TE/Prabhupada 0072 - సేవకుని ధర్మము శరణాగతి పొందుట

Revision as of 10:19, 11 June 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0072 - in all Languages Category:TE-Quotes - 1976 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture on CC Madhya-lila 20.108-109 -- New York, July 15, 1976

కాబట్టి ఎవరూ యజమాని కాలేరు. అది సాధ్యం కాదు. మీరు ఈ క్రింది ప్రకటనలో దానిని చూస్తారు: ekale īśvara kṛṣṇa āra saba bhṛtya (CC Adi 5.142). కృష్ణుడు మాత్రమే యజమాని, ప్రతి ఒక్కరూ సేవకులు. ఇది మన స్థానం, వాస్తవమైనది. కానీ కృత్రిమంగా మనము యజమాని కావాలని ప్రయత్నిస్తున్నాము. ఇది జీవనము కోసం పోరాటం. మనము కాని దాని కోసం మనము ప్రయత్నిస్తున్నాము. ఈ పదం మాకు తెలుసు, "జీవనము కోసం పోరాటం," "బలమైన వాటి యొక్క మనుగడ." కాబట్టి ఇది పోరాటం. మనము యజమాని కాదు; ఇప్పటికీ, మనము యజమాని అవ్వడానికి ప్రయత్నిస్తున్నము. మాయావాదా తత్వశాస్త్రం, వారు కుడా తీవ్రమైన తపస్సు చేస్తారు కానీ ఆలోచన ఏమిటి? ఆలోచన ఏమిటంటే "నేను దేవుని తో ఒకటిగా అవుతాను." అదే తప్పు. అదే తప్పు. అతను దేవుడు కాదు, కానీ అతను దేవుడిగా మారాడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను చాలా తీవ్రమైన తపస్సులను చేసినప్పటికీ, వైరాగ్యం ప్రతిదీ ... కొన్నిసార్లు వారు భౌతిక అనందములను అన్నిటినీ విడిచిపెట్టి, అడవీకి వెళ్లి, తీవ్రమైన తపస్సు చేస్తారు. ఆలోచన ఏమిటి? "ఇప్పుడు నేను దేవునితో సమానము అవుతాను." అదే తప్పు.


మాయ చాలా బలంగా ఉన్నది, అందువలన మనము ఆధ్యాత్మికము అని పిలుచుకునే దాంట్లో ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికి ఈ లోపాలు కొనసాగుతాయి. అందుకే చైతన్య మహాప్రభు అయిన సూచనలతో వెంటనే ముఖ్య విషయామును చెప్పుతారు. ఇది చైతన్య మహాప్రభు తత్వము కృష్ణుడు భగవద్గీతలో చివ్వరిగా sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja.. (BG 18.66). కృష్ణుడు తాను దేవాదిదేవుడు అని తన స్థానమును తెలియచేస్తునాడు కృష్ణుడు అజ్ఞాపిస్తున్నాడు, నీవు మోసగాడివి, అంతా విడిచిపెట్టి, నాకు శరణాగతి పొందండి, అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు." భగవద్గీతలో శ్రీకృష్ణుని చివరి ఉపదేశము ఇది చైతన్య మహాప్రభువే, కృష్ణుడు, కానీ కృష్ణుడి భక్తుడుగా వుంటూ అందువలన అయిన కృష్ణుడు చెప్పిన వ్విషయమే చెప్పుతూ , "మీరు శరణాగతి పొందండి," మరియు చైతన్య మహాప్రభు మాట్లాడుతూ "ప్రతి జీవుడు కృష్ణుడి యొక్క సేవకుడు" అని చెప్పారు. అంటే అతను శరణాగతి పొందాలి. సేవకుడు యొక్క ధర్మము శరణు తీసుకోవటము. యజమానితో వాదించకూడదు "నేను మీతో సమానంగా ఉన్నాను" అని వాదించకూడదు. ఇది అంత మూఢభక్తి, పిచ్చి ప్రతిపాదన.

piśācī pāile yena mati-cchanna haya
māyā-grasta jīvera se dāsa upajaya

దాసుడు యజమాని కాలేడు. అది సాధ్యం కాదు. ఎప్పుడైతే ఎంతకాలము జీవితములో మనము ఈ తప్పుడు భావనలోవుంటామో, "నేను సేవకుడిని కాదు, నేను యజమానిని" అప్పుడు అతను దుఖిస్తాడు. మాయా అతనికి బాధ ఇస్తుంది. దైవీ హై ఎస్సా. నేరస్థులు, ద్రోహులు మరియు దొంగలు వారు ప్రభుత్వ ఉత్తర్వును తిరస్కరించారు: "నేను ప్రభుత్వం గురించి పట్టించుకోను." కానీ అతను స్వచ్ఛందంగా బాధను అంగీకరిస్తాడు. ఇది ప్రభుత్వ చట్టాలను గౌరవించాలని. అతను సామాన్యంగా శ్రద్ధ తీసుకోకపోతే, అతడిని జైలులో ఉంచుతారు మరియు శక్తి ద్వారా, శిక్ష ద్వారా, అతను అంగీకరించాలి: "అవును, అవును, నేను అంగీకరిస్తున్నాను."


కాబట్టి ఇది మాయా. Daivī hy eṣā guṇamayi mama māyā duratyayā (BG 7.14). మనము మాయ యొక్క నిర్ణయాలు క్రింద ఉన్నాము. Prakṛteḥ kriyamāṇāni guṇaiḥ karmani sarvaśaḥ (BG 3.27). ఎందుకు? మనము యజమానిగా ప్రకటించుకుoటున్నాము. సేవకుడు యజమానిగా ప్రకటి0చుకుంటున్నాడు. కాబట్టి బాధ. మరియు సాధ్యమైనంత త్వరలో మనము ఒప్పుకుంటే "నేను యజమాని కాదు, నేను సేవకునిగా ఉoటాను" అప్పుడు బాధ ఉండదు చాలా సాధారణ తత్వము. అది ముక్తి. ముక్తి అంటే కేవలం సరైన వేదిక పైకి రావడము. అది ముక్తి. ముక్తిని శ్రీమద్-భాగావతములో నిర్వచించారు. muktir hitvā anyathā rūpaṁ svarūpeṇa vyavasthitiḥ (SB 2.10.6). ముక్తి అంటే ఇ అర్ధంలేని పద్దతులను విడిచిపెట్టడము anyatha అతను సేవకుడు, కానీ అతను యజమాని అని ఆలోచిస్తున్నాడు. ఇది పూర్తి వ్యతిరేకము అందువలన అతను జీవితము యొక్క ఈ వ్యతిరేక భావనను వదలివేసినప్పుడు, అప్పుడు అది ముక్తి అవుతుంది. అతను వెంటనే విముక్తి పొందుతాడు. మీరు తీవ్రమైన తప్పసులను చేయవలసిన అవసరం లేదు. ముక్తి ఎక్కువ సమయం తీసుకోదు అరణ్యంలోనికి వెళ్లి హిమాలయాలకు వెళ్ళి ధ్యానం చేసి ముక్కు మరియు అనేక విషయాలను అణచిపెట్టుకోవలసిన అవసరము లేదు దీనికి చాలా విషయాలు అవసరం లేదు. కేవలం మీరు సాదారణమైన విషయం అర్థం చేసుకోండి "నేను కృష్ణుడి యొక్క సేవకుడుని" - మీరు తక్షణమే ముక్తి పొందారు. ఇది శ్రీమద్-భాగావతంలో ముక్తికి ఇవ్వబడిన నిర్వచనం. Muktir hitvā anyathā rūpaṁ svarūpeṇa avasthitiḥ. జైలులో వుండే ఒక నేరస్తుడు వలె, అతను విధేయతతో వుండి. ఇప్పుడు, నేను చట్టాన్ని గౌరవిస్తాను అని పాటిస్తూ వుంటే నేను విధేయతతో ప్రభుత్వం చట్టాలకు కట్టుబడి ఉంటాను " అని అతను హామీ ఇవ్వడం వలన అతనిని ముందే విడుదల చేస్తారు. కాబట్టి మనము ఈ బౌతిక జీవనపు జైలు నుండి వెంటనే విడుదల అవ్వవచ్చు మనము చైతన్య మహాప్రభు యొక్క ఈ బోధనను అంగీకరించినట్లయితే, jīvera svarūpa haya nitya kṛṣṇera dāsa (CC Madhya 20.108-109).