TE/Prabhupada 0765 - మీరు పూర్తిగా చైతన్యము కలిగి ఉండాలి, ప్రతీది కృష్ణుడికి చెందుతుంది మనది ఏదీ కాదు
Lecture on SB 1.13.11 -- Geneva, June 2, 1974
అకించన, అకించిన అంటే భౌతికమమైనది ఏదైనా కలిగి ఉండకపోవడము. అకించిన - గోచర. కుంతీ మహారాణి, ఆమె కృష్ణుడుని ఆహ్వానిస్తున్నపుడు, ఆమె పలికింది, నా ప్రియమైన కృష్ణా, నీవు అకించిన - గోచర ( SB 1.8.26) భౌతిక సంపద లేని వ్యక్తి చేతనే నీవు తెలుసుకొనబడతావు. నీవు మాకు ఇప్పుడు ఎంతో భౌతిక సంపద ఇచ్చావు. మేము ఎలా నిన్ను అర్థం చేసుకోగలము? అది.... కుంతి విచారం వ్యక్తం చేస్తూ “మేము బాధలో వున్నప్పుడు, నీవు ఎల్లప్పుడూ మాతో వున్నావు. ఇప్పుడు నీవు మాకు రాజ్యము ఇంకా ప్రతిదీ ఇచ్చావు. ఇప్పుడు నీవు ద్వారకకు వెళుతున్నావు. ఇది ఏమిటి, కృష్ణా? నీవు మాకు తోడుగా ఉండుటకు మేము తిరిగి ఆ బాధాకరమైన స్థితికి వెళ్ళుట మేలు.” అకించిన - గోచర. కృష్ణుడు అకించిన గోచరుడు. భౌతిక జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకునేవారు, పూర్తిగా కృష్ణ చైతన్యములో మారటం సాధ్యం కాదు. ఇది చాలా రహస్యం.
అందువల్ల చైతన్య మహాప్రభు అన్నారు, నిష్కించనస్య భగవద్ - భజనోముఖస్య ( CC Madhya 11.8) భగవద్ - భజన, భక్తునిగా కావాలని, కృష్ణచైతన్యము, నిష్కించనస్య కొరకు ఉద్దేశించబడింది, భౌతిక సంబంధమైన ఏది కలిగి ఉండని వారు. దాని అర్థం అతడు పేదవాడిగా ఉండాలని అర్థం కాదు. కాదు. " ఏది నాకు సొంతం కాదు; ప్రతీది కృష్ణుడికి చెందుతుంది అని పూర్తిగా అతడు గ్రహించి ఉండవలెను. నేను కేవలం అతడి సేవకుడిని, అంతే.” ఇది అకించన అంటారు. " కృష్ణుని ముందుగా ఉంచుకొని, నేను కొన్ని భౌతిక వస్తువులు కలిగి వుంటాను”, అని నేను అనుకుంటే అది మరొక మోసం. మీరు పూర్తిగా చైతన్యము కలిగి ఉండాలి, ప్రతీది కృష్ణుడికి చెందుతుంది మనది ఏదీ కాదు.” అప్పుడు కృష్ణుడు మీ సుహృదయుడు అవుతాడు. అప్పుడు కృష్ణుడు బాధ్యత తీసుకుంటాడు, మీ ప్రయోజనం ఎలా ఉంటుంది, అద్భుతంగా. తేషాం సతత - యుక్తానాం భజతాం ప్రీతి - పూర్వకం ధధామి ( BG 10.10) ప్రీతి - పూర్వకం. ఇది చాలా గొప్ప సంకల్పం, కృష్ణా, నాకు కేవలం నీవు కావాలి, ఏమీ లేదు. ఇంక ఏమీ వద్దు. న ధనం న జనం న సుందరీం కవితాం వా జగదీశ ( CC Antya 20.29) ఇది చైతన్య మహాప్రభు యొక్క ఉపదేశము. చైతన్య మహాప్రభు ఈ తత్వమును పదేపదే ప్రచారము చేశారు. నిష్కించనస్య భగవద్ - భజన. భగవద్ - భజన అంటే అతడు తానే నిష్కించన అవుతాడు. ఆయన కృష్ణుడు, అత్యంత సంపన్నమైనవాడు. త్యక్త్వా సురేప్సిత, సుదుస్త్వజ - సురెప్సిత - రాజ్య - లక్ష్మిం ( SB 11.5.34) చైతన్య మహాప్రభువుకు చాలా అందమైన భార్య ఉండేది, సంపద యొక్క దేవత, విష్ణు ప్రియ, లక్ష్మీ - ప్రియ. కానీ మొత్తం ప్రపంచం యొక్క ప్రయోజనం కొరకు, ఆయన కృష్ణుడే అయినప్పటికీ, ఆయన మనకు ఉదాహరణను చూపించాడు. ఇరవై నాలుగేళ్ల వయసులో, ఆయన సన్యాసం స్వీకరించాడు