TE/Prabhupada 0078 - మనము కేవలం శ్రవణము ద్వారా, ఒక దాని తరువాత మరొక కత్తిని అందుకుంటున్నాము

Revision as of 10:19, 12 June 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0078 - in all Languages Category:TE-Quotes - 1973 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture on SB 1.2.16 -- Los Angeles, August 19, 1972

śuśrūṣoḥ śraddadhānasya vāsudeva-kathā-ruciḥ. ముందు శ్లోకములో వివరించబడింది. yad anudhyāsinā yuktāḥ (SB 1.2.15). ఎల్లప్పుడూ నిమగ్నమై ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి. ఇది కత్తి. మీరు కృష్ణ చైతన్య కత్తిని పట్టుకుని ఉండాలి అప్పుడు మీరు స్వేచ్ఛగా ఉంటారు.ఈ ముడి కత్తి ద్వారా కత్తిరించబడుతుంది ఇప్పుడు ఎలా మనము ఈ కత్తిని పొందవచ్చు? ఈ పద్ధతి ఇక్కడ వివరించబడింది. మీరు కేవలం విశ్వాసంతో, వినడానికి ప్రయత్నించండి. మీరు కత్తిని పొందుతారు. అంతే. వాస్తవానికి ఇ కృష్ణ చైతన్య ఉద్యమము వ్యాప్తి చెందుతోంది. మనము కేవలం శ్రవణము ద్వారా, ఒకటి తరువాత మరొక కత్తిని అందుకుంటున్నాము.నేను న్యూ యార్క్ లో ఈ ఉద్యమం ప్రారంభించాను. మీ అందరికి తెలుసు. నేను నిజానికి ఏ కత్తి కలిగిలేను. కొన్ని మతపరమైన నియమాలలో, వారు ఒక చేతిలో మత గ్రంధములను పట్టుకోని మరియు మరొక చేతిలో కత్తిని పట్టుకోని: ". మీరు ఈ గ్రంథాలను అంగీకరించాలి; లేకపోత నేను మీ తలను నరుకుతాను" ఇది మరొక విధమైన ప్రచారము. నేను కూడా కత్తిని కలిగి వున్నాను, కానీ ఆ రకమైన కత్తి కాదు .ఈ కత్తి - ప్రజలు వినడానికి అవకాశం ఇస్తుంది. అంతే.


Vāsudeva-kathā-ruciḥ. అతనికి రుచి రావడముతో రుచి అంటే ఆసక్తి ఇకడ కృష్ణుడి గురించి మాట్లాడుతున్నారు, చాల బాగుంది. నేను వింటాను వెంటనే ఇ కత్తిని పొందుతారు కత్తి మీ చేతిలో ఉంది. Vāsudeva-kathā-ruciḥ. కానీ రుచి ఎవరికి వస్తుంది? ఈ రుచి? నేను అనేక సార్లు, వివరించాను, రుచి చక్కెర మిఠాయి వంటిది. అందరికి తెలుసు ఇది చాల తియ్యగా ఉంటుంది కానీ మీరు కామెర్లతో బాధపడుతున్న ఒక వ్యక్తికి ఇస్తే, అతనికి ఇది చేదుగా ఉంటుంది అందరికి చక్కెర తీయ్యగా ఉంటుంది అని తెలుసు, కానీ కామెర్ల వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి, అతనికి తీపి మిఠాయి చేదుగా ఉంటుంది ప్రతి ఒక్కరికి తెలుసు.

ఇది వాస్తవము. వాసుదేవ కధ, కృష్ణ కధ వినడానికి రుచి భౌతికంగా అనారోగ్యంతో వున్నా వ్యక్తికి ఇ రుచి అర్ధము కాదు. ఈ రుచిని పొందడానికి ప్రాథమిక కార్యకలాపాలు ఉన్నాయి.అది ఏమిటి? మనము ప్రశంసించాలి.ఇది చాల బాగుంది. Ādau śraddhā, śraddadhāna. So śraddhā, ప్రశంసించడము ప్రారంభము.తరువాత సాధు సంఘ (CC Madhya 22.83) తరువాత కలవాలి: "సరే, ఈ భక్తులు కృష్ణుని గురించి పాడుతున్నారు, మాట్లాడుతున్నారు నేను వెళ్ళి, కూర్చుని నేను మరింత వింటాను దీనిని సాధు-సంఘ అంటారు.భక్తులతో సాంగత్యము చేయుట. ఇది రెండవ దశ. మూడవ దశ భజన క్రియ ఎవరైనా చక్కగా సాంగత్యము చేసినప్పుడు,అప్పుడు అతను నేను "ఎందుకు శిష్యుడు కాకూడదు" అని అనుకుంటాడు. అప్పుడు మాకు ధరకాస్తు ఇస్తాడు. ప్రభుపాద, మీరు నన్ను దయతో శిష్యునిగా అంగీకరిస్తే ఈ ప్రార్థనలు భజన క్రియ యొక్క ప్రారంభము. భజన-క్రియ అంటే భగవంతుని సేవలో నిమగ్నమై ఉండటము. ఇది మూడవ దశ