TE/Prabhupada 0074 - మీరు జంతువులను ఎందుకు తినాలి

Revision as of 10:39, 11 June 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0074 - in all Languages Category:TE-Quotes - 1974 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture on BG 4.21 -- Bombay, April 10, 1974


అంతా భగవద్గీతలో వివరించబడింది. "మీరు గాలి శ్వాస ద్వారానే నివసిoచాలి అని." భగవద్గీత చెప్పలేదు భగవద్గీతలో చెప్పారు: annād bhavanti bhūtāni (BG 3.14). అన్నా. అన్నా అంటే ఆహార ధాన్యాలు. ఆహార ధాన్యం అవసరం ఉంది. అన్నాద్ భవoతీటి భుతాని. భగవద్గీత మీరు తినడాము అవసరం లేదు అని ఎప్పుడు చెప్పాలేదు మీరు కేవలం గాలి పీల్చి మరియు యోగా సాధన ద్వార జీవించండి అని చెప్పలేదు. మనం ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు, ఇది సిఫార్సు చేయబడింది. Yuktāhāra-vihārasya. మనము తక్కువ, ఎక్కువ తిన కూడదు. మరియు నిరాశిస్. నిరాశిస్ అంటే విపరీతమైన కోరికలు. ఇప్పుడు మనము భౌతిక సంతృప్తిని మరింతగా కోరుకుంటున్నాము అది అవసరం లేదు. మీకు జీవితంలో పరిపూర్ణత కావాలంటే, దీనిని తపస్యా అని అంటారు. ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది, కానీ అతను అనవసరంగా కోరుకోకుడదు. ప్రతి ఒక్కరికి తినే హక్కు కూడా ఉంది. అందరికి హక్కు వున్నది. జంతువులకు కుడా కానీ మనం మరింత ఆస్వాదించాలని కోరుకుంటున్నాము. మనం జంతువులకు సరిగా జీవించడానికి అవకాశం ఇవ్వటములేదు. బదులుగా, మనము జంతువులను తినడానికి ప్రయత్నిస్తున్నాము ఇది అవసరమైనది కాదు. ఇది nirāśīh అoటారు. ఎందుకు మీరు జంతువులను తినాలి? ఇది అనాగరిక జీవితం. ఏ ఆహారం లేన్నప్పుడు,వారు ఆదివాసి ప్రజలు అయితే , వారు జంతువులను తినవచ్చును, ఎందుకంటే వారికీ ఆహారాన్ని ఎలా పండించుకోవాలో తెలియదు. కానీ మానవ సమాజం నాగరికంగా మారినప్పుడు, అతను, చాలా మంచి ఆహారమును పండించవచ్చు అతను ఆవులు తినే బదులు ఆవులను పెంచుకోవచ్చు. అతనికి పాలు వుంటాయి, తగినంత పాలు. మనము పాలు మరియు ధాన్యాలు ద్వార చాలా తయారీ చేసుకోవచ్చు. మనం అనవసరంగా ఆనందించడానికి కోరుకోకూడదు. ఇక్కడ చెప్పబడింది kurvan nāpnoti kilbiṣam. Kilbiṣam అంటే పాపభరితమైన జీవితము ఫలితంగా అని అర్థం. మన అవసరాన్ని కన్నా ఎక్కువగా కోరుకోకుంటే, అప్పుడు మనము చిక్కుకుపోతాము, పాపపు కార్యక్రమంలో పాల్గొనడం, కుర్వాన్ అపి, పనిలో నిమగ్నమై ఉన్నప్పటికీ. మీరు తెలిసే లేదా తెలియకుండా పని చేస్తున్నప్పుడు, మీరు పాపభరితమైన, పవిత్రమైనది కాని పనులు చేస్తారు కానీ మీరు సరిగ్గా బ్రతకాలని, కోరుకుంటే, అప్పుడు kurvan nāpnoti kilbiṣam. మన జీవితం ఏ పాప ఫలితాలు లేకుండా ఉండాలి. లేకపోతే మనము బాధపడాలి. చాలా అసహ్యకరమైన జీవితాలను చూసినప్పటికీ వారు నమ్మరు. 8,400,000 జీవన జాతులు ఎక్కడ నుంచి వస్తున్నాయి? అసహ్యకరమైన పరిస్థితిలో జీవించే జీవిలు చాల ఉన్నాయి. వాస్తవానికి, జంతువు లేదా ఇతర జీవాలకు తెలియదు, కానీ మానవులుగా,మనము ఈ జీవితం ఎందుకు హేయమైనదిగా వున్నదో తెలుసుకోవాలి. ఇది మాయ భ్రాంతి. ప్రతి ఒక్కరు కూడా ఒక పంది చాలా మురికిగా నివసిస్తున్నది, మలము తిoటు, అది చాలా సంతోషంగా వున్నాను అని అనుకుంటుంది. అందువలన అది కొవ్వును పొంది ఉంటుంది. సంతోషంగా ఉన్నప్పుడు, "నేను చాలా సంతోషంగా ఉన్నాను," అతను కొవ్వును కలిగివుంటాడు మీరు చూస్తారు ఈ పందులు చాలా కొవ్వుతో ఉంటాయి, కానీ వారు తినేది ఏమిటి? అవి మలం తిని, మురికి ప్రదేశములో వుంటాయి. కానీ అవి "మేము చాలా సంతోషంగా ఉన్నాము" అని అనుకుంటయి. అది మాయ యొక్క భ్రమ. జీవితంలో చాలా అసహ్యకరమైన పరిస్థితిలో జీవిస్తున్న ఎవరైనా, Māyā, భ్రాంతి ద్వారా, అతను సరిగ్గా ఉన్నాడని అతను చాలా ఖచ్చితంగా వున్నాడు అని ఆలోచిస్తున్నాడు, కానీ ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తి, అతను చాలా అసహ్యకరమైన స్థితిలో నివసిస్తున్నాడని చూస్తాడు. ఈ భ్రాంతి ఉంది, కానీ జ్ఞానం ద్వారా, మంచి సాంగత్యము ద్వార, శాస్త్రము నుండి, గురువు నుండి, సాధువుల నుండి, జీవితం యొక్క విలువ ఏమిటో అర్థం చేసుకోవాలి మరియు అలా జీవించాలి. ఇది కృష్ణుడిచే ఆదేశించబడుతుంది, అది నిరాశిస్, అనవసర కోరికలతో ఉండాకూడదు, జీవితం యొక్క అవసరాల కంటే ఎక్కువ ఉండకుడదు. దీనిని నిరాశిస్ అని పిలుస్తారు. Nirāśīḥ. ఇంకొక అర్ధం ఏమిటంటే బౌతిక ఆనందాన్ని ఇష్టపడకపోవటము. మరియు అతను పూర్తి జ్ఞానంతో ఉన్నప్పుడు ఇది సాధ్యమే "నేను ఈ శరీరం కాదు. నేను ఒక ఆధ్యాత్మిక ఆత్మను. ఆధ్యాత్మిక జ్ఞానంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది నా అవసరం. అప్పుడు అతను నిరాశిస్ కావచ్చు. ఇవి తపస్సు కొరకు అంశాలు. ప్రస్తుతం, ప్రజలు మరచిపోయారు. వారికి తపస్సు అంటే ఏమిటో తెలియదు. కానీ మానవ జీవితం ఈ ప్రయోజనం కోసం ఉద్దేశించబడింది. Tapo divyaṁ putrakā yena śuddhyet sattvaṁ yena brahma-saukhyam anantam (SB 5.5.1). ఇవి శాస్త్రం యొక్క ఆదేశాల. మానవ జీవితం తపస్యా కోసం ఉద్దేశించబడింది. మరియు తపస్యా ... అందువలన, వేద మార్గం ప్రకారం, జీవితం ప్రారంభంలో తపస్య, బ్రహ్మచారి దశ వున్నది బ్రహ్మాచర్య సాధన కోసం గురుకులమునకు ఒక విద్యార్థి పంపబడుతాడు. ఇది తపస్యా, సౌకర్యవంతమైన జీవితం కాదు. నేలపై పడుకోవాలి, గురువు కోసం భిక్ష కోరుతూ ఇంటింటికి వెళ్లుతారు. కానీ వారు అలసిపోరు. వారు పిల్లలు కనుక, వారు ఈ తపస్సులలో శిక్షణ ద్వార వారి సాధన ప్రారంభమవుతుంది. వారు ప్రతి స్త్రీను "అమ్మా" అని పిలుస్తారు. " తల్లి. నాకు భిక్ష ఇవ్వాoడి అని అడుగుతారు మరియు వారు గురువు ఇంటికీ తిరిగి వస్తారు. బిక్ష ద్వార వచ్చినదంతా గురువుకి చెందుతుంది. ఇది బ్రహ్మచారి జీవితం. ఇది తపస్యా. Tapo divyam (SB 5.5.1). ఇది వేద నాగరికత పిల్లలు జీవితం ప్రారంభం నుండి తపస్యా, బ్రహ్మాచర్యలో శిక్షణ పొందుతారు బ్రహ్మచర్యం. బ్రహ్మచారి ఎ మహిళను చూడడు. గురువు భార్య వయస్సులో వున్నపుడు , అతను గురువు భార్యకు దగ్గరకు వెళ్ళడు. ఇవి ఆంక్షలు. ఆ బ్రహ్మాచర్యము ఎక్కడ ఉంది? బ్రహ్మచారులు లేరు. ఇది కలియుగము. తపస్సు లేదు.