TE/Prabhupada 0953 - ఆత్మ స్వతంత్రాన్ని తప్పుగా ఉపయోగించుకున్నప్పుడు అతను పతనము అవుతాడు అది భౌతిక జీవితము

Revision as of 09:07, 29 November 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Telugu Pages - 207 Live Videos Category:Prabhupada 0953 - in all Languages Category:...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


750623 - Conversation - Los Angeles


ఆత్మ స్వతంత్రాన్ని తప్పుగా ఉపయోగించుకున్నప్పుడు, అతను పతనము అవుతాడు. అది భౌతిక జీవితము డాక్టర్ మిజ్: నాకు ఈ ప్రశ్నలో ఇబ్బందికరముగా ఉన్నది ఏమిటంటే, అప్పుడు, ఎందుకు ఆత్మ పతనము అవుతుంది... ఎందుకంటే, ఆత్మ అనేది మొదట ఆధ్యాత్మిక ఆకాశంలో భాగం లేదా భగవంతునిలో భాగం అని మీ భావనను నేను గ్రహించాను, అది ఏదో ఒక విధముగా అహంకారం కారణంగా ఈ ఆనందకరమైన పరిస్థితి నుండి పతనము అవుతుంది చాలా వరకు క్రిస్టియన్ సిద్ధాంతము లాంటిది, అహంకారం కారణంగా సైతాను స్వర్గం నుండి పడిపోయినట్లుగా. ఈ విషయము ఆశ్చర్యముగా ఉన్నది, ఏమిటంటే, ఆత్మ ఎందుకు చాలా వెర్రిగా, మూర్ఖంగా, పిచ్చివాడిగా అలాంటి పని చేస్తుంది.

ప్రభుపాద: అది ఆయన స్వాతంత్ర్యం. డాక్టర్ మిజ్: స్వాతంత్ర్యం.

ప్రభుపాద: స్వాతంత్ర్యం సరిగ్గా ఉపయోగించకుండా, ఆయన స్వాతంత్ర్యం దుర్వినియోగం చేస్తే ఆయన పతనము అవుతాడు.

డాక్టర్ మిజ్: నన్ను క్షమించండి, ఆయన ఏమి అవుతాడు?

ప్రభుపాద: ఆయన పతనము అవుతాడు.

డాక్టర్ మిజ్: ఆయన పతనము అవుతాడు.

ప్రభుపాద: తన స్వతంత్రత వలన ఆయన పతనము అవుతాడు. ఉదాహరణకు మీరు స్వాతంత్ర్యం కలిగి ఉన్నారు. మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. మీరు వెంటనే వెళ్ళవచ్చు. మీరు నా దగ్గర నుండి వినటానికి ఇష్టపడక పోవచ్చు.

డాక్టర్ మిజ్: నేను ఏమి చేయక పోవచ్చు?

ప్రభుపాద: మీరు నా దగ్గర నుండి, నావి వినటానికి ఇష్టపడక పోవచ్చు. డాక్టర్ మిజ్: అవును.

ప్రభుపాద: స్వాతంత్ర్యం మీరు కలిగి ఉన్నారు. నేను కూడా కలిగి ఉన్నాను. నేను మీతో మాట్లాడక పోవచ్చు. కావున ఆ స్వాతంత్ర్యం ఎల్లప్పుడూ ఉంటుంది. అదేవిధముగా, భగవంతునిలో భాగముగా మరియు అంశగా, ఇది ఆత్మ యొక్క కర్తవ్యము ఎల్లప్పుడూ భగవంతుని యొక్క సేవలో వినియోగించ బడటము

డాక్టర్ మిజ్: ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండటము...?

ప్రభుపాద: భగవంతుని సేవలో. డాక్టర్ మిజ్: భగవంతుడు యొక్క సేవలో.

ప్రభుపాద: ఉదాహరణకు ఈ వేలు నా శరీరం యొక్క భాగం. నేను అజ్ఞాపిస్తునట్లుగా, అది వెంటనే నిర్వహిస్తుంది. నేను ఇలా అంటాను, "ఇదే విధముగా చేయండి," ఆయన చేస్తాడు..., అది చేస్తుంది. కావున... కానీ ఇది చనిపోయిన పదార్థము. ఇది యాంత్రికంగా పని చేస్తుంది. మనస్సు వెంటనే వేలును నిర్దేశిస్తుంది అది యంత్రం లాగా పనిచేస్తుంది. ఈ మొత్తం శరీరం కేవలం ఒక యంత్రం వలె ఉంటుంది, కానీ ఆత్మ యంత్రం కాదు, యంత్రము యొక్క భాగం కాదు. ఇది ఆధ్యాత్మిక భాగం. కాబట్టి, నేను వేలుని నిర్దేశిస్తునట్లుగానే... యంత్రం అయి ఉండటము వలన, ఇది పనిచేస్తోంది, కానీ వేరే ఎవరైనా, ఒక స్నేహితుడు లేదా సేవకుడు, నేను అతన్ని ఏదో చేయమని నిర్దేశించవచ్చు, ఆయన చేయలేక పోవచ్చు. ఆత్మ స్వాతంత్ర్యం దుర్వినియోగం చేసినప్పుడు, అప్పుడు ఆయన పతనము అవుతాడు. అది భౌతిక జీవితం. భౌతిక జీవితం అంటే ఆత్మ యొక్క స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయడము. ఉదాహరణకు ఒక కొడుకు వలె. ఒక కుమారుని కర్తవ్యము తండ్రికి విధేయత చూపడము. కానీ ఆయన అంగీకరించకపోవచ్చు. ఇది ఆయన పిచ్చి. కావున ఆత్మ, స్వాతంత్ర్యం దుర్వినియోగము చేస్తే, అది పిచ్చిది అవుతుంది, ఆయన ఈ భౌతిక ప్రపంచంలోకీ పంపబడ్డాడు. డాక్టర్. మిజ్: ఇది నాకు చాలా అయోమయంగా ఉంది ఒకరు అంత వెర్రిగా ఉంటారా అని.

ప్రభుపాద: ఎందుకంటే స్వాతంత్ర్యము వలన మీరు మూర్ఖంగా మారవచ్చు. లేకపోతే, స్వాతంత్రానికి అర్థం లేదు. స్వాతంత్ర్యం అంటే మీకు నచ్చిన పనులను మీరు చేయ వచ్చు. ఇది భగవద్గీతలో చెప్పబడింది, అది yathecchasi tathā kuru ( BG 18.63) పద్దెనిమిదవ అధ్యాయంలో ఈ శ్లోకమును చూడండి. స్వాతంత్ర్యం ఉంది. మొత్తం భగవద్గీతను అర్జునుడికి ఉపదేశించిన తరువాత, కృష్ణుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు, "ఇప్పుడు నీవు ఇష్టపడేది, నీవు చేయవచ్చు." కృష్ణుడు భగవద్గీత ఉపదేశములను బలవంతముగా అంగీకరించేటట్లు చేయలేదు. ఆయన స్వాతంత్రాన్ని ఇచ్చాడు, "ఇప్పుడు మీకు నచ్చినది, మీరు చేయవచ్చు." ఆయన అంగీకరించారు: "అవును, ఇప్పుడు నా భ్రాంతి ముగిసింది, నీవు చెప్పినట్లు నేను చేస్తాను." అదే స్వాతంత్ర్యం. అవును.

బహులాస్వా: ఇది పద్దెనిమిదవ అధ్యాయములో.

ధర్మాదక్ష్య: "అందువల్ల నేను నీకు చాలా వివరించాను..." మొదట సంస్కృతమును చదవండి? ప్రభుపాద: అవును.

ధర్మాదక్ష్య: iti te jñānam ākhyātaṁ guhyād guhyataraṁ mayā vimṛśyaitad aśeṣeṇa yathecchasi tathā kuru ( BG 18.63) అందువల్ల నేను నీకు అత్యంత రహస్య జ్ఞానం గురించి వివరించాను. దీనిపై పూర్తిగా ఆలోచించు, ఆపై నీవు చేయాలనుకుంటున్నది చేయి.

"ప్రభుపాద: అవును. ఇప్పుడు మీరు చెప్పితే, "ఆత్మ ఎందుకు అంత మూర్ఖంగా మారుతుంది?" అది స్వాతంత్ర్యం యొక్క దుర్వినియోగం. తెలివైన తండ్రికి తెలివైన కుమారుడు ఉంటాడు, కానీ కొన్నిసార్లు వాడు ఒక అవివేకి అవుతాడు. కాబట్టి కారణం ఏమిటి? ఆయన తండ్రి యొక్క భాగం. ఆయన ఖచ్చితముగా తండ్రి వలె అవ్వాలి. కానీ ఆయన తండ్రి వలె కాడు. నేను అలహాబాద్లో గొప్ప న్యాయవాది, బారిష్టర్, మిస్టర్ బెనర్జీ ని చూసాను. ఆయన పెద్ద కుమారుడు కూడా న్యాయవాది, ఆయన చిన్న కుమారుడు, చెడు సాంగత్యము కారణంగా, ఆయన ఏకలా -వాలాగా మారాడు. ఏకలా అంటే... భారతదేశంలో ఒక గుర్రం బండి ఉంటుంది. అందువలన ఆయన ఒక ఏకలా గా ఉండటానికి ఇష్టపడ్డాడు. అంటే ఆయన ప్రేమలో పడిపోయాడు, ఒక తక్కువ తరగతి మహిళ, ఆమె యొక్క సాంగత్యములో ఆయన ఒక ఏకలాగా మారాడు. అనేక సందర్భాల్లో ఉన్నాయి. అజామిళుని ఉపాఖ్యానం. ఆయన ఒక బ్రాహ్మణుడు మరియు ఆయన అత్యంత పతనము అయ్యాడు. ఈ స్వాతంత్ర్యం దుర్వినియోగం ఎప్పుడూ ఉంది