TE/Prabhupada 1003 - భగవంతుని దగ్గరకు వచ్చారు భగవంతుడు ఆధ్యాత్మికము ఒక వ్యక్తి భౌతిక లాభము అడుగుతున్నాడు: Difference between revisions

 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 9: Line 9:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 1002 - Si j'aime Dieu pour quelque profit, ce sont les affaires; cela n'est pas l'amour|1002|FR/Prabhupada 1004 - Travailler comme des chiens et des chats et mourrir. Cela n'est pas de l'intelligence|1004}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 1002 - నేను కొంత లాభము కోసం భగవంతుణ్ణి ప్రేమిస్తే, అది వ్యాపారము అవుతుంది; అది ప్రేమ కాదు|1002|TE/Prabhupada 1004 - పిల్లులు కుక్కల వలె పని చేయడము మరియు చనిపోవడము ఇది తెలివి కాదు|1004}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 20: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|PgwK8khbYCc|భగవంతుని దగ్గరకు వచ్చారు భగవంతుడు ఆధ్యాత్మికము ఒక వ్యక్తి భౌతిక లాభము అడుగుతున్నాడు  <br/>- Prabhupāda 1003}}
{{youtube_right|Oj0PTzysE6c|భగవంతుని దగ్గరకు వచ్చారు భగవంతుడు ఆధ్యాత్మికము ఒక వ్యక్తి భౌతిక లాభము అడుగుతున్నాడు  <br/>- Prabhupāda 1003}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:45, 1 October 2020



750713 - Conversation B - Philadelphia


భగవంతుని దగ్గరకు వచ్చారు, భగవంతుడు ఆధ్యాత్మికము, కానీ ఒక వ్యక్తి భౌతిక లాభము కోసము అడుగుతున్నాడు

శాండీ నిక్సన్: ఒకరు భగవంతుణ్ణి ప్రేమించడమును నేర్చుకునే వేర్వేరు మార్గాలు ఉన్నాయా?

ప్రభుపాద: లేదు, అది వేరు కాదు.

శాండీ నిక్సన్: నా ఉద్దేశ్యం, ఇతర ఆధ్యాత్మిక మార్గాలు ఉన్నాయా... అన్ని ఆధ్యాత్మిక మార్గాలు ఒకే ముగింపునకు దారి తీస్తాయా?

ప్రభుపాద: ఆధ్యాత్మిక మార్గాలు నాలుగుగా విభజించబడ్డాయి. ఆధ్యాత్మికం కాదు. వాస్తవ ఆధ్యాత్మికం, మిశ్రమ ఆధ్యాత్మికం. ఉదాహరణకు, "భగవంతుడా, మా దైనందిన రొట్టె మాకు ఇవ్వండి." ఇది మిశ్రమ ఆధ్యాత్మికం. భగవంతుని దగ్గరకు వచ్చినాడు, భగవంతుడు ఆధ్యాత్మికుడు, కానీ ఒక వ్యక్తి భౌతిక లాభం కోసం అడుగుతున్నాడు. కాబట్టి ఇది మిశ్రమం, పదార్ధము మరియు ఆత్మ. కాబట్టి నాలుగు తరగతుల వారు ఉన్నారు. సాధారణంగా వారిని కర్మి , ఫలాపేక్ష ఆశించే వారు అని పిలుస్తారు, వారు కొంత భౌతిక లాభమును పొందడానికి పని చేస్తారు. వారిని కర్మి అని పిలుస్తారు. ఉదాహరణకు అందరు వ్యక్తుల వలె, మీరు చూస్తారు, వారు చాలా కష్టపడి పగలు రాత్రి పని చేస్తారు, వారు వారి కార్లను నడుపుతూ, (కార్ల శబ్దం చేస్తున్నారు) ఈ దారిలో మరియు ఆ దారిలో. ప్రయోజనము ఎలా కొంత డబ్బు తెచ్చుకోవటము. దీనిని కర్మి అంటారు. ఆపై జ్ఞాని. జ్ఞాని అంటే ఆయనకు తెలుసు, "నేను చాలా కష్టపడుతున్నాను ఎందుకు? పక్షులు, జంతువులు, ఏనుగులు, పెద్ద పెద్దవి - ఎనిమిది మిలియన్ల విభిన్న రకాలు - అవి పడటము లేదు వాటికి పని లేదు. వాటికి వృత్తి లేదు. అవి ఎలా తింటున్నాయి? ఎందుకు అనవసరంగా నేను చాలా పని చేస్తున్నాను? నా జీవిత సమస్య ఏమిటో నన్ను తెలుసుకోనివ్వండి. " కాబట్టి వారు జీవితము యొక్క సమస్య జన్మ, మరణం, వృద్ధాప్యం మరియు వ్యాధి అని అర్థం చేసుకుంటారు. అది పరిష్కరించుకోవాలని కోరుకుంటారు. వారు అమరులు ఎలా అవ్వాలని కాబట్టి వారు "నేను భగవంతుని ఉనికిలో విలీనం అయితే, అప్పుడు నేను అమరత్వం పొందుతాను లేదా జన్మ, మరణం, వృద్ధాప్యం వ్యాధి నుండి విముక్తుడిని అవ్వుతాను." ఇతనిని జ్ఞాని అని పిలుస్తారు. వారిలో కొందరు యోగులు. వారు కొంత ఆధ్యాత్మిక శక్తిని పొందేందుకు ప్రయత్నిస్తారు ఆయన ఎలా అద్భుతమును చేయగలడో చూపెట్టు కోవడానికి. యోగి చాలా చిన్న వాడు కావచ్చు. మీరు ఆయనని ఒక గదిలో ఉంచితే, ఆయన బయటకు వస్తారు. మీరు దానికి తాళము వేయండి. ఆయన బయటకు వస్తాడు. చిన్న ఖాళీ ఉన్నా, ఆయన బయటకు వస్తాడు. దానిని అనిమా అని అంటారు. ఆయన ఆకాశంలో ఎగురగలడు, ఆకాశంలో తేలగలడు. దీనిని లఘిమా అని పిలుస్తారు. ఈ విధముగా, ఎవరైనా ఈ ఇంద్రజాలమును ప్రదర్శిస్తే, వెంటనే ఆయనను చాలా అద్భుతమైన మనిషిగా అంగీకరిస్తారు కావున యోగులు, వారు... ఆధునిక యోగులు, వారు కేవలం కొంత ఆసనములను చూపిస్తారు, కానీ వారికి శక్తి లేదు. నేను ఈ మూడవ తరగతి యోగుల గురించి మాట్లాడటం లేదు. వాస్తవ యోగి అంటే అర్థం ఆయనకు కొంత శక్తి ఉంది. అది భౌతిక శక్తి. కాబట్టి యోగులు కూడా ఈ శక్తిని కోరుకుంటారు. అనవసరమైన పనులు గాడిదల వలె చేయడము నుండి మోక్షమును జ్ఞానులు కోరుకుంటారు. కర్మిల వలె కర్మిలకు కొంత భౌతిక లాభం కావాలి. కాబట్టి వారికి ప్రతి ఒక్కరూ కావాలి. కానీ భక్తులు, భక్తులు, వారికి ఏదీ అవసరం లేదు. వారు ప్రేమతో భగవంతుని సేవించాలి అని అనుకుంటారు. ఉదాహరణకు ఒక తల్లి తన పిల్ల వాడును ప్రేమిస్తున్నట్లే. లాభం గురించి ఏ ప్రశ్న లేదు. ఆప్యాయత వలన, ఆమె ప్రేమిస్తుంది. కాబట్టి మీరు ఆ దశకు వచ్చినప్పుడు, భగవంతుని ప్రేమించుటకు, అది పరిపూర్ణము. కాబట్టి ఈ విభిన్న పద్ధతులు, కర్మి, జ్ఞాని, యోగి మరియు భక్తుడు, ఈ నాలుగు పద్ధతులలో, మీరు భగవంతుని తెలుసుకోవాలంటే, అప్పుడు మీరు ఈ భక్తిని అంగీకరించాలి. ఇది భగవద్గీత లో చెప్పబడినది , bhaktyā mām abhijānāti ( BG 18.55) కేవలం భక్తి యొక్క పద్ధతి ద్వారా, నన్ను అర్థం చేసుకోవచ్చు, భగవంతుడిని. ఆయన ఇతర పద్ధతుల ద్వారా అని ఎన్నడూ చెప్పలేదు, లేదు. భక్తి ద్వారా మాత్రమే. మీరు భగవంతుని గురించి తెలుసుకోవాలని ఆయనను ప్రేమించుటకు ఆసక్తి కలిగి ఉంటే, అప్పుడు మీరు ఈ భక్తి పద్ధతిని అంగీకరించాలి. ఏ ఇతర పద్ధతి మీకు సహాయం చేయదు.