TE/Prabhupada 0645 - కృష్ణుడి సాక్షాత్కారం కలిగిన వ్యక్తి, ఆయన ఎల్లప్పుడూ వృందావనములో నివసిస్తున్నాడు

Revision as of 23:37, 1 October 2020 by Elad (talk | contribs) (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 6.1 -- Los Angeles, February 13, 1969


ప్రభుపాద: అవును, మీ ప్రశ్న ఏమిటి?

భక్తుడు: క్షీరోదకశాయి ప్రాణం లేని జీవరాసులలో ఉంటాడా? రాళ్లు వంటి ప్రాణంలేని జీవులలో?

ప్రభుపాద: హమ్?

భక్తుడు: క్షీరోదకశాయి ప్రాణం లేని జీవరాశుల్లో ఉంటాడా, భౌతికములో?

ప్రభుపాద: అవును, అవును, అణువులో కూడా.

భక్తుడు: తన చతుర్భుజ రూపంలో....?

ప్రభుపాద: అవును.

భక్తుడు: ఆయన ఏమిటి?

ప్రభుపాద: ఆయన ఎక్కడ నివసించినా, ఆయన సొంత సామాగ్రితో నివసిస్తాడు. Anor aniyan mahato mahiyan. ఆయన గొప్ప దాని కంటే గొప్పవాడు, ఆయన చిన్న దాని కంటే చిన్నవాడు. అది విష్ణువు. Andantara-stha-paramanu-cayantara-stham(BS 5.35). పరమాణు అంటే అణువు. మీరు అణువును కూడా చూడలేరు, ఎంత చిన్నదో. ఆయన ఆ పరమాణువులో ఉన్నాడు. ఆయన ప్రతీ చోటా వున్నాడు.

తమాల కృష్ణ: ప్రభుపాద, మీరు చెప్పారు ఎక్కడయితే కృష్ణుడు ఉన్నాడో, అది వృందావనము. నేను దేనికి ఆశ్చర్యపోతున్నానంటే, మన హృదయాలలో కృష్ణుడు ఉన్నట్లయితే, దాని అర్థం మన హృదయం లోపల ....

ప్రభుపాద: అవును. సాక్షాత్కారం కలిగిన వ్యక్తి, ఆయన వృందావనములో నివసిస్తున్నాడు, ఎక్కడైనా. ఆత్మ సాక్షాత్కారం కలిగిన వ్యక్తి ఎల్లప్పుడూ వృందావనములోనే నివసిస్తాడు. చైతన్య మహా ప్రభు అన్నారు. కృష్ణుని గురించి తెలుసుకున్న వ్యక్తి, అతడు ఎల్లప్పుడూ వృందావనంలోనే నివసిస్తాడు. ఆయన ఎక్కడా లేడు..... ఎలాగయితే కృష్ణుడు లేదా విష్ణువు ప్రతి ఒక్కరి హృదయంలో నివసిస్తున్నట్టు, కానీ, ఆయన కుక్క హృదయంలో కూడా నివసిస్తున్నారు. దాని అర్థం ఆయన కుక్క వంటి స్వభావం కలిగి వున్నట్లా? ఆయన వైకుంఠంలో నివసిస్తున్నాడు. ఆయన కుక్క హృదయంలో నివసిస్తున్నప్పటికీ, కానీ ఆయన వైకుంఠంలో నివసిస్తున్నాడు. అదేవిధముగా ఒక భక్తుడు ఏదో ప్రదేశంలో నివసిస్తున్నట్టు అనిపించవచ్చు అది వృందావనము నుండి చాలా దూరంలో ఉంది, కానీ ఆయన వృందావనములో నివసిస్తున్నాడు. అది వాస్తవము. అవును. (ముగింపు)