TE/Prabhupada 0710 - మనము మిలియన్ల మరియు ట్రిలియన్ల ఆలోచనలు చేస్తున్నాము ఆ ఆలోచనలో చిక్కుకుపోతున్నాము

Revision as of 09:07, 7 December 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0710 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 3.26.39 -- Bombay, January 14, 1975


ఏ యోగ పద్ధతి అయినా గాని హఠ యోగ, జ్ఞాన యోగ, లేదా... కర్మ-యోగ అత్యల్ప ప్రామణికమైనది. అన్నింటికంటే, భక్తి-యోగ ఉతమమైనది. అప్పుడు, మీరు భక్తి-యోగముకు వచ్చినప్పుడు, అది జీవితము యొక్క పరిపూర్ణము. Bhakti-yogena manasa samyak praṇihite amale ( SB 1.7.4) భక్తి-యోగేన అమల: "మనసు పరిశుద్ధమవుతుంది." Ceto-darpaṇa-mārjanam ( CC Antya 20.12) ఇది భక్తి-యోగము యొక్క ప్రత్యక్ష ప్రభావం. మనస్సు ఇప్పుడు కలుషితమైనది కనుక, ఇంద్రియాలు మరియు ఇంద్రియ కార్యక్రమాల సృష్టిలో, మనము మిలియన్ల మరియు ట్రిలియన్ల ఆలోచనలు చేస్తున్నాము ఆ ఆలోచనలో చిక్కుకుపోతున్నాము. మనము మిలియన్ల మరియు ట్రిలియన్ల శరీరములను అంగీకరించాలి ఆపై జన్మ, మరియు మరణం, వృద్ధాప్యం వ్యాధి చక్రంలో కొనసాగాలి. ఇది చిక్కుకొనుట. కాబట్టి మనస్సును పవిత్రము చేయండి. ఇది హరే కృష్ణ మహా మంత్రాన్ని కీర్తన, జపము చేయడము. Ceto-darpaṇa-mārjanaṁ bhava-mahā-dāvāgni-nirvāpaṇam. మన మనస్సు పరిశుద్ధమైనప్పుడు... ఇది మహా-దావగ్ని. మానసిక ఆలోచనల విస్తరణ, వేల మరియు మిలియన్ల, ఇది మహా, భవ-మహా-దావగ్ని. భవ-మహా-దావగ్ని. ఇది గురువు యొక్క కర్తవ్యము భవ మహా-దావగ్ని నుండి తన శిష్యుడిని బయటకు తీసుకు రావడము. Saṁsāra-dāvānala-līḍha-loka-trāṇāya kāruṇya-ghanāghanatvam. కారుణ్య, కరుణ.

కాబట్టి గురువు అంటే ఏమిటి? గురువు కరుణను పొందారు. సముద్రం నుండి నీటిని మేఘము పొందినట్లుగానే కరుణ అంటే, అదేవిధముగా, ఒక గురువు, ఆధ్యాత్మిక గురువు, మేఘము వంటి దయను పొందుతారు కృష్ణుడి దయ యొక్క సముద్రం నుండి. ఘనాఘనత్వం . అటవీ అగ్నిని అణచివేయగలిగినది మేఘము మాత్రమే. ఏ ఇతర నీరుపోసే పద్ధతి ఉపయోగపడదు. అడవిలో అగ్ని ఉంటే, మీ అగ్ని మాపక దళము లేదా నీటి బకెట్లు సహాయం చేయవు. అది అసాధ్యం. మీరు అక్కడకు వెళ్ళలేరు; మీరు మరియు మీ అగ్ని మాపక దళము మరియు బకెట్ ద్వారా ఏ సేవను చేయలేరు. అప్పుడు అగ్ని ఎలా ఆగిపోతుంది? ఘనాఘనత్వం. ఆకాశంలో మేఘాలు ఉంటే, వర్షము వస్తే, అప్పుడు విస్తృత అటవీ అగ్ని వెంటనే ఆరిపోతుంది. ఆ మేఘం ఆధ్యాత్మిక గురువుగా భావించబడుతోంది. ఆయన నీటిని పోస్తారు. ఆయన నీటిని పోస్తారు. Śravaṇa-kīrtana-jale karaye secana ( CC Madhya 19.152) ఆ నీరు ఏమిటి? ఆ నీరు ఈ శ్రవణము-కీర్తన. భవ-మహా-దావగ్ని, అగ్ని, భౌతికజీవితము యొక్క అటవీ అగ్ని నిరంతరం జ్వలింస్తుంది. మీరు మేఘం నుండి వచ్చే వర్షము ద్వారా దాన్ని ఆర్పవలెను, వర్షపాతం అంటే శ్రవణ కీర్తన అని అర్థం. శ్రవణ అంటే శ్రవణము అని అర్థం, కీర్తన అంటే కీర్తన చేయడము అని అర్థం. ఇది మాత్రమే ఏకైక మార్గం. Śravaṇa-kīrtana-jale karaye secana