TE/Prabhupada 0869 - జనులు మూర్ఖంగా తీరిక లేకుండా ఉన్నారు. మనము సోమరి తెలివైన వారిని తయారు చేస్తున్నాము: Difference between revisions

(No difference)

Revision as of 05:48, 8 February 2018



750629 - Conversation in Car after Morning Walk - Denver


జనులు మూర్ఖంగా తీరిక లేకుండా ఉన్నారు. మనము సోమరిగా ఉండే తెలివైన వారిని తయారు చేస్తున్నాము.

ప్రభుపాద:...తీరిక లేకుండా ఉండే మూర్ఖుడు చివరి తరగతి వ్యక్తి. ప్రస్తుత క్షణంలో వారు “తీరిక లేకుండా ఉండే మూర్ఖులు.”

తమాల కృష్ణ: వారు సోమరి మూర్ఖుల కంటే అధ్వాన్నంగా వున్నారు. ప్రభుపాద: హుహ్? తమాల కృష్ణ: ఇది సోమరి మూర్ఖత్వం కంటే అధ్వాన్నంగా ఉంది.

ప్రభుపాద: అవును. సోమరి మూర్ఖత్వం మూర్ఖత్వం కానీ అతడు సోమరి, అతడు హాని చేయడు. కానీ తీరిక లేని మూర్ఖుడు హాని కలిగిస్తాడు. ప్రస్తుత క్షణము జనాభా తీరిక లేని మూర్ఖులు. కాబట్టి మనము సోమరి తెలివైన వారు సృష్టిస్తున్నాము. తెలివి గల వ్యక్తి సోమరిగా ఉండాలి, లేకపోతే అతడు తెలివిగా ఎలా పని చేయగలడు, స్థిరబుద్ధితో. అది సరే, నన్ను ఆలోచన చేయనివ్వండి. తెలివైన వ్యక్తి తన నిర్ణయాన్ని సులభంగా ఇస్తాడని మనం ఆశించలేము.

తమాల కృష్ణ: అతడు సోమరి అని పిలువబడతాడు. కానీ అది తమో - గుణం కాదు.

ప్రభుపాద: అది నిగ్రహము. ఆధునిక ధోరణి “తీరిక లేని మూర్ఖులను” సృష్టించటం. కమ్యూనిస్టులు తీరిక లేకుండా మూర్ఖంగా ఉన్నారు.