TE/Prabhupada 0002 - పిచ్చి మనిషి నాగరికత

Revision as of 18:22, 20 March 2020 by SanatanaGokula (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


శ్రీమద్ భాగవతం 6.1.49 పై ఉపన్యాసం - న్యూ ఓర్లీన్స్ ఫామ్, ఆగస్టు 1, 1975


హరికేస: అనువాదం..."నిద్రలో ఉన్న ఒక వ్యక్తి, తన కలలో ప్రకారం, ఆయన శరీరం కార్యక్రమాలను వ్యక్తం చేస్తుంది, లేదా శరీరమే తాను అని అంగీకరించారు. అదేవిధముగా, ఆయన ప్రస్తుత శరీరమే తాను అని గుర్తిస్తాడు, ఇది తన గత ఆచారమైన లేదా అనాచారమైన జీవితం వలన సంపాదించుకున్నది, ఆయన తన గత లేదా భవిష్యత్తు జీవితాన్ని గురించి తెలుసుకోలేదు.

ప్రభుపాద:

యథాజ్ణస్ తమసా (యుక్త)
ఉపాస్తే వ్యక్తం ఎవ హి
న వేద పూర్వం అపరం
నష్ట-జన్మ-స్మృతిస్ తథా
(శ్రీమద్ భాగవతం 6.1.49)

ఇది మన పరిస్థితి. ఇది మన శాస్త్రం యొక్క పురోగతి. అది ఏమిటంటే "నేను ఈ జీవితం ముందు ఏమిటి నేను. ఈ జీవితం తర్వాత ఏమి అవుతాను?" అన్నది మనకు తెలియదు. జీవితం నిరంతరం కొనసాగుతుంది. అది ఆధ్యాత్మిక జ్ఞానం. కానీ వారికి జీవితం నిరంతరం కొనసాగుతుంది అని కూడా తెలియదు. వారు అనుకుంటారు, “అదృష్టవశాత్తూ, నాకు ఈ జీవితం వచ్చింది, మరణానంతరము అది పూర్తి అవుతుంది. గత, వర్తమాన భవిష్యత్తు అన్న ప్రశ్నే లేదు. మనం ఆనందంగా గడుపుదాం.” దీన్ని అజ్ఞానం అంటారు, తామస, బాధ్యతరహితమైన జీవితం.

కాబట్టి అజ్ఞః. అజ్ఞః అనగా జ్ఞానం లేనివాడు అని అర్థం. ఎవరైతే అజ్ఞానులో? ఇప్పుడు, తామస. ఎవరైతే అజ్ఞానం రీతులలో ఉన్నవారు. మూడు రకాల భౌతిక మాయలు, తీరులు: సత్త్వ, రజ, తామస. సత్త్వ-గుణం అనగా ప్రతిదీ స్పష్టం. ప్రకాశ. ఏ విధముగా అంటే, ఆకాశం మేఘాలతో కప్పివుంది: అప్పుడు సూర్య కాంతి స్పష్టంగా ఉండదు. కానీ మేఘాల పైన సూర్య కాంతి వుంది, ప్రతిదీ స్పష్టంగా ఉంది. మేఘము లోపల, అక్కడ స్పష్టంగా ఉండదు. అదే విధముగా సత్వ గుణంలో ఉన్నవారికి, వారికి ప్రతి ఒక్కటీ స్పష్టంగా వుంటుంది. తమో-గుణంలో ఉన్నవారికి, ప్రతిదీ అజ్ఞానంగా వుంటుంది. ఎవరైతే మిశ్రమంగా వుంటారో, రజో గుణం కాకుండా, తమో గుణం కాకుండా, మధ్యమం(మీడియం) ద్వారా, వారిని రజో గుణం అంటారు. మూడు గుణాలు. తామస. కాబట్టి వారు కేవలం శరీరం మీద ఆసక్తి చూపిస్తారు, ఏమి జరగబోతుందో పట్టించుకోరు, ఆయన గతంలో ఏమిటి అన్న జ్ఞానం ఉండదు. ఇది వేరొక చోట వివరించబడింది. నూనం ప్రమత్తః కురుతే వికర్మ (శ్రీమద్ భాగవతం 5.5.4) ప్రమత్తః, ఒక పిచ్చివాని వలె. ఆయన పిచ్చివాడిగా ఎందుకు మారాడో ఆయనకు తెలియదు.ఆయన మర్చిపోతాడు. తన కార్యక్రమాల ద్వారా తదుపరి ఏమి జరుగుతుంది అన్నది, ఆయనకు తెలియదు. పిచ్చివాడు.

కాబట్టి ఈ నాగరికత, ఆధునిక నాగరికత, కేవలం పిచ్చివాడి నాగరికత వలె. వారికి తమ గత జీవితం యొక్క జ్ఞానం ఉండదు, వారికి తమ భవిష్యత్తు జీవితం గురించి కూడా ఆసక్తి ఉండదు. నూనం ప్రమత్తః కురుతే వికర్మ (శ్రీమద్ భాగవతం 5.5.4) వారికి తమ గత జీవితం యొక్క జ్ఞానం ఉండక పూర్తిగా పాపముల యందు నిమగ్నం అయ్యి వుంటారు. ఒక కుక్క వలె. ఆయనకు తెలియదు ఎందుకు తను కుక్కగా మారాడో. ఆయన తదుపరి ఏమి పొందుతాడో? కాబట్టి ఒక కుక్క తన గత జీవితంలో ప్రధాన మంత్రిగా ఉండవచ్చు, కానీ ఆయన కుక్క జీవితం పొందినప్పుడు అది మర్చిపోతాడు. అది కూడా మాయ యొక్క మరో ప్రభావం. ప్రక్షేపాత్మిక-శక్తి, ఆవరనాత్మిక-శక్తి. మాయకు రెండు శక్తులు ఉన్నాయి. కొంత మంది తన గత పాపపు కార్యక్రమాల వలన కుక్కగా మారి ఉంటే, "గతంలో నేను ప్రధాన మంత్రి; ఇప్పుడు నేను కుక్కగా మారాను" అన్నది ఆయనకి గుర్తు ఉంటే, ఆయన జీవించడం అసాధ్యం. అందువలన మాయ తన జ్ఞానాన్ని కప్పి ఉంచుతుంది. మృత్యు. మృత్యు అనగా అర్థం ప్రతిదీ మర్చిపోవడం. దాన్ని మృత్యు అని అంటారు. మనకు ప్రతి పగలు రాత్రి యొక్క అనుభవం ఉంది. రాత్రి పూట మనం ఒక ప్రత్యేక వాతావరణం, ప్రత్యేక జీవితాన్ని కలలో చూస్తాం, మనం ఈ శరీరం గురించి మర్చిపోతాం, "నేను పడుకొని ఉన్నాను, నా శరీరం ఒక మంచి బహులంతస్తులోని ఇల్లు లో పడుకుని ఉంది, మంచి పరుపు" అని మనం మర్చిపోతాం. ఆయన వీధిలో వృధాగా తిరుగుతున్నాడు లేదా కొండ మీద ఉన్నాడు అనుకుందాం. అందువలన ఆయన కలలో తీసుకుంటున్నాడు, ఆయన తీసుకుంటున్నాడు... అందరూ, మనం ఆ శరీరం గురించి ఆసక్తి చూపిస్తాం. మనం గత శరీరం గురించి మర్చిపోతాం. కాబట్టి ఇది అజ్ఞానం. కాబట్టి అజ్ఞానం, మనం ఈ అజ్ఞానం నుండి జ్ఞానం వైపు ఎంత పైకి వెళ్లుతామో, అది విజయవంతమైన జీవితం. మనము స్వయంగా అజ్ఞానములో ఉంచుకుంటే, అది విజయము కాదు. అది జీవితాన్ని చెడగొట్టుకున్నట్లు.

కాబట్టి మన కృష్ణ చైతన్య ఉద్యమం లక్ష్యం "ఒక వ్యక్తిని అజ్ఞానం నుండి జ్ఞాన స్థాయికి పెంపొందించడం". అది వేదముల సాహిత్యం యొక్క మొత్తం పథకం: వ్యక్తిలో మార్పు తీసుకురావడం. కృష్ణుడు భగవద్గీతలో భక్తులు గురించి చెప్తాడు - అందరి కోసం కాదు - తేషామ్ అహం సముద్ధర్తా మృత్యు-సంసార-సాగరాత్ (భగవద్గీత 12.7) మరొకటి

తేషాం ఏవ అనుకమ్పార్థం
అహం అజ్ఞాన-జం తమః
నాశయామి ఆత్మ-భావ-స్థో
జ్ఞాన-దిపేన భాస్వతా
(భగవద్గీత 10.11)

ప్రత్యేకమైన వారి కోసం, భక్తుల కోసం...ఆయన అందరి హృదయాల్లో ఉన్నాడు, కానీ ఆయన ఒక భక్తుడు ఎవరైతే కృష్ణుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారో వారికి సహాయం చేస్తాడు. ఆయన సహాయం చేస్తాడు. భక్తులు కానీ వారి కోసం, వారికి కృష్ణుడితో ఎటువంటి సంబంధం ఉండదు....వారు పశువుల వలె వారు-తినడం, నిద్రించడం, భోగించడం రక్షించుకోవడం. వారు దేని గురించీ పట్టించుకోరు, భగవంతుని అర్థం చేసుకోవడానికి లేదా ఆయనకు భగవంతునికి ఉన్న సంబంధం ఏమిటి అని. వారు అనుకుంటారు. భగవంతుడు లేడు అని, వారి కోసం, కృష్ణుడు కూడా చెప్తాడు, "అవును భగవంతుడు లేడు, నువ్వు నిద్రపో." అందువలన సత్-సంగం అవసరం. ఈ సత్-సంగం, సతం ప్రసంగత్. భక్తుల సాహచర్యం ద్వారా, మనము భగవంతుని గురించి తెలుసుకోవాలనే కోరికను మేల్కొలుపవచ్చు. అందువలన కేంద్రాలు అవసరం. ఇది అనవసరంగా మనము చాలా కేంద్రాలు తెరుస్తున్నాం అని కాదు. కాదు. ఇది మానవ సమాజం ప్రయోజనము కోసం.