TE/Prabhupada 0158 - తల్లిని చంపే నాగరికత
Lecture on SB 5.5.3 -- Stockholm, September 9, 1973
Nūnaṁ pramattaḥ kurute vikarma(SB 5.5.4). వికర్మ అంటే నిషిద్ధమైన, నేరపూరిత కార్యకలాపాలు. మూడు రకాల కార్యకలాపాలు ఉన్నాయి: కర్మ, వికర్మ, అకర్మ. కర్మ అంటే విధ్యుక్త ధర్మములు. అది కర్మ. ఉదాహరణకు sva-karmaṇā. భగవద్గీతలో: sva-karmaṇā tam abhyarcya (BG 18.46). ప్రతి ఒక్కరికీ విధ్యుక్త ధర్మములు ఉన్నాయి. శాస్త్రీయ అవగాహన ఎక్కడ ఉంది? అక్కడ ఉండాలి ... నేను మొన్నటి రోజు మాట్లాడినట్లు, మానవ సమాజంలో శాస్త్రీయ విభజన. అత్యంత తెలివైన వారిని బ్రాహ్మణులకు వలె శిక్షణ ఇవ్వలి. కొంచెం తక్కువ మేధస్సు ఉన్నవారికి, వారికి నిర్వాహకుడిగా శిక్షణ ఇవ్వాలి. తక్కువ తెలివితేటలు ఉన్నవారికి, వారిని వర్తకులుగా, వ్యవసాయదారులుగా ఆవుల సంరక్షకునిగా శిక్షణ ఇవ్వాలి. ఆర్థిక అభివృద్ధికి ఆవు రక్షణ అవసరమవుతుంది, కానీ ఈ ముర్ఖులకు అది తెలియదు. ఆర్థిక అభివృద్ధి అంటే ఆవులను చంపడము. కేవలము చూడoడి, రాస్కల్ నాగరికత. ఇది .క్షమించమని అడగకండి. ఇది శాస్త్రము నేను పాశ్చాత్య నాగరికతను విమర్శిస్తున్నాను అని అనుకోవద్దు. ఇది శాస్త్రములో చెప్పబడినది. చాలా అనుభవపుర్వకమైనది.
ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించే వారుచాలా మంది ఉన్నారు, కానీ ఆవు రక్షణ అనేది ఆర్థిక అభివృద్ధి అంశాలలో ఒకటి అని వారికి తెలియదు. ఈ ముర్ఖులు, వారికి తెలియదు. వారు ఆవుని చంపడం మంచిదని వారు భావిస్తున్నారు. కేవలం వ్యతిరేకం. దీనిని కురుటే వికర్మ అని అంటారు కేవలం నాలుక యొక్క సంతృప్తి కోసం. అదే ప్రయోజనం మీరు పాలు నుండి పొందవచ్చు, కానీ వారు రాస్కల్స్, పిచ్చివాళ్ళు, ఎందుకంటే ఆవు యొక్క రక్తం తినడం లేదా త్రాగటం పాలు త్రాగే దానికన్నా మంచిదని వారు భావిస్తారు. పాలు రక్తం యొక్క పరివర్తన మాత్రమే, అందరికి తెలుసు. అందరికి తెలుసు. ఒక మనిషి వలె, తల్లి, బిడ్డ జన్మించిన వెంటనే, బిడ్డ జన్మించక ముందు, మీరు తల్లి స్తనముల నుండి ఒక్క పాల చుక్కను కుడా కనుగొనలేరు. చూడండి. ఒక చిన్న అమ్మాయిలో, రొమ్ములో పాలు లేవు. కానీ బిడ్డ జన్మించిన వెంటనే వెంటనే పాలు ఉన్నాయి. వెంటనే, సహజంగానే. ఇది దేవుడు ఏర్పాటు. ఎందుకంటే పిల్లవానికి ఆహారం అవసరం. దేవుడు ఏర్పాటు ఎలా ఉందో చూడండి. అయినప్పటికీ, మనము ఆర్థిక అభివృద్ధికి ప్రయత్నిస్తున్నాము. ఒక బిడ్డ జన్మించినట్లయితే దేవుడి ఆర్థిక కార్యక్రమం చాలా బాగుంది, ప్రకృతి యొక్క ఆర్ధిక కార్యక్రమం, వెంటనే తల్లి పాలతో సిద్ధంగా ఉంటుంది ... ఇది ఆర్థిక అభివృద్ధి. అదే పాలు ఆవుచే సరఫరా చేయబడుతుంది. ఆమె నిజానికి తల్లి, ఈ దుష్ట నాగరికత తల్లిని చంపుతుంది. తల్లిని చంపే నాగరికత. చూడండి. మీ తల్లి యొక్క రొమ్ము పీల్చుకుంటారు. మీ జీవిత ప్రారంభం నుండి మీరు ఆమె వృదాప్యములో ఉన్నప్పుడు, "తల్లి వలన ఉపయోగం లేదు, భారముగా ఉన్నది, ఆమె గొంతును నరుకుద్దాము," ఇది నాగరికత?