TE/Prabhupada 0487 - ఇది బైబిల్ లేదా ఖురాన్ లేదా భగవద్గీత అని పట్టింపు లేదు. మనము ఫలితము ఏమిటో చూడాలి

Revision as of 10:43, 25 September 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 TELUGU Pages with Videos Category:Prabhupada 0487 - in all Languages Category:TE-Quotes - 1968 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture -- Seattle, October 18, 1968


ప్రభుపాద: ఏమైనా ప్రశ్నలున్నాయా?

జాహ్నవ: క్రీస్తు చైతన్యం మరియు కృష్ణ చైతన్యము, పదాలు రెండు ఒకే రకముగా ఉన్నాయి దయచేసి పదాలను కలిపి, ఈ పదాలు మనకు ఎలా వచ్చాయో వివరించండి.

ప్రభుపాద: నేను అనేకసార్లు వివరించాను - ఒక పాకెట్ నిఘంటువు మరియు అంతర్జాతీయ నిఘంటువు. మీరు పాకెట్ నిఘంటువును నిఘంటువు కాదు అని చెప్పలేరు, కాని అది ఒక నిర్దిష్ట తరగతి విద్యార్థి కోసము ఉద్దేశించబడింది. అంతర్జాతీయ నిఘంటువు ఒక నిర్దిష్ట తరగతి విద్యార్థులకు ఉద్దేశించబడింది. వారు అందరు విద్యార్ధులే.. క్రీస్తు ... క్రీస్తు మాట్లాడినది, అది కూడా దేవుడి చైతన్యమే, కాని అది ఒక నిర్దిష్ట తరగతి వ్యక్తుల కోసం ఉద్దేశించబడింది. ఏ తరగతి వ్యక్తులు వారు? వారు సంపూర్ణ నాగరికులు కూడా కాదు. క్రీస్తు దేవుడి చైతన్యమును వివరిస్తున్నారు. ఇది ఆయన తప్పు అని, వారు ఆయనని శిలువ వేశారు. ఏ తరగతి వ్యక్తులు వారు? ఆలోచించండి. ఆయన ఏకైక దోషం ఆయన దేవుణ్ణి గురించి వివరిస్తున్నాడు, వారు ఆయనకు శిలువ వేశారు. బహుమానం శిలువ వేయడము. వాళ్ళు ఏ రకమైన తరగతి వ్యక్తులు వారు? ఆ సమాజం యొక్క స్థితి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కావున ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఏదైతే చెప్పబడిందో, అది వారికి సరిపోతుంది. కాని అర్జునుడు వంటి వ్యక్తికి భగవద్గీత చెప్పినప్పుడు, అది విభిన్నమైన విషయము. కాబట్టి మనము ప్రేక్షకుల ప్రకారం, పరిస్థితులకు అనుగుణంగా, సమయం ప్రకారం మాట్లాడవలసి ఉంటుంది. ఇక్కడ కొద్దిమంది మాత్రమే హాజరవుతున్నారని మీరు చూడలేదా? ఎందుకు? వారు ఈ కృష్ణ చైతన్యమును అర్థం చేసుకోలేరు, కృష్ణ చైతన్యము. ఇది అన్ని తరగతుల వ్యక్తుల కోసం కాదు. ఇది దేవుడు చైతన్యము యొక్క అత్యధిక ప్రమాణము. ప్రేమ. దేవుడు మీద ప్రేమ. కాబట్టి దేవుడి ప్రేమ ఉపదేశములు కూడా ఉన్నాయి, నిస్సందేహంగా. ఇది తేడా. ఒకే విషయము. ఎల్లప్పుడూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రాధమిక దశలో విద్యార్థులకు చిన్న జేబులో ఉండే నిఘంటువు, ఉన్నత విద్యార్ధుల కొరకు అంతర్జాతీయ నిఘంటువు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు, అవి రెండు నిఘంటువులు. కాని ఇది కొంత మంది కోసం ఉద్దేశించబడింది, ఇది కొంత మంది కోసం ఉద్దేశించబడింది. పరీక్ష phalena paricīyate phalena paricīyate, మీరు అర్థం చేసుకోవాలి. మీరు అడవిలో ప్రయాణిస్తున్నారని అనుకుందాం. చాలా చెట్లు ఉన్నాయి. కాని ఈ చెట్టు ఏమిటి, ఆ చెట్టు ఏమిటి మీరు అర్థం చేసుకోలేరు. కాని మీరు పువ్వును చూసిన వెంటనే," ఇక్కడ ఆపిల్ ఉంది, ఇది ఆపిల్ వృక్షం." మొన్నటి రోజు మీరు నాకు చెప్పుతున్న విధముగా, మీరు ఆపిల్ చెట్టును ఎన్నడూ చూడలేదు. అవును. ఇప్పుడు, ఆపిల్ ను చూసిన వెంటనే, "ఇది ఆపిల్ వృక్షం !" ఏ శాస్త్రము యొక్క పరీక్ష అయినా వ్యక్తులు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నారు.Phalena paricīyate. మీరు కొన్ని మత సూత్రాలను అనుసరిస్తే, దేవుడు ప్రేమను మీరు అభివృద్ధి చేసుకుంటున్నారు, అది సంపూర్ణము. ఇది బైబిల్ లేదా ఖురాన్ లేదా భగవద్గీత అని పట్టింపు లేదు. ఇది పట్టింపు లేదు. మనము ఫలితము ఏమిటో చూడాలి. ఫలితము ప్రజలు భగవంతుని ప్రేమ అభివృద్ధి చేసుకుంటూ ఉంటే, అప్పుడు అది పరిపూర్ణ౦గా ఉంటుoది. అర్థం చేసుకోవటానికి ప్రయత్నించకండి ఇది మంచిదేనా, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది ... కాదు. ఫలితము ఆధారముగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అదేవిధముగానే: మీరు ఫలితము చూసినట్లయితే, అది మొదటి తరగతి. కాబట్టి అది బైబిలా లేదా గీత అనే విషయము పట్టింపు లేదు. మీరు బైబిలు చదవడం ద్వారా దేవుడిపట్ల ప్రేమను పెoపొoదిoచుకుంటే, అది మొదటి తరగతి, మీరు భగవద్గీత ద్వారా భగవంతుని ప్రేమను అభివృద్ధి చేసుకోగలిగితే, అది మొదటి తరగతి. అలా చేయకపోతే, అది బైబిల్ లేదా ఖురాన్ లేదా భగవద్గీత, అది మీకు ఎలాంటి ప్రభావం చూపలేదు. ఇది మీ ఇష్టం. పోలిక ద్వారా కాదు, కాని మీ స్వంత కార్యక్రమాలను పట్టి. ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన ఉపదేశాన్ని మీరు అనుసరిస్తే, మీరు కూడా భగవంతుని ప్రేమను అభివృద్ధి చేసుకుంటారు. ఎటువoటి సందేహం లేదు. అదేవిధముగా, మీరు కృష్ణుడి ఉపదేశమును అనుసరిస్తే, మీరు కూడా అభివృద్ధి చేసుకుంటారు. ఇది మీ ఇష్టం. మీరు అనుసరించడానికి ప్రయత్నిoచండి. మీరు అనుసరించకపోతే, తులనాత్మక అధ్యయనం చేయడానికి ప్రయత్నించండి, ఇది మంచిది లేదా "ఇది చెడ్డది", "ఇది చెడ్డది" లేదా "ఇది మంచిది" అది śrama eva hi kevalam (SB 1.2.8) అని పిలవబడుతుంది - కేవలం చాకిరీ. ఎందుకు తులనాత్మక అధ్యయనం? మీరు దేవుడి మీద ఎంత ప్రేమను అభివృద్ధి చేసుకుంటున్నారో చూడండి, అంతే. Phalena paricīyate. "ఈ ఆపిల్ ఉందా లేదా, అంతే; ఈ చెట్టు ఏమిటి అని పట్టించుకోవలసిన అవసరము లేదు. నేను ఆపిల్ ఉందా లేదా అని ఆలోచిస్తాను "