TE/Prabhupada 0781 - యోగా యొక్క పరిపూర్ణము అంటే కృష్ణుడి యొక్క కమల పాదముల వద్ద మనస్సును స్థిరముగా ఉంచుట
Lecture on SB 6.1.21 -- Chicago, July 5, 1975
ఆ అర్హత కలిగిన బ్రాహ్మణుడు ఎవరు? మీరు చాలా సార్లు విన్నారు: śamo damaḥ satyaṁ śaucam ārjavaṁ titikṣā, jñānaṁ vijñānam āstikyaṁ brahma-karma svabhāva-jam ( BG 18.42) ఈ లక్షణాలు అభివృద్ధి చేసుకోవాలి. మొట్ట మొదట, సమ. మనస్సు స్థితి, సమ అంటే సమతుల్యత. మనస్సు ఎప్పుడూ కలవరపడదు. మనస్సుకు చాలా కారణాలు ఉంటాయి కలత చెందడానికి. మనస్సు కలత చెందనప్పుడు, దానిని సమః అంటారు. Guruṇāpi duḥkhena na vicālyate. అది యోగా యొక్క పరిపూర్ణము.
- yaṁ labdhvā cāparaṁ lābhaṁ
- manyate nādhikaṁ tataḥ
- yasmin sthite guruṇāpi
- duḥkhena na vicālyate
- (BG 6.22)
ఇది శిక్షణ. మనస్సు చాలా అనిశ్చలముగా ఉంటుంది. అయిదు వేల సంవత్సరాల క్రితం కూడా, అర్జునునికి, కృష్ణుడు సలహా ఇచ్చినప్పుడు, ఆ "నీవు నీ నిశ్చలముగా లేని మనస్సును స్థిరముగా పెట్టుకో," ఆయన స్పష్టంగా చెప్పాడు, "కృష్ణా, అది సాధ్యం కాదు." Cañcalaṁ hi manaḥ kṛṣṇa pramāthi balavad dṛḍham ( BG 6.34) నా మనస్సు ఎల్లప్పుడూ చాలా ఆందోళన కలిగిస్తుంది అని నేను చూస్తున్నాను, మనస్సుని నియంత్రించడమనేది సరిగ్గా గాలిని ఆపడానికి ప్రయత్నించడము వంటిది. కాబట్టి అది సాధ్యం కాదు. "కానీ వాస్తవానికి ఆతని మనస్సు కృష్ణుని మీద స్థిరముగా ఉంది. కాబట్టి, కృష్ణుని కమల పాదాల వద్ద స్థిర మనస్సు ఉన్నవారు, వారు జయించారు. వారి మనస్సు స్థిరముగా ఉంది. అది కావలసినది. Sa vai manaḥ kṛṣṇa-padāravindayor vacāṁsi vaikuṇṭha-guṇānuvarṇane ( SB 9.4.18) ఇవి అంబరీష మహారాజు యొక్క అర్హతలు. ఆయన చాలా బాధ్యతగల చక్రవర్తి, కానీ ఆయన మనసు కృష్ణుడి యొక్క కమల పాదముల వద్ద స్థిరముగా ఉంది. అది కావలసినది.
కాబట్టి ఇది బ్రాహ్మణుల అర్హత, కృష్ణుని యొక్క కమల పాదముల వద్ద మనస్సును స్థిరముగా ఉంచుటకు ఎలా సాధన చేయాలి, అది యోగా యొక్క పరిపూర్ణత. యోగ అంటే... కొన్ని ఇంద్రజాల విన్యాసాలు చూపించడము కాదు. యోగా యొక్క వాస్తవమైన పరిపూర్ణము కృష్ణుడి యొక్క కమల పాదముల వద్ద మనస్సును స్థిరముగా ఉంచుకొనుట అని అర్థం. కాబట్టి భగవద్గీతలో ఈ యోగ అధ్యాయపు ఆఖరి సారంశము, ఆరవ అధ్యాయం,
- yoginām api sarveṣāṁ
- mad-gatenāntar-ātmanā
- śraddhāvān bhajate yo māṁ
- sa me yuktatamo mataḥ
- (BG 6.47)
అది అర్జునుడికి ప్రోత్సహాన్ని కలిగిస్తుంది, ఎందుకంటే అర్జునుడు అనుకున్నాడు, "అప్పుడు నేను ఎందుకు పనికి రాను, నేను స్థిరముగా ఉండలేను" కానీ ఆయన మనస్సు ఇప్పటికే స్థిరముగా ఉంది. అందువలన కృష్ణుడు ఆయనని ప్రోత్సహించాడు, "నిరుత్సాహపడకు. ఎవరి మనసైనా ఎల్లప్పుడూ నా పై స్థిరముగా ఉంటే, ఆయన మొదటి తరగతి, ఉన్నత యోగి." కావున మనము ఎప్పుడూ కృష్ణుని గురించి ఆలోచిస్తూ ఉండాలి. అది హరే కృష్ణ మంత్రం. మీరు హరే కృష్ణ, హరే కృష్ణ జపము చేస్తే, దాని అర్ధము మీ మనస్సు కృష్ణునిపై స్థిరముగా ఉంది అని అర్థం. ఇది యోగ యొక్క పరిపూర్ణము. కాబట్టి ఒక బ్రాహ్మణుడు కావడము, ఇది మొదటి అర్హత: మనస్సును స్థిరంగా ఉంచుకోవడము, ఆందోళన చెందకుండా ఉండటము, సమ. మీ మనస్సు స్థిరముగా ఉన్నప్పుడు, అప్పుడు మీ ఇంద్రియాలు నియంత్రించ బడతాయి. మీరు మీ మనస్సులో స్థిరముగా అనుకుంటే "నేను కేవలము హరే కృష్ణ మంత్రమును జపము చేస్తాను ప్రసాదం తీసుకుంటాను, ఇక పై ఏ ఇతర పని చేయను " అప్పుడు ఇంద్రియాలు సహజముగా నియంత్రించబడతాయి. Tā'ra madhye jihwā ati, lobhamoy sudurmati.