TE/Prabhupada 0658 - శ్రీమద్-భాగవతం మహోన్నతమైనది. జ్ఞాన-యోగ మరియు భక్తి-యోగ రెండు కలిసి దానిలో ఉన్నాయి

Revision as of 07:06, 14 October 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0658 - in all Languages Category:TE-Quotes - 1969 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 6.13-15 -- Los Angeles, February 16, 1969


భక్తులు: కీర్తి అంతా శ్రీల ప్రభుపాదుల వారికి ప్రభుపాద: హరే కృష్ణ. సాంఖ్య-యోగ అనేది అష్టాంగ యోగ. ఈ కూర్చుండే భంగిమ మరియు ధ్యానం, దీనిని సాంఖ్య -యోగ అంటారు. జ్ఞాన యోగ అంటే తత్వశాస్త్ర పద్ధతి ద్వారా అని అర్థం. విశ్లేషణాత్మక పద్ధతి ద్వారా బ్రహ్మణ్ అంటే ఏమిటి? బ్రహ్మణ్ కానిది అంటే ఏమిటి? నేతి నేతి. అది జ్ఞాన-యోగ. ఉదాహరణకు వేదాంత-సూత్ర, జ్ఞాన యోగ మీరు వేదాంత-సూత్రాన్ని అధ్యయనం చేస్తారు, ఇది janmādy asya yataḥ ( SB 1.1.1) అని చెపుతుంది. అవి ఒక సూచన సంకేతాలను ఇస్తాయి, మహోన్నతమైన బ్రహ్మణ్, పరమ సత్యము, ఎవరి నుండి ప్రతిదీ వ్యక్తమవుతుందో. ఇప్పుడు మనము అది ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇది శ్రీమద్-భాగవతం లో వివరించబడింది. పరమ సత్యము యొక్క స్వభావం ఏమిటి. శ్రీమద్-భాగవతం యొక్క మొదటి శ్లోకములో సంపూర్ణ సత్యము గురించి ఇలా చెప్పబడింది: janmādy asya yato 'nvayād itarataś cārtheṣv abhijñaḥ svarāṭ ( SB 1.1.1) ఇప్పుడు పరమ సత్యము, ఆయన వ్యక్తమవుతున్న అన్నింటికి అత్యున్నత కారణము అయితే, అప్పుడు లక్షణాలు ఏమిటి? భాగవతము చెప్తుంది ఆయనకు అన్నీ తెలిసి ఉండాలి. ఆయన మరణించడు. అతడికి సమస్త జ్ఞానము తెలిసి ఉండాలి. ఏ రకమైన జ్ఞానం? Anvayād itarataś cārtheṣu. నేను జ్ఞానవంతుడిగా ఉన్నట్లే, మీరు కూడా జ్ఞానవంతులు. కానీ నాకు నా గురించి తెలియదు, నా శరీరంలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి. ఇది నా తల అని నేను చెప్తున్నాను. కానీ నేను ఎవరినైనా అడిగినట్లయితే, "మీ శరీరంలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో మీకు తెలుసా?" అలాంటి జ్ఞానం జ్ఞానం కాదు. కానీ భగవంతుడికి, భాగవతము చెప్తుంది ఆయనకు నేరుగా మరియు పరోక్షంగా ప్రతిదీ తెలుసు. నేను తినడం నాకు తెలుసు, కానీ నా తినే పద్ధతి నా రక్తప్రసరణకు ఎలా సహాయం చేస్తుందో తెలియదు, ఇది ఎలా రూపాంతరము చెందుతుందో, అది నల్లని రక్త నాళముల గుండా ఎలా వెళుతుందో. అది ఎలా పని చేస్తుందో, నాకు ఏమీ తెలియదు. కానీ భగవంతుడు అన్నీ తెలిసినవారై ఉండాలి - తన సృష్టి యొక్క ప్రతి మూలలో ఏమి జరుగుతుందో ఆయనకు తెలిసి ఉండాలి. అందువలన భాగవతము వివరిస్తుంది, అ పరమ సత్యము ఎవరి నుంచి ప్రతీదీ వ్యక్తమవుతుందో, ఆయనకు ప్రతీదీ తెలిసి ఉండాలి. ప్రతీదీ తెలిసి ఉండాలి. అభిజ్ఞానః, abhijñaḥ అంటే అర్థం ప్రతీదీ తెలిసి ఉండాలి

అది, మీరు ప్రశ్నించవచ్చు, "అప్పుడు అతడు చాలా శక్తివంతుడు, తెలివైనవాడు జ్ఞానవంతుడు అయితే, ఆయన వీటిని జ్ఞానవంతులైనా వారి నుండి నేర్చుకొని ఉండి ఉంటాడు..." కాదు. ఇతరుల నుండి జ్ఞానం నేర్చుకున్నట్లతే, ఆయన భగవంతుడే కాదు అని అంటున్నాము. స్వరాట్. సహజముగా. ఆయన తనకు తాను స్వతంత్రుడు. ఇది జ్ఞాన-యోగ. అధ్యయనం, ఏ స్వభావము వలన... విశ్లేషించండి, భగవంతుని యొక్క స్వభావము ఏమిటి, ఆయన నుండి ప్రతీదీ వ్యక్తమవుతున్నాయి. ఇది శ్రీమద్-భాగవతములో వివరించబడింది. అందువలన శ్రీమద్-భాగవతం మహోన్నతమైనది. జ్ఞాన-యోగ మరియు భక్తి-యోగ రెండు కలిసి దానిలో ఉన్నాయి. అవును. జ్ఞాన యోగ పద్ధతి పరమ సత్యమును శోధించడానికి మార్గము లేదా తత్వశాస్త్ర పద్ధతిలో సంపూర్ణ సత్యము యొక్క స్వభావమును అర్థం చేసుకోవడం అని అర్థం. దీనిని జ్ఞాన-యోగ అంటారు. మనది భక్తి-యోగ. భక్తి-యోగ అంటే, పద్ధతి అదే, లక్ష్యం అదే ఉంది. ఒకరు తాత్విక మార్గంలో భగవంతుని అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, ఒకరు భగవంతుని మీద తన మనస్సును కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు, ఇతరులు, భక్తులు, వారు కేవలం భగవంతుడికి సేవ చేయడములో నిమగ్నమైనారు, ఆయన వెల్లడి చేసిన విధముగా. ఒక పద్ధతి ఆరోహణ పద్ధతి ద్వారా అర్థం చేసుకోవడము. మరొక పద్ధతి అవరోహణ పద్ధతి. ఉదాహరణకు చీకటిలో ఉన్నట్లుగా, మీరు ఆరోహణ పద్ధతి ద్వారా సూర్యుడు అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, మీరు చాలా శక్తివంతమైన విమానం లేదా స్పుత్నిక్లను ఎగుర వేస్తూ, ఆకాశం మీద అన్నీ వైపులా తిరుగుతూ, మీరు చూడలేరు. కానీ అవరోహణ పద్ధతి, సూర్యుడు ఉదయించినప్పుడు, మీరు వెంటనే అర్థం చేసుకుంటారు. ఆరోహణ పద్ధతి - నా ప్రయత్నం, దానిని ఇండక్టివ్ (ప్రేరక) పద్ధతి అని పిలుస్తారు.ఇండక్టివ్ (ప్రేరక) పద్ధతి. ఉదహరణకు నా తండ్రి ఇలా చెప్పాడు, మనిషికి మరణము ఉంటుంది. నేను అంగీకరిస్తున్నాను. ఇప్పుడు మనిషి మరణిస్తాడా అని మీరు పరిశోధన చేయాలనుకుంటే, మీరు వేలమంది మనుష్యులను చూస్తారు, ఆయన అమరుడా లేదా మరణిస్తాడా. అది చాలా సమయం తీసుకుంటుంది. నీవు ఉన్నతమైన ప్రామాణికం నుండి జ్ఞానాన్ని తీసుకుంటే, మనిషి మరణిస్తాడు, మీ జ్ఞానం సంపూర్ణము.

కావున athāpi te deva padāmbuja-dvaya-prasāda-leśānugṛhīta eva hi jānāti tattvaṁ bhagavan-mahimno na cānya eko 'pi ciraṁ vicinvan ( SB 10.14.29) అందువల్ల చెప్పబడినది , "నా ప్రియమైన ప్రభు, నీ నుండి కొంచము దయను పొందిన వ్యక్తి, ఆయన నిన్ను చాలా త్వరగా అర్థము చేసుకోగలడు. ఇతరులు ఆరోహణ పద్ధతి ద్వారా మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వారు, వారు లక్షలాది సంవత్సరాలపాటు కల్పన చేయవచ్చు, వారు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. " వారు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. వారు నిరాశ మరియు గందరగోళానికి గురవుతారు. ఓ, భగవంతుడు సున్నా. అంతే, నాశనము అయింది. భగవంతుడు సున్నా అయితే, అప్పుడు సున్నా నుండి చాలా, నేను చెబుతున్నది, ఎలా సంఖ్యలు వస్తున్నాయి? భగవంతుడు సున్నా కాదు. భాగవతము చెప్తుంది, వేదాంత చెప్తుంది janmādy asya yataḥ ( SB 1.1.1) భగవంతుని నుండి ప్రతిదీ ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు అది ఎలా సృష్టించబడుతుందో మనము అధ్యయనం చేయాలి. ఇది కూడా వివరించబడింది, మార్గం ఏమిటి, పద్ధతి ఏమిటి, అది ఎలా తెలుసుకోవాలి. ఇది వేదాంత-సూత్రము. వేదాంత అర్థం అంతిమ జ్ఞానం. వేదము అంటే జ్ఞానం అంత అంటే అంతిమ అని అర్థం. కాబట్టి వేదాంత అంటే అంతిమ జ్ఞానం. అంతిమ జ్ఞానం భగవంతుడు