TE/Prabhupada 0056 - ప్రహ్లాద మహారాజు కృష్ణ చైతన్యములో ప్రామాణికుడు
Lecture on SB 7.6.1 -- Madras, January 2, 1976
- śrī-prahrāda uvāca
- kaumāra ācaret prājño
- dharmān bhāgavatān iha
- durlabhaṁ mānuṣaṁ janma
- tad apy adhruvam arthadam
- (SB 7.6.1)
ఇది ప్రహ్లాద మహారాజు కృష్ణ చైతన్యములో ప్రామాణికుడు శాస్త్రములలో పన్నెండు మంది మహాజనులను వివరించారు
- svayambhūr nāradaḥ śambhuḥ
- kumāraḥ kapilo manuḥ
- prahlādo janako bhīṣmo
- balir vaiyāsakir vayam
- (SB 6.3.20)
ధర్మదికారులను గురించి యమరాజు పలికిన వచనము ధర్మ అంటే భాగవత ధర్మ నిన్నరాత్రి వివరించాను ధర్మ అంటే భాగవత అని Dharmaṁ tu sākṣād bhagavat-praṇītaṁ (SB 6.3.19). ఎలాగైతే ప్రధాన న్యాయమూర్తి న్యాయస్థానములో ధర్మమును అనుసరించి త్రిర్పుఇస్తారో ధర్మమును సామాన్య మానవుడు లేక వ్యాపారవేత్త తయారుచేయలేరు. సాధ్యపడదు ధర్మమును తాయారు చేసేది పాలించుచున్నప్రభుత్వముమాత్రమే ఎవరుతాయారు చేయలేరు. అది కుదరదు హై కోర్ట్ లో ఎవరైనా ఇ విదముగా వేడుకుంటే, నా సొంత ధర్మమూ నాకున్నది అంటే న్యాయ మూర్తి ఒప్పుకోడు అదేవిదముగా, ధర్మాన్ని నీవు తాయారు చేయలేవు నీవు గొప్పవాడివి కావచ్చు నీవు ప్రధాన న్యాయమూర్తివి అయినాకూడా న్యాయాన్నితయారుచేయలేవు. ఎందుకంటే న్యాయాన్ని ప్రభుత్వము ఇస్తుంది అదేవిదముగా ధర్మ అంటే భాగవత ధర్మ మిగతా ధర్మాలు ధర్మాలు కావు. వాటిని ఆన్గికరించలేము సరిగ్గా అదే విధంగా, మీ ఇంటి వద్ద తయారు చేయబడిన చట్టం ఆమోదించబడదు. అందువలన dharmaṁ tu sākṣād bhagavat-praṇītaṁ (SB 6.3.19).
అయితే bhagavat-praṇītaṁ dharma అంటే ఏమిటి? భగవద్గీతలో చెప్పబడినది, మాకు ప్రతి ఒక్కరికీ తెలుసు. కృష్ణుడు వచ్చాడు, కృష్ణుని రాకకు ఉద్దేశ్యము dharma-saṁsthāpanārthāya, మత సిద్ధాంతాలను స్థాపించడానికి, లేదా పునఃస్థాపన కోసం. Dharmasya glānir bhavati bhārata. Yadā yadā hi dharmasya glānir bhavati bhārata (BG 4.7). కాబట్టి కొన్నిసార్లు గ్లాని, ధర్మ సూత్రాలను పాటించే విషయంలో హాని జరుగుతుంది అప్పుడు కృష్ణుడు వస్తాడు. Paritrāṇāya sādhūnāṁ vināśāya ca duṣkṛtām (BG 4.8). Yuge yuge sambhavāmi. కాబట్టి ఈ ధర్మా, కృష్ణుడు ధర్మాలు అని పిలవబడే వాటిని పునర్వ్యవస్థీకరించడానికి రాలేదు: హిందూ ధర్మా, ముస్లిం ధర్మా, క్రిస్టియన్ ధర్మా, బుద్ధుడి ధర్మా. కాదు శ్రీమద్భాగవతము ప్రకారము dharmaḥ projjhita-kaitavo (SB 1.1.2). ఎ ధర్మ అయితే మోసము చేస్తుందో ఆ ధర్మమును ప్రోజ్జ్హిత అంటారు Prakṛṣṭa-rūpeṇa ujjhita, అది విసిరివేయబడి లేదా తరిమివేయబడిందని అర్థం. నిజమైన ధర్మమూ ఏమిటంటే bhāgavata-dharma, నిజమైన ధర్మము అందువలన ప్రహ్లాద్ మహారాజు చెపుతారు kaumāra ācaret prājño dharmān bhāgavatān iha (SB 7.6.1). వాస్తవమునకు dharma అంటే భగవంతుడు, భగవంతునితో మనకున్న సంబంధము మరియు ఆ సంబంధానికి అనుగుణంగా వ్యవహరిస్తు, తద్వారా మన జీవిత అంతిమ లక్ష్యమును సాధించవచ్చును ఇది ధర్మము