TE/Prabhupada 1017 - బ్రహ్మ వాస్తవ సృష్టికర్త కాదు. వాస్తవ సృష్టికర్త కృష్ణుడు

Revision as of 23:38, 1 October 2020 by Elad (talk | contribs) (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


720200 - Lecture SB 01.01.01 - Los Angeles


బ్రహ్మ వాస్తవ సృష్టికర్త కాదు. వాస్తవ సృష్టికర్త కృష్ణుడు ఇప్పుడు పద్ధతి ఏమిటంటే, మనము ఒక గురువును చేరుకోవడము వలె, ఆధ్యాత్మిక గురువును, జ్ఞానము పొందడానికి. బ్రహ్మకు ముందు కనిపించే జీవి ఏదీ లేదు. కావున ఆయనకు జ్ఞానము ఎలా వచ్చింది? సమాధానం "tene brahma hṛdā ya ādi-kavaye" 'Ādi-kavaye'. మొదటగా సృష్టించబడిన జీవి బ్రహ్మ, హృదయము నుండి నేర్చుకున్నాడు. దీని అర్థం కృష్ణుడు, వాసుదేవుడు లేదా భగవంతుడు, అందరి హృదయంలో ఉన్నాడు. ఆయన బ్రహ్మ హృదయంలో కూడా ఉన్నాడు. ఆయన నీ హృదయంలో ఉన్నాడు, నా హృదయములో కూడా ఉన్నాడు. మరియు 'హృదా' ఈ పదాన్నే ఉపయోగిస్తారు. హృదా అంటే హృదయము. కాబట్టి ఆయన హృదయంలో నుండి ఎవరికైనా నేర్పించగలడు. కానీ ఎందుకు మనము ఆయన గురించి తెలుసుకోము? సిద్దాంతపరంగా మనకు తెలుసు, కానీ ఆచరణాత్మకంగా మన బద్ధ జీవితములో ఆయన మనకు ఎలా నిర్దేశము ఇస్తున్నారో మనము అవగాహన చేసుకోలేము. కానీ ఆయన మార్గనిర్దేశము చేస్తున్నాడు. అది సత్యము. బ్రహ్మ సాధారణ జీవి కాదు, అందుచే ఆయన భగవంతుని నుండి హృదయంలో మార్గాన్ని తీసుకోగలడు. సరిగ్గా బ్రహ్మ వలె సరిగ్గా మనము మార్గాన్ని తీసుకోవచ్చు అర్హత సంపాదించినప్పుడు.

బ్రహ్మ భగవంతునికి సేవ చేయడానికి అవతరించారు. భగవంతుని యొక్క కోరిక పూర్తి చేయడానికి. మనము ఒక వడ్రంగిని పిలిపించి, నేను నాకు ఒక బీరువా చేయమని అడుగుతాను. నేను ఆయనకి కావలసిన పదార్థాలను, ఉపకరణాలు, లేదా వేతనాలను ఇస్తాను, ఆయన ఒక బీరువాను చేస్తాడు. అదేవిధముగా, భగవంతుడు పదార్థాలను సృష్టించాడు, తయారీదారులను కూడా, బ్రహ్మ ఈ విశ్వాన్ని సృష్టించాడు. కానీ ఆయన వాస్తవ సృష్టికర్త కాదు. వాస్తవ సృష్టికర్త కృష్ణుడు. అంతేకాక, వాస్తవ యజమాని కూడా కృష్ణుడు ఎందుకంటే ఆయన పదార్థాలు సృష్టించాడు. వాస్తవానికి మనము ఆచరణీయ రంగంలో పని చేస్తున్నప్పుడు, మనము పదార్థాలను సృష్టించలేము ఉదాహరణకు మనము చాలా పెద్ద ఆకాశహర్మ్య భవనాన్ని నిర్మించాలి అని అనుకుందాము, కానీ పదార్థాలు, అవి భూమి, రాయి, చెక్క, ఇనుము, ఇవి ఇంటి నిర్మాణములో ఉపయోగించే పదార్థాలు, వాటిని మనము సృష్టించలేము. అవి భగవంతునిచే సృష్టించబడినవి. మనము కేవలం రూపమును మారుస్తాము. మనము భూమిని తీసుకొని, భూమి నుండి మట్టిని తీసుకొని, నీటితో కలుపుతాము. ఈ నీటిని భగవంతుడు సృష్టించాడు. భూమిని భగవంతుడు సృష్టించాడు. అప్పుడు మనం కలపాలి, ఇటుకల వలె ఒక ముద్దను తయారు చేసి, అగ్నిలో ఉంచుతాము. అగ్ని కూడా భగవంతునిచే సృష్టించబడింది. ఈ విధముగా, మనము పరిశీలిస్తే మనము అధ్యయనం చేస్తే, పదార్థాలు మనము విపయోగించే ఈ పదార్థాలు, అవి మన సృష్టి కాదు. అవి భగవంతుని సృష్టి. మనము కేవలము వాటిని ఉపయోగించుకుంటాము. మనము వాటిని ఉపయోగించుకుంటాము కనుక అది మన ఆస్తి కాదు. ఇది ఆలోచన.

ఉదాహరణకు నేను కార్మికుడిని అని అనుకుందాం, నేను కొన్ని పదార్థములను ఉపయోగిస్తున్నాను, మరియు తయరు చేస్తున్నాను అంటే ఆ వస్తువు తయారైనప్పుడు పూర్తిగా, అది నా ఆస్తి అవుతుంది అని కాదు. కాదు ఎలా అవుతుంది? అందువలన తత్వము ప్రతిదీ కృష్ణుడికి భగవంతునికి చెందుతుంది. నేను కూడా ఆయనకు చెందినవాడను. నేను ఏమి తయారు చేసినా, అది కూడా ఆయనకి చెందుతుంది. ఈ ఆలోచన ప్రతిదీ భగవంతునికి చెందుతుంది అని అర్థం. నేను కూడా భగవంతునికి చెందుతాను. నా బుద్ధి భగవంతునికి చెందుతుంది. మనము ఉపయోగించే వస్తువులు లేదా భౌతిక అంశాలు, అవి కూడా భగవంతునికి చెందినవి. అప్పుడు నేను యజమానిని అని చెప్పుకునే అవకాశము ఎక్కడ ఉంది? దీనిని భ్రాంతి అని అంటారు. కాబట్టి ఈ కృష్ణ చైతన్య ఉద్యమం పునరుద్ధరణ కోసం ఉద్దేశించబడింది మానవ సమాజం యొక్క వాస్తవ చైతన్యం, ఎందుకంటే పిల్లులు, కుక్కలు లేదా జంతువులలో, అలాంటి చైతన్యమును తీసుకు రాలేము. వారు చాలా నిస్తేజంగా ఉంటారు చైతన్యము అధమ స్థాయిలో ఉన్నప్పుడు, వారికి అర్థం చేసుకోవడం సాధ్యం కాదు..