TE/Prabhupada 0129 - కృష్ణుని మీద ఆధారపడండి. దేనికీ కొరత ఉండదు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0129 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes -...")
(No difference)

Revision as of 16:42, 28 June 2017




Lecture on SB 7.6.1 -- Vrndavana, December 2, 1975

కృష్ణుడు చెప్పుతునారు man-manā bhava mad-bhakto mad-yājī māṁ namaskuru (BG 9.34). మనము దీనిని ప్రచారము చేస్తున్నాము. ఈ దేవాలయంలో మనం అందరిని అడుగుతున్నాము, ఇక్కడ కృష్ణుడు ఉన్నారు. ఎల్లప్పుడూ కృష్ణుని గురించి ఆలోచించండి. హరే కృష్ణ మంత్రమును జపము చేయండి అప్పుడు మీరు అనుకోవాల్సి ఉంటుంది. "హరే కృష్ణ, హరే కృష్ణ," అంటే కృష్ణుని గురించి ఆలోచించటము. మీరు కృష్ణుని పేరు విన్న వెంటనే మనుమానా ఎవరు చేస్తారు? మద్-భక్త. మీరు కృష్ణుడి భక్తుడు కాకపోతే, మీరు మీ సమయాన్ని వృథా చేయలేరు, "కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ." కేవలం హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తూ వుంటే మీరు కృష్ణుడి భక్తుడు అవుతారు. Man-manā bhava mad-bhakto mad-yājī.

ఇప్పుడు కృష్ణుడి యొక్క . ఆరాధన. రోజంతా కృష్ణుని యొక్క సేవ కోసం maṅgala-āratika, ఉపయోగించబడుతుంది, కృష్ణుని యొక్క నామమును జపము చేయుట కొరకు కృష్ణుడి వంట కోసం, కృష్ణ యొక్క ప్రసాదం పంపిణీ కోసం, చాలా విధాలుగా. ప్రపంచం మొత్తం మీద మన భక్తులు - 102 కేంద్రాలు ఉన్నాయి - వారు కేవలం కృష్ణ చైతన్యములో నిమగ్నమై ఉన్నారు. ఇది మా ప్రచారం, ఎల్లప్పుడూ, ఏ ఇతర పని లేదు. మేము ఎటువంటి ఇతర పని చేయము కాని మేము కనీసం ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాం, ప్రతి నెల ఇరవై ఐదు లక్షల రూపాయలు, కానీ కృష్ణుడు సరఫరా చేస్తున్నారు. Teṣāṁ nityābhiyuktānāṁ yoga-kṣemaṁ vahāmy aham (BG 9.22). మీరు కృష్ణ చైతన్యవంతులు అయినట్లయితే, కృష్ణునిపై పూర్తిగా ఆధారపడి ఉన్నట్లైతే, అప్పుడు కొరత ఉండదు. నేను కృష్ణా చైతన్యమును నలభై రూపాయలతో ప్రారంభించాను. ఇప్పుడు మన దగ్గర నలభై కోట్ల రూపాయలు ఉన్నాయి. నలభై రూపాయలతో ప్రారంభమై పది సంవత్సరాల్లో ప్రపంచం మొత్తంలో ఏ వ్యాపారవేత్త అయిన నలభై కోట్లును సంపాదించగలడా? ఇది ఉదాహరణ కాదు. పదివేలమంది వ్యక్తులు రోజువారీ భోజనం చేస్తున్నారు. ఇది కృష్ణ చైతన్యము. Yoga-kṣemaṁ vahāmy aham (BG 9.22). మీరు కృష్ణ చైతన్యము కలిగి ఉంటే, మీరు ఆయన మీద ఆధారపడతారు నిజాయితీగా పని చేస్తారు అప్పుడు కృష్ణుడు ప్రతిదీ అందజేస్తాడు. ప్రతిదీ. ఇది ఆచరణాత్మకంగా స్పష్టమవుతోంది.

ఉదాహరణకు, బొంబాయిలో, ఇప్పుడు భూమి కోటి రూపాయల విలువ ఉంటుంది. నేను ఈ భూమిని నేను కొనుగోలు చేసినపుడు,నా దగ్గర మూడు లేక నాలుగు లక్షలు వున్నాయి అది పూర్తిగా ఊహాగానాము. నేను నమ్మకముగా వున్నాను. "నేను చెల్లించగలను. కృష్ణుడు నాకు ఇస్తాడు. డబ్బు లేదు. ఆది సుదీర్ఘ చరిత్ర. నేను చర్చించడానికి ఇష్టపడను. కానీ ఇప్పుడు నాకు ఆచరణాత్మక అనుభవం వుంది . మీరు పూర్తిగా కృష్ణుడిపై ఆధారపడి వుంటే - ఏ కొరత ఉండదు. మీకు కావలసినది ఏదిఅయిన, అది నెరవేరుతుంది. Teṣāṁ nityābhiyuktānām. ఎప్పుడూ కృష్ణ చైతన్యములో నిమగ్నమై ఉండండి. అప్పుడు మీకున్న ప్రతి కోరిక నేరవేరుతుంది