TE/Prabhupada 0628 - కానీ మనము బహుశా, అయితే వంటి వాటిని అంగీకరించము. కాదు. వాస్తవమును మనము అంగీకరిస్తాము

Revision as of 11:22, 22 December 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0628 - in all Languages Category:TE-Quotes - 1972 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.13 -- Pittsburgh, September 8, 1972


ఇక్కడ ఉంది, పరిపూర్ణ జ్ఞానం కృష్ణుడిచే మాట్లాడబడినది:

dehino 'smin yathā dehe
kaumāraṁ yauvanaṁ jarā
tathā dehāntara-prāptir
dhīras tatra na muhyati
(BG 2.13)

దేహినః, జీవించి ఉన్న ఆత్మ, శరీరం మారుతుంది. అదేవిధముగా, మరణం తరువాత, మరణం అని అని పిలవబడేదాని తరువాత... కాని మరణం లేనందున. ఈ స్థూల శరీరం మరణించిన తరువాత, ఆత్మ మరొక స్థూల శరీరమునకు బదిలీ చేయబడుతుంది. ఈ ప్రకటన మనకు భగవద్గీత నుండి లభిస్తుంది. మనము ఈ ప్రకటనను అంగీకరించినట్లయితే "ఇది వాస్తవం", అప్పుడు మన ఆధ్యాత్మిక జీవితం వెంటనే ప్రారంభమవుతుంది. ఈ అవగాహన లేకుండా, ఆధ్యాత్మిక అవగాహన అనే ప్రశ్నే లేదు. ప్రతిదీ అస్పష్టంగా ఉంది, కేవలం మానసిక కల్పన, "బహుశా," "అయితే" శాస్త్రవేత్తలు తత్వవేత్తలు అని పిలవబడే వారు ఈ సిద్ధాంతాలను ప్రతిపాదిస్తున్నారు కానీ మనము "బహుశా," "అయితే" వంటి వాటిని అంగీకరించము. కాదు వాస్తవమును మనము అంగీకరిస్తాము. ఇది నమ్మకం అనే ప్రశ్న కాదు; అది వాస్తవమా కాదా అనే ప్రశ్న. కాబట్టి ఇది వాస్తవం.

ఇప్పుడు, ఆత్మ ఎలా వేరొక శరీరమునకు వెళ్ళుతుంది? ఉదాహరణకు ఈ జీవితము తరువాత, నేను మెరుగైన జీవితం పొందుతాను, అది బాగుంది. నేను అధమ జీవితాన్ని పొందితే, అప్పుడు పరిస్థితి ఏమిటి? తదుపరి జీవితములో నేను పిల్లి లేదా కుక్క లేదా ఆవు యొక్క జీవితాన్ని పొందితే. మీరు అమెరికాలో మళ్ళీ పుట్టారు అని అనుకుందాం. మీరు మీ శరీరాన్ని మార్చితే, మొత్తం పరిస్థితులు మారిపోతాయి. మానవునిగా, మీరు ప్రభుత్వము నుండి అన్ని రకాల రక్షణను పొందుతారు, కానీ మీరు మరొక శరీరము పొందిన వెంటనే, చెట్టు లేదా జంతువులు గాని, భిన్నంగా ఉంటుంది. జంతువు కబేళాకి వెళుతుంది; చెట్లు కత్తిరించబడుతున్నాయి. నిరసన లేదు. కాబట్టి ఇది భౌతిక జీవన స్థితి. కొన్నిసార్లు మనం మంచి జీవన పరిస్థితిని పొందుతున్నాం, కొన్నిసార్లు మనము అధమ జీవితపు పరిస్థితిని పొందుతున్నాం. హామీ లేదు. ఇది నా పని మీద ఆధారపడి ఉంటుంది. అది ఆచరణాత్మకమైనది. ఈ జీవితంలో కూడా మీరు విద్యావంతులు అయితే, మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. మీరు విద్యావంతులు కాకపోతే, మీ భవిష్యత్తు అంత ప్రకాశవంతమైనది కాదు. అదేవిధముగా, ఈ మానవ రూపం, మనము ఈ పునరావృతమవుతున్న జన్మ మరణములకు పరిష్కారం చేయవచ్చు. జీవితం యొక్క ఈ భౌతిక పరిస్థితుల నుండి ఎలా బయటపడాలనేది మానవ జీవితం యొక్క ఏకైక కర్తవ్యము: జన్మ, మరణం, వృద్ధాప్యము వ్యాధి. మనము పరిష్కారం చేయవచ్చు. ఆ పరిష్కారం కృష్ణ చైతన్యము. మనము కృష్ణ చైతన్యవంతులము అయిన వెంటనే... కృష్ణ చైతన్యము అంటే అర్థం కృష్ణుడు, మహోన్నతమైన వాడు, అతడు, భగవంతుడు. మనము కృష్ణుడి యొక్క భాగం. ఇది కృష్ణ చైతన్యము. కేవలం అర్థం చేసుకోవడానికి ... మీరు మీ తండ్రిని, మీ సోదరులను మీరే అర్థం చేసుకున్నట్లుగానే. మీరు తండ్రి యొక్క కుమారులు. కాబట్టి అర్థం చేసుకోవడం కష్టం కాదు. తండ్రి మొత్తం కుటుంబాన్ని నిర్వహిస్తున్నట్లు, అదేవిధముగా, కృష్ణుడు, దేవాదిదేవుడు, లేదా భగవంతుడు, ఆయనకు అనేక అసంఖ్యాకమైన కుమారులను, జీవులను కలిగి ఉన్నాడు, ఆయన మొత్తం శరీరం, మొత్తం కుటుంబాన్ని నిర్వహిస్తున్నాడు. ఇబ్బంది ఏమిటి? తరువాత కర్తవ్యము చైతన్యమును అభివృద్ధి చెందినదిగా చేసుకోవడము. ఒక మంచి కుమారుడు లాగా, "తండ్రి నా కోసం ఎంతో చేసారు. కనీసం నేను అంగీకరించాలి నా తండ్రి నా కోసం చేసిన దానికి నేను తిరిగి చెల్లించవలసి ఉంది, ఈ భావనను కృష్ణ చైతన్యము అని పిలుస్తారు