TE/Prabhupada 0435 - ఈ సకల ప్రాపంచిక సమస్యలచేత మనము కలవరపాటుకు గురవుతున్నాము: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0435 - in all Languages Category:TE-Quotes - 1968 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in USA, Los Angeles]]
[[Category:TE-Quotes - in USA, Los Angeles]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0434 - N’écoutez pas les tricheurs et n’essayez pas de tricher les autres|0434|FR/Prabhupada 0436 - Joyeux en toutes circonstances, et toujours intéressé par la conscience de Krishna|0436}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0434 - మోసగాళ్ల నుండి శ్రవణం చేయవద్దు మరియు ఇతరులను మోసం చేయటానికి ప్రయత్నించవద్దు|0434|TE/Prabhupada 0436 - అతను అన్ని సందర్భల్లోనూ చలాకీగా ఉంటాడు,కృష్ణ చైతన్యములో మాత్రమే ఆసక్తి చూపుతాడు|0436}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|0rQn6rJCrqA|ఈ సకల ప్రాపంచిక సమస్యలచేత మనము కలవరపాటుకు గురవుతున్నాము  <br/>- Prabhupāda 0435}}
{{youtube_right|T-u7EpyWlbc|ఈ సకల ప్రాపంచిక సమస్యలచేత మనము కలవరపాటుకు గురవుతున్నాము  <br/>- Prabhupāda 0435}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 19:28, 8 October 2018



Lecture on BG 2.8-12 -- Los Angeles, November 27, 1968


భక్తుడు: "నా ఇంద్రియాలను ఎండబెట్టే ఈ దుఃఖాన్ని పారద్రోలేందుకు నాకు ఏ మార్గమూ కనిపించడం లేదు. ఈ భూమ్మీద ఎదురులేని రాజ్యాన్ని గెలుచినా కూడా,నేను ఈ దుఃఖాన్ని నశింపజేయ లేకున్నాను, స్వర్గం లో దేవతల వలె సార్వభౌమత్వాన్ని పొందివున్నాకూడా ( BG 2.8) సంజయుడు పలికెను: ఈ విధంగా మట్లాడిన తరువాత, శత్రువులను శిక్షించే అర్జునుడు కృష్ణుడితో, 'గోవింద, నేను యుధ్ధం చేయను,అని పలికి మౌనంగా నిలిచెను ( BG 2.9) ఓ భరత వంశీయుడా, ఆ సమయంలో కృష్ణుడు, ఉభయ సేనల మధ్యలో నవ్వుతూ, దుఃఖంతో బాధపడుతున్న అర్జునుడితో ఈవిధంగా పలికెను( BG 2.10) భగవంతుడు పలికెను ... "

ప్రభుపాద: మనము ప్రమాదకరమైన స్థితిలో వున్నపుడు చాలా గంభీరంగా మారిపోతాము, మనము ఏదో పోగొట్టుకున్నట్లుగా వుంటాము, కానీ కృష్ణుడు నవ్వుతున్నాడు. మీరు గమనించారా? కొన్నిసార్లు మనం ... ఇది భ్రాంతి అనుకుంటాము. దానికి ఉదాహరణ, స్వప్నం లో వున్న వ్యక్తి"పులి ఉంది, అక్కడ పులి ఉంది, అది నన్ను తినేస్తోంది" అని రోదిస్తాడు. మరియు మేలుకువలో వున్న వ్యక్తి, అతను, "పులి ఎక్కడ ఉంది? పులి ఎక్కడ ఉంది?"అని నవ్వుతాడు. అయితే నిద్రలోని వ్యక్తి , "పులి, పులి, పులి."అని రోదిస్తున్నాడు. అదేవిధంగా, మనము చాలా కలవరపడుతున్నప్పుడు ... ఎలాగంటే రాజకీయ నాయకులు వలె, వారు కొన్నిసార్లు రాజకీయ పరిస్థితులలో కలవరపడతారు. ఇది నా భూమి, నా దేశం, అని తన హక్కుగా చెప్పుకుంటారు. మరియు ఇతర పక్షము వారు కూడా "ఇది నా భూమి, నా దేశం" అని తమ హక్కుగా చెప్పుకుంటారు. మరియు వారు చాలా తీవ్రంగా పోరాడతారు. కృష్ణుడు నవ్వుతున్నాడు. "నా దేశం, నా భూమి 'అని ఈ అర్ధంలేని మాటలు ఏమిటి? ఇది నా భూమి అని ఒకరు అంటే, మరొకరు 'నా భూమి' అని చెప్పుకుంటారు పోరాటాలు చేస్తారు. " వాస్తవానికి, ఈ భూమి కృష్ణుడికి చెందినది, కానీ ఈ ప్రజలు భ్రాంతితో, ఇది నా భూమి , నా దేశం, అని చెప్పుకుంటారు ఈ భూమికి లేదా ఆ దేశానికి చెందిన వారిగా ఎంతకాలం వుంటారో మర్చిపోతారు. దానినే భ్రాంతి అంటారు.

కాబట్టి ఇది మన పరిస్థితి. మన వాస్తవమైన స్థితిని అవగాహన చేసుకోకుండా మనము ఈ ప్రాపంచిక సమస్యలతో కలవరపడుతున్నాము, ఇవన్నీ అవాస్తవమైనవి. Janasya moho 'yam ahaṁ mameti ( SB 5.5.8) మోహం, మోహం అంటే భ్రాంతి.అదే భ్రమ. అందరూ ఈ భ్రమలో ఉన్నారు. కాబట్టి ఎవరైతే తెలివైన వ్యక్తి, అతను ఈ ప్రాపంచిక పరిస్థితులు కేవలం భ్రమ అని అర్థం చేసుకుంటాడు ... నేను మరియు "నాది" అనే సూత్రం ఆధారంగా, నేను కల్పించుకున్న అన్ని ఆలోచనలు అవన్నీ భ్రమలు. కాబట్టి ఒకరు,ఎవరైనా భ్రాంతి నుండి బయటపడే తెలివి కలిగివున్నప్పుడు, అతను ఒక ఆధ్యాత్మిక గురువుకు శరణాగతి పొందుతాడు. అది అర్జునుడిచే ఉదహరించబడింది. అతను చాలా కలవరపడ్డప్పుడు ... అతను కృష్ణుడితో స్నేహంగా మాట్లాడుతున్నాడు, కానీ అతను గమనించాడు ఈ స్నేహపూర్వక సంభాషణ వలన నా సమస్య పరిష్కరించబడదు. అతను కృష్ణుడిని ఎన్నుకున్నాడు, ఎందుకంటే అతనికి కృష్ణుడి విలువ తెలుసు. కనీసం, అతనికి తెలిసుకొని ఉండాలి. అతను స్నేహితుడు. అతనికి తెలుసు కృష్ణుడు అంగీకరించాడు ... "అతను నా స్నేహితుడు గా ప్రవర్తిస్తున్నప్పటికీ, కానీ గొప్ప ప్రామాణీకులచే కృష్ణుడు దేవాది దేవుడుగా అంగీకరించారు. " అది అర్జునుడికి తెలుసు. అందువల్ల అతను ఇలా చెప్పాడు, "నేను పూర్తిగా నిశ్చేస్టుడనై ఉన్నాను కాబట్టి ఏమీ గ్రహించలేకున్నాను. నేను ఈ యుద్ధంలో విజయము సాధించినా కూడా, అయినప్పటికీ నేను సంతోషంగా ఉండజాలను. ఈ భూమండలం యొక్క విజయప్రాప్తే కాదు, నేను సర్వలోకాధిపత్యమును సాధించినప్పటికీ లేక నేను ఉన్నత లోకాలలో దేవతాస్థానాన్ని పొందినప్పటికీ, అప్పటికీ ఈ నా విచారం తొలగింపబడదు. "