TE/Prabhupada 0003 - పురుషుడు కూడా స్త్రీయే: Difference between revisions

No edit summary
 
(No difference)

Latest revision as of 04:37, 22 March 2020



శ్రీమద్ భాగవతం 6.1.64-65 పై ఉపన్యాసం - వ్రిందావన, సెప్టెంబర్ 1, 1975

ప్రభుపాద:

తాం ఎవ తోశాయాం ఆశ
పిత్ర్యేనార్థేన యావతా
గ్రామ్యాయిర్ మనోరమైహ్ కామైహ్
ప్రసీదేత యథా తథా
(శ్రీమద్ భాగవతం 6.1.64)


ఆ స్త్రీని చూసిన తరువాత నుంచి, అతడు నిరంతరం, ఇరవైనాలుగ్గంటలూ, అవే కామకోరికల పై ధ్యానిస్తున్నాడు. కామైస్ తైస్ తైర్ హృత-జ్ణానాః (భగవద్గీత 7.20). ఎవరైతే కామపూరితులవుతారో క్రమంగా వారి బుద్ధి అంతా నశిస్తుంది. ఈ ప్రపంచం అంతా కామపూరిత కోరికల ఆధారంగా జరుగుతోంది. ఇది భౌతిక ప్రపంచం. ఎందుకంటే నేను కామపురితుడిని, నువ్వు కామపూరితుడవు, మనలో ప్రతి ఒక్కరు. కాబట్టి నా కోరికలు తీరక పోయిన వెంటనే, నీ కోరికలు తీరవు, నేను మీకు శత్రువుగా మారుతాను, మీరు నాకు శత్రువుగా మారుతారు. నేను మీరు మంచి పురోగతి సాధిస్తే చూడలేను. మీరు నేను మంచి పురోగతి సాధిస్తే చూడలేరు. ఇది భౌతిక ప్రపంచం. ద్వేషం. కామ కోరికలు. కామ, క్రోధ, లోభ, మోహ, మాత్సర్య. ఇది భౌతిక ప్రపంచం యొక్క ఆధారం.

కావున ఆయన అలా మారాడు. శిక్షణ ఏంటంటే, ఆయన ఒక బ్రాహ్మణుడుగా మారడానికి శిక్షణ పొందుతున్నాడు, శమో, దమ, (భగవద్గీత 18.42), కానీ ఆయన పురోగతికి అడ్డుపడింది. ఒక స్త్రీ తో ఉన్న సంబంధం వల్ల. అందువలన వైదిక నాగరికత ప్రకారం, స్త్రీ ఆధ్యాత్మిక అభివృద్దికి విఘాతంగా ఆమోదింపబడింది. మొత్తం వైదిక నాగరికత అంతా స్త్రీని ఎలా నివారించాలి అని. మీరు స్త్రీని మాత్రమే స్త్రీగా భావించవద్దు. పురుషుడు కూడా స్త్రీయే. వ్యక్తులు కాకుండా స్త్రీలను మాత్రమే ఖండించారు అని భావించవద్దు. స్త్రీ అంటే ఆనందించుటకు, పురుషుడు అంటే ఆనందించేవాడు. కాబట్టి ఈ భావన, ఈ భోగ భావనను ఖండించాలి. నేను ఒక స్త్రీని ఆనందం కోసం చూస్తే, నేను పురుషుడిని. ఒక స్త్రీ కూడా పురుషుడిని ఆనందం కోసం చూస్తే, ఆమె కూడా పురుషుడు. స్త్రీ అంటే ఆనందించుటకు, పురుషుడు అంటే ఆనందించేవాడు. కాబట్టి ఈ భోగ భావన ఉన్న ఎవరైనా పురుషుడుగా పరిగణించబడతారు. కాబట్టి ఇక్కడ రెండు లింగాలు (స్త్రీ పురుషులు) దేనికోసం అంటే.... అందరూ "నేను ఎలా ఆనందించాలి?" అని ప్రణాళికలు చేస్తారు. అందువలన అతడు కృత్రిమంగా పురుషుడు. లేకపోతే, నిజానికి, మనము అందరం ప్రకృతి. జీవులు, స్త్రీ లేదా పురుషుడు. ఇప్పుడు ఉన్నది బాహ్య దుస్తులు.