TE/Prabhupada 0996 - నేను అమెరికన్ బాలురకు బాలికలకు నా వెనుక రావడానికి లంచము ఇవ్వలేదు కీర్తన మాత్రమే ఆస్తి

Revision as of 10:27, 4 November 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Telugu Pages - 207 Live Videos Category:Prabhupada 0996 - in all Languages Category:...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


730406 - Lecture SB 02.01.01-2 - New York


నేను అమెరికన్ బాలురకు మరియు అమ్మాయిలకు నా వెనుక రావడానికి లంచము ఇవ్వలేదు. కీర్తన మాత్రమే ఆస్తి

ప్రభుపాద: కావున పరిక్షిత్ మహా రాజు శుకదేవ గోస్వామిని ​​ప్రశ్నించారు... నా బాధ్యత ఏమిటి? ఇప్పుడు ఏడు రోజులలో నేను చనిపోతాను, నా బాధ్యత ఏమిటి? అందువలన ఆయన కృష్ణుడి గురించి విచారణ ఇచ్చాడు. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు, అర్జునుడి యొక్క మనవడు, వైష్ణవ కుటుంబములో జన్మించాడు... పాండవులు, వారు వైష్ణవులు మరియు కృష్ణుని భక్తులు, బాల్యం నుండి ఆయన కృష్ణుడిని ఆరాధించే అవకాశాన్ని కలిగి ఉన్నాడు. కృష్ణుడు అర్చామూర్తితో ఆయన (ఆడుకుంటున్నాడు) ఆడుకున్నాడు, అందువలన కృష్ణుడి గురించి శ్రవణము చేయడానికి సహజంగా ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. అందువలన ఆయన విచారణ చేశాడు, "నా బాధ్యత ఏమిటి? నేను కేవలము కృష్ణుడి గురించి లేదా వేరొకరి గురించి వినాలా? " కాబట్టి ఈ ప్రశ్న విన్నప్పుడు, శుకదేవ గోస్వామి అభినందనలు తెలుపుతున్నారు, varīyān eṣa te praśnaḥ: ( SB 2.1.1) ఓ, మీ ప్రశ్న చాలా అద్భుతమైనది, చాలా స్వాగతిస్తున్నాను, varīyān. వరీయాన్ అర్థం "చాలా స్వాగతిస్తున్నాను ," నేను ఇచ్చినది, varīyān. కీర్తింపదగినది, అవును. "కీర్తింపదగిన ప్రశ్నః , ఎందుకంటే మీరు కృష్ణుడి గురించి ప్రశ్నించారు."

కావున varīyān eṣa te praśnaḥ kṛto loka-hitaṁ nṛpa: ( SB 2.1.1) నా ప్రియమైన రాజా, ఈ ప్రశ్న ప్రపంచంలోని ప్రజలందరికీ అన్ని విధముల శుభప్రదమైనది మీరు కేవలము కృష్ణుడి గురించి ప్రశ్నించినప్పుడు లేదా కృష్ణుడి గురించి విన్నప్పుడు, మనకు అర్థం కానప్పటికీ, కృష్ణుడి యొక్క ఆ శబ్ద కంపనము... ఉదాహరణకు హరే కృష్ణ మంత్రమును కీర్తించుచున్నట్లుగా, మనకు హరే కృష్ణ అంటే ఏమిటో అర్థం కాకపోవచ్చు, అయినప్పటికీ, అది దివ్యమైన ధ్వని కనుక, అది శుభకరమైనది. మీరు ఎక్కడ హరే కృష్ణ ను కీర్తన చేసినా వారు వినవచ్చు లేదా వారు వినకపోవచ్చు, అది వారికి శుభకరమైనది. మనము మన వ్యక్తులను వీధిలో సంకీర్తన చేయడము కోసము పంపుతున్నాము. ప్రజలు దాన్ని వినటానికి ఉత్సాహంగా ఉన్నారా లేదా అనే విషయము పట్టింపు లేదు, కానీ ఇది వారికి శుభకరమైనది. ఇది మానవ సమాజానికి చాలా, చాలా అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. అది మన సూత్రం. అంతే కానీ మనము కీర్తన చేస్తున్నాము కనుక, ఎవరూ పట్టించుకోవడము లేదు అని, మనము నిరాశ చెందకూడదు. మన, ఈ సంకీర్తన ఉద్యమం చాలా మంచిది, కేవలము కీర్తన చేయడము ద్వారా ఈ శబ్ద ప్రకంపనము ఒక పవిత్రమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది, varīyān eṣa te praśnaḥ ( SB 2.1.1) ఇప్పుడు మీరు ఆచరణాత్మకంగా చూడగలరు, ఎవరైతే పాత సభ్యులు ఉన్నారో వారు... కాబట్టి నేను ఈ న్యూయార్క్ లో దుకాణం ముందర కేవలము కీర్తన చేయడము ద్వారా మొదలుపెట్టాను. అందువల్ల నేను నా వెంట వచ్చిన అమెరికన్ బాలురకు మరియు బాలికలకు లంచం ఇవ్వలేదు. ఇది మాత్రమే ఆస్తి. కీర్తన చేయడము ఆ టాంప్కిన్సన్ స్క్వేర్ పార్క్ లో, ఈ బ్రహ్మానంద స్వామి ఆయన మొదటగా నా కీర్తనలో నృత్యము చేయడానికి వచ్చాడు. (నవ్వు) ఆయన మరియు అచ్యుతానంద, అది మన కృష్ణ చైతన్యము ఉద్యమములో మొదటి నృత్యము. (నవ్వు) అవును. మరియు నా దగ్గర మృదంగము కూడా లేదు.అది ఏమిటి, అది ఏమిటి?

భక్తుడు: డ్రమ్.

ప్రభుపాద: డ్రమ్, చిన్న డ్రమ్. అందుకే నేను హరే కృష్ణ కీర్తనను రెండు నుండి ఐదు వరకు, మూడు గంటలు కీర్తన చేస్తున్నాను, చాలా మంది అబ్బాయిలు మరియు అమ్మాయిలు వస్తున్నారు మరియు చేరినారు, టైమ్స్ పత్రికలో మొదటి ఫొటోగ్రాఫ్ వచ్చినది. న్యూ యార్క్ టైమ్స్, వారు మెచ్చుకున్నారు, ప్రజలు కూడా ప్రశంసించారు. కాబట్టి ఈ కీర్తన, ప్రారంభములో కేవలము కీర్తన మాత్రమే జరిగినది. ఏమీ లేదు, అంతకన్నా ఏమీ లేదు. ఆ సమయంలో ప్రసాద వితరణ కార్యక్రమము లేదు. అది, తరువాత అది వచ్చింది. కాబట్టి మనము ఎల్లప్పుడూ నమ్మకం కలిగి ఉండాలి ఈ కీర్తన ఈ భౌతిక ప్రపంచం యొక్క శబ్ద ప్రకంపనము కాదు. ఇది భౌతిక ప్రపంచం యొక్క శబ్ద కంపనం కాదు. నరోత్తమా దాసా ఠాకురా చెప్తారు, golokera prema-dhana hari-nāma-saṅkīrtana.. ఇది ఆధ్యాత్మిక ప్రపంచం నుండి దిగుమతి చేయబడింది. ఇది పూర్తిగా ఆధ్యాత్మికం. లేకపోతే ఎలా సాధ్యమవుతుంది? కొన్నిసార్లు యోగులు అని పిలవబడే వారు, వారు చెప్తారు కీర్తన... బాంబే లో ఒక దుష్టుడు అని అని పిలవబడే వాడు ఉన్నాడు, ఆయన చెప్తాడు, హరే కృష్ణ మంత్రాన్ని కీర్తన చేయడము మరియు కోకా-కోలా కీర్తన చేయడము ఒక్కటే అని అంటాడు. ఆయన ఒక దుష్టుడు. ఇది ఈ భౌతిక ప్రపంచం యొక్క శబ్ద ప్రకంపనము కాదని ఆయనకు తెలియదు. కానీ జ్ఞానం లేని వారు, "ఈ కీర్తన అర్థం ఏమిటి, హరే కృష్ణ, హరే కృష్ణ?" అని ఆలోచిస్తారు కానీ వారు ఆచరణాత్మకంగా చూస్తున్నారు మనము పగలూ రాత్రి కీర్తన చేస్తూ ఉంటాము అయినా మనం అలసిపోము, కానీ మీరు ఏ ఇతర భౌతిక పేరును అయినా తీసుకోండి, మూడు సార్లు కీర్తన చేసిన తరువాత మీరు అలసిపోతారు. అది రుజువు. మీరు పగలూ రాత్రి కీర్తన చేస్తూ ఉండండి, మీరు ఎప్పటికీ అలసటను అనుభూతి చెందరు. కాబట్టి ఈ ప్రజలు, పేద ప్రజలు, అర్థం చేసుకోవడానికి వారికి మనస్సు లేదు.