TE/Prabhupada 0938 - యేసుక్రీస్తు,అతనిలో తప్పు లేదు భగవంతుడు గురించి ప్రచారము చేయటమే ఆయన యొక్క ఏకైక దోషము: Difference between revisions

 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 9: Line 9:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0937 - Le corbeau n'ira pas à le cygne. Le cygne n'ira pas à Le corbeau|0937|FR/Prabhupada 0939 - Personne ne va se marier au mari qui a épousé Soixante-quatre fois|0939}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0937 - కాకి హంస దగ్గరకు వెళ్లదు. హంస కాకి దగ్గరకి వెళ్లదు|0937|TE/Prabhupada 0939 - అరవై నాలుగు సార్లు వివాహం చేసుకున్న భర్తను ఎవరూ వివాహం చేసుకోరు|0939}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 20: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|yy5xyUZ5A_8|యేసుక్రీస్తు,అతనిలో తప్పు లేదు భగవంతుడు గురించి ప్రచారము చేయటమే ఆయన యొక్క ఏకైక దోషము  <br/>- Prabhupāda 0938}}
{{youtube_right|IZQsTASjsTo|యేసుక్రీస్తు,అతనిలో తప్పు లేదు భగవంతుడు గురించి ప్రచారము చేయటమే ఆయన యొక్క ఏకైక దోషము  <br/>- Prabhupāda 0938}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:38, 1 October 2020



730425 - Lecture SB 01.08.33 - Los Angeles


యేసుక్రీస్తు,అతనిలో తప్పు లేదు. భగవంతుడు గురించి ప్రచారము చేయటమే ఆయన యొక్క ఏకైక దోషము

ప్రభుపాద: ఒక వ్యక్తుల తరగతి ఉన్నారు, వారిని అసురులు అంటారు. వారు sura-dviṣām. వారు ఎల్లప్పుడూ భక్తుల పట్ల అసూయపడేవారు. వారిని రాక్షసులు అని పిలుస్తారు. ఉదాహరణకు ప్రహ్లాద మహారాజు మరియు ఆయన తండ్రి హిరణ్యకశిపుని లాగానే. ప్రహ్లాద మహారాజు యొక్క తండ్రి హిరణ్యకశిపుడు, కానీ ప్రహ్లాద మహారాజు భక్తుడవటము వలన, అతను అసూయపడినాడు. అది రాక్షసుల స్వభావం. చాలా అసూయ, ఎంతంటే, అతను తన కుమారుని చంపడానికి సిద్ధపడ్డాడు. ఆ చిన్న పిల్లవాడి ఏకైక తప్పు, హరే కృష్ణ కీర్తన చేస్తున్నాడు. అది ఆయన తప్పు. తండ్రి చేయలేకపోయాడు... అందువల్ల వారిని sura-dviṣām అని పిలుస్తారు, భక్తుల పట్ల ఎల్లప్పుడూ అసూయపడేవారు. రాక్షసులు అంటే భక్తుల పట్ల ఎల్లప్పుడూ అసూయపడే వారు అని అర్థం. ఈ భౌతిక ప్రపంచం చాలా బాధ కలిగించే ప్రదేశము.

మీకు చాలా మంచి ఉదాహరణ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు క్రీస్తు లాగానే. ఆయన తప్పు ఏమిటి? కానీ sura-dviṣām, అసూయపడే వ్యక్తులు అతన్ని చంపారు. మనము కనుగొంటే, మనము విశ్లేషించి ఉంటే, యేసు క్రీస్తు యొక్క తప్పు ఏమిటి, ఏ తప్పు లేదు. భగవంతుడు గురించి ప్రచారము చేయటము ఏకైక తప్పు. ఇంకా అయినప్పటికి ఆయన చాలా శత్రువులను కలిగి ఉన్నాడు. ఆయనను క్రూరత్వంతో శిలువ వేశారు. కాబట్టి మీరు దీనిని ఎల్లప్పుడూ చూస్తారు, sura-dviṣām. కాబట్టి ఈ కృష్ణుడు ఈ sura-dviṣām ను చంపడానికి వస్తాడు. అందువలన vadhāya ca sura-dviṣām. ఈ అసూయపడే వ్యక్తులు చంపబడ్డారు.

కానీ ఈ చంపే పనులను కృష్ణుడు లేకుండా కూడా చేయవచ్చు. ఎందుకంటే చాలా సహజ శక్తులు ఉన్నాయి, యుద్ధం, తెగులు, కరువు. ఏదైనా. కేవలము వాటిని అమలు చేస్తే. లక్షల మంది ప్రజలు చంపబడతారు. కాబట్టి ఈ దుష్టులను చంపడానికి కృష్ణుడు ఇక్కడకు రావలసిన అవసరము లేదు. వారిని కృష్ణుడి నిర్ధేశముతో, ప్రకృతి యొక్క చట్టం వలన చంపబడవచ్చు. Prakṛteḥ kriyamāṇāni guṇaiḥ karmāṇi sarvaśaḥ ( BG 3.27)

Sṛṣṭi-sthiti-pralaya-sādhana-śaktir ekā (BS 5.44). ప్రకృతి చాలా శక్తిని కలిగి ఉంది, అది సృష్టించగలదు అది నిర్వహించగలదు, అది నాశనము చేయగలదు, ప్రతిదానినీ. ప్రకృతి చాలా శక్తివంతమైనది. సృష్టి - స్థితి - ప్రళయ. సృష్టి అంటే సృష్టించడము, స్థితి అంటే నిర్వహణ, ప్రళయ అంటే నాశనం. ఈ మూడు విషయాలు ప్రకృతి చేయగలదు ఉదాహరణకు ఈ సృష్టి వలె, భౌతిక సృష్టి అనేది సహజమైనది, ప్రకృతి, విశ్వము. ఇది నిర్వహించబడుతుంది. ప్రకృతి దయ ద్వారా, మనము సూర్యకాంతి పొందుతున్నాము, మనము గాలిని పొందుతున్నాము, మనకు వర్షాలు వస్తున్నాయి మరియు తద్వారా మనము మన ఆహారం పండించుకుంటున్నాము, చక్కగా తినడం, చక్కగా పెరగటము. ఈ నిర్వహణ కూడా ప్రకృతిచే చేయబడుతుంది. కానీ ఏ సమయంలో అయినా ఒక బలమైన గాలి ద్వారా ప్రతీదీ నాశనము అవుతుంది ప్రకృతి చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ రాక్షసులను చంపడానికి, ప్రకృతి ఇప్పటికే ఉంది. వాస్తవానికి, కృష్ణుడి దర్శకత్వంలో ప్రకృతి పనిచేస్తోంది. Mayādhyakṣeṇa prakṛtiḥ sūyate sa-carācaram ( BG 9.10) ఈ రాక్షసులు చంపబడవలెను అని కృష్ణుడు చెప్పినట్లయితే, ప్రకృతి యొక్క ఒక పేలుడు, ఒక బలమైన గాలి, వారిని మిలియన్ల మందిని చంపగలదు

అందువలన కృష్ణుడు ఆ ప్రయోజనము కోసము రావలసిన అవసరం లేదు. అయితే ఇక్కడకు కృష్ణుడు వస్తాడు, ఆ: yācita. కృష్ణుడు వసుదేవుడు మరియు దేవకి వంటి భక్తులు కోరినప్పుడు ఆయన వస్తాడు. అది ఆయన రావడము. అది ఆయన రావటమునకు కారణము. ఆయన వచ్చినప్పుడు ఏకకాలంలో ఆయన దీనిని కూడా చూపెడుతాడు, నా భక్తుల పట్ల అసూయపడే వారిని ఎవరినైనా నేను వారిని చంపుతాను, నేను వారిని చంపుతాను. వాస్తవానికి, ఆయన చంపడం పోషించడము, అది ఒకే విషయము. ఆయన సంపూర్ణుడు. కృష్ణుడిచే చంపబడినవారు, వారు వెంటనే మోక్షాన్ని పొందుతారు, అది రావడానికి లక్షలాది సంవత్సరాలు అవసరం. అందువలన ప్రజలు కృష్ణుడు ఈ ప్రయోజనము కోసం లేదా ఆ ప్రయోజనము కోసం వచ్చారని చెప్తారు, కానీ వాస్తవానికి కృష్ణుడు భక్తుల ప్రయోజనము కోసము వస్తాడు, క్షేమయా. క్షేమయా యొక్క అర్థం ఏమిటి? నిర్వహణ కోసం

భక్తుడు: "శ్రేయస్సు కోసం."

ప్రభుపాద: శ్రేయస్సు కోసం. భక్తుల మంచి కోసం. భక్తుల మంచి కోసము ఆయన ఎప్పుడూ చూస్తూ ఉంటాడు.అందువలన కుంతీ దేవి యొక్క ఈ సూచనల ద్వారా, మన కర్తవ్యము ఎప్పుడూ ఎలా భక్తుడుగా మారాలి. అప్పుడు అన్ని మంచి లక్షణాలు మనకు వస్తాయి. Yasyāsti bhaktir bhagavaty akiñcanā sarvair guṇais tatra samāsate surāḥ ( SB 5.18.12) మీరు కేవలం మీ భక్తిని, నిద్రాణమైన భక్తిని, సహజ భక్తిని పెంపొందించుకుంటే... మనకు సహజ భక్తి ఉంది.

ఉదాహరణకు తండ్రి కొడుకులాగానే, అక్కడ సహజ ప్రేమ ఉంది. కుమారుడికి తండ్రి పట్ల తల్లి పట్ల సహజ భక్తి ఉంది. అదేవిధముగా,మనకు మన సహజ భక్తి ఉంది. మనము వాస్తవమునకు ప్రమాదంలో ఉన్నప్పుడు, శాస్త్రవేత్తలు కూడా, వారు కూడా భగవంతుడికి ప్రార్థిస్తారు. కానీ వారు ప్రమాదంలో లేనప్పుడు, వారు భగవంతుణ్ణి తిరస్కరిస్తారు. అందువల్ల భగవంతుడు ఉన్నాడని ఈ మూర్ఖులకు నేర్పడానికి ప్రమాదము అవసరం. కాబట్టి అది సహజమైనది.Jīvera svarūpa haya nitya-kṛṣṇa-dāsa ( CC Madhya 20.108-109) అది మన సహజమైన... కృత్రిమంగా మనము భగవంతుడుని బహిష్కరించటానికి ప్రయత్నిస్తున్నాము. భగవంతుడు చనిపోయాడు, భగవంతుడు లేడు, నేను భగవంతుడను, ఈ భగవంతుడు, ఆ భగవంతుడు ఈ మూర్ఖత్వమును మనము వదిలివేయాలి. అప్పుడు కృష్ణుడిచే మనకు రక్షణ అని విధాలుగా లభిస్తుంది.

చాలా ధన్యవాదాలు.

భక్తులు: జయ ప్రభుపాద, హరిబోల్!