TE/Prabhupada 0679 - తెలిసి చేసినా,తెలియక చేసినా కృష్ణ చైతన్యములో చేసినది అది ప్రభావాన్ని కలిగి ఉంటుంది: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0679 - in all Languages Category:TE-Quotes - 1969 Category:TE-Quotes - Le...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 8: Line 8:
[[Category:Telugu Pages - Yoga System]]
[[Category:Telugu Pages - Yoga System]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0678 - Une personne consciente de Krishna est toujours dans le trance du yoga|0678|FR/Prabhupada 0680 - Nous sommes en train de penser que nous sommes assis sur ce sol, mais dans le fond nous sommes assis sur Krishna|0680}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0678 - కృష్ణ చైతన్య వ్యక్తి ఎప్పుడూ యోగ సమాధిస్థితిలో ఉంటాడు|0678|TE/Prabhupada 0680 - మనము ఈ నేల మీద కూర్చొని ఉన్నాము, కాని వాస్తవానికి మనము కృష్ణునిలో కూర్చుంటున్నాము|0680}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 19: Line 19:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|Qyht2tdPbmE|తెలిసి చేసినా,తెలియక చేసినా కృష్ణ చైతన్యములో చేసినది అది ప్రభావాన్ని కలిగి ఉంటుంది  <br />- Prabhupāda 0679}}
{{youtube_right|9ytoeTotz1k|తెలిసి చేసినా,తెలియక చేసినా కృష్ణ చైతన్యములో చేసినది అది ప్రభావాన్ని కలిగి ఉంటుంది  <br />- Prabhupāda 0679}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:37, 1 October 2020



Lecture on BG 6.25-29 -- Los Angeles, February 18, 1969


విష్ణుజన: శ్లోకము ఇరవై-తొమ్మిది: "ఒక నిజమైన యోగి నన్ను అన్ని జీవులలోనూ గమనిస్తాడు మరియు నాలో ప్రతి ఒక్కరిని చుస్తాడు. నిజానికి ఆత్మ-సాక్షాత్కారము కలిగిన వ్యక్తి ప్రతిచోటా నన్ను చూస్తాడు ( BG 6.29) "

ప్రభుపాద: అవును. ఇప్పుడు, "ఒక నిజమైన యోగి నన్ను అన్ని జీవులలో గమనిస్తాడు." ఆయన ఎలా చూస్తాడు? వారు అన్ని జీవులు కృష్ణుడు అని అర్థం చెప్తారు. కావున, కృష్ణుడిని వేరుగా పూజించటం వలన ప్రయోజనము లేదు. అందువల్ల వారు సంక్షేమ కార్యక్రమాలను చేస్తారు. ఇది మెరుగైనది అని వారు చెప్తారు. ఎందుకు కృష్ణుడిని పూజించాలి? కృష్ణుడిలో ప్రతి ఒక్కరిని చూడాలని కృష్ణుడు చెబుతాడు. కావున మనము సేవ చేద్దాము... కానీ వారికి సాంకేతిక పద్దతులు తెలియవు. దానికి ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువు దగ్గర శిక్షణ తీసుకోవటము అవసరము. ఈ, "ఒక నిజమైన యోగి అన్ని జీవులలో నన్ను గమనిస్తాడు." నిజమైన యోగి, భక్తుడు. ఈ భక్తులు బయట కృష్ణ చైతన్యమునను ప్రచారము చేయడానికి వెళ్తున్నారు. ఎందుకు? వారు అన్ని జీవులలో కృష్ణుడిని చూస్తారు. ఎలా? ఎందుకనగా అన్ని జీవులు కృష్ణుడి యొక్క అంశలు అని చూస్తారు. వారు కృష్ణుడిని మర్చిపోయినారు. కాబట్టి వారిని మనము కృష్ణ చైతన్యమునకు మేలుకోల్పుదాము. ఒక భక్తుడు ఇతరులను చూస్తాడు, ఎవరైతే కృష్ణ చైతన్యములో లేరో. ఉదాహరణకు కొన్నిసార్లు కొన్ని మిషనరీ కార్యక్రమాలు ఉన్నాయి, నిరక్షరాస్యులకు విద్యను ఇవ్వడానికి. ఎందుకు? ఎందుకంటే వారిని మనుషులుగా చూస్తారు. వారిని విద్యావంతులను చేయాలి. వారు జీవిత విలువను తెలుసుకోవాలి. అది వారి సానుభూతి. ఇక్కడ కూడా అదే విషయము. అందరూ కృష్ణుడి యొక్క అంశలము అని తెలుసుకోవాలి. ఈ చైతన్యాన్ని మరచి పోవడము వలన ఆయన బాధపడతాడు. అంటే, ప్రతి మానవుడిలో కృష్ణుడిని చూడటము. ప్రతి జీవి కృష్ణుడు అయ్యాడు అని కాదు. ఆ విధముగా చూడవద్దు, అప్పుడు మీరు పొరపాటు చేస్తారు. ప్రతి జీవి... ఉదాహరణకు నేను ఎవరినైనా చూసినట్లయితే, ఈ బాలుడు ఫలనా పెద్ద మనిషి యొక్క కుమారుడు అని. అంటే నేను ఈ అబ్బాయిలో అ పెద్ద మనిషిని చూస్తాను. ఇది స్పష్టంగా ఉన్నదా? నేను ప్రతి జీవిని భగవంతుడు లేదా కృష్ణుడి కుమారుడుగా చూసినట్లయితే, అప్పుడు అంటే నేను ప్రతి జీవిలో భగవంతుడిని చూస్తాను అని అర్థం. అర్థం చేసుకోవడానికి ఏమైనా కష్టము ఉన్నదా?

విష్ణుజన: ఇది ఒక సంఘమా లేదా ఇది ఒక దృష్టి?

ప్రభుపాద: లేదు, ఇది వాస్తవము. (నవ్వు) ఇది సంఘం లేదా దృష్టి కాదు, ఇది వాస్తవం. మీరు ఒక పిల్లిని చూసినప్పుడు, మీరు ఒక కుక్కను చూసినప్పుడు, మీరు ఆయనలో కృష్ణుడిని చూస్తారు. ఎందుకు? మీకు ఇక్కడ ఒక పిల్లి ఉన్నది అని తెలుసు. ఆయన, తన పనులు ద్వారా, గత జన్మ పనుల వలన ఆయనకు ఈ పిల్లి శరీరం వచ్చింది, మరచిపోయినాడు. కాబట్టి నేను ఈ పిల్లికి సహాయం చేస్తాను, దానికి కొంచము కృష్ణ ప్రసాదము ఇస్తాను కావున ఏదో ఒక రోజు ఆయన కృష్ణ చైతన్యమునకు వస్తాడు. ఇది, ఆయనలో కృష్ణుడిలో చూడటము. అంతే కానీ, ",ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, అని నేను ఈ పిల్లిని ఆలింగనం చేసుకుంటాను." ఇది అర్థంలేనిది. ఇక్కడ ఒక పులి ఉంది," ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, రండి, దయచేసి నన్ను తినండి. "ఇది మూర్ఖత్వము. మీరు ప్రతి ప్రాణి పట్ల సానుభూతి కలిగి ఉండాలి. ఆయన కృష్ణుడి యొక్క అంశ అని Vāñchā-kalpatarubhyaś ca kṛpā-sindhubhya eva ca. అంతే కానీ మనము ఆయనను ఆలింగనం చేసుకోము" కృష్ణా రండి" అని. కాబట్టి "నిజమైన యోగి నన్ను అన్ని జీవులలో గమనిస్తాడు." ఇది చూడటము అంటే. ఎందుకు మనము ఈ పిల్లలను స్వాగతిస్తున్నాము? ఎందుకంటే ఆయన కృష్ణుడి యొక్క అంశ. మీరు వారికి అవకాశం ఇస్తున్నారు, సాధ్యమైనంత వరకు, కీర్తనలో పాల్గొనడానికి, ప్రసాదం రుచి చూడడానికి. ఎవరో ఒక పిల్ల వాడు వస్తాడు, ఈ విధముగా అనుకరిస్తాడు. ఓ ఇది ఫలితము లేకుండా ఉన్నది అని అనుకోవద్దు. తెలిసి చేసినా లేదా తెలియక చేసినా, కృష్ణ చైతన్యములో చేసినది, అది దాని ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ప్రణామము చేస్తున్న ఈ పిల్లలు, లేదా "కృష్ణ" కీర్తన చేయడానికి ప్రయత్నిస్తున్నవారు, లేదా చప్పట్లు కొడుతున్నవారు, ఈ విషయాలు కృష్ణ చైతన్యము యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతున్నాయి. ఉదాహరణకు ఒక బాలుడు ఈ అగ్నిని తాకినట్లయితే, అది ప్రభావము చూపుతుంది. అది పిల్లవాడిని క్షమించదు," ఓ,వాడు పిల్లవాడు, వాడికి తెలియదు." అగ్ని ప్రభావము చూపుతుంది. అదేవిధముగా కృష్ణుడు మహోన్నతమైన స్ఫూర్తి అయితే, ఒక పిల్లవాడు దానిలో పాల్గొనవచ్చు , కృష్ణుడు ప్రభావము చూపుతాడు. వాడికి దాని గురించి తెలియవచ్చు లేదా తెలియక పోవచ్చు. ఇది పట్టింపు లేదు. ఎందుకంటే కృష్ణుడు అక్కడ ఉన్నాడు. ఇది చాలా బాగుంది. అందువల్ల ప్రతి జీవికి అవకాశము ఇవ్వాలి. ఈ బాలురు బయట వారిని ఆహ్వానిస్తున్నారు, "రండి," ఈ ప్రేమ విందు. ఆలోచన ఏమిటి? ఆలోచన, వారిని రానిద్దాం, కొంచము ప్రసాదము తీసుకోండి ఇది ఏదో ఒక రోజు కృష్ణ చైతన్యములో ప్రభావము చూపుతుంది. ఇది ప్రభావము చూపుతుంది. కాబట్టి అది వారి ప్రచారము. వారు ప్రతి ఒక్కరినీ చూస్తున్నారు. కృష్ణ, వారు అందరిలో కృష్ణుడిని చూస్తున్నారు, ఆ విధముగా. అంతే కానీ ప్రతి ఒక్కరూ కృష్ణుడు కాదు. ఈ తప్పు చేయవద్దు. కృష్ణుడు సర్వాంతర్యామి. ఎందుకు ఈ మనిషిలోనే, ఆయన అణువులో కూడా ఉన్నాడు. Aṇḍāntara-stha-paramāṇu-cayāntara-stham (BS 5.35). మీరు బ్రహ్మ సంహితలో కనుగొంటారు. పరమాణు అంటే అణువు. అందువలన ఆయన అణువు లోపల కూడా ఉన్నాడు. ఎందుకు ప్రతి జీవిలో ఉండకూడదు? మీరు ఆ జ్ఞానం కలిగి ఉండాలి.