TE/Prabhupada 0400 - శిక్షాష్టకము శ్లోకములకు భాష్యము: Difference between revisions

 
No edit summary
 
Line 5: Line 5:
[[Category:TE-Quotes - Purports to Songs]]
[[Category:TE-Quotes - Purports to Songs]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0399 - La teneur et portée de Sri Nama, Gay Gaura Madhur Sware|0399|FR/Prabhupada 0401 - La teneur et portée du Sri Sri Siksastakam|0401}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0399 - శ్రీ నామ గాయ్ గౌరచంద్ మధూర్ స్వరే పాటకు భాష్యము|0399|TE/Prabhupada 0401 - శిక్షాష్టకము శ్లోకములకు భాష్యము|0401}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 16: Line 16:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|GQNTR_IyNb8|శిక్షాష్టకము శ్లోకములకు భాష్యము  <br />- Prabhupāda 0400}}
{{youtube_right|lrn5OkOdOhM|శిక్షాష్టకము శ్లోకములకు భాష్యము  <br />- Prabhupāda 0400}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/V15_02_sri_sri_siksastakam_purport.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/purports_and_songs/V15_02_sri_sri_siksastakam_purport.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->



Latest revision as of 05:48, 17 February 2019



Purport to Sri Sri Siksastakam, CDV 15


Ceto-darpaṇa-mārjanam bhava-mahā-dāvāgni-nirvāpaṇaṁ
śreyaḥ-kairava-candrikā-vitaraṇaṁ vidyā-vadhū-jīvanam,
ānandāmbudhi-vardhanaṁ prati-padaṁ pūrṇāmṛtāsvādanaṁ
sarvātma-snapanaṁ paraṁ vijayate śrī-kṛṣṇa-saṅkīrtanam.

చైతన్య మహాప్రభు తాను తలపెట్ట దలచిన కార్యాచరణను అనుసరించి ఈ విధంగా 8 శ్లోకాలను మనకు ఇచ్చారు. అలా అవి ఎనిమిది శ్లోకాల రూపంలో వివరించబడ్డాయి. వాటినే శిక్షాష్టకము అనే పేరుతో పిలుస్తారు. శిక్షా అంటే సూచన, అష్టక అంటే ఎనిమిది. ఈ ఎనిమిది శ్లోకాలలో వారు తన ఉపదేశాన్ని ముగించారు, మరియు వారి తదుపరి శిష్యులు, ఆరుగురు గోస్వాములు,పెక్కు గ్రంధములలో వానిని విశదీకరించారు. అందువల్ల చైతన్య మహా ప్రభు అసలు విషయం పరం విజయతే శ్రీ కృష్ణ సంకీర్తనం అన్నారు: హరేకృష్ణ మంత్రానికి జయము మరియు కృష్ణచైతన్య సంకీర్తన ఉద్యమానికి జయము జయము. హరినామనికే అన్ని మహిమలు.అన్ని జయాలు. ఎందుకు హరినామానికి సఖల జయములు, కీర్తులు? ఎందుకంటే, వారు ఇలా వివరించారు,చేతో దర్పణ మార్జనం. మీరు ఈ హరేకృష్ణ మంత్రాన్ని జపించి నట్లయితే, అప్పుడు మీ హృదయంలో పేరుకుపోయిన కల్మషాలు, భౌతిక కాలుష్యం వలన ఏర్పడిన ఆ కల్మషాలు, పూర్తిగా తొలగించబడతాయి. ఆయన హృదయాన్ని అద్దముతో పోల్చి ఉదాహరణగా చెబుతున్నారు. ఒకవేల అద్దము పూర్తిగా ధూళి చేత కప్పబడి ఉంటే, అప్పుడు అద్దం యొక్క ప్రతిబింబం ద్వారా మన వాస్తవమైన ముఖాన్ని చూడలేము. అందువలన, అది శుభ్రపరచబడాలి. మన ప్రస్తుత బధ్ధ జీవనం లో, మన హృదయం చాలా దుమ్ముతో నిండివుంది, అనాది కాలంనుండి అది మన భౌతిక సాంగత్యంవల్ల పేరుకొనబడింది. మనం ఈ హరేకృష్ణమంత్రాన్ని జపం చేస్తే, అప్పుడు ఆ దుమ్ము తొలగించబడుతుంది. అది వెంటనే తొలగింపబడదు, అది తొలగించబడే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే హృదయం అనే అద్దము,దుమ్ము నుండి పరిశుద్ధుమైన వెంటనే, వారి వాస్తవమైన ముఖము ఏవిధంగా వుంటుందో వారు చూడవచ్చు. ఇక్కడ ముఖము అంటే వాస్తవమైన స్వరూపం. హరే కృష్ణ మంత్రాన్ని జపించటం ద్వారా, ఎవరైనా తాము ఈ శరీరం కాదని అర్థం చేసుకోగలరు. ఇది మన దురభిప్రాయం. ధూళి అంటే ఈ దురభిప్రాయం, ఈ శరీరాన్ని లేదా మనస్సును తనుగా భావించడం. వాస్తవానికు, మనము ఈ శరీరం లేదా మనస్సు కాదు. మనము ఆత్మ స్వరూపులం. ఎప్పుడైతే మనము ఈ శరీరాలు కాదని గ్రహిస్తామో, వెంటనే భవ మహా దావాగ్ని-నిర్వాపనం. భౌతిక బధ్ధజీవనం అనే దావాగ్ని లేదా భౌతిక బాధలనబడే దావాగ్ని, వెంటనే మాయమవుతుంది .అప్పుడిక బాధలు ఉండవు. అహం బ్రహ్మాస్మి. భగవద్గీత యందు చెప్పబడినట్లు, బ్రహ్మ-భుతః ప్రసన్నాత్మా. వెంటనే ఆత్మగా తన వాస్తవమైన స్థితిని అర్థం చేసుకుంటాడు,అప్పుడు అతను సంతోషంగా ఉంటాడు. మనము ఆనందంగా లేము. ఎందుకనగా భౌతిక సాంగత్యం వల్ల మనo ఎల్లప్పుడూ ఆత్రుతలతో నిoడివున్నాం కాబట్టి. హరే కృష్ణ మంత్రాన్ని కీర్తన, జపము చేయడము ద్వారా, మనము వెంటనే సంతోషకరమైన జీవిత దశకు వస్తాము. భవ మహా దావాగ్ని-నిర్వాపనం. దానినే ముక్తస్థితి లేదా మోక్షము అని పిలుస్తారు. ఎప్పుడైతే ఒకరు ఆనందాన్ని పొందుతున్నపుడు, అన్ని ఆందోళనలనుండి విముక్తి పొందినప్పుడు, ఆ స్థితే వాస్తవమైన ముక్తస్థితి. ఎందుకంటే ప్రతి జీవరాశి, ఆత్మగా స్వభావరీత్యా ఆనందమయమైనది. తన మొత్తం జీవన సంఘర్షణ ఆనందమయ స్థితికి చేరుకోవటం కోసమే, కానీ అతను అసలు సూత్రాన్ని మరిచిపోతున్నాడు. కాబట్టి, సంతోషకరమైన స్థితిని పొందగోరే ప్రతి ప్రయత్నంలోనూ విఫలమవుతున్నాడు. హరేకృష్ణ మంత్రజప కీర్తనల వల్ల ఈ వరుస వైఫల్యాలను వెంటనే అధిగమించవచ్చు. అదే హరినామం యొక్క దివ్య శబ్ద ప్రకంపన యొక్క ప్రభావం. ముక్తస్థితి తర్వాత,అనగా సంతోష స్థితిని పొందిన తర్వత, భౌతిక ఆనందం తగ్గుతుంది. మీరు ఆనందించలనుకునే ఏ ఆనందం అయిన, అది తగ్గిపోతుంది. ఉదాహరణకు,తినడం తీసుకోండి. మనము ఒక మంచి ఆహర పదార్థం తినాలని అనుకుంటే, కొంత పదార్ధాన్ని తిన్న తరువాత మనము ఇంక తీసుకోవలనుకోము. కాబట్టి ఈ భౌతిక జగత్తులో మనం ఏదైతే ఆనందాన్ని పొందుతామో, అది తరిగిపోతుంది. కానీ ఆధ్యాత్మిక ఆనందం విషయానికి వస్తే, చైతన్య మహప్రభు ఇలా అంటున్నారు, ఆధ్యాత్మిక ఆనందం సముద్రం లాంటిది. కానీ ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో, సముద్రపు పెరుగుదల లేదని మనం గ్రహించగలం. సముద్రం దాని పరిమితిలోనే ఉంది. కానీ ఆధ్యాత్మిక ఆనందం యొక్క సముద్రం పెరుగుతూ వుంటుంది. Ānandāmbudhi-vardhanam. Śreyaḥ-kairava-candrikā-vitaraṇam. అది ఎలా పెరుగుతుంది? ఇక్కడ వారు చంద్రుని ఉదాహరిస్తున్నారు,ఉదయించే చంద్రునితో. అమవాస్య రోజు నూతన చంద్రుని రూపం నుంచి వరుసగా చంద్రుని రూపాన్ని గమనించినట్లయితే, మొదటి రోజు అది ఒక చిన్న వక్ర రేఖలాగ ఉంటుంది. కానీ రెండవ రోజు, మూడవ రోజు పెరుగుతుంది, క్రమంగా పెరుగుతుంది. అదేవిధంగా, ఆధ్యాత్మిక జీవితం, ఆధ్యాత్మిక ఆనందమయ జీవితం రోజు తర్వాత రోజు చంద్రుని రూపు వలె రోజు రోజుకూ పెరుగుతూపోతుంది, అది పౌర్ణమి రాత్రి పూర్ణ చంద్రుడు వచ్చే స్థితి వరకూ పెరుగుతుంది, అవును. కాబట్టి,ceto-darpaṇa-mārjanam bhava-mahā-dāvāgni-nirvāpaṇam,, Śrayaḥ-kairava-candrikā-vitaraṇam vidyā-vadhū-jīvanam. అప్పుడు జీవితం పూర్తిగా జ్ఞానమయమవుతుంది. ఎందుకంటే ,ఆధ్యాత్మిక జీవితం అంటే శాశ్వతమైనది ,సంపూర్ణ జ్ఞాన మయమైనది , సంపూర్ణ ఆనందమయమైనది. మన ఆనందం అంచెలంచెలుగా పెరుగుతుంది. కారణం మన జ్ఞాన స్థితి పెరుగుతూ ఉంటుంది కాబట్టి. Śriya-kairava-candrikā-vitaraṇa vidyā-vadhū-jīvanam, ānandāmbudhi-vardhanaṁ. అది సముద్రములాగానే ఉంటుంది, కానీ ఆ ఆనందం పెరుగుతుంది. Ānandāmbudhi-vardhanaṁ, sarvātma-snapanaṁ. అది ఎంత ఆనందంగా ఉంటుందంటే ,ఒకసారి ఆ జీవన స్థితికి చేరుకున్న తరువాత, ఎవరైనా "నేను పూర్తిగా సంతృప్తి చెందాను"అని భావిస్తాడు.సర్వాత్మ స్నపనం. అది ఎలాగంటే ఎప్పుడైతే ఒకరు నీటిలోకి మునిగి స్నానం చేసిన తర్వాత, వెంటనే అతను నూతన ఉత్సాహాన్ని పొందుతాడో. అదేవిధంగా, ఈ ఆధ్యాత్మిక జీవితం, రోజురోజుకీ ఆనందాన్ని ఇనుమడింప చేస్తూ, అతను పూర్తిగా సంతృప్తి చెందాను అని భావించే స్థితికి చేరుస్తుంది.