TE/Prabhupada 0402 - విభావరీ శేషకు భాష్యము: Difference between revisions

 
No edit summary
 
Line 5: Line 5:
[[Category:TE-Quotes - Purports to Songs]]
[[Category:TE-Quotes - Purports to Songs]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0401 - La teneur et portée du Sri Sri Siksastakam|0401|FR/Prabhupada 0403 - La teneur et portée de Vibhavari Sesa, partie 2|0403}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0401 - శిక్షాష్టకము శ్లోకములకు భాష్యము|0401|TE/Prabhupada 0403 - విభావరీ శేషకు భాష్యము|0403}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 16: Line 16:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|TS9E97RTcfA|విభావరీ శేషకు భాష్యము  <br/>- Prabhupāda 0402}}
{{youtube_right|JKJv860BHoM|విభావరీ శేషకు భాష్యము  <br/>- Prabhupāda 0402}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/C07_02_vibhavari_sesa_purport_clip1.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/purports_and_songs/C07_02_vibhavari_sesa_purport_clip1.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->



Latest revision as of 06:29, 17 February 2019



Purport to Vibhavari Sesa


ఇది భక్తివినోద ఠాకురుల వారు పాడిన గీతము. వారు ప్రతి ఒక్కరినీ ఉదయాన్నే లేవమని కోరుతున్నారు. విభావరీ శేష, రాత్రి ముగిసింది, ఆలోక-ప్రవేశ, సూర్యోదయపు కాంతిరేఖలు ప్రవేశిస్తున్నాయి.ఇక నిద్రను వీడి మేల్కొనుము. Nidrā chāri uṭha jīva, ఇక నిద్రించినది చాలు. ఇది వైదిక జీవనం. ఎవరైనాసరే సూర్యోదయం తర్వాత నిద్రించకూడదు. అతను సూర్యోదయానికి ముందే మేల్కొనాలి. ఇది ఆరోగ్యకరమైన జీవితసూత్రము. అలా నిద్ర నుంచి లేచిన వెంటనే ప్రతి ఒక్కరూ భగవంతుని దివ్యనామాలను కీర్తించాలి. ఇక్కడ ఈవిధంగా సూచించబడింది, బోలో హరి హరి, ఇప్పుడు మీరు హరేకృష్ణ మంత్రాన్ని కీర్తిస్తున్నారు. అదేవిధంగా ముకుంద మురారి, అవి కృష్ణుడి ఇతర నామములు.

ముకుంద అంటే ముక్తి ప్రదాత. మురారి, మురారి అనగా కృష్ణుడు ముర అనే రాక్షసుని యొక్క శత్రువు. రామ అనేది మరొక నామము,రామ,కృష్ణ. హయగ్రీవ, హయగ్రీవ అనేది కృష్ణుడి యొక్క మరొక అవతారం. అదేవిధంగా నృసింహ, నర-హరి, అనగా సగం సింహం, సగం మనిషి, ఆయనే నరసింహ స్వామి. తర్వాత వామన అవతారం, నృసింహ వామన శ్రీ మధుసూదన. మధుసూదన, మధు అనే రాక్షసుడు వుండేవాడు.అలాగే కైటభ, బ్రహ్మ సృష్టికార్యం చేసిన తరువాత వారు ఆయనను మింగడానికి వచ్చారు, కాబట్టి వారు సంహరించబడ్డారు. అందుచే కృష్ణుడికి మరో నామము మధుసూదన. మధుసూధన అనే పేరు భగవద్గీతలో చాలాసార్లు కనబడుతుంది. మధుసూదన అంటే మధు యొక్క శత్రువు. కృష్ణుడు కొందరికి స్నేహితుడు మరియు కొందరికి శత్రువు. అతను ప్రతిఒక్కరికి స్నేహితుడే, కానీ అతను కృష్ణున్ని శత్రువుగా పరిగణిస్తున్నవారికి ఆయన శత్రువుగా వ్యవహరిస్తాడు. ఆయన ఎవరికీ శత్రువు కాదు.కానీ తనను ఎవరైనా శత్రువుగా చూడదలచుకుంటే వారికి ఆయన శత్రువుగా దర్శనమిస్తాడు.అది పరిపూర్ణము. రాక్షసులు,వారు కృష్ణుణ్ణి శత్రువుగా చూడదల చుకున్నారు, కాబట్టి రాక్షసుల కోరికకు తగ్గట్టు, వారిముందు శత్రువుగా దర్శనమిస్తాడు,వారిని సంహరిస్తాడు మరియు వారికి ముక్తినిస్తాడు. అది కృష్ణుని పరమ లీల, మధుసూదన బ్రజేంద్ర-నందన శ్యామ. వాస్తవమునకు దేవునికి ఏ నామమూ లేదు, కానీ కానీ ఆయన లీలల ద్వారా రకరకాల నామాలను ధరిస్తాడు. ఉదాహరణకు మధుసూదన అనే నామము కృష్ణుడు మధు అనే రాక్షసుని సంహరించడంవల్ల కలిగింది. అదేవిధంగా, అతను బ్రజేంద్ర-నందన, వ్రజ కుమారుడు, అంటే వృందావనానికి చెందినవాడు, ఎందుకంటే అతను యశోద నంద మహారాజుల కుమారుడు కాబట్టి, బ్రజేంద్ర-నందనుడు. శ్యామ, అతని శారీరక రంగు నల్లగా ఉంది, అందుచే అతన్ని శ్యామసుందర అని పిలుస్తారు. పూతన-ఘాతన, కైతభ-శాతన, జయ దాశరథి-రామ. ఆయన పూతన అనే రాక్షసిని సంహరించారు కాబట్టి ఆయన నామము పూతన-ఘాతన. ఘాతన అంటే చంపినవాడు. కైతభ-శతన, అతను అన్ని రకాల ఉపద్రవాలను నివారించేవాడు. జయ-దాసరథి-రామ.ఆయన రావణుని సంహరించిన కారణాన జయ దాశరథి అని కీర్తించబడ్డాడు. దాశరథి అంటే: ఆయన తండ్రి పేరు దశరథుడు, అందువలన అతను దాశరథి, దాశరథి-రామ. యశోద-దులాల గోవింద-గోపాల. యశోద-దులాల అనగా తల్లి యశోద యొక్క పెంపుడు కుమారుడు. గోవింద-గోపాల, అతను గోప బాలుడు, గోవిందుడు. గోవులకు ఆనందాన్నిచ్చే వాడు. బృందావన పురందర, బృందావన భూమి యొక్క అధినేత. అతను వృందవనములో ప్రతి ఒక్కరికి కేంద్రాకర్షణ గా ఉంటాడు. రవణాంతకర గోపీ-ప్రియ-జన, అతను గోపీకలకు, చాలా అనుకూలంగా ఉంటాడు,కాబట్టి గోపీ-ప్రియ రాధిక-రమణ, అతను ఎప్పుడూ రాధారాణి సాంగత్యంలో ఆనందిస్తాడు, అందువలన అతని నామము రాధిక-రమణ. భువన-సుందర-బర. అతను చాలా గోపీకలను ఆకర్షించిన కారణాన, అంటే అతను మొత్తం విశ్వానికే ఆకర్షకుడు అని అర్థం. ఈ విశ్వంలో కృష్ణుడి కంటే ఎవరూ ఆకర్షణీయులు లేరు, లేదా ఎక్కడైనగాని లేరు, అందువలన అతన్ని భువన-సుందర-బర అంటారు. బర అంటే పేరెన్నికగన్న. రవణాంతకర, మాఖన-టస్కర, గోపీ-జన-వస్త్ర-హారి.