TE/Prabhupada 0621 - కృష్ణ చైతన్య ఉద్యమం ప్రామాణికునికి విధేయతగా ఉండమని ప్రజలకు ప్రచారమును చేస్తుంది

Revision as of 07:21, 9 December 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0621 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 13.1-2 -- Miami, February 25, 1975


కాబట్టి మన కృష్ణ చైతన్య ఉద్యమం ప్రామాణికునికి విధేయతగా ఉండమని ప్రజలకు ప్రచారమును చేస్తుంది. ఇది జ్ఞానము యొక్క ఆరంభం. Tad viddhi praṇipātena paripraśnena sevayā ( BG 4.34) మీరు ఆధ్యాత్మిక విషయము తెలుసుకోవాలనుకుంటే, ఇది మీ ఆలోచనా పరిధిని, అనుభూతి సంకల్పమునకు మించినది... మానసిక కల్పన, అంటే ఆలోచించడము, అనుభూతి చెందడము మరియు సంకల్పము చేయడము, మనస్తత్వము. కానీ మీ ఆలోచనకు మించిన విషయము ఇది. కాబట్టి భగవంతుడు లేదా భగవంతుని గురించి ఏదైనా మన ఆలోచన, కల్పన పరిమితి దాటి ఉంది. కాబట్టి, మనం దానిని విధేయతతో నేర్చుకోవాలి. Tad viddhi praṇipātena, ప్రణిపాత అంటే శరణాగతి పొందుట. Prakṛṣṭa-rūpeṇa nipāta. Nipāta అంటే శరణాగతి పొందుట. Tad viddhi praṇipātena paripraśnena. మొదట మీరు పూర్తిగా శరణాగతి పొందటానికి ఎవరినైనా కనుగొనండి. అప్పుడు మీరు ఆధ్యాత్మిక విషయము గురించి ప్రశ్నించండి.

ఉదాహరణకు అర్జునుడు ఖచ్చితంగా అనుసరిస్తున్నాడు. ఆయన మొదట కృష్ణుడికి శరణాగతి పొందాడు Śiṣyas te 'haṁ śādhi māṁ prapannam: ( BG 2.7) "నా ప్రియమైన కృష్ణా, మనం స్నేహపూర్వకంగా మాట్లాడుతున్నాము, కాబట్టి సమాన స్థాయిలో. మీరు ఏదో మాట్లాడతారు, నేను ఏదో మాట్లాడతాను. ఈ విధముగా మనము కేవలం మన సమయం వృథా చేసుకుంటున్నాము, దానికి ముగింపు లేదు.అందువలన, నేను శిష్యుడిగా శరణాగతి పొందుతున్నాను. మీరు ఏమి చెప్పినా, నేను అంగీకరిస్తాను. "

ఇది మొదటి షరతు. మొదటగా ఒక వ్యక్తిని మీరు కనుగొనండి,ఎవరి యందు మీరు పూర్తి విశ్వాసము కలిగి ఉంటారో , ఆయన ఏమి చెప్పినా మీరు అంగీకరిస్తారో అటువంటి వారిని మీరు కనుగొనండి. అది గురువు అంటే. మీరు మీకు మీ గురువు కంటే బాగా తెలుసు అని అనుకుంటే, అప్పుడు ఉపయోగం లేదు. మొదట మీరు మీకంటే మెరుగైన వ్యక్తిని గుర్తించండి. అప్పుడు మీరు ఆయనకు శరణాగతి పొందండి. అందుచే నియమాలు నిబంధనలు ఏమిటంటే ఎవరూ గుడ్డిగా ఏ గురువుని అంగీకరించ కూడదు, ఎవరూ గుడ్డిగా ఏ శిష్యుడినీ అంగీకరించ కూడదు. వారు కనీసం ఒక సంవత్సరం పాటు, ప్రవర్తించాలి కాబట్టి కాబోయే శిష్యుడు కూడా అర్థం చేసుకోగలడు, నా గురువుగా ఈ వ్యక్తిని నేను అంగీకరించ వచ్చా కాబోయే గురువు కూడా అర్థం చేసుకోగలడు, "ఈ వ్యక్తి నా శిష్యుడు కాగలడా." ఇది సనాతన గోస్వామి తన హరి-భక్తి-విలాసంలో ఉపదేశము.

ఇక్కడ అర్జునుడు కృష్ణుడిని తన గురువుగా అంగీకరించారు. ఆయన విధేయుడిగా చెప్పుచున్నారు ఆ prakṛtiṁ puruṣaṁ caiva. ప్రకృతి, ప్రకృతి అంటే ప్రకృతి, పురుష ప్రకృతిని ఆనందించే వాడు అని అర్ధము. ఈ భౌతిక ప్రపంచంలో, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో, అభివృద్ధి చెందుతున్న అభివృద్ధి చెందని దేశాలంటే వారికి చాలా ఇష్టం. అంటే దోచుకోవడము, లేదా పురుష, పురుషుడు అవ్వటము , ఆనందించడము. మీరు అమెరికన్లు, మీరు ఐరోపా నుండి వచ్చారు, ఇప్పుడు మీరు మొత్తం అమెరికా ను అభివృద్ధి చేసినారు, చాలా మంచి నగరాలు, పట్టణాలు బాగా అభివృద్ధి చెందినది. దీనిని వనరులను దోపిడీ చేయడము అని పిలుస్తారు.

కాబట్టి ప్రకృతి, మనము, జీవులము ప్రత్యేకించి మానవులు, వారు పురుషులు. కానీ నిజానికి మనము ఆస్వాదించలేము. మనము ఆనందించేవారిమి కాదు ఈ కోణంలో మనము ఆనందించే వారిమి కాదు: ఉదాహరణకు మీరు అమెరికన్లు మీరు అమెరికాకు చెందిన ఈ భూభాగాన్ని చాలా చక్కగా అభివృద్ధి చేశారు. కానీ మీరు ఆనందించలేరు. మీరు ఆనందిస్తున్నట్లు మీరు ఆలోచిస్తున్నారు, కానీ మీరు ఆనందించలేరు. కొంత సమయం తరువాత మిమ్మల్ని బయట పడవేస్తారు "బయటకు వెళ్ళండి". అప్పుడు మీరు ఎలా ఆనందించే వారు అవుతారు? మీరు "కనీసం యాభై సంవత్సరాలు లేదా వంద సంవత్సరాలు నేను ఆనందిస్తాను" అని అనుకోవచ్చు. కాబట్టి మీరు ఆనందిస్తారని మీరు చెప్పవచ్చు, ఆనందం అని పిలవబడేది. కానీ మీరు శాశ్వతముగా ఆనందాన్ని పొందే వారు కాదు. అది సాధ్యం కాదు