TE/Prabhupada 1009 - ఆధ్యాత్మికగురువును భగవంతుని వలె గౌరవిస్తే ఆయనకు భగవంతునికి ఇచ్చే సౌకర్యాలను ఇవ్వాలి: Difference between revisions

 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 9: Line 9:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 1008 - Mon Guru Maharaja m'a ordonné, "allez et prêcher ce culte dans les pays occidentaux"|1008|FR/Prabhupada 1010 - Vous pouvez voir le bois, la pierre. Vous ne pouvez pas voir ce qui est l'esprit|1010}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 1008 - నా గురు మహారాజా నన్ను ఆదేశించారు పాశ్చాత్య దేశాలలో ఈ సంప్రదాయాన్ని ప్రచారము చేయండి|1008|TE/Prabhupada 1010 - మీరు చెక్కను, రాయిని చూస్తారు. మీరు ఆత్మ అంటే ఏమిటో చూడలేరు|1010}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 20: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|Yp0HlIDchFY|ఆధ్యాత్మిక  గురువును భగవంతుని వలె గౌరవిస్తే ఆయనకు భగవంతునికి ఇచ్చే సౌకర్యాలను ఇవ్వాలి  <br/>- Prabhupāda 1009}}
{{youtube_right|hemitCViDHY|ఆధ్యాత్మిక  గురువును భగవంతుని వలె గౌరవిస్తే ఆయనకు భగవంతునికి ఇచ్చే సౌకర్యాలను ఇవ్వాలి  <br/>- Prabhupāda 1009}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:45, 1 October 2020



750713 - Conversation B - Philadelphia


మీరు ఆధ్యాత్మిక గురువును భగవంతుని వలె గౌరవిస్తే, మీరు ఆయనకు భగవంతునికి ఇచ్చే సౌకర్యాలను ఇవ్వాలి

అన్నే జాక్సన్: మీరు చాలా చిన్నవారు అని మీరు చెప్పారు. మీరు భగవంతుడు కాదు, అయినా, భక్తులు మిమ్మల్ని భగవంతునిగా భావిస్తున్నారని బయట వానిగా నాకు కనిపిస్తుంది.

ప్రభుపాద: అవును, అది భక్తుని కర్తవ్యము. కేవలం ఒక ప్రభుత్వ అధికారి వలె. వ్యక్తిగతంగా ఆయన చాలా ముఖ్యమైన వాడు కాదు, కానీ ఎంత కాలము ఆయన ప్రభుత్వ ఉత్తర్వును అమలు చేస్తాడో, ఆయనను ప్రభుత్వంగా గౌరవించాలి. అది పద్ధతి. ఒక సాధారణ పోలీసు వచ్చినా కూడా, మీరు ఆయనను గౌరవించాలి ఎందుకంటే ఆయన ఒక ప్రభుత్వ మనిషి కనుక కానీ దాని అర్థం ఆయన ప్రభుత్వం కాదు. ఆయన గౌరవించబడతాడు. Sākṣād-dharitvena samasta-śāstrair uktas tathā bhāvyata eva sadbhiḥ. ఆ మనిషి భావిస్తే "నేను ప్రభుత్వాన్ని అయ్యాను, ప్రజలు నన్ను గౌరవిస్తున్నారు," అప్పుడు ఆయన వెర్రివాడు. కానీ... కానీ మర్యాద ఉంది. ప్రభుత్వాధికారి వచ్చినట్లయితే, అతన్ని ప్రభుత్వము వలె గౌరవించాలి.

అన్నే జాక్సన్: అదే ఆలోచన, నేను అనేక అందమైన వస్తువుల గురించి కూడా ఆశ్చర్యపోతున్నాను, భక్తులు మీ దగ్గరకు తీసుకుని వస్తారు, ఉదాహరణకు, మీరు విమానాశ్రయం నుండి బయలుదేరినప్పుడు, మీరు ఒక అందమైన, గొప్ప, ఫాన్సీ కారులో వెళ్ళారు, నేను దీని గురించి ఆశ్చర్యపోతున్నాను ఎందుకంటే...

ప్రభుపాద: ఇది ఎలా గౌరవించాలో వారికి భోదించడము. మీరు ప్రభుత్వ మనిషిని ప్రభుత్వము వలె గౌరవిస్తే, అప్పుడు మీరు ఆయనని ఆ విధముగా చూసుకోవాలి.

అన్నే జాక్సన్: కానీ...

ప్రభుపాద: మీరు ఆధ్యాత్మిక గురువును భగవంతుని వలె గౌరవిస్తే, అప్పుడు మీరు అతనికి భగవంతునికి కల్పించే అన్ని సౌకర్యాలను అందించాలి. లేకపోతే మీరు భగవంతుణ్ణి ఎలా చూసుకుంటారు? కేవలం మనసులోనా? కార్యక్రమాలలో కూడా.

అన్నే జాక్సన్: నన్ను క్షమించండి. మీరు చివరగా చెప్పినది ఏమిటి?

ప్రభుపాద: ఆధ్యాత్మిక గురువును భగవంతునిగా పరిగణిస్తే, కావున అతను చూపెట్టాలి, ఆచరణాత్మకముగా చూపెట్టాలి, అతనిని భగవంతుని వలె చూసుకుంటున్నాడు అని కాబట్టి భగవంతుడు బంగారు కారులో ప్రయాణిస్తాడు. అయితే ఆధ్యాత్మిక గురువుకు సాధారణ మోటారు కార్ ను ఇస్తే, కాబట్టి అది సరిపోదు, ఎందుకనగా ఆయనను భగవంతుని వలె పరిగణించవలసి ఉంటుంది. భగవంతునికి ఈ మోటారు కారు ఏమిటి? (నవ్వు) అది సరిపోదు . భగవంతుడు మీ ఇంటికి వచ్చినట్లయితే, మీరు అతన్ని సామాన్య మోటారు కారులో తీసుకువస్తారా లేదా మీరు ఆయనని భగవంతునిగా పరిగణించినట్లయితే, ఒక బంగారు కారును మీరు ఏర్పాటు చేస్తారా? మీ విషయము ఏమిటంటే వారు నాకు మంచి మోటారు కారును ఏర్పాటు చేశారు, కానీ అది నాకు సరిపోదు అని అనుకుంటున్నాను. అది ఆయనను భగవంతునిగా పరిగణించడములో కొరత ఉంది. ఆచరణాత్మకముగా ఉండండి

అన్నే జాక్సన్: నిన్న నేను న్యూయార్క్ నుండి వచ్చిన భక్తుడిని కలుసుకున్నాను, అతను అన్నాడు చాలామంది ఉన్నారు ఇతర గ్రహాల నుండి వచ్చిన వారు పండుగలో , మీరు వారిని చూడగలిగారు. అది నిజమా?

ప్రభుపాద: అవును, అవును. అందరూ చూడగలరు. మీకు కళ్ళు ఉంటే, మీరు కూడా చూడవచ్చు. కానీ మీకు కళ్ళు లేకపోతే, మీరు అసూయగా ఉంటారు ఎందుకంటే వారు ఒక మంచి మోటారు కారును ఏర్పాటు చేశారు. కాబట్టి మీరు చూడడానికి మీ కళ్ళను సరి చేసుకుంటే. గ్రుడ్డివాడు చూడలేడు. కళ్ళను వైద్యముతో బాగు చేయించుకోవాలి ఎలా చూడాలో.

అన్నే జాక్సన్: ఇది మీ ఇతర ఇంద్రియాల విషయములో కూడా నిజమేనా?

ప్రభుపాద: ప్రతి ఇంద్రియమును. మీరు ఏదైనా చూడాలనుకుంటే, మీరు ఎలా చూడాలి అనేదాని గురించి శిక్షణ తీసుకోవాలి. ఒక శాస్త్రవేత్త మైక్రోస్కోప్ ద్వారా ఎలా చూస్తున్నాడు. మీరు ఉత్త కళ్ళతో చూడాలనుకుంటే. సాధ్యమవుతుందా చూడడానికి? మీరు చూడటానికి పద్ధతిని అనుసరించాలి. అప్పుడు మీరు ప్రతిదీ చూడగలరు