TE/Prabhupada 0344 - శ్రీమద్-భాగవతము, కేవలం భక్తితో నిండి ఉన్నది: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0344 - in all Languages Category:TE-Quotes - 1974 Category:TE-Quotes -...")
(No difference)

Revision as of 15:24, 28 August 2017



Lecture on SB 3.26.11-14 -- Bombay, December 23, 1974


వ్యాసదేవుడు, అన్ని వేదముల సాహిత్యం రాయడం తరువాత, అయిన సంతృప్తి చెందలేదు. అయిన నాలుగు వేదాలు వ్రాసాడు,తరువాత పురాణాలు - పురాణాలు అంటే వేదాలకు అనుబంధం అని అర్ధం. ఆ తరువాత వేదాంత-సూత్రా, వేద జ్ఞానము యొక్క చివరి పదం, వేదాంత-సూత్రా. కానీ అతను సంతృప్తి చెందలేదు. తన ఆధ్యాత్మిక గురువు అయిన నారదా ముని, వ్యాసదేవుడిని ఇలా ప్రశ్నించాడు: మానవులకు జ్ఞానము ఇస్తున్నా పుస్తకాలను వ్రాసిన తర్వాత మీరు ఎందుకు అసంతృప్తి చెందుతున్నారు? అందువల్ల అయిన చెప్పారు, "సర్, అవును, నేను రాసినట్లు నాకు తెలుసు ... కాని నాకు సంతృప్తి రావటము లేదు, కారణం ఏమిటో నాకు తెలియదు." అప్పుడు నారద ముని ఇలా అన్నాడు, "అసంతృప్తి ఎందుకంటే మీరు దేవాదిదేవుని యొక్క లీలలను వివరించకపోవడము వలన. అందువలన మీరు సంతృప్తి చెంద లేదు. మీరు కేవలం బాహ్య ఆంశాల గురించి చర్చించారు, కానీ అంతర్గత అంశాల గురించి, మీరు చర్చించలేదు. అందువల్లన మీరు అసంతృప్తి చెందారు. ఇప్పుడు మీరు దీన్ని చేయండి. " వ్యాసదేవుడు, అయిన ఆధ్యాత్మిక గురువు నారద ముని యొక్క ఆదేశాములతో అయిన చివరి పరిపక్వ రచన శ్రీమద్-భాగావతం. Śrīmad-bhāgavatam amalaṁ purāṇaṁ yad vaiṣṇavānāṁ priyam. అందువల్ల వైష్ణవులు, వారు శ్రీమద్-భాగావతమును amalaṁ purāṇam గా భావిస్తారు. Amalaṁ purāṇam అంటే ... Amalam అంటే అర్థం ఏ కాలుష్యం లేకుండా. మిగతా అన్ని ఇతర పురాణాలు, అవి కర్మ, జ్ఞానా, యోగతో నిండి వున్నాయి. అందువలన అవి samalam బౌతిక కాలుష్యం తో, ఉంటాయి. శ్రీమద్-భాగవతముం, కేవలం భక్తితో నిండి ఉన్నాది; అందువలన ఇది అమలం. భక్తి అంటే దేవాదిదేవుడుతో నేరుగా సంబంధం కలిగి ఉండుట, భక్తుడు మరియు భగవoతుడు, లావాదేవి భక్తి. భగవoతుడు ఉన్నారు, భక్తుడు ఉన్నారు. కేవలము యజమాని మరియు సేవకుని వలె . యజమాని సేవకుల మధ్య సంబంధం, లావాదేవి , సేవ.

కావునా మనము సేవను చేయాలి... ఇది మన సహజ, సహజ స్వభావం. మనము సేవ చేస్తున్నాము. కానీ కలుషితమై ఉండటము వలన, ఆ చైతన్యము, citta, ఈ బౌతిక పదార్ధాల ద్వారా కలుషితమైనది, మనము వేరే విధంగా సేవ చేయాలని ప్రయత్నిస్తున్నాము. కొంత మంది కుటుంబానికి, సమాజానికి, వర్గానికి, దేశానికి సేవ చేయాలనీ కోరుకుంటారు, మానవాళికి, మరెన్నో వాటికి,మరెన్నో వాటికి, కానీ ఈ సేవలు అన్ని, అవి కలుషితమైనవి. కానీ మీరు కృష్ణ చైతన్యములో మీ సేవను ప్రారంభించినప్పుడు, ఆది పరిపూర్ణ సేవ. అది పరిపూర్ణ జీవితం. కృష్ణ చైతన్య ఉద్యమం మానవ సమాజమునకు సేవ చేయడానికి, పరిపుర్ణమైన స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ధన్యవాదాలు.