TE/Prabhupada 0009 - భక్తునిగా మారిన దొంగ

Revision as of 10:06, 2 April 2015 by Rishab (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0009 - in all Languages Category:TE-Quotes - 1972 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture on SB 1.2.12 -- Los Angeles, August 15, 1972

కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. [Bg. 7.25] నాహం ప్రకాశః సర్వస్య యోగ-మాయ, సమవ్ర్తః "నేను ప్రతి ఒక్కరికి కనపడను.యోగమయ, యోగమయ కప్పుతోంది." కాబట్టి మీరు దేవున్ని ఎలా చూడగలరు? కానీ ఈ దురాచకం కొనసాగుతోంది, "మీరు భగవంతుడును నాకు చూపిస్తారా? మీరు భగవంతుడిని చూసారా?" భగవంతుడు ఒక ఆట వస్తువు అయిపోయాడు. "ఇదిగో దేవుడు.ఈయన దేవుని అవతారం." [Bg. 7.15] న మం దుస్క్ర్తినో ముదః ప్రపద్యన్తే నరద్మః వారు పాపులు, జులయులు, అవివేకులు, మానవజాతిలో అత్యల్పముమైన వారు. వాళ్ళు ప్రశ్నిస్తారు: "మీరు నాకు భగవంతుడిని చూపిస్తారా?" మీరు ఎటువంటి అర్హత సాధించారు, భగవంతుడును చూడటానికి? ఇక్కడ ఉంది అర్హత. అది ఏమిటి? తక్ చ్రద్దధన మునయః ఒకరు మొదటిగా విశ్వాసం కలిగి ఉండాలి. నమ్మకమైన. స్రద్దధనహ్. నిజానికి అతను, దేవుణ్ణి చూడటానికి చాలా ఆసక్తి కలిగి ఉండాలి. ఒక సాధారణ, అల్పమైన కోరికగా కాదు, "మీరు నాకు భగవంతుడుని చూపుతారా?" ఒక మాయ, భగవంతుడు అంటే కేవలం ఒక మాయ లాగా. కాదు.అతను చాలా శ్రద్ధ కలిగి ఉండాలి: "అవును, భగవంతుడు ఉన్నట్లు అయితే... మేము చూసాము, మేము భగవంతుడు గురించి తెలుసుకోవడం జరిగింది. కావున నేను తప్పక చూడాలి." దీనికి సంభందించి ఒక కథ ఉంది. ఇది చాలా వివరణాత్మకంగా ఉంటుంది; వినడానికి ప్రయత్నించండి. భాగవతంని ఒక ప్రొఫెషనల్ (వృత్తిలో నిపుణుడు) వల్లించేవాడు చెబుతున్నాడు. మరియు అతను కృష్ణుని గురించి వివరిస్తున్నాడు, బాగా అన్ని ఆభరణాలుతో అలంకరించబడి ఉంటాడు, అతను ఆవులు కాచుట కొరకు అరణ్యానికి వెళ్ళాడు. ఆ సభలో ఒక దొంగ ఉన్నాడు. అందువలన అతను అనుకున్నాడు ఎందుకు వ్రిందా వనానికి వెళ్ళి, ఈ బాలుడుని దోపిడీ చేయకూడదు? అతను చాలా విలువైన రత్నాలుతో అడవిలో ఉన్నాడు. నేను అక్కడికి వెళ్లి పిల్లాడిని పట్టుకుని అన్ని ఆభరణాలను తీసుకొనవచ్చు." అది తన ఉద్దేశం. కావున అతను బాలుడును కనుగునేందుకు చాలా తీవ్రమైన నిశ్చయంతో ఉన్నాడు అప్పుడు నేను ఒక రాత్రిలో లక్షాధికారి అవ్వగలను. చాలా నగలు.కాదు." కావున అతను వెళ్ళాడు, కానీ అతని అర్హత మాత్రం "నేను కృష్ణుడిని తప్పకుండా చూడాలి, నేను కృష్ణుడిని తప్పకుండా చూడాలి," ఆ ఆందోళన, ఆ ఆసక్తి వల్ల వ్రిందావనంలో కృష్ణుడిని చూడటానికి అతనికి సాధ్యపడింది. అతను కృష్ణుడిని భాగవతం చెబుతున్న వ్యక్తి చెప్పినట్లే చూసాడు. అప్పుడు అతను చూసి, "ఓహ్; ఓహ్, నువ్వు చాలా మంచిగా ఉన్నావు, కృష్ణ." కావున అతను కృష్ణుడిని పొగడడం మొదలు పెట్టాడు. కృష్ణుడిని పొగడడం వల్ల తాను కొన్ని నగలు తీసుకొనవచ్చు అని అనుకున్నాడు. అతను తన అసలు విషయం చెప్పినప్పుడు, "నేను మీ ఈ ఆభరణాలు కొన్ని తీసుకొనవచ్చా? మీరు చాలా ధనవంతుడిగా ఉన్నారు." "లేదు, లేదు,లేదు నువ్వు తీసుకోవడానికి లేదు...మా అమ్మగారు కోపగించుకుంటారు. నేను ఇవ్వలేను.." కృష్ణుడు చిన్న పిల్లాడి వలె. కావున అతను మరింత ఆసక్తి కృష్ణుడి ఫై చూపించాడు. మరియు అప్పుడు.. కృష్ణుడితో ఉన్న బంధం వలన, అతను అప్పటికే శుద్ధి అయ్యాడు. అప్పుడు, చివరిగా, కృష్ణుడు చెప్పాడు, " సరే, నువ్వు తీసుకొనవచ్చు." అప్పుడు అతను వెంటనే, ఒక భక్తుడయ్యాడు. ఎందుకంటే కృష్ణుడితో ఉన్న సాంగత్యం వలన... కావున ఏదో ఒక విధంగా, మనము కృష్ణుడితో సాన్నిహిత్యంగా ఉండాలి. ఏదో ఒక విధంగా. అప్పుడు మనము పరిశుద్దులు అవుతాము