాటికీ ఆయన నిర్దేశించిన ప్రకారం పనిచేస్తూనే ఉన్నాను కాబట్టి ఎల్లప్పుడూ ఆయనతోనే ఉన్నాను. అదేవిధంగా శ్రీ కృష్ణ భగవానుని సంతృప్తిపరచేందుకు మనమందరం సమిష్టిగా కృషి చేయాలి. తద్వారా వియోగ భావాలన్నీ దివ్య ఆనందంగా పరిణామం చెందుతాయి - శ్రీల ప్రభుపాదులు ఉద్ధవదాసుకు వ్రాసిన లేఖ నుండి (ISKCON Press) - 3 మే 1968

Comment వ్యాఖ్య

Srila Prabhupada offers many revealing truths in this series of statements.

పైన ఉదహరించిన శ్రీల ప్రభుపాదుల యొక్క కొన్ని ప్రకటనల ద్వారా ఆయన ఎన్నో సత్యాలను మనకు బహిర్గతపరుస్తున్నారు.

  • Srila Prabhupada's personal guidance is always here.

శ్రీల ప్రభుపాదుల వ్యక్తిగత మార్గదర్శకత్వం మనకు ఎప్పుడూ అందుతూ ఉంటుంది.

  • We should be happy in feelings of separation from Srila Prabhupada.

శ్రీల ప్రభుపాదుల నుండి దూరమైన భావనలో కూడా మనం సంతోషంగా ఉండగలగాలి.

  • In Srila Prabhupada's physical absence his Vaniseva is more important.

శ్రీల ప్రభుపాదులు భౌతికంగా మనతో లేరు కాబట్టి ఇప్పుడు ఆయన వాణీసేవ మనకు మరింత ప్రాధాన్యమైనది.

  • Srila Prabhupada had very little personal association with his Guru Maharaja.

శ్రీల ప్రభుపాదులు తమ గురుమహరాజుతో చాలా తక్కువ ప్రత్యక్ష అనుబంధాన్ని కలిగిఉన్నారు.

  • Srila Prabhupada's oral instruction, as well as his books, are all at our service.

శ్రీల ప్రభుపాదుల ముఖతా వెలువడిన బోధనలూ మరియు ఆయన రచించిన గ్రంధాలూ అన్నీ మనకు మార్గదర్శకాన్ని అందిస్తున్నాయి.

  • Feelings of separation from Srila Prabhupada transform into transcendental bliss.

శ్రీల ప్రభుపాదుల యొక్క బౌతిక దూరంలో కూడా మనం సంతోషంగా ఉండగలిగితే అది దివ్య ఆనందంగా పరిణమిస్తుంది.

  • When Srila Prabhupada is not physically present, if we follow his Vani, we get his help.

శ్రీల ప్రభుపాదులు ప్రస్తుతం భౌతికంగా లేరు కాబట్టి, మనం ఆయన వాణిని అనుసరిస్తే, మనం ఆయననుండి సహాయాన్ని పొందగలము.

  • Srila Prabhupada never left Bhaktisiddhanta Sarasvati's association, not even for a moment.

శ్రీల ప్రభుపాదులు తమ గురుమహరాజు భక్తిసిద్ధాంత సరస్వతీ ఠాకూరు తో అనుబంధాన్ని ఒక్క క్షణం కూడా విడిచి పెట్టలేదు.

  • By consulting Srila Prabhupada's oral instructions and his books we get clear and strong ideas.

శ్రీల ప్రభుపాదుల మౌఖిక బోధనలను మరియు రచనలను ఆశ్రయించడం ద్వారా మనం స్పష్టమైన, ధృఢమైన ఉద్దేశ్యాలను ఏర్పరచుకోగలుగుతాము.

  • By following Srila Prabhupada's instructions we will never feel separated (disconnected) from him.

శ్రీల ప్రభుపాదుల ఆదేశాలను పాటించడం ద్వారా మనం ఆయన నుండి విడిపోయిన భావనను ఎప్పటికీ అనుభవించము.

  • Srila Prabhupada expects all his followers to follow these instructions in order to become empowered siksa-disciples of him.

తమ అనుచరులందరూ ఈ ఆదేశాలను పాటించడం ద్వారా సాధికారత కలిగిన శిక్షా-శిష్యులుగా మారాలని శ్రీల ప్రభుపాదులు ఆకాంక్షిస్తున్నారు.

Using Media to Spread Krishna's Message శ్రీ కృష్ణుడి సందేశాన్ని వ్యాప్తి చేయడానికి Media ను ఉపయోగించడం

మీ సంఘటితమైన వ్యవస్థతో నేను రచించిన పుస్తకాలను ముద్రణ మరియు ఇతర ఆధునిక మాధ్యమాల ద్వారా పంపిణీ చేసేందుకు ముందుకు వెళ్ళండి. తద్వారా శ్రీ కృష్ణుడు మీపట్ల ఖచ్చితంగా సంతుష్టుడౌతాడు. మనం శ్రీ కృష్ణుడి గురించి లోకానికి చెప్పేందుకు టెలివిజన్, రేడియో, చలనచిత్రాలు, ఇంకా ఏయే మార్గాలు ఉన్నాయో అటువంటి అన్ని ప్రసార మాధ్యమాలనూ ఉపయోగించుకుందాము - శ్రీల ప్రభుపాదులు భగవాన్ దాసు (GBC) కు వ్రాసిన లేఖ నుండి - 24 నవంబర్ 1970

మన శ్రీ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని వ్యాప్తి చేయడంలో అత్యధిక సంఖ్యాక ప్రజలను చేరగలిగిన ప్రసార మాధ్యమాలు ముఖ్యమైన సాధనాలుగా ఉపకరించవచ్చు. ఇదంతా సాధించగలిగే మార్గాలను అన్వేషించే ప్రయత్నాల్లో మీరున్నారని తెలిసి నేను ఎంతో సంతోషిస్తున్నాను - శ్రీల ప్రభుపాదులు నయనాభిరామ దాసు (TP) కు వ్రాసిన లేఖ నుండి. - 9 జనవరి 1971.

  • I am very encouraged by the reports of the tremendous success of your TV and radio programs. As much as possible try to increase our preaching programs by using all the mass media which are available. We are modern day Vaishnavas and we must preach vigorously using all the means available. – Srila Prabhupada Letter to Rupanuga das (GBC), 30 December 1971

మీ టెలివిజన్ మరియు రేడియో కార్యక్రమాలు అత్యద్భుతమైన విజయాన్ని సాధిస్తున్నాయనే నివేదికల నుండి నేను ఎంతో ప్రేరణ పొందుతున్నాను. అన్ని విధాలైన బహుళ ప్రసారమాధ్యమాలను సాధ్యమైనంత ఎక్కువగా ఉపయోగిస్తూ మన బోధనా కార్యక్రమాలను విస్తరించేందుకు ప్రయత్నించండి. మనం ఆధునిక వైష్ణవులం. అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగిస్తూ విస్తృతంగా బోధించి తీరాలి - శ్రీల ప్రభుపాదులు రూపానుగ దాసు (GBC) కు వ్రాసిన లేఖ నుండి - 30 డిసెంబరు 1971.

  • If you are able to arrange everything so that I can simply sit in my room and be seen by the world and speak to the world, then I shall never leave Los Angeles. That will be the perfection of your L.A. Temple. I am very, very encouraged by your proposal to flood the medias of your country with our Krishna Consciousness program, and see that it is practically taking shape under your hands, so I am all the more pleased. - Srila Prabhupada Letter to Siddhesvar das and Krishnakanti das, 16 February 1972

నేను నా గదిలోనే ఆసీనుడనై ప్రపంచానికి కనిపించేలా, ప్రపంచంతో మాట్లాడగలిగేలా అవసరమైనవన్నీ మీరు ఏర్పాటు చెయ్యగలిగితే, నేను లాస్ ఏంజిల్స్ ఎప్పటికీ వదిలిపెట్టను. అప్పుడు మీ లాస్ ఏంజిల్స్ ఆలయం పరిపూర్ణత సంతరించుకుంటుంది. మీ దేశంలోని ప్రసార మాధ్యమాలన్నింటినీ మన శ్రీ కృష్ణ చైతన్య కార్యక్రమ ప్రవాహంతో నింపెయ్యాలనే మీ ప్రతిపాదనను చూసి నేను ఎంతో ప్రేరణ పొందాను. ఇదంతా మీ చేతుల్లో ఆచరణాత్మకంగా రూపుదిద్దుకోవడం చూసి నేను మరింత సంతోషిస్తున్నాను - శ్రీల ప్రభుపాదులు సిద్ధేశ్వర దాసు మరియు కృష్ణకాంతి దాసు లకు వ్రాసిన లేఖ నుండి - 16 ఫిబ్రవరి 1972.

ఈ టెలివిజన్ లో కనిపించే ప్రముఖులకు మీరు మన పుస్తకాలను పరిచయంచేసి ఆ విషయాలను ప్రసారం చేయించగలిగే ప్రయత్నం చేయండి. అప్పుడే ప్రసార మాధ్యమాలను ద్వారా మన ఉద్యమాన్ని వ్యాప్తిచేసే కృషిలో నిజమైన విజయం సాంధించినట్లు అవుతుంది - శ్రీల ప్రభుపాదులు ముకుంద దాసు కు వ్రాసిన లేఖ నుండి - 21 ఫిబ్రవరి 1973.

శ్రీల ప్రభుపాదుల బోధనలు, సూచనలను ఆయన గ్రంధాలలో కనిపిస్తూన్న విధంగా వివిధ అంశాల వారీగా వర్గీకరించి, ఓ క్రమపద్ధతిలో కూర్చి, "సమగ్ర జ్ఞాన సంగ్రహ" స్వరూపంగా రూపొందించాలనే మీ ప్రతిపాదన విని ఆ దివ్య కరుణా భరిత మానసుడు ఎంతో సంతోషపడినారు - శ్రీల ప్రభుపాదుల యొక్క కార్యదర్శి శుభానంద దాసుకు వ్రాసిన లేఖ నుండి - 7 జూన్ 1977.

Comment వ్యాఖ్య

Following in the footsteps of his Guru Maharaja Srila Prabhupada knew the art of engaging everything for Krishna's service. తమ గురుమహరాజు అడుగుజాడలను అనుసరించడం వలన, శ్రీల ప్రభుపాదులు శ్రీ కృష్ణుడి సేవ కోసం అన్ని వనరులనూ సయోధ్య పరచి వినియోగించే కళలో నిష్ణాతులై ఉన్నారు.

  • Srila Prabhupada wants to be seen by the world and speak to the world.

శ్రీల ప్రభుపాదులు ప్రపంచం తమను చూడాలని, ప్రపంచంతో మాట్లాడాలనీ కోరుకుంటున్నారు.

  • Srila Prabhupada desires to flood the media with our Krishna Consciousness programs.

శ్రీల ప్రభుపాదులు మనం శ్రీ కృష్ణ చైతన్య కార్యక్రమాలతో ప్రసారమాధ్యమాలను ముంచెత్తాలని ఆశిస్తున్నారు.

  • Srila Prabhupada wants his books distributed through the press and other modern-media.

శ్రీల ప్రభుపాదులు ముద్రణ మరియు ఇతర ఆధునిక మాధ్యమాల ద్వారా తమ రచనలు విస్తరింపబడాలని కోరుకుంటున్నారు.

  • Srila Prabhupada was happy to hear about the plan for a subject by subject encyclopedia of his teachings.

శ్రీల ప్రభుపాదులు ఆయన బోధనలన్నీ విషయాల వారీగా సంగ్రహ పరచాలనే ప్రణాళిక గురించి విన్నప్పుడు సంతోషించారు.

  • Srila Prabhupada says we should increase our preaching programs by using all the mass media that is available.

అందుబాటులో ఉన్న అన్ని బహుళ ప్రసార మాధ్యమాలనూ ఉపయోగించి మన బోధనా కార్యక్రమాలను తీవ్రతరం చేయాలని శ్రీల ప్రభుపాదులు సూచించారు.

  • Srila Prabhupada says we are modern day Vaishnavas and we must preach vigorously using all the means available.

మనం ఆధునిక వైష్ణవులమనీ, అందుభాటులో ఉన్న అన్ని మాధ్యమాలనూ ఉపయోగించి విస్తృతంగా బోధించాలని శ్రీల ప్రభుపాదులు సూచించారు.

  • Srila Prabhupada says we can use everything – television, radio, movies, or whatever there may be – to tell about Krishna.

శ్రీల ప్రభుపాదులు శ్రీ కృష్ణుడి గురించి ప్రపంచానికి తెలిపేందుకు టెలివిజన్, రేడియో, చలనచిత్రాలు వంటివి ఏవైనా సరే, ఆ అన్ని మాధ్యమాలనూ ఉపయోగించాలని తెలిపారు.

  • Srila Prabhupada says that the mass-media can become such an important instrument in spreading our Krishna consciousness movement.

మన శ్రీ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని వ్యాప్తిచేయడంలో అత్యధిక సంఖ్యాక ప్రజలను చేరగలిగిన ప్రసార మాధ్యమాలు ప్రధానమైన సాధనాలు అవుతాయని తెలియచేసారు.

Modern-media, modern opportunities ఆధునిక ప్రసార మాధ్యమాలు - ఆధునిక అవకాశాలు

For Srila Prabhupada, in the 1970's, the terms modern-media and mass-media meant the printing press, radio, TV and movies. Since his departure, the landscape of mass media has dramatically transformed to include Android phones, cloud computing and storage, e-book readers, e-commerce, interactive TV and gaming, online publishing, podcasts and RSS feeds, social networking sites, streaming media services, touch-screen technologies, web-based communications & distribution services and wireless technologies.

1970 లలో శ్రీల ప్రభుపాదులు modern-media మరియు mass-media అనే విషయాలను ముద్రణా రంగం, రేడియో, టెలివిజన్, చలనచిత్రాలు వంటి ప్రసారమాధ్యమాలను దృష్టిలో ఉంచుకుని అనేవారు. కానీ ఆయన నిర్యాణానంతరం నుండి ఈ రోజు వరకూ mass-media ప్రపంచం ఊహించినదానికంటే ఎన్నోరెట్లు ఎక్కువగా తన పరిధిని విస్తృతం చేసుకుంది. ఆండ్రాయిడ్ ఫోన్లు, క్లౌడ్ కంప్యూటింగ్ మరియు స్టోరేజ్, ఈ-బుక్ రీడర్లు, ఈ-కామర్స్, ఇంటరాక్టివ్ TV మరియు గేమింగ్, ఆన్‌లైన్ పబ్లిషింగ్, పాడ్‌కాస్ట్ లు మరియు RSS ఫీడ్స్, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు, స్ట్రీమింగ్ మీడియా సర్వీసెస్, టచ్-స్క్రీన్ టెక్నాలజీ, web-based కమ్యూనికేషన్స్ & డిస్ట్రిబ్యూషన్ సేవలు, wireless టెక్నాలజీస్ వంటివెన్నో maas-media లో అంతర్భాగమైపోయాయి.

In line with Srila Prabhupada's example we are, since 2007, using modern mass media technologies to compile, index, categorize and distribute Srila Prabhupada's Vani.

శ్రీల ప్రభుపాదులు సూచించిన సోదాహరణపూర్వకమైన మార్గాన్ని అనుసరిస్తూ, మనం 2007 సం. నుండి, శ్రీల ప్రభుపాదుల బోధనలన్నింటినీ సంకలనం చేసి, విషయ క్రమానుసారం వర్గీకరించి విస్తృతంగా ప్రపంచానికి అందించడం కోసం మోడర్న్ మాస్ మీడియా టెక్నాలజీస్ ని ఉపయోగిస్తున్నాము.

  • Vanipedia's aim is to increase the visibility and accessibility of Srila Prabhupada's teachings on the web by offering a free, authentic, one-stop resource for

క్రింద తెలిపినటువంటి విభిన్న వర్గాల జిజ్ఞాసువులందరూ శ్రీల ప్రభుపాదుల బోధనలను సులభంగా, ఉచితంగా పొందగలిగేలా ప్రామాణికమైన ఆధ్యాత్మిక వనరుల సమాహారంగా అందించడమే వాణీపీడియా యొక్క లక్ష్యం.

• ISKCON preachers
• ISKCON leaders and managers
• devotees studying devotional courses
• devotees wishing to deepen their knowledge
• devotees involved in inter-faith dialogues
• curriculum developers
• devotees feeling separation from Srila Prabhupada
• executive leaders
• academics
• teachers and students of religious education
• writers
• searchers of spirituality
• people concerned about current social issues
• historians

ISKCON బోధకులు ISKCON నాయకులు మరియు నిర్వహణాధికారులు ఆధ్యాత్మిక విషయాలను అధ్యయనంచేసే భక్తులు ఆధ్యాత్మిక విజ్ఞానపు లోతులు తెలుసుకోవాలనుకునే భక్తులు భిన్నవిధాలైన ఆధ్యాత్మిక విశ్వాసాల సంభాషణల్లో పాల్గొనే భక్తులు బోధనాంశాలను నిర్మించే, విస్తృతం చేసే భక్తులు శ్రీల ప్రభుపాదుల వియోగభావనలో ఉన్న భక్తులు కార్యనిర్వాహక మార్గదర్శులు విద్యావేత్తలు మత సంబంధిత విద్యా బోధకులు మరియు విద్యార్థులు రచయితలు ఆధ్యాత్మిక జిజ్ఞాసువులు వర్తమాన సమాజ సమస్యలపై ఆందోళనగల వ్యక్తులు చరిత్రకారులు

Comment వ్యాఖ్య

There is still more to be done to make Srila Prabhupada's teachings accessible and prominent in the world today. Collaborative web technologies provide us the opportunity to surpass all our previous successes.

నేటి సమకాలీన ప్రపంచం శ్రీల ప్రభుపాదుల బోధనలను మరింత సులభంగా అందుకోగలిగేందుకు మరియు ఆ ఆధ్యాత్మిక జ్ఞానం అత్యంత ప్రాముఖ్యమైనదని గుర్తించేందుకు మనం చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది. నేడు మనకు అందుబాటులో ఉన్న Collaborative Web Technologies ఆధారంగా మనం ఇప్పటివరకూ సాధించిన విజయాల మించిన గొప్ప కార్యాలను సాధించే అవకాశం సుస్పష్టంగా ఉంది.

Vaniseva – the Sacred Act of Serving Srila Prabhupada's Vani వాణీసేవ - శ్రీల ప్రభుపాదుల వాణిని సేవించే పవిత్ర కార్యం

Srila Prabhupada stopped speaking on the 14th of November, 1977, but the Vani he gave us remains ever fresh. However, these teachings are not yet in their pristine condition, nor are all of them readily accessible to his devotees. Srila Prabhupada's followers have a sacred duty to preserve and to distribute his Vani to everyone. We are therefore inviting you to perform this vaniseva.

శ్రీల ప్రభుపాదులు 1977 నవంబరు 14 నుండి మౌనంవహించారు. కానీ ఆయన మాకు ప్రసాదించిన వాణీ మాత్రం నేటికీ నిత్యనూతనంగానే ఉంది. అయినప్పటికీ, ఆయనబోధనలన్నీ వాటియొక్క సహజస్థితిలో ఆయన భక్తులు సులభంగా అందుకోగలిగేలా లభ్యమవడంలేదు. ఆయన బోధనలన్నింటినీ సంరక్షించి, ప్రతిఒక్కరికీ అందేలా విస్తృతపరచడం అనేది శ్రీల ప్రభుపాదుల అనుచరులందరి యొక్క పవిత్ర కర్తవ్యం. అందుకోసం ఈ వాణీసేవ లో భాగస్వాములు కావాలని మిమ్మలనందర్నీ ఆహ్వానిస్తున్నాము.

Always remember that you are one of the few men I have appointed to carry on my work throughout the world and your mission before you is huge. Therefore, always pray to Krishna to give you strength for accomplishing this mission by doing what I am doing. My first business is to give the devotees the proper knowledge and engage them in devotional service, so that is not very difficult task for you, I have given you everything, so read and speak from the books and so many new lights will come out. We have got so many books, so if we go on preaching from them for the next 1,000 years, there is enough stock. – Srila Prabhupada Letter to Satsvarupa das (GBC), 16 June 1972

నా కార్యాన్ని ప్రపంచమంతటా విస్తరించడానికి నేను నియమించిన కొద్దిమంది పురుషులలో మీరూ ఒకరని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. నేనేదైతే చేస్తున్నానో అలానే మీరూ చేయడం ద్వారా ఈ లక్ష్యాన్ని నెరవేర్చడానికి కావలసిన శక్తిని ప్రసాదించమని శ్రీ కృష్ణుడిని సదా ప్రార్ధించండి. నా ప్రముఖమైన కార్యమేమిటంటే, భక్తులకు సరియైన జ్ఞానాన్ని ఇవ్వడం ఇంకా వారిని భక్తియుత సేవలో నిమగ్నం చేయడం, తద్వారా చేయవలసిన కార్యం మీకు కష్టం కాబోదు. నేను మీకు సమస్తమూ సమకూర్చాను, కాబట్టి మీరు పుస్తకాలు చదవండి అందులోని విషయాలను మాట్లాడండి. అప్పుడు మరెన్నో కొత్త జ్యోతులు ఉద్భవిస్తాయి. మనకు ఎన్నో గ్రంధాలు సమకూరాయి, మీరు వాటినుంచి బోధించడం కొనసాగిస్తే రాబోయే వేయి సంవత్సరాల వరకూ కూడా అవి సరిపోతాయి - శ్రీల ప్రభుపాదులు సత్‌స్వరూప దాసు (GBC) కు వ్రాసిన లేఖ నుండి - 16 జూన్ 1972.

In June of 1972 Srila Prabhupada said that "we have got so many books" that we have "enough stock" to preach from for the "next 1,000 years." At that time, only 10 titles had been printed, so with all the extra books that Srila Prabhupada published from July 1972 to November 1977 the number of years of stock could easily be expanded to 5,000. If we add to this his oral instructions and letters, then the stock expands to 10,000 years. We need to expertly prepare all these teachings to be accessed and properly understood so that they can be "preached from" for this whole period of time.

1972 జూన్ లో శ్రీల ప్రభుపాదులు రాబోయే 1,000 సంవత్సరాలకూ బోధించేందుకు "సరిపోయేంత" గా "మనకు అనేక పుస్తకాలు ఉన్నాయి" అని తెలిపారు. ఆ సమయానికి కేవలం 10 శీర్షికలతో మాత్రమే గ్రంథాలు ముద్రించబడి ఉన్నాయి. జులై 1972 నుండి నవంబరు 1977 వరకు శ్రీల ప్రభుపాదులు ప్రచురించిన అదనపు గ్రంథాలన్నింటినీ కలిపి బోధించాలంటే రాబోయే 5,000 సంవత్సరాలకు అవి సరిపోతాయి. ఆయన మౌఖిక బోధనలు, లేఖలు, సంభాషణలు అన్నీ కలిపితే రాబోయే 10,000 సంవత్సరాలకు సరిపోయేంత విజ్ఞానరాశి అవుతుంది. అంత సుదీర్ఘ కాలంపాటు బోధించేందుకు ఆధారం కాగలిగేలా ఆ విజ్ఞాన సర్వస్వం అందుబాటులో ఉండేందుకు మరియు సరిగ్గా అర్ధం చేసుకోబడేందుకు వీలుగా బహురూపాలైన ఆ బోధనలను మనం నేర్పుతో సరియైన విధంగా సిద్ధం చేయాలి.

There is no doubt that Srila Prabhupada has unending enthusiasm and determination to preach the message of Lord Caitanya Mahaprabhu. It does not matter that his vapu has left us. He remains in his teachings, and via the digital platform, he can now preach even more widely than when he was physically present. With complete dependence on Lord Caitanya's mercy, let us embrace Srila Prabhupada's vani-mission, and with more resolve than ever before, expertly prepare his Vani for 10,000 years of preaching.

శ్రీ చైతన్య మహాప్రభువుల సందేశాన్ని బోధించేందుకు శ్రీల ప్రభుపాదులకు అంతులేని ఉత్సాహం మరియు ధృఢ సంకల్పం ఉన్నాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఆయన భౌతికంగా మనతోలేరనే విషయం అప్రాధాన్యం. ఆయన తమ బోధనల రూపంలో సజీవంగా ఉన్నారు. ఈనాటి డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా ఆయన తమ శరీరంతో ఉన్నప్పటికంటే మరింత విస్తృతంగా ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో, అనేక ఆధ్యాత్మిక విషయాలను, అనేక మంది జిజ్ఞాసువులకు ఒకే సమయంలో బోధించగలరు కూడా. అందుకోసం మనం భగవత్స్వరూపులైన శ్రీ చైతన్య మహాప్రభువుల కారుణ్యాన్ని సంపూర్ణంగా శరణుజొచ్చి శ్రీల ప్రభుపాదుల వాణీ యజ్ణాన్ని స్వీకరించి మునుపెన్నడూ లేనంత ధృఢ నిశ్చయంతో రాబోయే 10,000 సంవత్సరాల బోధనకు సరిపోయేట్లుగా ఆయన వాణిని నేర్పుతో సంసిద్ధం చేద్దాము.

Over the past ten years I have given the framework and now we have become more than the British Empire. Even the British Empire was not as expansive as we. They had only a portion of the world, and we have not completed expanding. We must expand more and more unlimitedly. But I must now remind you that I have to complete the translation of the Srimad-Bhagavatam. This is the greatest contribution; our books have given us a respectable position. People have no faith in this church or temple worship. Those days are gone. Of course, we have to maintain the temples as it is necessary to keep our spirits high. Simply intellectualism will not do, there must be practical purification.

మనం లక్ష్య సాధనకు ఆవశ్యకమైన సాధనాల సమన్వయాన్ని గడచిన పదేళ్ళ కాలంలో నేను నిర్మించాను. ఇప్పుడు మనం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మించిపోయాము. బ్రిటిష్ సామ్రాజ్యం కూడా ఈనాడు మనమున్నంత విస్తృతంగా లేదు. ప్రపంచంలోని కొంత భాగం మాత్రమే వాళ్ళది, కానీ మనం విస్తరించడం ఇంకా పూర్తి చేయలేదు. మనం హద్దులు లేకుండా ఇంకా ఇంకా విస్తరించాలి. ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేయదలచినది ఏమంటే, నేను శ్రీమద్భాగవత అనువాదాన్ని పూర్తిచేసి తీరాలి. ఇది అత్యుత్తమమైన కానుక అవుతుంది. మన గ్రంథాలే మనకు గౌరవప్రదమైన స్థానాన్ని ఇచ్చాయి. ఈ చర్చి లేదా ఆలయ ఆరాధనలో ప్రజలకు విశ్వాసం లేదు. ఆ రోజులు వెళ్ళిపోయాయి. కానీ, నిజానికి మనం దేవాలయాలను కొనసాగించాలి. ఎందుకంటే మన మనో భావనలను ఉజ్వలంగా ఉంచేందుకు అవి ఆవశ్యకాలు. కేవలం శుద్ధతర్కజ్ఞానం వల్ల సాధ్యం కాదు, ఆచరణాత్మక అంతఃకరణశుద్ధి జరగాలి.

So I request you to relieve me of management responsibilities more and more so that I can complete the Srimad-Bhagavatam translation. If I am always having to manage, then I cannot do my work on the books. It is document, I have to choose each word very soberly and if I have to think of management then I cannot do this. I cannot be like these rascals who present something mental concoction to cheat the public. So this task will not be finished without the cooperation of my appointed assistants, the GBC, temple presidents, and sannyasis. I have chosen my best men to be GBC and I do not want that the GBC should be disrespectful to the temple presidents. You can naturally consult me, but if the basic principle is weak, how will things go on? So please assist me in the management so that I can be free to finish the Srimad-Bhagavatam which will be our lasting contribution to the world. – Srila Prabhupada Letter to All Governing Body Commissioners, 19 May 1976

కాబట్టి నేను శ్రీమద్భాగవత అనువాదం పూర్తిచేసే అనుకూలత కోసం మీరు నన్ను కార్యనిర్వహణా బాధ్యతలని మరింతగా తగ్గించాలని కోరుతున్నాను. నేను ఎప్పుడూ నిర్వహణా భాధ్యతల్లోనే ఉంటే నా గ్రంథ రచనా కార్యాన్ని నిర్వర్తించలేను. అది ప్రామాణిక గ్రంథం, నేను ప్రతీ పదాన్నీ చాలా అవగాహనతో ఎంచుకోవాలి, అటువంటప్పుడు నేను కార్యనిర్వహణ గురించి ఆలోచించవలసి వస్టే ఈ పనిని పూర్తిచేయలేను. ప్రజలను మోసం చేయడానికి ఏవో మానసిక కల్పనలు ప్రదర్శించే ఈ వంచకులలాగా నేనుండలేను. కాబట్టి నేను నియమించిన సహాయకులు, GBC, ఆలయ అధ్యక్షులు, సన్యాసుల సహకారం లేకుండా నేను ఈ కార్యాన్ని పూర్తిచేయలేను. నేను నా ఉత్తమమైన అనుచరులనే GBC కోసం ఎన్నుకున్నాను. అటువంటి GBC, ఆలయ అధ్యక్షులతో అగౌరవంగా ఉండాలని నేను కోరుకోవడంలేదు. మీరు సహజంగా నన్ను సంప్రదించవచ్చు, కానీ ఒకవేళ ప్రాధమిక సూత్రమే బలహీనంగా ఉంటే, కార్యాలు ఎలా కొనసాగుతాయి? కాబట్టి దయచేసి కార్యనిర్వహణలో నాకు సహాయం చేయ్యండి, తద్వారా నేను శ్రీమద్భాగవతాన్ని స్వేచ్చగా పూర్తిచేయగలుగుతాను. ఇది మనం ప్రపంచానికి అందించే శాశ్వతమైన కానుక అవుతుంది - శ్రీల ప్రభుపాదులు అందరు పాలక మండలి కమీషనర్లకు వ్రాసిన లేఖ నుండి - 19 మే 1976.

Here Srila Prabhupada is stating "this task will not be finished without the cooperation of my appointed assistants" to help him make "our lasting contribution to the world." It is Srila Prabhupada's books that have "given us a respectable position" and they are "the greatest contribution to the world."

పై వ్యక్తీకరణ ద్వారా శ్రీల ప్రభుపాదులు మనకు ఈ విషయాలు తెలియచేస్తున్నారు "నేను నియమించిన సహాయకుల సహకారం లేకుండా నా ఈ కార్యం పూర్తికాదు", శ్రీమద్భాగవత అనువాదం "ప్రపంచానికి మన శాశ్వతమైన కానుక", శ్రీల ప్రభుపాదుల గ్రంథాలు "మనకు గౌరవనీయమైన స్థానాన్ని కల్పించాయి" ఇంకా అవి "ప్రపంచానికి అత్యుత్తమమైన కానుకలు".

Over the years, so much vaniseva has been performed by BBT devotees, book distributors, preachers who have held firmly to Srila Prabhupada's words, and by other devotees who have been dedicated to distribute and preserve his Vani in one way or another. But there is still much more to do. By working together via the technologies of the brhat-brhat-brhat mrdanga (the World Wide Web) we now have an opportunity to build an unparalleled manifestation of Srila Prabhupada's Vani in a very short period of time. Our proposal is to come together in vaniseva and build a Vani-temple to be completed by November 4th, 2027, at which time we will all be celebrating the final 50th anniversary. 50 years of serving Srila Prabhupada in separation. This will be a very appropriate and beautiful offering of love to Srila Prabhupada, and a glorious gift to all the future generations of his devotees.

గడచిన చాలా ఏళ్ళుగా BBT భక్తులు, గ్రంథాలను విస్తృతం చేస్తున్న భక్తులు, శ్రీల ప్రభుపాదుల భావాలను గాఢంగా విశ్వసించి ఆచరిస్తున్న బోధకులు, శ్రీల ప్రభుపాదుల వాణిని వీలైనన్ని విధాలుగా సంరక్షించి విస్తృత పరచేందుకు ప్రత్యేకంగా నియుక్తులైన ఇతర భక్తులు ఇలా ఎన్నో విధాలుగా చాలా గొప్పదైన వాణీసేవను ప్రదర్శించారు. అయినప్పటికీ ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. బృహత్-బృహత్-బృహత్ మృదంగా (World Wide Web) వంటి సాంకేతిక పరిజ్ఞాలను ఉపయోగిస్తూ సమిష్టిగా కృషి చేయడం ద్వారా శ్రీల ప్రభుపాదుల యొక్క వాణిని అతి తక్కువ కాల వ్యవధిలో అసామాన్యమైన రీతిలో వ్యక్తీకరించేదుకు మనకు ఇప్పుడు అవకాశం ఉంది. మా ప్రతిపాదన ఏమిటంటే మనమందరం వాణీసేవలో నియుక్తులమై కలసికట్టుగా పనిచేస్తూ 4 నవంబరు 2027 నాటికి ఒక వాణీ-ఆలయాన్ని నిర్మించాలని. ఆ సమయానికి మనం శ్రీల ప్రభుపాదులతో మనకు ఏర్పడిన 50 వ వియోగ వార్షికోత్సవాన్ని జరుపుకుంటాము. శ్రీల ప్రభుపాదుల నిర్యాణానంతరం 50 సంవత్సరాలు అందించిన సేవ. మనం నిర్మించే ఆ వాణీ-ఆలయం శ్రీల ప్రభుపాదులకు మనం సమర్పించగలిగే సముచితమైన, అందమైన, ప్రేమపూర్వకమైన సేవ అవుతుంది. అంతేకాక ఆయనయొక్క భవిష్యత్తరాల భక్తులకు మనం అందించగలిగే ఓ దివ్యమైన బహుమతి అవుతుంది.

I am glad that you have named your printing press the Radha Press. It is very gratifying. May your Radha Press be enriched in publishing all our books and literatures in the German language. It is a very nice name. Radharani is the best, topmost servitor of Krishna, and the printing machine is the biggest medium at the present moment for serving Krishna. Therefore, it is really a representative of Srimati Radharani. I like the idea very much. – Srila Prabhupada Letter to Jaya Govinda das (Book production manager), 4 July 1969

మీరు మీ ముద్రణాలయానికి రాధా ప్రెస్ అని పేరు పెట్టడం నాకు ఆనందం కలిగించింది, చాలా సంతృప్తిగా ఉంది. మన గ్రంథాలు, సాహిత్యాలను అన్నింటినీ జర్మనీ భాషలో ప్రచురించడంలో మీ రాధా ప్రెస్ సుసంపన్నమగుగాక. ఇది చాలా చక్కటి పేరు. రాధారాణి అత్యుత్తమ, అత్యున్నత శ్రీ కృష్ణ సేవిక, ఇంకా ప్రస్తుత సమయంలో ఈ ముద్రణా యంత్రమే శ్రీ కృష్ణుని సేవకు అతి పెద్ద ఉపకరణం. ఈ విధంగా ఈ యంత్రం నిజంగానే శ్రీమతి రాధారాణి యొక్క ప్రతినిధియే. ఈ ఆలోచన నాకు బాగా నచ్చింది - శ్రీల ప్రభుపాదులు జనగోవింద దాసు (గ్రంథ నిర్మాణ కార్యనిర్వహణాధికారి) కు వ్రాసిన లేఖ నుండి - 4 జులై 1969.

For the better part of the 20th century, the printing press provided the tools for successful propaganda from so many groups of people. Srila Prabhupada stated how expert the communists were to spread their influence in India via the pamphlets and books they distributed. Srila Prabhupada used this example to express how he wanted to make a large propaganda program for Krishna consciousness by distributing his books all over the world.

20 వ శతాబ్దంలో ఎక్కువ భాగం, ముద్రణాలయాలు వివిధ లక్ష్యాలతో ఉన్న ప్రజా సమూహాలు విజయవంతంగా తమ భావాల ప్రచారంచేయడం కోసం అవసరమైన సాధనాలను అందించింది. కమ్యూనిస్ట్‌లు తమ ప్రభావాన్ని భారతదేశంలో విస్తరించడాన్ని కరపత్రాలు ఇంకా పుస్తకాల పంపిణీ ద్వారా తెలివిగా ఎలా సాధించారో శ్రీల ప్రభుపాదులు పేర్కొన్నారు. శ్రీ కృష్ణ చైతన్యాన్ని ప్రపంచమంతటా విస్తరించడానికి తమ పుస్తకాలను విస్తృతంగా పంపిణీ చేయడం ద్వారా ఏవిధంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేపట్టాలో తెలియచేయడానికి శ్రీల ప్రభుపాదులు ఈ ఉదాహరణను ఉపయోగించారు.

Now, in the 21st century, Srila Prabhupada's statement "the biggest medium at the present moment for serving Krishna" can undoubtedly be applied to the exponential and unparalleled power of internet publishing and distribution. In Vanipedia, we are preparing Srila Prabhupada's teachings for proper representation on this modern mass distribution platform. Srila Prabhupada stated that the Radha Press of his devotees in Germany was "really a representative of Srimati Radharani." We are therefore certain that he would consider Vanipedia to be a representative of Srimati Radharani as well.

20 వ శతాబ్దంలో శ్రీల ప్రభుపాదులు వ్యక్తపరచిన "శ్రీ కృష్ణ సేవ చేసేందుకు ప్రస్తుత సమయంలో ఈ ముద్రణా యంత్రాంగమే అతి పెద్ద మాధ్యమం" అనే భావన ఈ 21 వ శతాబ్దంలో Internet లో ప్రచురించి విస్తృతపరచడమనే విశేషమైన, అసామాన్యమైన సాంకేతికశాస్త్ర శక్తికి అన్వయించవచ్చు. ఈ ఆధునిక సామూహిక విస్తరణా వేదిక (modern mass distribution platform) అయిన Internet ఆధారంగానే వాణీపీడియాలో మనం శ్రీల ప్రభుపాదుల బోధనలు సరియైన విధంగా వ్యక్తీకరింపబడేందుకు సిద్ధం చేస్తున్నాము. శ్రీల ప్రభుపాదులు జర్మనీ లోని తమ భక్తుల రాధా ప్రెస్ ను "నిజంగా శ్రీమతి రాధారాణి ప్రతినిధి" అని పేర్కొన్నారు. ఆవిధంగా ఆయన, మనం నిర్మించే ఈ వాణీపీడియా ను కూడా శ్రీమతి రాధారాణి యొక్క ప్రతినిధి గానే పరిగణిస్తారని మేము నిస్సంశయంగా భావిస్తున్నాము.

So many beautiful Vapu-temples have already been built by ISKCON devotees – let us now build at least one glorious Vani-temple. The Vapu-temples offer sacred darshans to the forms of the Lord, and a Vani-temple will offer the sacred darshan to the teachings of the Lord and His pure devotees, as presented by Srila Prabhupada. The work of ISKCON devotees will naturally be more successful when Srila Prabhupada's teachings are situated in their rightful, worshipable position. Now there is a wonderful opportunity for all his current "appointed assistants" to embrace the vani-mission of building his Vani-temple and to inspire the whole movement to participate.

ISKCON భక్తులు ఇప్పటికే ఎన్నో అందమైన వపు-దేవాలయాలను నిర్మించారు - ఇప్పుడు మనం కనీసం ఒక అద్భుతమైన వాణీ-ఆలయాన్ని నిర్మిద్దాం. వపు-దేవాలయాలు భగవంతుని పవిత్ర స్వరూపాల యొక్క దర్శనభాగ్యాన్ని కలుగచేస్తాయి. వాణీ-ఆలయం శ్రీల ప్రభుపాదులు సమర్పించినట్లుగా భగవంతుని యొక్క మరియు ఆయన శుద్ధ భక్తుల యొక్క బోధనల పవిత్ర దర్శనాన్ని అందిస్తుంది. శ్రీల ప్రభుపాదుల బోధనలు సరియైన, ఆరాధనీయమైన స్థితిలో ఉన్నప్పుడు, ISKCON భక్తుల కార్యక్రమాలు సహజంగానే మరింత విజయవంతమవుతాయి. ఆయనచే "నియమించబడిన సహాయకులు" అందరూ ఓ పవిత్ర ఉద్యమంలో పాలుపంచుకున్నట్లుగా ప్రేరేపితులై ఆయన వాణీ-ఆలయాన్ని నిర్మించాలనే వాణీ-యజ్ఞ దీక్షను స్వీకరించి కృషి చేయడానికి ఒక గొప్ప అవకాశం ఉంది.

Just as the enormous and beautiful Vapu-temple rising from the banks of the Ganges in Sridham Mayapur is destined to help spread Lord Caitanya's mercy all over the world, so too can a Vani-temple of Srila Prabhupada's teachings strengthen his ISKCON mission to spread all over the world and establish Srila Prabhupada's natural position for thousands of years to come.

ఏ విధంగా అయితే శ్రీధాం మాయాపూర్ లో గంగానది ఒడ్డున వెలసిఉన్న విశాలమైన మనోహరమైన వపు-దేవాలయం శ్రీ చైతన్య మహాప్రభువు యొక్క కరుణను ప్రపంచమంతటా విస్తరించే కేంద్రంగా విరాజిల్లుతూ ఉందో, అదే విధంగా శ్రీల ప్రభుపాదుల వాణీ-దేవాలయం కూడా ఆయన ISKCON అనే యజ్ఞకార్యాన్ని బలోపేతం చేసి ప్రపంచమంతటా వ్యాప్తిచేసి శ్రీల ప్రభుపాదుల అత్యున్నత సహజ స్థానాన్ని రాబోయే వేలాది సంవత్సరాలకు ఆధ్యాత్మిక దిక్సూచిగా నిస్సంశయంగా నిలబెట్టగలుగుతుంది.

Vaniseva – Taking Practical Action to Serve వాణీసేవ - ఆచరణాత్మక కార్యాన్ని సమర్పించేందుకు సంసిద్ధత

  • Completing Vanipedia means Srila Prabhupada's teachings will be presented in a way that no one has ever done for the works of any spiritual teacher. We invite everyone to take part in this sacred mission. Together we will give Srila Prabhupada a unique exposure to the world on a magnitude only possible via the web.

వాణీపీడియా ను పూర్తి చేయడం అంటే, ఇప్పటివరకూ ఏ ఆధ్యాత్మిక గురువు యొక్క బోధనలూ సంకలనపరచి సంరక్షించి ప్రదర్శించబడని విధంగా శ్రీల ప్రభుపాదుల బోధనామృతాన్ని ప్రపంచానికి అందించడమే. ఈ పవిత్ర యజ్ఞంలో పాలుపంచుకొమ్మని మేము మీ అందరినీ ఆహ్వానిస్తున్నాము. మనమందరం సమిష్టిగా కృషిచేసి శ్రీల ప్రభుపాదుల యొక్క సహజ జగద్గురు స్థానాన్ని ప్రపంచానికి వ్యక్తంచేసేందుకు సాధ్యమయ్యే ఏకైక సాధనం Internet.

  • Our desire is to make Vanipedia the No.1 reference encyclopedia of Srila Prabhupada's teachings in multiple languages. This will only happen with the sincere commitment, sacrifice, and support of many devotees. To date, over 1,220 devotees have participated in building Vanisource and Vaniquotes and translations in 93 languages. Now in order to complete Vaniquotes and build the Vanipedia articles, the Vanibooks, the Vanimedia, and the Vaniversity courses we need more support from devotees with the following skills:

శ్రీల ప్రభుపాదుల బోధనలన్నింటికోసం ఆధారంగా నిలిచే సమగ్ర జ్ఞాన స్వరూపంగా వాణీపీడియా ను అనేకభాషలలో తీర్చిదిద్దాలనేదే మా ఆకాంక్ష. ఎందరో భక్తుల హృదయపూర్వకమైన నిబద్ధత, త్యాగం ఇంకా కృషి వల్లనే ఇదంతా సాధ్యమవుతుంది. ఈరోజు వరకూ 1,220 మంది భక్తులు వాణీ-ఆలయన్ని నిర్మించే కార్యంలో భాగంగా వాణీఆధారాన్ని (vani-source), వాణీఉల్లేఖనాలను (vani-quotes) ఇంకా అనువాదాలను 93 భాషలలో రూపొందించారు. ఇప్పుడు వాణీఉల్లేఖనాలను పూర్తిచేసేందుకు, వాణీపీడియా వ్యాసాలను, వాణీగ్రంథాలను, వాణీమీడియాను, వాణీవిశ్వవిద్యాలయ పాఠ్యాంశాలను నిర్మించేందుకు భక్తుల నుండి ఈ క్రింది నైపుణ్యాలతో కూడిన సహకారం ఎంతో అవసరం

• Administration
• Compiling
• Curriculum Development
• Design and Layout
• Finance
• Management
• Promotion
• Researching
• Server Maintenance
• Site Development
• Software Programming
• Teaching
• Technical Editing
• Training
• Translating
• Writing

పరిపాలన కార్యనిర్వహణ ద్రవ్య సంబంధ పరిజ్ఞానం (Finance) పరిశోధన సంకలనపరచుట (Compiling) అనువాదం వ్రాయడం పాఠ్యప్రణాళిక అభివృద్ధి Web Design and Layout Website Development Software Programming Technical Editing Server Maintenance ప్రచారం బోధన శిక్షణ

  • Vaniservants offer their service from their homes, temples, and offices, or they can join us full-time for certain periods in Sridham Mayapur or Radhadesh.

వాణీసేవకులు తమ సేవలను తమ గృహాలనుండి, దేవాలయాలనుండి ఇంకా కార్యాలయాలనుండి అందిస్తున్నారు. అవకాశం ఉంటే కొంత కాలంపాటు మీరు శ్రీధాం మాయాపూర్ లేదా రాధాదేశ్ లోని దేవాలయాల్లో మాతో చేరి ఉంటూ మీ పూర్తిసమయం వాణీసేవకు నివేదించవచ్చు.

Donating ఆర్ధికసేవ

  • For the past 12 years Vanipedia has been primarily financed by the book distribution from Bhaktivedanta Library Services a.s.b.l. To continue its construction, Vanipedia needs funding beyond the current capacity of BLS. Once completed, Vanipedia will hopefully be sustained by small donations from a percentage of many satisfied visitors. But for now, in order to complete the initial phases of building this free encyclopedia, the service of offering financial support is crucial.

గత 12 సంవత్సరాలుగా వాణీపీడియా నిర్మాణానికి అవసరమైన ద్రవ్య వనరులు ప్రధానంగా భక్తివేదాంత గ్రంథాలయ సేవల (BLS) ద్వారా జరిగే పుస్తక పంపిణీ విభాగం ద్వారా సమకూరుతున్నాయి. వాణీపీడియా నిర్మాణం ఇకపై కొనసాగేందుకు BLS యొక్క ప్రస్తుత సామర్ధ్యానికి మించిన నిధులు అవసరం. పూర్తిగా నిర్మింపబడిన తరువాత, సంతృప్తి చెందిన వాణీపీడియా సందర్శకుల నుండి లభించే కొద్ది పాటి విరాళాల ద్వారా వాణీపీడియా నిర్వహణ కొనసాగగలుగుతుందని ఆశిస్తున్నాము. కానీ, శ్రీల ప్రభుపాదుల బోధనలను ప్రపంచంలోని ప్రజలందరికీ వారు నేర్చుకోగలిగే భాషలలో ఉచితంగా అందించేందుకు వీలుగా "సమగ్ర జ్ఞాన సంగ్రహ" (Encyclopedia) స్వరూపంగా ఈ వాణీపీడియాను పూర్తిగా నిర్మించేందుకు మీరు ఆర్ధిక రూపంలో అందించే సేవ ఎంతో కీలకమైనది.

  • Supporters of Vanipedia can choose from one of the following options

వాణీపీడియాకు ఆర్ధికసేవను అందించతలచేవారు ఈ క్రింది options లలో ఏదైనా ఒక దానిని ఎంచుకోవచ్చు.

Sponsor: A person donating any amount they desire

పోషకులు: తమకు వీలయినంత ఆర్ధికసేవను అందించే వ్యక్తి

Supporting Patron: An individual person or legal entity donating at least 81 euros

సహాయ పోషకులు: కనీసం 81 యూరోలు విరాళాన్నందించే వ్యక్తి లేదా చట్టబద్ధమైన సంస్థ

Sustaining Patron: An individual person or legal entity donating at least 810 euros with the possibility to make 9 monthly payments of 90 euros

కొనసాగించే పోషకులు: కనీసం 810 యూరోలు విరాళాన్నందించే వ్యక్తి లేదా చట్టబద్ధమైన సంస్థ. ఒకేసారి కాకున్నా, ప్రతీ నెలా 90 యూరోల చొప్పున 9 నెలల పాటు విరాళాన్నందించే అవకాశం కూడా ఉంది.

Growth Patron: An individual person or legal entity donating 8,100 euros with the possibility to make 9 yearly payments of 900 euros

వృద్ధి పోషకులు: కనీసం 8,100 యూరోలు విరాళాన్నందించే వ్యక్తి లేదా చట్టబద్ధమైన సంస్థ. ఒకేసారి కాకున్నా, ప్రతీ నెలా 900 యూరోల చొప్పున 9 నెలల పాటు విరాళాన్నందించే అవకాశం కూడా ఉంది.

Foundational Patron: An individual person or legal entity donating 81,000 euros with the possibility to make 9 yearly payments of 9,000 euros

వ్యవస్థాపక పోషకులు: కనీసం 81,000 యూరోలు విరాళాన్నందించే వ్యక్తి లేదా చట్టబద్ధమైన సంస్థ. ఒకేసారి కాకున్నా, ప్రతీ నెలా 9,000 యూరోల చొప్పున 9 నెలల పాటు విరాళాన్నందించే అవకాశం కూడా ఉంది.

మీ విరాళాలను online ద్వారా లేదా [email protected] పేరుతో ఉన్న మా PayPal ఖాతా ద్వారా కూడా అందించవచ్చు. మీరు మరేదైనా పద్ధతిలో మీ విరాళాలను అందించతలచినా లేదా అంతకుముందు ఏదైనా మరింత సమాచారం తెలుసుకోవాలనుకున్నా మమ్మల్ని [email protected] అనే ఈమెయిల్ ఐడి పై సంప్రదించగలరు.

We Are Grateful - Prayers మన కృతజ్ఞతాపూర్వక ప్రార్ధనలు

We Are Grateful

మేము కృతజ్ఞులము

Thank you Srila Prabhupada
for giving us this opportunity to serve you.
We will do our best to please you in your mission.
May your teachings give shelter to millions of fortunate souls.

మిమ్ము సేవించే ఈ అవకాశం మాకొసగినందుకు శ్రీల ప్రభుపాదా మీకు ధన్యవాదాలు మీ ఈ యజ్ఞ కార్యంలో మిమ్ములను సంతోషపరచేందుకు మాశక్తివంచన లేకుండా కృషిచేస్తాము మీ బోధనలు కోట్లాది జిజ్ఞాసువులకు ఆశ్రయమై విరాజిల్లుగాక.


Dear Srila Prabhupada,
please empower us
with all good qualities and abilities
and continue to send us long term
seriously committed devotees and resources
to successfully build your glorious Vani-temple
for the benefit of All.

పూజ్య శ్రీల ప్రభుపాదా దయతో అన్ని సద్గుణాలతో, సామర్థ్యాలతో శక్తివంతులయ్యేలా మమ్ము దీవించండి సకల జనుల స్రేయస్సుకోసం అద్భుతమైన మీ వాణీ-ఆలయాన్ని నిర్మించేందుకు సుదీర్ఘకాలం కృతనిశ్చయంతో సేవనందించే భక్తులను, వనరులనూ మాకు అందించండి


Dear Sri Sri Panca Tattva,
please help us to become dear devotees of Sri Sri Radha Madhava
and dear disciples of Srila Prabhupada and our Guru Maharaja
by continuing to facilitate us to work hard and smart
in the mission of Srila Prabhupada
for the pleasure of his devotees.

ప్రియమైన శ్రీ పంచతత్వా శ్రీ శ్రీ రాధామాధవ ప్రియ భక్తులమయ్యేలా శ్రీల ప్రభుపాదుల మరియు మా గురు మహరాజుల ప్రియ శిష్యులమయ్యేలా, శ్రీల ప్రభుపాదుల భక్తులందరి ఆనందంకోసం ఆయన యజ్ఞంలో చురుకైన తీవ్రమైన కృషిని కొనసాగించగలిగేలా మాకు మీ దీవెనలందించండి.

Thank you for considering these prayers

మా ఈ ప్రార్ధనలను స్వీకరిస్తున్నందుకు కృతజ్ఞతాపూర్వక ప్రణామములు.

Comment వ్యాఖ్య

Only by the empowering grace of Srila Prabhupada, Sri Sri Panca Tattva, and Sri Sri Radha Madhava can we ever hope to achieve this herculean task. Thus we incessantly pray for Their mercy.

ఈ బృహత్ కార్యాన్ని శ్రీల ప్రభుపాదులు, శ్రీ శ్రీ పంచతత్వ మరియు శ్రీ శ్రీ రాధామాధవుల సాధికారిక కృప వల్ల మాత్రమే సాధించగలమని మా విశ్వాసం. అందుకే వారి కరుణకోసం మేము నిరంతరం ప్రార్ధిస్తాము.


ఇతర వనరులు

hare kṛṣṇa hare kṛṣṇa - kṛṣṇa kṛṣṇa hare hare - hare rāma hare rāma - rāma rāma hare hare