TE/Prabhupada 0845 - కుక్కకు కూడా మైథునజీవితము ఎలా ఉపయోగించాలో తెలుసు దానికి ఫ్రూడ్ తత్వము అవసరం లేదు

Revision as of 23:38, 1 October 2020 by Elad (talk | contribs) (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


761217 - Lecture BG 03.25 - Hyderabad


ప్రభుపాద:

saktāḥ karmaṇy avidvāṁso
yathā kurvanti bhārata
kuryād vidvāṁs tathāsaktaś
cikīrṣur loka-saṅgraham
(BG 3.25)

రెండు వర్గాల వ్యక్తులు ఉన్నారు: విద్వాన్, జ్ఞానవంతులు, మరియు మూర్ఖులు. జ్ఞానవంతులు కాదు, మూర్ఖులు కాకపోవచ్చు. మానవుడు, వారు, జంతువుల కన్నా చాలా తెలివైనవారు. కానీ వారిలో చాలా తెలివైన వారు, తక్కువ తెలివి కలిగిన వారు ఉన్నారు. మొత్తం మీద, వారు జంతువులు కంటే మరింత తెలివైనవారు.

ఇప్పటి వరకు మేధస్సును పరిగణలోకి తీసుకున్నప్పుడు, తినడం, నిద్ర, సెక్స్ మరియు రక్షణ విషయములను పరిగణలోకి తీసుకున్నప్పుడు, అది సమానంగా ఉన్నది, జంతువులో అయినా లేదా మానవుడులో అయినా. దీనికి ఏ విద్య అవసరం లేదు. కుక్కకు కూడా మైథునజీవితమును ఎలా ఉపయోగించాలో తెలుసు. దానికి ఫ్రూడ్ యొక్క తత్వము అవసరం లేదు. కానీ మానవ సమాజం, వారు ఆలోచిస్తున్నారు ఇక్కడ గొప్ప తత్వవేత్త ఉన్నాడు. ఆయన సెక్స్ గురించి వ్రాస్తున్నాడు. ఇది జరుగుతోంది. తినడం, సాధారణముగా తినడం... భూమి ఇక్కడ ఉంది. మీరు కొంచెం పని చేయండి, మీ ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసుకోండి, మరియు మీరు సమృద్ధిగా తినవచ్చు. కానీ పెద్ద పెద్ద ఆవులను తీసుకురావడానికి ఒక శాస్త్రీయ కబేళా అవసరము లేదు నిస్సహాయమైన జంతువులను చంపి నగరంలో నివసించడము. ఇది బుద్ధిని దుర్వినియోగము చేయడము. ఇది బుద్ధి కాదు. అందువలన ఒక భక్తుడు వాస్తవానికి తెలివైన వాడు మన బుద్ధిని ఎలా ఉపయోగించవచ్చో వారు మార్గమును చూపించవలసి ఉంటుంది. అది ఇక్కడ వివరించబడింది, saktāḥ karmaṇy avidvāṁsaḥ.

Avidvāṁsaḥ, మూర్ఖులు, జ్ఞానం లేని వ్యక్తులు వారు వివధ రకములైన కార్యక్రమాలను చాలా కనుగొన్నారు, కేవలం అవివేకము. ఆధునిక నాగరికత, నాగరికత అభివృద్ది అని పిలువబడేది, అంటే, నేను చెప్పేదేమిటంటే, avidvāṁsaḥ, వారిచే ప్రణాళిక చేయబడినది జ్ఞానం లేని వ్యక్తులు. అవి నాగరికత యొక్క అభివృద్ది కాదు. అందువల్ల వారు ఆత్మ మరో శరీరములోనికి బదిలీ అవుతుంది అని నమ్మరు. వారు నమ్మరు, ప్రధాన సమస్యను ప్రక్కన పెడతారు, వారు ఈ జీవితములో ప్రణాళిక చేస్తారు. యాభై లేదా అరవై సంవత్సరాలు జీవించడానికి, పెద్ద, పెద్ద ప్రణాళికలను తయారు చేస్తారు, సత్తః, భౌతికముగా ఆకర్షితులు అయి ఉంటారు. Saktāḥ karmai, కొత్త, కొత్త పద్ధతులను కనుగొంటారు. Avidvāṁsaḥ. వారు ఒక మనస్సును మరియు ప్రతిభను ఎలా నిమగ్నము చేయాలో తెలియదు. దానిని మనము మొన్నటి రోజు చర్చించాము, ఆ pravṛttiṁ ca nivṛttiṁ ca na vidur āsurā janāḥ ( BG 16.7) ఏ విధంగా మనం మన మనస్సును మరియు ప్రతిభను నిమగ్నం చేయవలెనో వారికి తెలియదు అది దేవత మరియు అసుర మధ్య తేడా. అసురునికి తెలియదు. అసురుడు అనుకుంటాడు తాను నిరంతరము జీవిస్తానని అనుకుంటాడు, ఆయన భౌతిక సుఖాల కోసము పెద్ద పెద్ద, ప్రణాళికలను సిద్ధం చేస్తాడు. ఇది రాక్షస నాగరికత. ఆయన ఇక్కడ ఉండడానికి అనుమతించబడడు. Duḥkhālayam aśāśvatam ( BG 8.15) ఇది బాధను అనుభవించటానికి ప్రదేశము. మన స్థానాన్ని మనము అర్థం చేసుకోవటానికి

కానీ ఈ మూర్ఖులు, వారు బాధను పరిగణనలోకి తీసుకోరు. వారు ఎక్కువ బాధ కోసం ప్రణాళికలు చేస్తున్నారు. ఇది వెర్రి నాగరికత. వారు చేయలేరు... శాస్త్రవేత్తలు అని పిలవబడే వారు, వారు మాటల గారడి చేస్తున్నారు, పురోగతి గురించి. ఈ రోజు ఉదయం మనము చర్చిస్తున్నాము, ఏ తెలివైన వారు అడగవచ్చు, "అందువల్ల మీరు ఏమి పరిష్కరించారు? ఈ సమస్య జన్మ, మరణం, వృద్ధాప్యం మరియు వ్యాధికి మీరు ఏ రకమైన పరిష్కారము చేసారు? మీరు ఈ సమస్యను పరిష్కరించారా? " దానికి వారు అవును అని చెప్పరు. అవును, మేము ప్రయత్నిస్తున్నాము, లక్షలాది సంవత్సరాల తరువాత, అది సాధ్యం కావచ్చు. అది కూడా... "మనము శాశ్వతంగా జీవించవచ్చు." వారు అలా అంటారు. ఇప్పుడు, మీ ప్రతిపాదనను నిర్ధారించడానికి లక్షలాది సంవత్సరాలు జీవించబోయేది ఎవరు? ప్రతి ఒక్కరూ యాభై, అరవై సంవత్సరాలలో మరణిస్తారు. నీవు... నీవు మూర్ఖుడవు, నీవు కూడా మరణిస్తావు. మీ ఫలితాన్ని ఎవరు చూస్తారు? కాబట్టి ఇది జరుగుతోంది. అందువల్ల జీవితములో నివసించే మార్గాన్ని చూపించడము తెలివైన వ్యక్తి యొక్క కర్తవ్యము