TE/Prabhupada 0076 - ప్రతి చోటా భగవంతుని చూడండి
Ratha-yatra -- San Francisco, June 27, 1971
మన కన్నులు దేవుని ప్రేమతో అభిషేకి౦చినప్పుడు, మనo ఎక్కడైన ఆయనను చూడగలము. ఇది శాస్త్రముల యొక్క ఉత్తర్వు. భగవంతుని పై ప్రేమను అభివృద్ధి చేసుకోవడము ద్వారా మనము అయినను చూసే శక్తిని అభివృద్ధి చేసుకోవచ్చును. Premāñjana-cchurita bhakti-vilocanena (Bs. 5.38). ఒకరు కృష్ణ చైతన్యంలో సరిగా అభివృద్ధి చెందినప్పుడు, అతను తన హృదయంలో ఎక్కడకు వెళ్ళినా ప్రతిక్షణము ప్రతిచోటా భగవంతుని చూడవచ్చు ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఒక ప్రయత్నం ప్రజలు దేవుడిని ఎలా చూడవచ్చు, కృష్ణుడిని ఎలా చూడవచ్చు అని తెలుసుకోవడానికి. కృష్ణుడుని మనము సాధన చేస్తే చూడవచ్చు. కృష్ణుడు చెప్పినట్టుగా raso 'ham apsu kaunteya (BG 7.8). కృష్ణడు చెప్పుతారు, "నేను నీటి యందలి రుచిని" మనము ప్రతి ఒక్కరము, ప్రతి రోజు నీరు త్రాగుతాము కేవలం ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు, . లేదా అంతకంటే ఎక్కువ సార్లు నీరు త్రాగిన వెంటనే, నీటి రుచి కృష్ణుడు అని మనము అనుకుంటే, వెంటనే మనము కృష్ణ చైతన్యవంతులము అవ్వుతాము. కృష్ణ చేతనo అవ్వటాము చాలా కష్టమైన పని కాదు. కేవలం మనం సాధన చేయాలి. కృష్ణ చేతన్యమును ఎలా సాధన చేయాలి అనే దానికి ఇది ఒక ఉదాహరణ. మీరు నీరు త్రాగినప్పుడు, మీ దాహము తిరిన వెంటనే మీ దాహం తీరినది. వెంటనే మీరు ఈ దాహం, చల్లారిచే శక్తి కృష్ణుడు అని అనుకొండి. Prabhāsmi śaśi sūryayoḥ. కృష్ణుడు చెప్పుతారు "నేను సూర్యరశ్మిని, నేను చంద్రునిని వెన్నెలను." పగటి సమయంలో, మానము ప్రతి ఒక్కరము సూర్యరశ్మిని చూస్తాము. మీరు సూర్యరశ్మిని చూసిన వెంటనే, మీరు కృష్ణుడిని గుర్తుకు తెచ్చుకోవచ్చు, "ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు అని" మీరు రాత్రి చంద్రుడి వెన్నెలను చూసినప్పుడు వెంటనే మీరు "కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు అని" గుర్తుంచుకోవచ్చు. ఇ విధముగా, మీరు సాధన చేస్తే, అనేక ఉదాహరణలు ఉన్నాయి, అనేక ఉదాహరణలు భగవద్గీత ఏడవ అధ్యాయంలో ఇస్తారు, మీరు వాటిని జాగ్రత్తగా చదివినట్లయితే, కృష్ణ చైతన్యమును ఎలా సాధన చేయాలి అని. ఆ సమయంలో, మీకు కృష్ణుడిపై వున్నా ప్రేమ పరిణితి చెందినప్పుడు, మీరు ప్రతిచోటా కృష్ణుడిని చూస్తారు. కృష్ణుడిని చూడడానికి ఎవరూ మీకు సహాయం చేయనవసరము లేదు, కానీ మీ ప్రేమతో, మీ భక్తితో కృష్ణుడు మీకు కనిపిస్తారు. Sevonmukhe hi jihvādau svayam eva sphuraty adaḥ (Brs. 1.2.234). సేవ ద్రుక్పదములో వున్నప్పుడు, కృష్ణుడు నేను కృష్ణుడు లేదా దేవుడి శాశ్వతమైన సేవకుడిని అని అనుకుంటే అప్పుడు కృష్ణుడు అతనిని ఎలా చూడవచ్చో మీకు సహాయం చేస్తారు. ఇది భగవద్గీతలో చెప్పబడింది, Tesam Satata-yuktānām bhajatām ప్రీతి-pūrvakam dadami బుద్ధి-yogam తాం yena మామ్ upayānti మీరు (BG 10.10)